BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Monday, November 21, 2011

తెలుగులో మరో కొత్త న్యూస్ చానల్... ఇమేజ్ 24 గంటల న్యూస్ చానల్

ఇప్పటికే కెమెరా స్టాండ్లు పట్టే ప్రెస్ మీటింగ్ హాల్ వెతుక్కోడానికి ప్రెస్ మీట్ పెట్టేవాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే రిపోర్టర్లు కెమేరా మెన్స్, ప్రింట్ కెమెరా మెన్లు, ప్రింట్ జర్నలిస్టులతో కిటకిట లాడిపోతుంది. ఏదైనా ధర్నాజరిగినా.. మీటింగ్ జరిగినా.. జస్ట్ మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ స్టాఫ్ తోనే సక్సెస్ అవుతుందనే సెటైర్లు కూడా ఈ మద్య పేలాయి. ఇప్పటికే ఉన్న న్యూస్ చాలదన్నట్టు... మరో మూడు చానళ్లు క్యూ కట్టిన విషయం తెలిసిందే.. వి6, టీఎన్‌ఎన్, తులసీ సీడ్స్ వారి చానల్ తో బాటు.. కొత్తగా ఇమేజ్ బ్రాడ్ కాస్టింగ్ రంగంలోకి దిగింది.. ఇప్పటికే ఆ సంస్థ జోరుగా రిక్రూట్‌చేసుకుంటోంది. ఇప్పటి వరకు వైద్యవ్యాపారంలో ఉన్న ఆ సంస్థ వార్తా వ్యాపారంలోకి దిగడంతో.. జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకునే వాళ్లకు.. ఇప్పటికే ఎంచుకొని రకరకాల అనుభవాలతో, అనుభూతులతో అవస్థలు పడే వాళ్లకు మరో మంచి అవకాశం వచ్చినట్టే. ఇమేజ్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ... అన్ని విభాగాల్లో రిక్రూట్ చేసుకుంటోంది.. ఆశావహులు అప్లై చేసుకోవచ్చు.....

పొలిటికల్ చానల్స్ బోర్ కొట్టాయి.. ఇక కులాల చానళ్లు వస్తున్నాయి

ఇప్పటి వరకు మనం రాజకీయ పార్టీల చానళ్లే చూశాం.. దీనికోసం ఏ రాష్ట్రమూ మినహాయింపు కాదు. పక్కరాష్ట్రాల గోల మనకెందుకు గానీ.. మన రాష్ట్రంలో మాత్రం జగన్ సిండికేట్, ఎల్లో సిండికేట్ అనే యమాకేటుగాళ్లు చానళ్లను నడిపిస్తున్నారని ఆ చానళ్లే ఒకరిపై ఒకరు దుమ్ము దూళి ఎత్తిపోసుకుంటున్నాయి. మళ్లీ ఇందులో తెలంగాణ అనుకూల చానళ్లు, వ్యతిరేక చానళ్లనే రెండు వర్గాలు, మళ్లీ ఇందులో తెలంగాణ వాదులందరి వాయిస్ వినిపించే చానళ్లు, కేవలం కేసీఆర్‌ను మాత్రమే ఉద్యమ సారధిగా చూపించే చానళ్లు.. ఇలా విభజించుకుంటూ పోతే.. ఆటంబాంబ్ శృంకలాలంత చిట్టా బయటపడుతుంది. ఇక రాజకీయ పార్టీల చానళ్లలో పాత కుల గజ్జి మళ్లీ చెలేస్తోంది. ఇప్పటికే ఇటు పత్రికల్లో.. అటు ఎలక్ట్రానిక్ మీడియాలో కమ్మరాజ్యం కలవరపెడుతున్న విషయం పాతదే.. ఆ తరువాత బ్రాహ్మణాధిపత్యం షరా మామూలే.. వీళ్ల చేష్టలు భరించి... భరించి రెండవ స్థానల్లో ఉండి విసుగు చెందిన బీసీ, దళితులు అవకాశం కోసం ఎదురు చూశారు. తాజాగా చానళ్లలో బీసీల ఆధిపత్యం ఎక్కువయిందన్నది పరిశోధనా సత్యం. ఇక్కడ ఆధిపత్యం అంటే పెద్ద పెద్ద పదవులను కుంటే పొరపాటే.. మీడియా ఉద్యోగాల్లోకి ప్రవాహంలా వచ్చి చేరుతూనే.. పై ఉద్యోగాలకు పోటీ పడుతున్న సంఖ్య అధికంగా ఉంది. దీంతో బాటు బీసీల్లో వచ్చిన చైతన్యం మూలాన.. పై స్థాయిలో ఉన్న బీసీలు సాధ్యమైనంత వరకు బీసీలకే ప్రాధాన్యమిచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. దీంతోపాటు కులాల గొడవ.. యాదవులు, గౌళ్లు, కాపులు, పద్మశాలీలు బాగా పోటీపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. గౌడ కులస్థులు, కాపు కులస్థులు, పద్మశాలీలు రెండవ స్థాయిల్లో ఉన్నారు. పద్మశాలీలు చాపకింద నీరులా విస్తరిస్తున్నారు. చారీలు ఇందులో కంసాలీలు కూడా కాస్త చొరవగానే దూసుకుపోతున్నారు..
అందుకే తాజాగా వచ్చే చానళ్లలో ఎక్కువ సంఖ్యలో కులాన్ని చూసి కొలతలేసి మరీ రిక్రూట్ చేసుకుంటున్నారని బాగా ప్రచారం జరుగుతోంది. ఎంపీ వివేకా పెడుతున్న వి6 చానల్ లో ఎంపీగారు దళితులకు ప్రాధాన్యమివ్వమని చెప్పారని వినికిడి.. కానీ సీఈఓగా పనిచేస్తున్న అంకం రవి, ఇన్‌పుట్/ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేస్తున్న పసునూరి శ్రీధర్ బాబు, ఫీచర్స్ ఇన్‌చార్జిగా నియమితుడైన చల్లా శ్రీనివాస్ వీళ్లంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కావడంతో.. తమ సామాజిక వర్గానికి రిక్రూట్‌మెంట్లో పెద్ద పీఠ వేస్తున్నారని మీడియా కోడై కూస్తోంది. ఇదే విషయమై ఆ చానల్‌లో పనిచేస్తున్న నా ఫ్రెండ్ ను అడిగినపుడు అందరి కులాలు తెలియవు కానీ ఇతర కులాల వారు కూడా ఉన్నట్టుంది అన్నారు. కానీ ఓ పెద్ద మనిషి సేకరించిన సమాచారం ప్రకారం గ్రాస్ రూట్స్ నుంచి పై స్థాయి వరకు ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించినట్టు తెలుస్తోంది. ఈ పద్దతి విడనాడాలని విజ్ఞప్తి చేయడం మినహా మరేమీ చేయలేం. ఇదే కొనసాగితే ఇతర చానళ్లలో బీసీల పై అగ్రవర్ణాల దాడి( తీసివేతలు) తప్పదేమోననిపిస్తోంది.
దాని తరువాత కొత్తగా తులసీ సీడ్స్ ఆధ్యర్యంలో వస్తున్న మరో చానల్ కూడా ఇదే పద్దతిని పద్దతిగా అనుసరిస్తుందనే ప్రచారం జోరుగా ఊపందుకుంది. తులసీ సీడ్స్ అధినేత కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం.. వీరు చానల్ పెట్టేటపుడే కాపులకో చానల్ కావలని నిర్ణయించుకొని పెట్టారట. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు హడావుడి చేసిన తులసీ అధినేత ఇప్పుడు చానల్ పెట్టడం వెనుక రకరకాల కారణాలున్నాయని విశ్లేషకుల అంచనా.
అయితే ఇప్పటి వరకు ఉన్న పొలిటికల్ మౌత్ పీసులు కాస్తా.. క్యాస్ట్‌లీ మౌత్ పీసులుగా మారబోతున్నాయన్నమాట.. చూడాలి... త్వరలో యాదవులకో చానల్, గౌండ్ల కులానికో చానల్ వస్తుందేమో..

పోటా పోటీగా ముస్తాబవుతున్న కొత్త చానళ్లు- జనవరికి విడుదల

తెలంగాణ ప్రాంతానికి పరిమితమై వాదాన్ని, నినాదాన్ని వినిపించడానికి మరో రెండు కొత్త చానళ్లు జనం ముందుకు రానున్నాయి. ఎంపీ వివేక్ టీం వి6 పేరుతో చానల్ తెస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఈ చానల్లో ఇప్పటికే ట్రైనీ ఉద్యోగులను నియమించుకొని శిక్షణ ఇస్తున్నారని సమాచారం. సీనియర్లను తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరిస్తున్నారని వినికిడి. జీతాల విషయంలో కూడా గతంలో కొన్ని చానళ్లలాగా బోల్తా పడకుండా.. కాస్తో కూస్తో ప్రతిభ ఉన్నవారికే పట్టం కట్టాలని యోచిస్తున్నట్టు ఆ చానల్‌తో సంబంధం ఉన్న నా సహచరుడు తెలిపాడు. అయితే అదే సాకుతో చానల్ ను ట్రైనీల చేతిలో పెట్టినా ఇబ్బందేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తెలంగాణ ప్రాంత జర్నలిస్టులకు మరిన్ని అవకాశాలు దొరికినట్టే.. ఇప్పటికే తెలంగాణ కళారూపాలను బుల్లితెరపై ఆవిష్కరించడంలో ముందున్న టీన్యూస్‌ని మరికొందరు అనుసరించబోయి బోల్త పడ్డారు. హెచ్ఎంటీవీ మాత్రం రసమయితో చేసే మార్మోగినపాట మాత్రం కాస్త సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక టీన్యూస్ లో ప్రేమ్‌రాజ్, జనార్దన్‌లు మొదలు పెట్టిన మాటా ముచ్చట నిరాటంకంగా కొనసాగుతోంది. ఇదో ట్రెండ్ సెట్టర్‌గా మారడం ఆ చానల్ సాధించిన విజయమే.. తరువాత మా టీవీని అనుసరించి పెట్టిన రేలారే ధూంధాం.. ఆరభశూరత్వంగా మారింది. టీవీ9 మాపల్లెపాట బొక్కాబోర్లా పడింది. గానపదమని,.. ఇంకా రకరకాలపేర్లతో పెట్టిన చానళ్లన్నీ ప్రొడక్షన్ క్వాలిటీ లేక, సరియైన ప్రొడ్యూసర్ లేక చతికిల పడ్డాయి. తాజాగా వి6 చానల్ కూడా ఇటువంటి కార్యక్రమం ఒకటి జజ్జనకరి జనారే.. పేరుతో రూపొందిస్తుందని అవిశ్వసనీయ సమాచారం. ఇక టిఎన్ఎన్ పేరుతో వచ్చే మరో తెలంగాణ నెట్‌వర్క్ చానల్.. రిక్రూట్ చేసుకుంటోంది. ఇందులో కళాకారులు, జర్నలిస్టు వృత్తిలో ఉన్నవారు ఇరువురూ పాలు పంచుకుంటున్నారు. అయితే ఈ చానల్ పై మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నా.. తెలంగాణ ప్రజల గొంతు వినిపించేందుకు మరోవేదకి దొరికినట్టయింది. కొత్తగా జర్నలిజంలోకి రావాలని ఉబలాట పడేవారికి ఇవి వేదికలుగా మారనున్నాయి. చానళ్లు ఎన్ని వచ్చినా 1వ తారీఖు వరకు జీతాలు చెల్లించేలా ఉంటే అదే పదివేలు..(స్టార్టింగ్ వేతనం ఐదువేలేలెండి)

Monday, August 29, 2011

ఓ హోటల్లో క్యాట్ వాక్ లతో న్యూస్ యాంకర్ల హలచల్ .....

ఓ హోటల్లో క్యాట్ వాక్ లతో యాంకర్ల హలచల్ .....పొటోలతో సహా ఎప్పుడు ఎందుకు ఎలా..ఎవరు అనే పూర్తి విషయాలు వచ్చే పోష్టులో చూడండి..ఫొటోలతో సహా..ఏఏ న్యూస్ చానల్ల యాంకర్లు ఈ క్యాట్ వాక్ లో పాల్గొన్నారు..ఏ హోటల్ లో యాంకర్లు హల చల్ చేసి సందడి చేశారు...మాకూ హక్కులున్నాయంటూ..మేమూ కల్సిఉన్నామంటూ ఆ పూర్తి వివరాలు వచ్చేపోష్టులో యాంకర్లు చేస్తున్న డిమాడ్లేంటి ...అవిసాద్యిమా..? ఉద్యోగాలకు బద్రతకల్పించగలరా..?అంటూ కొన్ని డిమాడ్లతో ఏకం అయిన యాంకర్లు , వాయిస్ వోవర్ ఆర్టిష్టులు.. .....ఏంటా డిమాండ్లు..ఎంతమంది హాజరు అయ్యారు ఆ ట్రూప్ లో కొందరు మేము రాము ఇబ్బందుల్లో ఉన్నప్పుడూ మీరు సహాయం చేశారా అంటూ రిజెక్ట్ చేశారు..మరీ ఈ యాంకర్ల లీడర్ ఎవరు..? హోటల్లో వీరు చేసిన సందడేంటి అన్నీ విషయాలు త్వరలో..రెండు రోజులు సందడి చేసిన యాంకర్లు.......సందట్లో సడేమియా అన్నట్టు మేల్ , ఫిమేల్ యాంకర్లు షేర్ చేసుకున్న ఫోన్ నెంబర్లు ..ఆఫీసుల కు వచ్చి పచ్చి కామేంట్సు చేస్తున్న మేల్ యాంకర్లు..అసలేం జరుగుతుంది..ఫిమేల్ యాంకర్లు చేస్తున్న క్యాట్ వాక్, సందడిని సెల్ఫోన్లలో రికార్డుచేసి ఆఫీసుల్లో అందరికీ చూపిస్తూ..చండాలమైన కామెంట్సు మరి ఇదేంటి తోటి యాంకర్లను ఇలా అనటం అవసరమా.?....యూనియన్ పెట్టుకోవలనుకోవడం బాగానే ఉంది మరి కోతి వేషాలేంటి..వాటిని వీడియోలు తీసి కామెంట్స్ ఏంటి..?

పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో రిపోర్టర్ల..దందా..20లక్షలు హాంపట్

పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో రిపోర్టర్ల..దందా..20లక్షలు హాంపట్...వినాయక చవితి మట్టివినాయకుల పంపినీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్టు ఫ్రీగా వినాయకుల పంపినీ చేస్తుంది...అదీ స్వచ్చంద సంస్తలను ఎన్నుకొన్మి వారికి డబ్బులు ఇచ్చి వారి ద్వారా ప్రజలకు ఫ్రీ గా మట్టీ గనపతులను ఇస్తున్నారు..అంతే ఇంకేముంది ...బెలం చుట్టూ ఈగలు వాలినట్టు అక్కడ రిపోర్టర్లు చేరి..తమకూ స్వచ్చంద సంస్థ్జ ఉందంటూ బినామి స్వచ్చంద సంస్థ పేరుతో డబ్బులు దండుకుంటున్నారు...ఇప్పటీకే సాక్షిరిపోర్టర్ ,ఇలాగే డబ్బులు కొట్టేశారని సమాచారం..పెద్ద నీతిమంతులం అని చెప్పుకునే ఆంద్రజ్యోతి రాధాకృష్టగారు మీ రీపోర్టర్ కూడా ఈ దందా చేస్తున్నట్టు సమాచారం .ఇలా ప్రింట్ మీడియా రిపోర్టర్లు ఇప్పటిక్కే 20లక్షలకు టోపీ పెట్టారని తెలుసోంది...సాక్షి రిపొర్టర్ ఎక్కువగా పొల్యూషన్ కంట్ర్లోల్ బోర్డులోనే కనిపిస్తున్నాడు ...ఇప్పటీకైనా ఇలాంటివి ప్రజలు తెల్సుకొని చీ అనకముందే మీడియా యాజమాన్యిం జాగ్రత్త పడితే మంచిది..ఇది ఓ స్వచ్చంద సంస్థ నిర్వాహకుడు ఇచ్చిన సమాచారం ఈసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎవరెవరు ఎంత ఎంత డబ్బులు కొట్టేశారో పేర్లు ప్రటిస్తాం

Thursday, August 18, 2011

ఈవారం TRP రేటింగ్స్‌

Etv2 -5.94

Ntv -4.24

T NEWS -2.88

TV5 -2.88

TV9 -2.27

Zee 24 -1.54

Sakshi -1.21

INEWS -0.74

Maha -072

HMtv -0.62

ABN -0.62

http://www.porutelangana.com

మీడియా రంగం లోకి ఇమేజ్ హాస్పిటల్

త్వరలో తెలుగు ప్రేక్షకుల నెత్తిన మరో పిడుగు పడబోతుంది. ప్రజల ప్రాణాలతో బిజినెస్ చేస్తున్న ఇమేజ్ హాస్పిటల్ ఇప్పుడు మీడియా రంగం లోకి అడుగు పెట్టలనుకుంటుంది. ఇమేజ్ న్యూస్ ఛానల్, ఇమేజ్ హెల్త్‌ ఛానల్ ను తెచ్చేందుకు రంగం సిద్దమ్యంది. అందుకోసం కొందరు మీడియా ప్రముఖులతో లంచ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసిన్రట. సర్లే నిరుద్యోగులకు, సో కాల్డ్ జర్నలిస్ట్ ల వేధింపులతో నలిగిపోతున్నవారికి ఇక్కడో ప్లాట్ ఫాం దొరికితే చాలు.

ఆర్టీసీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌ టెస్ట్ సిగ్నల్‌ స్టార్ట్‌



ఆర్టీసీ సంస్థ చానల్‌ను ప్రారంభించింది. హైటెక్‌, వోల్వో బస్సుల్లో ప్రయాణికులు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు వివిధ స్థలాల ప్రాముఖ్యతను తెలియజేసే ఏర్పాట్లను చేస్తున్నది. త్వరలో పూర్తిస్థాయిలో ప్రసారాలు చేయనున్నది. ఆర్టీసీ చానల్స్‌ యాడ్స్‌ కూడా బాగానే వస్తున్నయి. ఎందుకంటే బస్సుల్లోని ప్రయాణికులు చచ్చినట్టు టీవీ చూస్తరు. వేరే మార్గం లేదు కాబట్టి యాడ్‌ మార్కెట్‌ ఆర్టీసీ చానల్‌ వైపు చూస్తున్నది. ఎనీవే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి చానల్‌ ఊరటనిస్తుందని భావిద్దాం. రాష్ట్రం విడిపోయే నాటికి నష్టం లేకుండా మన డిపోలను అప్పగిస్తే చాలు.

source :- http://www.porutelangana.com

Friday, August 12, 2011

రిపోర్టర్లూ మీఫోన్లు ట్యాప్ అవుతున్నాయి..జాగ్రత్త..?



రిపోర్టర్లూ మీఫోన్లు ట్యాప్ అవుతున్నాయి..జాగ్రత్త..?..రాష్ట్రంలో పరిస్థితులు మీరు ఇప్పటికే గమనించి ఉంటారు ..అదీ మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు రిపొర్టర్లను టార్గెట్ చేసి మరీ చితగ బాదారు..ఇదేదో అప్పటికప్పుడు తీసుకున్న నిర్నయంకాదు..పోలీసు ఉన్నతాదికారులు దాడి జరుగక ముందు తీసుకున్న నిర్నయం..రక్తంకారేలా కొట్టిన వాళ్ళను ఎంచేయలేకపోయిన మన యూనియన్ లీడర్లు ఏంచేస్తున్నారు..అందుకే ఇప్పుడు పోలీసులు రిపోర్టర్లను మానసికంగా దెబ్బతీసేందుకు ప్లాన్ వేశారు..ప్రతి రిపోర్టర్ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు..ఇది మాకు అందిన పక్కా సమాచారం మీఫోన్ ట్యాప్ అవుతుందా లేదాని మీరు గుర్తించాలంటే మీకు ఏదైనా కాల్ వచ్చినప్పుడు బుస్ మనే సౌండ్ వస్తుంది...గమనించండి..లైన్ క్లియర్ గా ఉండదు..గతంలో పోలీసులను టార్గెట్ చేస్తూ పేపర్లలో రాసిన రిపోర్టర్లు..కొందరు టాస్క్ ఫోర్సు పోలీసుల జీవితాలను బయట పెడతామని చానల్ల్ లో వేసి ఆతరువాత మేనేజ్ చేసిన వారు ఇలా అనేక మందిని టార్గెట్ చేసిన పోలీసులు ఫోన్లను ట్యాప్ చేసి వారి ఇళ్ళీగల్ సంబందాలు...బిజినెస్ లు ఏమైనా ఉంటే వారిని మానసికంగా దెబ్బతీసేందుకు పోలీసులు వ్యూహం పన్నారు..దీనిలో బాగంగానే నిన్ని అరెష్టు అయిన గురుదెవ్ MLM కంపెనీ పై పోలీసులు ఎన్నోసార్లు దాడి చేసి పట్టుకున్నా డబ్బులతో మేనేజ్ చేసుకొని వదలి పెట్టారు..మరి ఇప్పుడు MP స్థాయి రికమండేషన్ ఉన్నా ఎందుకు అరెష్టు చూపించ వలసి వచ్చింది ...ఈసారి మీడీయా వారితో వారికి లింకులు ఉన్నాయని తెల్సి ...వారిచే కొందరి MEDIA పేర్లు కావాలని చెప్పించి తమ ప్లాన్ ను అమలు చేస్తున్నారు...సో మీరు ఎవరైనా అమ్మాయిల తో ఇల్లీగల్ ఎఫైర్ ఉంటే జాగ్రత్త పోలీసులు మీమీద నిఘా పెట్టారు..మీరు మీ గర్ల్ ప్రెండ్ తో ఎక్కడైనా గెష్టుహౌస్ కు కాని పబ్ లకు వెళ్ళినా మఫ్టీలో మిమ్మల్ని వెంటాడుతున్నారు..రిపోర్టర్ల్ ఫోన్లలో మాట్లాడే అన్ని ఇల్లీగల్ మ్యాటర్లు ,ఇల్లీగల్ ఎఫైర్లను రికార్టు చేస్తున్నారు...జాగ్రత్త..రక్తం కారేట్టు కొడీతేనే మనం ఏంచేయలేక పోయాం రిపోర్టర్లను మానసికంగా దెబ్బతీసేందుకు అనే పోలీసులు రెడీగా ఉన్నారు మీరు అమ్మాయి ల ఎఫైర్లు మనీడీలింగ్ లను రెడ్ హేండెడ్ గా పట్టుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నట్టు సమాచారం..పోలీసుల తో జాగ్రత్త ..అదీ మనం పదిమందికి నీతులు చెప్పే మంచి వృత్తిలో ఉన్నాం మనమే తప్పు చేస్తే ఎదుటి వానిగురించి ఏం చెబుతాం మన వృత్తిన అవమాన పరచినట్టేకదా ..సో గతంలో తప్పులు చేసినా కనీసం ఇప్పటినుంచైనా మన వృత్తికి న్యాయం చేద్దాం..సో మరోసారి హెచ్చరికి మీ ఫోన్లు పోలీసులు ఇల్లీగల్ గా ట్యాప్ చేస్తున్నారు ఇప్పటికే చాలా ఫోన్లు ట్యాప్ లో ఉన్నాయి..ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పిన సమాచారం..BE CARE FULL

యాంకర్ ను పెళ్ళీ చేసుకున్న లైఫ్ ష్టైల్ రిపొర్టర్ మరోయాంకర్ తో సరసాలు

యాంకర్ ను పెళ్ళీ చేసుకున్న లైఫ్ ష్టైల్ రిపొర్టర్ మరోయాంకర్ తో సరసాలు...ఎం మాయచేశాడో తెలీదు మొత్తనికి ఓ యాంకర్ ను పటాయించి పెద్దల సహాయంతో పెళ్ళి చేసుకున్నాడు ..బాగానే ఉంది..అసలే లైఫ్ ష్టైల్ రిపోర్టర్ అమ్మాయిలతో బాగా టచ్ ఉండే బీట్ అనుకున్నాడో ఏమో ...ఓ యాంకర్ ను పెళ్ళీ చేసుకొని ఆఫీసులో అందరు ఉండగానే మరో యాంకర్ తో .......ఫోన్లలోనే సృంగార సంభాషన ఫోనులో ఆదివారాల్లొ ఎప్పుడు వస్తావు ఎంజాయ్ చేద్దాం అంటూ సంభాషన సాగుతుందట పక్కన ఎవ్వరు ఉందీ పట్టించుకోకుండా..ఈ విషయాన్ని గమనించిన ఓ ఔత్సాహిక రిపోర్టర్ కాల్ డీటైల్స్ తెప్పించి ఎవ్వరాని ఆరాతీస్తే మరో చానల్ యాంకర్ అని తేలింది..ఈ విషయాని సదరు రిపోర్టర్ తెలుగు మీడియాన్సూస్ కు తెలిపడు ఈ కాల్ డీటైల్స్ ను సదరు లైఫ్ ష్టైల్ రిపోర్టర్ భార్యికు చేరవేస్తాను అంటున్నాడు ...ఇదే జరిగితే లైఫ్ ష్టైల్ రిపోర్టర్ రిపోర్టర్ భార్యి కు చూచాయనగా విషయం చెప్పగానే అదే జరిగితే ఆయాంకర్ ను తను పని చేసే చానల్ కు వెళ్ళీ చెప్పుతీసుకొని కొడతాను అన్నట్టు సమాచారం...లైఫ్ ష్టైల్ రిపోర్టర్ గారు కాస్త మీదూకుడు తగ్గిస్తే మంచిది లేకుంటే రచ్చ రచ్చ అవుతుంది....మీరేదే కాస్త గ్లామర్ గా ఉన్నారని ఇలా సృంగార పాఠాలు అందరికి చెబితే మీకు చివరికి చిరిగి చాట అవ్వడమేకాక సదరు యాంకర్ జీవితం బుగ్గిపాలవుతుంది...చానల్ పరువుపోతుందని ఆమెను ఎవ్వరూ తీసుకోరు...అసలే రోజులు బాగాలేవు...అమ్మా యాంకరమ్మా తమరు కూడా జర జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే నీవు సీక్రెట్ గా మాట్లాడు తున్నావు అనుకుంటున్నావు..కాని యాంకర్లతో రిలేషన్ గొప్పగా ఫీల్ అయి అందరికీ తెల్సేలా ఫోన్లలో మాట్లాడుతుంటే చివరికి చిరిగేదినీకే..మనవాడీ నోట్లో ఏదీ దాగదంట అందరికీ టాంటాం చేస్తున్నాడు జర బద్రం బిడ్డా..సదరు లైఫ్ ష్టైల్ రిపోర్టర్ బార్యికు తెల్సి మీచానల్ కు వచ్చి కొట్టిందనుకో మీ తల్లి దండ్రులు తలలు ఎక్కడ పెట్టుకోవాలి ...కాస్తా నీ లైఫ్ గురించి ఆలోచించుకోతల్లి ..కాస్తమనిషి గ్లామర్ గా కనిపించగానే రిలేషన్ మైటైన్ చేస్తున్నాను అంతా సీక్రెట్ గా జరిగిపోతుంది అనుకుంటున్నావు మనవాడు అదేగొప్పగా ఫీల్ అయి నీ బ్రతుకు బయట పెడుతున్నాడు..

టెలివిజన్ రేటింగ్స్ : నిజాలూ, నిష్ఠురాలూ.-(bhavanarayana.గారి విష్లేషన )



ప్రతి బుధవారం మధ్యాహ్నం కనీసం మూడు న్యూస్ చానల్స్ నుంచి మిత్రులు గడిచిన వారం రేటింగ్స్ పంఫుతుంటారు. చిత్రమేమిటంటే వాళ్ళ వాదనలకు పొంతన ఉండదు. ఎవరికి వాళ్ళు తమ మార్కెట్ వాటా ఎక్కువ ఉన్నట్టు చెప్పుకుంటారు. అదెలా సాధ్యమనేది సహజంగా ఎదురయ్యే ప్రశ్న. అసలు చిక్కు అక్కడే ఉంది. ఫలానా పట్టణాల్లో ఆ చానల్ ముందుందంటే చాలు, సంబంధిత అంకెలతో ఒక ఎస్ ఎం ఎస్. వస్తుంది. ఫలానా వయోవర్గంలో ఎక్కువ మంది ఆ చానల్ చూసినట్టు తేలితే మరో ఎస్ ఎమ్ ఎస్. వారంలో మొదటి 30 కార్యక్రమాల్లో మావే ఎక్కువ ఉన్నాయంటూ ఇంకొకరి వాదన. అందరి వాదనలూ నిజమే కావచ్చు. కానీ సామాన్యులకు ఇదొక గందరగోళం. కానీ ఫలానా చానల్ కి ఎక్కువ రేటింగ్ ఉందని చర్చించుకోవటం మాత్రం ఆగదు. చానల్ గొప్పదనానికి అదే నిదర్శనమనే అభిప్రాయం సామాన్యప్రజలకూ ఏర్పడింది. కేవలం రేటింగ్స్ ఆధారంగా చానల్ గొప్పతనాన్ని నిర్థారించటమే ఒక దారుణమైతే, అదే రేటింగ్స్ ని అన్ని చానల్స్ ఒక పౌరసంబంధాల ఆయుధంగా మలుచుకోవటం మరింత దురదృష్టకరం. ప్రకటనలు సంపాదించుకోవటానికే రేటింగ్స్ పరిమితం కావటం లేదని తేలిపోయింది.

టెలివిజన్ చానళ్ల ప్రేక్షకాదరణను అంకెల్లోకి అనువదించే ప్రక్రియగా రేటింగ్స్ ను నిర్వచించుకోవచ్చు. ప్రకటనకర్తలకు ప్రేక్షకులను సమకూర్చిపెట్టటమే చానల్స్ పని కాబట్టి వీలైనంత ఎక్కువమందిని ఆకట్టుకోగలుగుతున్నట్టు నిరూపించుకోవటం వాటి బాధ్యతగా మారింది. ఆ విధంగా మరిన్ని ప్రకటనలు తెచ్చుకోగలిగే స్థోమతను చానల్స్ చాటుకుంటున్నాయి. తమ కార్యక్రమాలకు వస్తున్న రేటింగ్స్ ను బట్టి ప్రకటనలు తెచ్చుకునే పరిస్థితి దాటిపోయింది. కేవలం రేటింగ్స్ కోసమే కార్యక్రమాలు రూపొందిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీనివలన ప్రేక్షకులకు అవసరమైన కార్యక్రమాలకంటే ప్రేక్షకులు కళ్లు తిప్పుకోకుండా చూస్తారనుకునే కార్యక్రమాలమీదనే చానల్స్ దృష్టిపెడుతున్నాయి. ఈ ధోరణి మీద విమర్శలు ఏ స్థాయికి వెళ్ళాయంటే అసలు రేటింగ్స్ అనేవే ఉండకూదదనే వాదన ఇప్పుడు తెరమీదకొచ్చింది. ఇది రేటింగ్స్ తప్పా ? రేటింగ్స్ ను ఆపాదించుకోవటంలో ఉన్నతప్పా?వాటిలో శాస్త్రీయత లోపించటం తప్పా ? ఇన్ని రకాల ప్రశ్నల మధ్య ప్రభుత్వం మొదటిసారిగా రేటింగ్స్ మీద దృష్టి సారించాలనుకుంటోంది. ఒక కమిషన్ ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. అయితే ఈ రేటింగ్స్ లెక్కించే విధానం మొదలుకొని ఆపాదిస్తున్న తీరు వరకూ సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

పత్రికల సర్క్యులేషన్ నిర్థారించటానికి కచ్చితమైన లెక్కలుంటాయి.అందువలన ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ( ఎబిసి) పని చాలా సులభం. టీవీ విషయానికొచ్చేసరికి అది కుదరదు. కేవలం సర్వే పధ్ధతి మీద ఆధారపడాలి. అందుకే ఇది వివాదాస్పదంగా మారింది. పత్రికల పట్ల పాఠకుల ఆదరణలో గంటలూ రోజులూ అంతగా ముఖ్యం కాదు. ఆరు నెలలకొకసారి ఫలితాలు వస్తాయి. టీవీలకు వారానికొకసారి రేటింగ్స్ వెలువడతాయి. ఇందుకోసం ప్రతి నిమిషం చానల్స్ ను రేటింగ్స్ సంస్థ గమనిస్తూ ఉంటుంది. అందుకే ప్రతిటీవీ చానల్ క్షణ క్షణానికీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కృషి చేయాలి. లేకపోతే రిమోట్ తన పని తాను చేసుకుపోతుంది. ఒకసారి ప్రేక్షకుడు అటువైపు వెళ్ళిపోతే ఇక్కడ ఎంత మంచి కార్యక్రమం ప్రసారం చేసినా ప్రయోజనం ఉండదు. ఇటువంటి పోటీ వాతావరణంలో టీవీ రేటింగ్స్ అత్యంత సున్నితమైన అంశంగా మారిపోయాయి.

రేటింగ్స్ లెక్కించేందుకు భారతదేశంలో టామ్ ( టెలివిజన్ ఆడియెన్స్ మెజర్‍మెంట్ ) అనే సంస్థ ఉంది. నిజానికి పదేళ్ల కిందట టామ్, ఇన్‍ టామ్ అనే రెండు సమ్స్థలుండేవి. ఈ రెండూ సంస్థలూ భిన్నమైన ఫలితాలు ప్రకటిస్తూండటంతో అప్పట్లో కొంత వివాదం చెలరేగింది. అయితే, అదే సమయంలో అమెరికాలోని వీటి మాతృసంస్థలు కలిసిపోవటంతో సహజంగానే ఇక్కడ గుత్తాధిపత్యం ఏర్పడింది. ఇన్‍టామ్ మాయమైంది. ఇప్పుడు టామ్ చెప్పిందే వేదం. ప్రకటనకర్తలూ. ఏజెన్సీలూ , చానల్ యాజమాన్యాలూ తప్పనిసరిగా టామ్ సమాచారం మీదనే ఆధారపడాలి. ఇటువంటి గుత్తాధిపత్యంలో టామ్ ఎంత మేర బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నదో, ఏపాటి విశ్వసనీయత సంపాదించుకున్నదో పరిశీలించాలంటే లెక్కింపు విధానాన్నే సమీక్షించాల్సి ఉంది.

ముందే చెప్పినట్టు, రేటింగ్స్ లెక్కించటమంటే సర్వే మాత్రమే. ఈ సర్వే ఎంత దారుణంగా ఉంటుందో చూస్తే రేటింగ్స్ మీద కొద్దిపాటి గౌరవం కూడా మిగలదు. దేశం మొత్తం మీద 12 కోట్లకు పైగా కేబుల్ కనెక్షన్లు ఉంటే కనీసం 12వేల ఇళ్లు కూడా ఈ సర్వే లో లేవు. అంటే పదివేల ఇళ్లలో ఒకటి చొప్పున మాత్రమే సర్వే చేసి దాన్నే ప్రేక్షకుల అభిప్రాయంగా చెబుతున్నారు. 120 కోట్ల జనాభాలో 50 వేల లోపు మంది అభిప్రాయమే రేటింగ్ అవుతోంది. అంటే పాతిక వేలమందిలో ఒకరిని లెక్కపెడుతున్నారన్నమాట. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, ఇక్కడున్న కోటికిపైగా కనెక్షన్లలో 1200 ఇళ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇంకోవిధంగా చెప్పాలంటే , ఇంటికి ఐదుగురి చొప్పున దాదాపు 6 వేల మందిని సర్వే చేస్తున్నారు. ఈ లెక్కలనే మనం ప్రేక్షకుల తీర్పుగా చాటుకుంటున్నాం.

సర్వే పధ్ధతి కూడా అయోమయమే. ఆంధ్ర ప్రదేశ్ లో పట్టణాలను మూడు రకాలుగా విభజించారు. మొదటిది హైదరాబాద్ నగరం. ఆ తరువాత విభాగంలోకి విశాఖపట్నం, విజయవాడ నగరాలొస్తాయి. ఈ మూడు నగరాలు కాకుండా పది పట్టణాలు కూడా రేటింగ్ పరిశీలనలో ఉన్నాయి. వీటి జాబితా రహస్యమని టామ్ సంస్థ చెబుతుంది గాని ఇది బహిరంగ రహస్యమే. అన్ని చానల్స్ కూ ఈ పట్టణాలు తెలుసు. అందుకే అక్కడ చానల్ తప్పనిసరిగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంటర్‍టైన్‍మెంట్ చానల్స్ అయితే రకరకాల కార్యక్రమాల ప్రిలిమినరీ సెలక్షన్స్ కు ఈ పట్టణాలనే ఎంచుకుంటాయి. న్యూస్ చానల్స్ కూడా ఆయా పట్టణాల వార్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. అక్కడి ఎమ్ ఎస్ ఓ ( చానల్స్ పంపిణీదారుడు ) కు క్యారేజ్ ఫీజు చెల్లిస్తాయి. వీటితో బాటు అక్కడ ఎవరెవరి ఇళ్లలో మీటర్లు పెట్టారో తెలుసుకుని తగిన ” జాగ్రత్తలు ” తీసుకుంటారని కూడా చెబుతారు గాని స్పష్టంగా అది నిరూపించటం కష్టం కాబట్టి ఆ విమర్శల జోలికి వెళ్ళనక్కర్లేదు.

ఇక లెక్కింపు విషయానికొస్తే, ఈ ఎంపిక చేసిన ఇళ్లలో పీపుల్స్ మీటర్ ఏర్పాటు చేస్తారు. దీన్ని ఒక రిమోట్ తో అనుసంధానం చేస్తారు. ఎవరైనా టీవీ ఆన్ చేయాలంటే ఈ మీటర్ మీద తమకు సంబంధించిన బటన్ నొక్కాలి. స్త్రీపురుషులకు వేరువేరు బటన్స్ ఉంటాయి. వయసులను బట్టి కూడా బటన్స్ మారతాయి. ఎవరైనా టీవీ దగ్గరనుంచి పక్కకి వెళ్ళిపోవాలంటే వాళ్ల బటన్ ఆప్ చేసి వెళ్ళాలి. ఆ విధంగా ఎవరెవరు ఎంత సేపు ఏ చానల్ చూశారో బరోడాలోని టామ్ కార్యాలయ రికార్డులలో నమోదవుతుంది. ” అందరూ అంత కచ్చితంగా టీవీ చూసేముందూ, అక్కడినుంచి వెళ్ళేముందూ బటన్ నొక్కుతారా “ లాంటి ధర్మసందేహాలకిక్కడ తావు లేదు. లక్షలోపు జనాభా ఉన్న మండలకేంద్రాలూ, గ్రామపంచాయితీలూ లెక్కకు రావా అంటే రావన్నదే సమాధానం. సగం జనాభా అభిప్రాయాలు లెక్కలోకి తీసుకోకుండా ఇది సరైన సర్వే ఎలా అవుతుందనేది జవాబుదొరకని ప్రశ్న.


టామ్ రేటింగ్స్ మీద ఇప్పటికే ఎన్నో విమర్శలున్నాయి. అతి తక్కువ శాంపిల్స్ తో రూపొందించే నివేదికలు సమగ్రంగా ఉండే అవకాశమే లేదు. అయినా సరే టామ్ దగ్గర ఒక రెడీమేడ్ గడసరి సమాధానం ఉండనే ఉంది. రక్తపరీక్ష చేయటానికి ఎంత రక్తమ్ తీస్తారన్న ఎదురు ప్రశ్నే వాళ్ళ సమాధానం. భిన్నమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న భారతదేశంలో ఏకరూపత ఉండదని తెలిసినా ఇదే బుకాయింపు. అసలు కారణం ఏమిటంటే, రేటింగ్స్ లెక్కించటానికి ఇళ్లలో టీవీలకు బిగించే పీపుల్స్ మీటర్ ఖరీదు లక్షరూపాయలు. ఇప్పటికే దేశంలో పదివేల మీటర్లకు వంద కోట్లు ఖర్చుపెట్టిన టామ్ ఇంతకుమించి ఖర్చు వద్దనుకుంటోంది. రేటింగ్స్ నిర్ణయించే ఏకైక సంస్థ గనుక అందరినీ శాసించే స్థితిలో ఉండి గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది.

చివరికి చానల్స్ అన్నీ టీ ఆర్ పీ ( టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ ) చట్రంలో ఇరుక్కు పోయాయి. మొత్తం టీవీ పరిశ్రమనే శాసించే స్థానంలో రేటింగ్స్ స్థిరపడ్డాయి. చానల్స్ కూడా మంచి రేటింగ్ వస్తే ఆనందించటం, రాకపోతే రేటింగ్స్ ని తిట్టుకుంటూ టామ్ ని విలన్ గా చిత్రీకరించటమే ఇప్పటిదాకా చూశాం. అయితే, ప్రత్యామ్నాయ వ్యవస్థ మీద దృష్టి పెట్టటంతో బాటు టామ్ పనితీరుమీద పర్యవేక్షణ ఉందాలన్న కోణంలో ఇప్పుడు చర్చ మొదలైంది. ఒకే రేటింగ్ ఏజెన్సీ సరిపోతుందా, ఎక్కువ దేశాల్లో ఉన్నట్టు కనీసం రెండు ఉండాలా అనేది కూడా ఇప్పటి చర్చలో భాగమే. టీవీ రేటింగ్స్ లెక్కించే టామ్ మీద విమర్శలు భారతదేశానికే పరిమితం కాలేదు.అమెరికాలో టామ్ మాతృ సంస్థ ఏసీ నీల్సెన్ కూడా ఎన్నో ఆరోపణలు ఎదుర్కోక తప్పలేదు. ఏసీ నీల్సెన్ గుత్తాధిపత్యానికి అక్కడి మరో సంస్థ టీ ఎన్ ఎస్ బ్రేక్ వేసింది. ఒక్కసారిగా ఏసీ నీల్సెన్ అరాచకాలు వెలుగు చూడటంతో ఎన్నో కోర్టుకేసులు ఎదుర్కోవలసి వచ్చింది.

అమెరికాలో మీడియా రేటింగ్స్ కౌన్సిల్ ఉంది.అది రేటింగ్స్ తీసే క్రమాన్ని పర్యవేక్షిస్తుంది. భారత్ లో మాత్రం అలాంతి వ్యవస్థ ఏదీ లేదు. ట్రాయ్ ఎప్పుడు ఏ విశయంలో జోక్యం చేసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఏయే అంశాలలో దాని పాత్ర ఉంటుందో ఇప్పటికీ ఎవరూ చెప్పలేరు. కార్యక్రమాలకు సంబంధించినంతవరకు తన ప్రమేయం ఎంతమాత్రమూ ఉండదని ట్రాయ్ చెబుతుంది. ఇది సాంకేతిక మైన అంశం కాదుగనుక పట్టించుకోనంటుంది. ఈ రేటింగ్స్ ఆధారంగానే కార్యక్రమాలు తయారవుతున్నాయి కాబట్టి సమాచార ప్రసారాల శాఖ పరిధిలోనివని మరో వాదన. ప్రకటనకర్తలు, యాడ్ ఏజెన్సీలు, చానల్స్ కలసి అంగీకరించి ఏర్పాటుచేసుకున్న ఈ వ్యవస్థ మీద అభ్యంతరాలుంటే వాళ్ళే సరి చేసుకోవాలని ట్రాయ్ సూచిస్తోంది.మరో వైపు సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ కూడా చేతులెత్తేసింది. ఒక దశలో అప్పటి సమాచార కార్యదర్శి అరోరా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ ” మియా బీవీ రాజీ హై తో క్యా కరేగా హాజీ ” అన్నారు. అంటే, ఇది కేవలం ప్రకటనదారులకూ, సంస్థలకూ, చానల్స్ కూ సంబంధించిన వ్యవహారంగానే ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

అయితే ప్రబుత్వం చెబుతున్నట్టుగా ఇది నిజంగా కేవలం మార్కెట్ కి సంబంధించిన సమస్యేనా ? రేటింగ్స్ ని ప్రజాదరణగా అర్థం చేసుకోవటమే తప్పన్న విషయాన్ని ప్రభుత్వమే పట్టించుకోకపోతే చౌకబారు కార్యక్రమాలతో ప్రేక్షకులు ఇబ్బంది పడాలా ? సెక్స్, క్రైమ్ లాంటి కార్యక్రమాలు ప్రసారమవుతున్నప్పుడు చాలామంది ఆసక్తితో చూడవచ్చు. ఆ తరువాత అలాంటి కార్యక్రమాలు మంచివి కావనే అభిప్రాయానికి రావచ్చు.అంతమాత్రాన ఆ కార్యక్రమాలకు ప్రజాదరణ ఉన్నట్టు భావించటం సమంజసం కాదు. చూస్తే తప్ప మంచో చెడో తెలియనప్పుడు తీరా చూశారు కాబట్టి మంచి కార్యక్రమమనే నిర్ధారణకు రావటం మీద విమర్శలొస్తున్నాయి. కేవలం రేటింగ్ వచ్చినంత మాత్రాన అది మంచి కార్యక్రమం అనుకోవటానికి వీల్లేదు. దురదృష్టవశాత్తూ అలా అనుకోవటం వల్లనే మిగిలిన చానల్స్ కూడా అటువంటి కార్యక్రమాన్నే ప్రసారం చెయ్యాలని తహతహలాడుతున్నాయి. కనీసం ప్రయోగాత్మకంగానైనా మంచి కార్యక్రమాలు అందించే ప్రయత్నం చేయటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే చానల్స్ కంటే ప్రకటనకర్తలే కాస్త బాధ్యతతో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. రేటింగ్స్ ఎక్కువ వస్తున్నప్పటికీ క్రైమ్ కార్యక్రమాలకు ప్రకటనలు ఇవ్వటానికి ముందుకు రావటం లేదు. ప్రకటనకర్తలకు సహాయ పడాల్సిన రేటింగ్స్ ఇప్పుడు కార్యక్రమాల రూపకల్పనకు మార్గదర్శనం చేస్తున్నాయి. ఆ మాట కొస్తే , యాడ్ ఏజెన్సీల కంటే చానల్స్ ఎక్కువగా రేటింగ్స్ ని వాడుకుంటున్నాయేమో అనిపిస్తుంది.

మరో సారి రేటింగ్స్ తీరు గమనిస్తే, గ్రామీణ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోవటం లేదని టామ్ స్వయంగా అంగీకరిస్తోంది. లక్షలోపు జనాభా ఉన్న ప్రదేశాలను పట్టించుకోదు. దీన్ని బట్టి చానల్స్ కూడా గ్రామీణప్రజలకు అవసరమయ్యే కార్యక్రమాల గురించి ఆలోచించటమే అనవసరమనే అభిప్రాయానికొచ్చాయి. అంతెందుకు.. చానల్స్ ఉపయోగించే భాష విషయంలోనూ అదే ధోరణి కనిపిస్తోంది. ఇంగ్లిష్ పదాలు అలవోకగా దొర్లిస్తూ పట్టణప్రాంత ప్రజలు ఉపయోగించే భాషనే చానల్స్ ఎంచుకోవటానికి కారణమూ రేటింగ్స్ లెక్కించే విధానమే. ఎంటర్‍టైన్‍మెంట్ చానల్స్ తమ కార్యక్రమాలలో ప్రేక్షకులకు భాగస్వామ్యం కల్పించాలనుకుంటే రేటింగ్స్ లెక్కించే పట్టణాలనే ఎంచుకుంటాయి. అక్కడి ప్రేక్షకుల దృష్టిలో పడాలన్న ఆశే అందుకు కారణం. న్యూస్ చానల్స్ అయితే రేటింగ్ పట్టణాల వార్తలౌ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం, అటువంటి “కీలక పట్టణాల” లో గట్టి రిపోర్టర్లను నియమించటం రహస్యమేమీ కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదా, లేదా? ఇది కేవలం చానల్స్,అడ్వర్టైజర్, యాడ్ ఏజెన్సీ సమస్య మాత్రమేనా ?

రేటింగ్స్ లెక్కించటమనేది ఒకే సంస్థ చేతిలో ఉండటం కూడా రేటింగ్స్ విశ్వసనీయతను ప్రశ్నార్ధకంగా మార్చింది. ఈ మధ్యనే ఎ మాప్ అనే సంస్థ వచ్చింది. ఇది టామ్ లాగా వారానికొకసారి కాకుండా ఏ రోజుకారోజు, ఇంకా కావాలంటే ఎప్పటికప్పుడు ఆన్‍లైన్ లో రేటింగ్స్ ఇస్తానంటోంది. అదే జరిగితే న్యూస్ చానల్స్ ప్రేక్షకులను రాబట్టుకోవటానికి ఎప్పటికప్పుడు ఎన్ని రకాల అవలక్షణాలు నేర్చుకుంటాయో ఊహకు అందదు. ఈ పరిస్థితుల్లో సాంకేతికత ఎక్కువగా ఉన్న రేటింగ్స్ ను పక్కన బెట్టి కార్యక్రమాల నాణ్యత మీద సర్వే జరిపించటం మంచిది. చానల్స్ కూడా పరోక్షంగా ఇదే కోరుకుంటున్నాయి. రేటింగ్స్ ను ప్రభుత్వం నియంత్రించ లేకపోతే ఎక్కువ నష్టపోయేది ప్రజలే. సమాచార శాఖామంత్రి చెబుతున్న రేటింగ్స్ కమిషన్ నిజంగా ఏర్పాటై రేటింగ్స్ లో లొసుగులు తొలగించి కార్యక్రమాల నాణ్యతకు రేటింగ్ ఇస్తే ప్రేక్షకులు సంతోషిస్తారు.
Source :- http://bhavanarayana.co.tv లోనిది

Friday, August 5, 2011

ఓ చానల్ బ్యూరో చీఫ్...యాంకర్ తో,లేడీ రిపోర్టర్ తో సృంగార లీలలు

ఓ చానల్ బ్యూరో చీఫ్...సృంగార లీలలు..ఎవ్వరూ తనను గమనించడం లేదు అనుకున్నాడో...తానేం చేసినా ఎవ్వరికి తెలీదు అనుకున్నాడో కాని... సదరు బ్యూరో చీఫ్ ఓ లేడి రిపోర్టర్ తో మరో యాంకర్ తో ఎంజాయి చేస్తున్నాడు.యాంకర్ ది వేరే చానల్ , లేడీ రిపోర్టర్ ది మాత్రం బ్యూరో చీఫ్ గారి చానలే అంట మరి ఈయనగారికి ఈ లింక్ లు ఎలా ఏర్పడ్డాయో మరి..సదరు యాంకరమ్మ ఎవరో లేదీ రిపోర్టర్ ఎవరో త్వరలో తెలుస్తుంది..ఓ అభిమాని మాకు చెప్పిన విషయాలు ఇవి త్వరలో సరదు బ్యూరో చీఫ్...గారి రాచలీలల ఫోటోలు పంపుతాను అని తెలిపాడు...పార్కుల్లొ ఉన్న ఫొటోస్ ఉన్నాయని పబ్ కు వెల్లినప్పటి ఫొటోస్ ఉన్నాయని చెప్పుకొస్తున్నడు...యాంకర్ తో ఉన్నప్పడి ఫొటోలు .... లేడీ రిపోర్టర్ తో ఉన్నప్పటి ఫొటోలు మాకు పంపుతాను అంటున్నాడు.........అప్పుడు కచ్చితంగా ఫొటోలు బ్లాగ్ లో పెడతాము మరి ఆ బ్యూరో చీఫ్ ఇప్పటికైనా జాగ్రత్త పడితే మంచిది నిజం ఎప్పటికీ దాగదు మరి ...సదరు బ్యూరో చీఫ్ కు పెళ్ళైంది..లేడీ రిపోర్టర్ కు పెళ్ళైంది ...సదరు యాంకర్ కు మాత్రం పెళ్ళి కాలేదంట ...ఈ హాట్ న్యూస్ ఫోటోస్ మాకు చేరేలోపు సదరు బ్యూరో చీప్ జాగ్రత్తపడితే మంచిదేమో..?

టీవీ9 బంద్ అయింది

త్వరలో పత్రిక, న్యూస్‌ ఛానల్‌ ప్రారంభిస్తా: జగ్గారెడ్డి




సామాజిక తెలంగాణ లక్ష్యంగా దోపిడీదారుల పాలన పోవాలని మీడియా రంగంలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు మెదక్‌ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(కాంగ్రెస్‌) వెల్లడించారు. బుధవారం రాత్రి ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మరి కొద్ది రోజుల్లో 'జై తెలంగాణ జై' పేరుతో దినపత్రిక, టీవీ న్యూస్‌ ఛానల్‌ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ పేరు మీద వంద కోట్ల రూపాయలను పోగుచేసి వాటిని కుటుంబ ఆస్తులుగా కూడబెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య తెలంగాణ పేరు మీద వచ్చిన ఒక దినపత్రిక, టీవీ ఛానెల్‌ కేవలం బ్లాక్‌ మెయిలింగ్‌కే పరిమితమై, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడవడం చూసి తానెంతో బాధపడుతున్నానని పేర్కొన్నారు. అందుకే పత్రిక, న్యూస్‌ ఛానెల్‌ ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

Source: eenadu.net

అంకం రవి-శ్రీధర్ బాబు నేతృత్వంలో...విశాక ఇండస్ట్రీస్ ఛానల్..."వీ సిక్స్" త్వరలో

తామర తంపరగా పుట్టుకొస్తున్న తెలుగు టెలివిజన్ ఛానెల్స్ జాబితాలో మరొక ఛానెల్ చేరబోతున్నది. తెలంగాణాలోని పెద్దపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎం.పీ. జీ.వివేక్ గారికి చెందిన విశాక ఇండస్ట్రీస్ ఈ ఏడాది నవంబర్ లో "వీ సిక్స్ (V-6)" అనే పేరుతో ఒక ఛానల్ ను తెచ్చేందుకు సిద్ధమవుతున్నది.
తెలుగు టెలివిజన్ జర్నలిజంలో 'హార్డ్ కోర్' చర్చలు జరపడంలో మంచి పేరు తెచ్చుకున్న అంకం రవి నేతృత్వంలో ఇది రాబోతున్నది. ఈ చానెల్ ఏర్పాటుకు రవి మంచి కసరత్తు చేసి...ప్రతిపాదనను ఒక కొలిక్కి తెచ్చారని సమాచారం. తెలంగాణా కాంగ్రెస్ నేత ఛానల్ కదా...ఇది మూడునాళ్ళ ముచ్చటేలే అనుకున్న నాకు హెచ్.ఎం.టీవీ లో అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేస్తున్న నా మంచి మిత్రుడు పసునూరి శ్రీధర్ బాబు (మాజీ ఇండియా టుడే జర్నలిస్ట్) ఒక షాక్ ఇచ్చారు. హెచ్.ఎం.టీవీ కోర్ కమిటీ సభ్యుడైన శ్రీధర్ "వీ సిక్స్" లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా చేరారు. తక్కువ కాలంలోనే ఎక్కువగా మిత్రుడైనా జర్నలిస్టు శ్రీధర్. ప్రతిభను పరిగణలోకి తీసుకుని శ్రీధర్ ను మంచి పదవిలో నియమించడం ఈ గ్రూప్ తీసుకున్న మంచి నిర్ణయమని నాకు అనిపించింది. వినోద్ వాళ్ళ ఇంట్లో పేర్లన్నీ "వి" తో ఆరంభమవుతాయట, అలాగే వారికి అచ్చివచ్చే సంఖ్య "ఆరు (సిక్స్)" అట. అందుకే అలాంటి పేరు పెట్టారట. నాకైతే పేరు నచ్చలేదు కానీ...రవి-శ్రీధర్ సమన్వయంలో వచ్చే టీం పట్ల ఆసక్తి ఉన్నది.

కాంగ్రెస్ కు, తెలంగాణాకు కొమ్ము కాయడం తమ ఎజెండాలో లేకుండా ఛానల్ నడపాలని ఈ యాజమాన్యం భావిస్తున్నది...ప్రస్తుతానికి. అది మంచిదే కదా! ఈ చానెల్ వారైనా ఇష్టం వచ్చినట్లు జర్నలిస్టులను తీసుకుని...అనక భరించలేక వారిని ఇంటికి పంపబోరని, ఒక ఉద్యోగిని తొలగించడం ఒక హత్యతో సమానంగా భావిస్తారని, "వాడిని పీకుదాం...వీడిని పీకుదాం" అని పెద్ద కత్తి పట్టుకుని కూర్చొనే జర్నలిస్టు జాతి కంటక అమానుష ఎడిటర్లకు బుద్ధి వచ్చేలా వీరు ప్రవర్తిస్తారని నేను కోరుకుంటున్నాను.

తమకు తప్ప మరొకడికి పరిజ్ఞానం లేదని భ్రమల్లో బతికే మహనీయులు, మన అనుయాయులకు తప్ప వేరే వారిని బతకనివ్వకూడదని అనుకునే మహానుభావులు, జర్నలిజం లో నీతి-విలువలను అర్జెంటుగా పాతరెయ్యాలని కంకణం కట్టుకున్న వీరులు...నడుపుతున్న పోరంబోకు ఛానల్స్ కు భిన్నంగా కొత్త ఛానల్ తేవడానికి తెలుగులో వీలు ఉన్నది. ఆ గ్యాపును కొత్త చానెల్ ఎలా పూడుస్తుందో వేచి చూడాల్సిందే. తులసి వారి చానెల్, విజయవాడ కేంద్రంగా ఒక ఛానల్, చిరంజీవి ఛానల్ కూడా రాబోతున్నాయని అంటున్నారు.

నా మిత్రుడు శ్రీధర్ గురించి రాయకుండా ఈ పోస్టు ముగిస్తే అది తప్పవుతుంది. నల్గొండ జిల్లా కు చెందిన పసునూరి శ్రీధర్ బాబు చెన్నై లో ఇండియా టుడే పత్రికలో పనిచేస్తున్నప్పుడు హెచ్.ఎం.టీ.వీ. చీఫ్ ఎడిటర్ రామచంద్ర మూర్తి గారు తన కోర్ టీం లోకి ఆహ్వానించారు. విషయ పరిజ్ఞానం, విశ్లేషణా సామర్ధ్యం, సందర్భ శుద్ధి, ప్రజాస్వామ్యయుత భావన...అన్నింటికి మించి చక్కని తెలుగు రాసే సత్తా ఉన్న రచయితా-కవి శ్రీధర్ అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. శ్రీధర్ చేసే వార్తా వ్యాఖ్య కు మంచి రేటింగ్స్ వచ్చేవి, తన చర్చలు అర్థవంతంగా అనిపించేవి. శ్రీధర్ కు టీ.వీ.జర్నలిజం లో మంచి భవిష్యత్తు ఉంది. రవీ అండ్ శ్రీదర్...విష్ యు గుడ్ లక్.:- Ramu


source :- http://apmediakaburlu.blogspot.com/

Thursday, July 21, 2011

చిరంజీవి 'టీవీ' ఎప్పుడు.?



ఈ వారం టీఆర్పీ రేటింగ్స్‌(29వ వారం)

1) టీవీ9 - 2.60
2) టీవీ5 - 1.76
3) హెచ్ ఎం టీవీ - 1.43
4) ఎన్ టీవీ - 1.39
5) సాక్షి టీవీ - 1.37
6) ఈ టీవీ2 - 1.19
7) జీ 24 గంటలు - 0.95
8) మహా టీవీ - 0.75
9) టి న్యూస్ - 0.57(కేవలం హైదరాబాద్ లో మాత్రమే)
10)ఎబిఎన్ - 0.57
11)స్టూడియో ఎన్ - 0.56
12)ఐ న్యూస్ - 0.45
13)జెమిని న్యూస్ - 0.07

టీవీ9 విషప్రచారంపై టీ న్యూస్‌ కథనం-ఉన్నదున్నట్టుగా (you tube lo video chusi rasindi)

రంగుల డబ్బా టీవీ9 తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉంది. తెలంగాణపై ఒక్క మంచిపరిణామం జరిగినా జీర్ణించుకోలేని ఈ సోకాల్డ్‌ సీమాంధ్ర మీడియా సొల్లు పురాణం మొదలుపెట్టింది. ఒక్కసారి టీ కాంగ్ నేతల కొత్త కుంపటి అంటూ మరోసారి హైకమాండ్ గుస్సా అంటూ కారు కూతలు కూస్తుంది. వంకర టింకర వార్తలు రాస్తూ ఉద్యమాన్ని వీలైనంతా పక్కదారి పట్టిస్తోంది. తెలంగాణ కోసం తెగించుడేనని తేల్చి చెప్పిన టీ కాంగ్రెస్ నేతల్ని కొత్త పార్టీ పెడుతున్నారంటూ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారంటూ హైకమాండ్ ముందు దోషుల్ని చేసేందుకు కుట్ర పన్నుతోంది. టీ కాంగ్ ఐక్యత మీటింగ్ కు 23మందే హాజరయ్యారు తెలంగాణ కాంగ్రెస్ లో చీలికలు అంటూ దిక్కుమాలిన న్యూస్ తో న్యూసెన్స్ క్రియేట్ చేస్తోంది. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవం కోసం రాజీనామాలు చేస్తే.. ఆత్మరక్షణలో అంటవ్.. అసలు ఆత్మరక్షణలో పడింది కాంగ్రెస్ హైకమాండ్.. ఇంకా చెప్పాలంటే.. సీమాంధ్ర నేతలే. ప్రపంచానికి అంతా అర్ధమైన ఈ విషయాన్ని టీవి 9 ఎక్కడ నువ్ ప్రస్తావించవెందుకు? స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఎమ్మెల్యేలు పార్టీలు ,సిద్ధాంతాలతో నిమిత్తంలేకుండా రాజీనామాలు చేస్తే.. ఎరక్కపోయి ఇరుక్కున్నా అంటూ వెకిలి వేషాలు వేసిన టీవి9.. రాజీనామాలు చేసి ఇరుక్కున్నట్లు నీతో ఎవరు చెప్పారో చెప్పగలవా? రాజీనామాల్ని వెనక్కు తీసుకుంటే.. ఈప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమతదో ఆ పార్టీ నేతలకు, హైకమాండ్‌కు టీవి9 తెలియదనుకుంటున్నదా? తమపై టీవీ9 అసత్య ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నేతలు డైరెక్ట్ గానే తిడుతున్నరు.
ఇక తెలంగాణ ముద్దుబిడ్డ జైపాల్ రెడ్డి రాష్ట్ర సాధనలో తనవంతు ప్రయత్నాలు చేస్తున్నరు. నిన్నగాక మొన్న దేశప్రధానిని కలిసిన జైపాల్ తన పుట్టిన గడ్డ విముక్తి కోసం చేస్తున్న ప్రయత్నాల్ని మీడియా ముందు స్పష్టం చెప్పిన్రు. హైదరాబాద్‌ రాజధానిగ తెలంగాణను ఇచ్చి తీరాల్సిందేనని కుండబద్దలు కొట్టారు.



ఈ విషయాన్ని పీటీఐ సహా అన్ని వార్తా సంస్థలు, జాతీయ మీడియాతో సహా అందరూ ఉన్నదున్నట్లు చెప్పారు. కానీ, ప్రాంతీయ విద్వేషాన్ని నిండా నింపుకున్న టీవీ 9 మాత్రం జైపాల్ లాంటి సీనియర్ నేత హైదరాబాద్‌ను వేరుచేసి మాట్లాడారంటూ..కుళ్లు ప్రచారాన్ని మొదలుపెట్టింది.

మెరుగైన సమాజం కోసమంటూ డప్పుకొట్టూకునే టీవీ9 ఛానల్ తనేదో తీస్ మార్ ఖాన్ న్యూస్ ప్రసారం చేస్తున్నట్లు నోటికొచ్చింది వాగుతూ కక్కాల్సిన విషమంతా కక్కింది. పనికి రాని వాదనలు తెరమీదికి తెస్తూ తెలివితక్కువ వాదనలు వినిపిస్తోంది. టీవి 9కు తెలంగాణ ఉద్యమంపై విషాన్ని కక్కటం ఇదేం కొత్తకాదు. ఏడేళ్లుగ ఆ ఛానెల్ చేస్తున్న విష ప్రచారాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికపుడు ఎండగడుతునే ఉంది. మొన్నటికి మొన్న తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల ముందు తన విష ప్రచారంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష లేదని చాటిచెప్పే ప్రయత్నం చేసింది. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేస్తున్నట్లు చాకలి శ్రీను మీడియా ముందు చెప్పినప్పటికీ.. వ్యక్తిగత కారణాలంటూ.. దుర్మార్గపు ప్రచారాన్ని టీవి9 మొదలుపెట్టింది. తెలంగాణ చానెల్ ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టడంతో టీవి9 నాలిక్కరుచుకోక తప్పలేదు. ఈ దరిద్రపుగొట్టు మీడియా ఎంత దుష్రచారం చేసినా.. తెలంగాణ బిడ్డలు పన్నెండు మంది త్యాగధనులను ఎంత మెజారిటీతో గెలిపించిన్రో ప్రపంచం చూసింది.

రాజీనామాలు చేసిన నేతలపై వేటు అంటూ టీవీ9 పదేపదే స్టోరీలు ప్లే చేసింది. హై కమాండ్ కు కోపం వచ్చిదంటూ బద్నాం చేసింది. టీ కాంగ్ నేతలు రాజీనామాలతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ అతితెలివి వార్తలు ప్రసారం చేసింది. ఆరునూరైన రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే ప్రసక్తే లేదంటూ కాంగ్రెస్ హైకమాండ్ తమకు మాత్రమే చెప్పిందన్నట్లు రాంగ్ మెసెజ్ ఇచ్చింది. టీవీ 9 మూడు నాలుగు రోజులుగ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగ చేస్తున్న విషప్రచారాన్ని ముందే పసిగట్టిన తెలంగాణ నేతలు రాజీనామాలు చేయక ముందే.. తెలంగాణ ప్రజల్ని అప్రమత్తం చేసిన్రు.

ఇదే టీవి9 సీమాంధ్ర నేతలకు ఢిల్లీలో ఎదురవుతున్న పరాభవం గురించి మాటాకైన ప్రస్తావించదు. సీమాంధ్ర నేతల ఢిల్లీ పర్యటన మూడు సార్లు వాయిదా పడ్డా.. టీవీ9కు కనిపించదు, వినిపించదు. ఆధారాలు లేకున్నా.. తెలంగాణ నేతలను పలుచన చేసే టీవీ 9 నాగార్జున సాగర్ డీప్ కట్ కుంభకోణంలో సిమెంటు దొంగగ ముద్రపడ్డ సుబ్బిరామిరెడ్డి ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు డబ్బులు సంచులతో తిరుగుతున్నాడంటూ.. తెలంగాణ నేతలు చెప్పినా.. ఆ విషయాన్ని ఎందుకు ప్రసారం చేయదు? పిడికెడు మంది సీమాంధ్ర పెట్టుబడీదారులకు కొమ్ముకాయటమే పనిగా పెట్టుకున్న టీవి9 తెలంగాణ ఉద్యమాన్ని కించపరిస్తే..ఇక్కడి జనం చూస్తూ ఊరుకోరు.



ఇలాంటి అసత్య , వూహాజనిత కథనాలు ప్రసారం చేసే టీవీ9 మెరుగైన సమాజం కోసమంటూ ట్యాగ్ లైన్ పెట్టుకోవడం సిగ్గుచేటన్నది జగమెరిగిన నిజం. కులం పేరు అడిగిన వాడ్ని చెప్పుతో కొట్టామంటూ డప్పు కొట్టే టీవీ9 అంతకంటే దారుణంగా తన వర్గం, కులస్థుల ప్రయోజనాల కోసం తెలంగాణపై దుష్ఫ్రచారం చేస్తున్నందుకు ఏ చెప్పుతో కొట్టాలి. మీడియాను అడ్డం పెట్టుకుని ఎస్ఈజెడ్ ల పేరుతో వేలాది ఎకరాలను కొట్టేసిన టీవీ9 ఆ వివరాలను ప్రజల ముందు పెట్టాలి.



తెలంగాణపై లేనిపోని దుష్ర్ఫచారం చేస్తూ 600మంది ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపించిన టీవీ9 ఇప్పటికీ అలాంటి దుష్ర్ఫచారానే చేస్తోంది. మరీ దుర్మార్గపు రేటింగ్ కోసం గుజరాత్ టీవీ9 రిపోర్ట్ ఓ నిండు ప్రాణం జలితీసుకుని జైల్లో చిప్పుకూడు తిన్న ఘటనన ప్రజలకు ఎందుకు వివరించలేదు? అడ్డగోలు వార్తలు, అసత్య ప్రచారాలతో పబ్బం గడుపుతున్న టీవీ9కు నాలుగున్నర కోట్ల తెలంగాణ బిడ్డలు శిక్ష విధించే సమయం వచ్చింది. టీవీ9 పద్దతి మార్చుకోకపోతే.. తెలంగాణ బిడ్డలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది.

Sunday, July 17, 2011

టివి9 రవిప్రకాష్ తెలంగానా ద్రోహి అంటున్న ఓబ్లాగర్..http://saaradakiran.blogspot.com



ఈ లింక్ క్లిక్ చేయండి టివి9 రవిప్రకాష్ తెలంగానా కు ఏవిదంగా ద్రోహం చేశాడో చెప్పుకొచ్చాడు

http://saaradakiran.blogspot.com/2011/07/my-story-on-tv9.html

Friday, July 15, 2011

"ది హన్స్ ఇండియా" ప్రారంభోత్సవం ఈ నెల 15 న

‌హెచ్.ఎం.టీవీ చీఫ్ ఎడిటర్ కె. రామచంద్రమూర్తి గారి సారథ్యంలో, సంచలనాత్మక ఎడిటర్ నాయర్ గారి సంపాదకత్వంలో ఆంగ్ల దినపత్రిక "ది హన్స్ ఇండియా" ఈ నెల 15 న మార్కెట్ లోకి విడుదల కాబోతున్నది. ముందుగా ప్లాన్ చేసిన ప్రకారమైతే...అవినీతిపై సమరం చేస్తున్న అన్నా హజారే ఈ పత్రికను ప్రారంభించాల్సి ఉంది. ఆయన హైదరాబాద్ పర్యటన ఖరారైందీ లేనిదీ తెలియరాలేదు.

ఇప్పటికే ఈ పత్రిక డమ్మీలు తేవడం ఆరంభించింది. మిగిలిన ఆంగ్ల దినపత్రికలకు భిన్నంగా, వినూత్నంగా, ఆకర్షణీయంగా తేవడానికి నాయర్ గారి బృందం కష్టపడి పనిచేస్తున్నది. వీరికి హెచ్.ఎం.టీవీ సీనియర్లు కూడా సహకరిస్తున్నారు. "ది హన్స్ ఇండియా" కోసమని నాయర్ గారు ఏరికోరి తెచ్చుకున్న సీనియర్ జర్నలిస్టు, "ది హిందూ" లో పనిచేసి మానేసిన సాయ శేఖర్ ఒక వారం కిందట సిటీ ఎడిటర్ పదవిని వదిలి త్వరలో రాబోయే మధ్యాహ్న ఆంగ్ల పత్రిక "నూన్ పోస్ట్" లో అసోసియేట్ ఎడిటర్ గా చేరారు. భారీ స్థాయిలో రాబోతున్న "నూన్ పోస్ట్" ను ఈ నెల 14 న ఆరంభిస్తారని చెబుతున్నారు. గతంలో డీ.ఎన్.ఏ. పత్రికలో బెంగళూరు లో పనిచేసిన ఒకరు దీనికి సంపాకుడిగా వ్యవహరిస్తున్నారు.

Thursday, July 7, 2011

మీడియాకి పనుండదంటున్న పూరి

మల్లికార్జున శర్మను ఈటానగర్ బదిలీ చేసిన 'ఈనాడు'

హక్కుల గురించి నోరు తెరిచి అడిగిన ఉద్యోగులపై కత్తి కట్టే 'ఈనాడు' సంస్థ మరొక దారుణానికి పాల్పడింది. జర్నలిస్టుగా తన హక్కుల గురించి, న్యాయంగా రావలసిన పదోన్నతి గురించి అడిగిన పాపానికి ఇప్పటికే ఒరిస్సా రాజధానికి బదిలీ చేసిన సీనియర్ జర్నలిస్టు మల్లికార్జున శర్మను 'ఈనాడు' నిన్న సాయంత్రం ఉన్నపళంగా ఈటానగర్ బదిలీ చేసింది. మర్నాడే (అంటే ఈ రోజు) రిలీవ్ అయి ఈ నెల పద్నాలుగో తేదీన అక్కడ జాయిన్ కావాలని ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది.
కిందటి నెల పదిహేను రోజులకే జీతం ఇచ్చి ఇబ్బంది పెట్టడంపై మల్లికార్జున్ లేబర్ శాఖ కు ఫిర్యాదు చేయడం, ఈ నెల పందొమ్మిదవ తేదీన శ్రీకాకుళం లో అసిస్టంట్ లేబర్ కమిషనర్ ముందు జాయింట్ మీటింగ్ ఉండడం తో శర్మను మానసికంగా దెబ్బ తీయడానికే ఈ బదిలీ చేసినట్లు ఆయన స్నేహితులు చెబుతున్నారు.



"పిల్లల విద్యా సంవత్సరం ఆరంభం అయ్యాక ఇలా బదిలీ చేయడం దారుణం. తమకే పుట్టిన పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. అయినా ఈనాడు యజమానులు ఇలాంటి నీచానికి పాల్పడ్డారు. దీనికి వారు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు," అని ఒక మిత్రుడు కాస్త పరుషంగా అన్నారు.



"న్యూస్ టుడే" అనే సంస్థను నెలకొల్పి దాని నుంచి 'ఈనాడు' వార్తలను కొనుక్కుంటూ పత్రిక నడుపుతున్నట్లు.... లోకానికి పొద్దున్న లేచిన దగ్గరి నుంచి సుద్దులు చెప్పే రామోజీ రావు, ఆయన కొడుకు పేపర్ల మీద చూపించారు. ఇదీ కాక జర్నలిస్టులకు వేజ్ బోర్డు ప్రకారం రావలసిన జీతాలు ఇవ్వకుండా 'ఈనాడు' దోచుకోవడాన్ని మల్లికార్జున్ కోర్టులలో ప్రశ్నించారు.


దానికి ప్రతీకారంగా ఈ బదిలీ వేటు వేసినట్లు భావిస్తున్నారు. ఢిల్లీ లోని ఆర్.టీ.ఐ. అధికార్లకు, ఈనాడు యాజమాన్య ప్రతినిధులకు, మల్లికార్జున్ కు మధ్య వీడియో కాన్ఫరెన్స్ జరిగిన కొద్ది సేపట్లోనే ఈ జర్నలిస్టు పై బదిలీ వేటు వేసారని సమాచారం.
source :- http://apmediakaburlu.blogspot.com/

చిరంజీవి ఛానల్ కు స్వప్న- తులసి సీడ్స్ వారి ఛానల్ త్వరలో

టీవీ నైన్ వ్యవస్థాపక బృందంలో కీలక భూమిక పోషించి, తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక స్థానం పొందన స్వప్న ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ప్రారంభించబోయే ఛానల్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) లేదా ఎడిటర్ ఇన్ ఛీఫ్ గా వెళ్లి పనిచేయడం ఆరంభించారని చాలా ఆలస్యంగా నాకు అందిన సమాచారం. "ఇప్పుడు అడుగుతున్నవేమన్నా...రామ్ వెళ్ళిపోయిన కొన్నాళ్లకే ఆమె కూడా వెళ్లిపోయింది గదా..".అని సాక్షి సంస్థలో ఉద్యోగి ఒకరు సోమవారం సాయంత్రం నాతో చెప్పారు. కొద్దిగా ట్రాక్ చేయడం ఆపితే చాలు...ఈ తెలుగు ఛానల్స్ లో విషయాలు తెలియకుండా పోతాయి.



నిండుగా చీర కట్టుకుని కట్టూబొట్టూతో తీరుగా ఉండే వారు బుల్లితెరను ఏలుతున్న రోజుల్లో రంగప్రవేశం చేసిన స్వప్న టీవీ నైన్ ద్వారా అనతికాలంలోనే వినుతికెక్కారు. అమెరికాలో చదువుకుని వచ్చి, సంగీత పరిజ్ఞానం ఉన్న ఆమె యాంకరింగ్ తో సంచలనం సృష్టించారు. ఆమె నవ్వు మాత్రం భలే ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పక తప్పదు. ఆడవారి విషయంలో బాగా బద్నాం అయిన కరీం అనే యాంకర్, స్వప్న అటూ ఇటుగా ఒకరి తర్వాత ఒకరు టీవీ నైన్ ను వదిలారు. ఒక అమ్మాయి తండ్రి, బ్రదర్ జరిపిన యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడి కరీం కోలుకుంటుండగా, స్వప్న రేడియో వైపు దృష్టిమరల్చారు. తర్వాత సాక్షి ఛానల్ లో చేరారు కానీ అక్కడ అప్పటికే పాతకుపోయిన ప్రియదర్శిని రామ్ తో తనకు పడలేదని చెబుతారు. ఒక దశలో రామ్ మీద జగన్మోహన్ రెడ్డి భార్యకు స్నప్న ఫిర్యాదు చేశారని కూడా ధృవపరుచుకోడానికి వీలులేని వార్తలను బట్టి తెలుస్తున్నది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి భజన బృందంలో కీలక భూమిక పోషించిన జర్నలిస్టులలో ఒకరైన స్వప్న...చిరంజీవి ఛానల్ లో చేరారు...ఒక మంచి పే ప్యాకేజీకి ఆకర్షితురాలై.
బడుగుల బాగుకోసమంటూ ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి ఎన్నికలలో బొక్కబోర్లా పడగానే...ఇక లాభంలేదని అధికార కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న చిరంజీవిని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్న స్వప్న కల సాకారమవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం. ఒక మీడియా సంస్థ అంటూ లేకపోవడం వల్ల చాలా నష్టపోయామని బాధపడుతున్న చిరంజీవి బృందం స్వప్నపై చాలా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తున్నది.

ఇదిలావుండగా...తులసి సీడ్స్ అనే సంస్థ త్వరలో ఒక ఇరవై నాలుగు గంటల ఛానల్ తేబోతున్నదట. ఈ ఛానల్ నిర్వహణ బాధ్యతలను తోట భావ నారాయణ అనే సీనియర్ జర్నలిస్టుకు అప్పగించారట. ఆ ఛానల్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నదని చెబుతున్నారు. మా టీవీ, జెమిని టీవీలలో ఉన్నత పదవుల్లో పనిచేసిన భావ నారాయణ...ఎలక్ట్రానిక్ మీడియా మీద ఒక పుస్తకం కూడా రాశారు. కొన్నాళ్లు హెచ్.ఎం.టీవీ లో పనిచేసిన భావ నారాయణ ఆ తర్వాత దాన్ని వదిలేశారు.

తెలుగు న్యూస్ చానల్లకు NBA వార్నింగ్






Thursday, June 30, 2011

ఈ వారం GRP రేటింగ్స్‌(26వ వారం)

) TV9-110 గత వారం-112
2) TV5- 81 గత వారం-84
3) SAKSHI TV-72 గత వారం-79
4) HMTV- 59 గత వారం-53
5) ETV2- 48 గత వారం-47
6) NTV- 45 గత వారం-49
7) MAHA TV-37 గత వారం-33
8) ZEE24GANTALU-32 గత వారం-37
9) STUDIO N-23 గత వారం-26
10) ABN- 19 గత వారం-17
11) I NEWS- 15 గత వారం-16
12) T NEWS-15 గత వారం-10(only in hyd)
13) GEMINI NEWS- 4 గత వారం-5

తెలుగు న్యూస్ చానల్స్ ను అడ్డుకున్నదెవరు ?

మొదటిసారిగా తెలుగు న్యూస్ చానల్స్ అన్నీ ఒక్కటయ్యాయి. ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకున్న సందర్భాలను మరిచిపోయి చేయిచేయి కలిపి మీడియా స్వేచ్ఛ కోసం చానల్ యజమానులు పోరుబాటన సాగుతామని ప్రతినబూనారు. రేటింగ్ పోటీని పక్కనబెట్టి ప్రభుత్వాన్ని ఉమ్మడిశతృవుగా ప్రకటించటానికి పోటీ పడ్డారు. చర్చావేదికల్లో శ్రీకృష్ణ కమిటీ నివేదికను చీల్చి చెండాడదామని అనుకుంటే ప్రభుత్వమే సైంధవుడిలా అడ్డుపడిందని ప్రజలకు చాటిచెప్పటానికి నానా ప్రయాసపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసుల దౌర్జన్యాలను చూపించకుండా హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ ఆదేశాలిచ్చి తమ స్వేచ్ఛను కాలరాశారంటూ కారాలూ మిరియాలూ నూరారు.

కానీ ఇది గడసరితనమే తప్ప, పైకి కనిపించినంత ధర్మాగ్రహం కానేకాదని జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రధానంగా రెండు అంశాలను ముందుగా తెలుసుకోవాలి. ఒకటి కేబుల్ టీవీ చట్టం, రెండోది వార్తా ప్రసారకుల సంఘం (న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్). కేబుల్ టీవీ చట్టం 1995 నాటిది. అంటే పదహారేళ్ళుగా అమలులో ఉన్నదే. ఈ రోజు కొత్తగా అమలు చేయటమనే ప్రశ్నే తలెత్తదుగనుక తెలుగు న్యూస్ చానల్స్ సీ ఈ ఓ లు సరికొత్తగా మేలుకొని జూలు విదిల్చి ఆగ్రహావేశాలు వెళ్ళగక్కాల్సిన అవసరమే లేదు. ప్రజలను రెచ్చగొట్టే విధమైన ప్రసారాలు చేయకూడదని చెప్పటం చాలా మామూలు విషయమే. ఇప్పుడు కొత్తగా ఉలిక్కిపడాల్సిన అవసరమే లేదు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక అనంతర ఘటనల ప్రసారాలకు సంబంధించి కేబుల్ టీవీ చట్టంలో చెప్పారేమో అని అర్థం వచ్చేలా ఇప్పుడు రాద్ధాంతం చెయ్యాల్సిన అవసరమేమైనా ఉందా ?

ఇక రెండోది… వార్తాప్రసారకుల సంఘం ( ఎన్ బి ఎ). ప్రభుత్వం ఆంక్షలు విధించకుండా ఉండాలంటే స్వీయనియంత్రణ మేలని ప్రభుత్వమే చెబుతున్న సమయంలో న్యూస్ చానల్స్ ఏర్పాటుచేసుకున్న సంస్థ ఇది. న్యూస్ చానల్స్ పాటించాల్సిన నియమాలు రూపొందించటంతోబాటు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ప్రత్యేక సూచనలు కూడా చేయటం దీని పని. ఆ విధంగా ప్రభుత్వ జోక్యాన్ని నివారించగలుగుతున్నామని సంస్థ భావిస్తోంది. ముంబై లో తీవ్రవాదుల దాడి సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరు పరోక్షంగా తీవ్రవాదులకు సహకరించిందని విమర్శలొచ్చాక ముందస్తుగా కొన్ని సూచనలు చేయటం మొదలైంది. అయోధ్య తీర్పు సమయంలో మార్గదర్శకాలిచ్చినట్టే శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమయంలో కూడా సభ్యత్వం తీసుకున్న చానల్స్ కు కొన్ని సూచనలు చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఈ సూచనలు అందేది సభ్యులకు మాత్రమే. అంటే, తెలుగులో ఉన్న 15 న్యూస్ చానల్స్ కు గాను సభ్యత్వం తీసుకున్న ఈటీవీ, టీవీ9, సాక్షి, హెచ్ ఎంటీవీ, జీ 24 గంటలు, జెమినీ న్యూస్ చానల్స్ మాత్రమే ఆ సూచనలు అందుకున్నాయి. అదే కాపీని మన కమిషనర్ ఏకే ఖాన్ అన్ని న్యూస్ చానల్స్ కు పంపుతూ మీ సంఘం చేస్తున్న సూచనలైనా పాటించండంటూ కోరారు. ఇది మన సీ ఈ ఓ లకు ఎక్కడలేని ఆగ్రహాన్ని తెప్పించింది. అవును మరి.. తోటికోడలు నవ్వితే తట్టుకోవటం కష్టమే కదా!

తెలంగాణ కు అనుకూలంగా ఉద్యమిస్తున్న ఉస్మానియా విద్యార్థుల ఆవేదనను టీవీలో చూపాలనుకున్నా, శ్రీ కృష్ణ కమిటే నివేదికమీద చర్చోపచర్చలతో ప్రజలకు వాస్తవాలు వివరించాలనుకున్నా ఏకేఖాన్ అడ్డుపడ్డారని చెప్పుకోవటానికి ఒక సాకు దొరికిందని సంతోషపడిన చానల్ యజమానులు ఈ ఆగ్రహం నటించారని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఈ మాట మరింత ఉలుకుపాటు కలిగించవచ్చుగాని మొదటి నుంచి విశ్లేషిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఎన్ బీ ఏ ఇచ్చినవి ఆదేశాలా? సూచనలా ? సూచనలు మాత్రమే. అవి నచ్చని పక్షంలో సభ్యులు తమ అభిప్రాయాలను సంఘానికి తెలుపుకునే అవకాశం లేదా ? ఈ ప్రత్యేక పరిస్థితులను వివరించి సంఘాన్ని ఒప్పించేందుకు సభ్యత్వమున్న ఆ ఆరు చానల్స్ ప్రయత్నించాయా ? ఎన్ బీ ఏ ఆదేశాలు సభ్యులందరికీ అనివార్యంగా శిరోధార్యమని భావించిన పక్షంలో సభ్యులు కాని 9 చానల్స్ మాటేమిటి ? వాటికి ఎన్ బీ ఏ సూచనలు పాటించాల్సిన అగత్యం అసలే లేదు కదా?

మళ్ళీ ఖాన్ గారి గారి కొరడా దగ్గరికొద్దాం. చానల్స్ ప్రసారాల విషయంలో ప్రభుత్వజోక్యం లేనేలేదని మొరపెట్టుకున్నా ఆయన మాటలు వినపడనట్టు నటించారు. పైగా, ఎవరైనా రెచ్చగొట్టే వార్తలు ప్రసారం చేయవద్దని సూచించినంతమాత్రాన నిజాలే చూపవద్దని కాదుగదా! ప్రజలకు సమాచారం చేరవేయటం మీడియా పని. ఆంక్షలు ఉన్నా బేఖాతరుచేసి నిజాలు నిర్భయంగా చాటిచెబుతామని పదే పదే చెప్పుకునే మీడియా ఇలా కుంటి సాకులు చూపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కమిషనర్ ఇచ్చింది ఎన్ బీ ఏ సూచనలే తప్ప ప్రభుత్వాదేశాలు కాదని ఈ సీ ఈ ఓ లకు తెలియదా ?వీరందరి కలయికకు చొరవతీసుకున్న వారికి తెలియదా ? ఎవరి ఉచ్చులో ఎవరు పడ్డారు ? ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరుగుతున్నదో చెప్పాల్సిన బాధ్యత నుంచి వైదొలగేలా చేసిన ఈ వ్యవహారంలో ఎలాంటి కుట్రా లేదంటే నమ్మగలమా?

Source :- http://bhavanarayana.co.tv/

సిద్దార్దపై కేసు పెట్టిన తెలుగు న్యూస్ చానల్స్

చిరంజీవి పెట్టే టీవీ ఛానల్ పేరు.. ఓపినింగ్ డేట్ పూర్తి వివరాలు




ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సొంత టెలివిజన్ ఛానల్ ను పెట్టనున్నారనే వార్తలు చాలా కాలంగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఆగస్టు ఇరవై రెండు నాటికి ఈ చానల్ ను తీసుకురావాలని ఆయన సంకల్పించారు. కాగా ఆ ఛానల్ పేరు పవర్ న్యూస్ అని పెట్టారని తెలస్తోంది. ఇక ఆ చానెల్ ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్ కానుంది. ఇక నుంచి చిరంజీవి ఆ ఛానెల్ పనిలోనే ఉంటారని, అందుకనే సినిమా కూడా ఒప్పుకోవటం లేదని చెప్తున్నారు.

చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్టు ఇరవై రెండు నాటికి ఈ టీవీ ఛానల్ జనంలోకి తేవాలన్నది వారి ఉద్దేశంగా ఉంది. ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పటికీ, మీడియా తన చేతిలో లేకపోవడం వల్ల బాగా నష్టం జరిగిందని చిరంజీవి భావించే ఈ ఛానెల్ లాంచింగ్ చేస్తున్నారని వార్త. సన్నిహితులు భావిస్తుంటారు. సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మరికొందరు సన్నిహితులతో కలిసి చిరంజీవి ఈ చానల్ ను తీసుకువస్తున్నారు. టివీ నైన్ స్వప్న ఈ ఛానెల్ ని లీడ్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Thursday, June 23, 2011

జవహర్ లాల్‌నెహ్రూ హౌసింగ్‌ సొసైటీలో ఏం జరుగుతుంది : {బినామీల గుట్టు తెలిసినవారు పోరుతెలంగాణకు చెప్పండి}

(తెలంగాణ శ్రీనివాస్)
జవహర్ లాల్‌నెహ్రూ హౌసింగ్‌ సొసైటీలో ఏం జరుగుతుంది. సొసైటీ లబ్దిదారుల లిస్ట్ ను కొంతకాలం ఎందుకు గోప్యంగా ఉంచారు. స్వయంగా లబ్దిదారులే అడిగినా సొసైటీ పెద్దలు మొదట ఎందుకు నిరాకరించిన్రు. 1100 మంది లబ్దిదారుల్లో 800మంది సీమాంధ్ర జర్నలిస్టులున్నరన్న విషయాన్ని పోరుతెలంగాణ ఎప్పుడో చెప్పింది. కానీ ఈ 800 మందిలో ఎంతమంది నిజమైన జర్నలిస్టులున్నరు. ఎంతమందికి అర్హత ఉన్నది. వీరిలో జర్నలిజం వృత్తిని వదిలేసినవాళ్లు ఎందరున్నరు. ఎంతమందికి ఎక్స్ పీరియన్స్‌బేస్డ్‌ గా 800లోపు నెంబర్లు ఇచ్చిన్రు. వీళ్ల సీమాంధ్ర అర్హతతో పాయింట్లు వేసిన్రా. తెలంగాణవాళ్లందరికీ ఎందుకు 700 తర్వాత నెంబర్లు ఇచ్చిన్రు. కేవలం తెలంగాణ వాళ్ల పేర్లే ఎందుకు వెనుకబడ్డయి. సొసైటీ పెద్దలు ఫేర్‌గా లేరని తెలంగాణ లబ్దిదారులు వాపోతున్నరు. జవహర్‌లాల్‌నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ సుప్రీంకోర్టుకు సమర్పించిన లిస్ట్‌ పోరుతెలంగాణ సేకరించింది. లిస్ట్‌ ను gallery లో పోస్ట్‌ చేసిన. ఈ లిస్ట్‌ లో నిజమైన లబ్దిదారులు ఎందరున్నరు. ఎవరన్నా ఎక్స్‌ పీరియన్స్‌ లేకుండా ఉన్నవాళ్లు, స్థలం పొందడానికి అనర్హులు ఉంటే వాళ్ల పేర్లు పోరుతెలంగాణకు చెప్పండి. ఇందులో మీకు తెలిసిన జర్నలిస్టులు అర్హులా..? కాదా? ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వండి. తెలంగాణవాళ్లందరినీ ఎందుకు వెనక్కి నెట్టాల్సి వచ్చింది. ఉన్న 300 మందికి స్థలాలు రాకుండా కుట్రలు ఎందుకు చేస్తున్నరు. తెలంగాణ ఉద్యమానికి ఆటంకాలు సృష్టిస్తూ, విషప్రచారం చేయడమే కాక తెలంగాణలో తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు రాకుండా చేస్తున్నరు. 1100 మందిలో 800 మంది సీమాంధ్రులే. కేవలం 800 మందికి మాత్రమే స్థలాలు వచ్చేటట్టు ఉన్నయి. అంటే తెలంగాణవాళ్లకు రావు. తెలంగాణ జర్నలిస్టులంతా ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. హైదరాబాద్ లో సీమాంధ్ర జర్నలిస్టులు ఇళ్లస్థలాలు ఇవ్వొద్దని తెలంగాణ జాతి మొత్తుకుంటుంటే సీమాంధ్ర జర్నలిస్టులు ఒక్క తెలంగాణ జర్నలిస్టుకు కూడా స్థలం రాకుండా కుట్ర చేస్తున్నరు. సీమాంద్ర జర్నలిస్టుల తీరును తెలంగాణ జర్నలిస్టులంతా నిరసించాలి. తెలంగాణ వచ్చినంకనే జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి. Gallery లో ఉన్న ఈ లిస్ట్‌ ను చదివి అర్హులెవరో, బినామీ లెవరో తెలంగాణ జర్నలిస్టులు తేల్చండి. తెలంగాణ జర్నలిస్టుల కోసం పోరుతెలంగాణ పోరాడుతుంది. పోరుతెలంగాణతో తెలంగాణ జర్నలిస్టులంతా గొంతుకలపండి. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కూడా దీనిపై పోరాడాలని పోరుతెలంగాణ విజ్ఞప్తి చేస్తుంది.
Feedback: telanganasree@gmail.com

SOURCEV:-http://www.porutelangana.com

Monday, June 20, 2011

మారిన జీ 24 గంటల లోగో




జీ టెలివిజాన్ నెట్ వర్క్ తన చాన్నాళ్ళ లోగో లను మార్చింది .తెలుగులో న్యూస్ ఛానల్ గా ఉన్న జీ 24 గంటల లోగొ కూడా మారింది .కొత్త లోగో stylish గా కనబడుతున్నా ప్రజలు ఇదో కొత్త చానల్ అని అనుకునే ప్రమాదం లేక పోలేదు .. ప్రింట్ మీడియాలో కూడా ప్రచారం చేస్తే బాగుంటుందేమో

తీరు మార్చుకోని తెలుగు న్యూస్ యాంకర్ లు.........?

తెలుగు న్యూస్ యాంకర్ లు లైవ్ కార్యక్రమాలలో వ్యవహరిస్తున్న తీరు ఇటు ప్రేక్షకులకు అటు రాజకీయ నాయకులకు ఆగ్రహం తెప్పిస్తుంది .మొన్న రజినీకాంత్ (TV9),నిన్న సుమతి (TV9),నేడు కొమ్మినేని శ్రీనివాసరావు (NTV)లు తెలంగాణా రాజకీయ నాయకులతో వ్యవరిస్తున్న శైలి కంపరం పుట్టిస్తుంది .ఇక రాధాకృష్ణ(ABN) నోటి దూలకు అడ్డు అదుపు లేనే లేదు .టీవీ స్క్రీన్ల ఫై నిత్యం కనబడుతుండటంతో హీరో లుగా ఎలా మాట్లాడిన చెల్లుబాటు అవుతుంది అన్న తీరులో వ్యవహరిస్తున్నారు .

*తెలంగాణా కు వ్యతిరేఖంగా కథనాలు ,చర్చలు నడపడంలో దిట్ట అయినా రజినీకాంత్ కు ఆనాడే జగదీశ్వర్ రెడ్డి (TRS) బుద్ది చెప్పారు .



తెలుగు దేశం వర్గావాలు తెరాస అడ్డుకున్తున్తుందన్న విషయం లో tv9 యాంకర్ సుమతి లైవ్ లో చేసిన ఓవర్ యాక్షన్ ను తీవ్రంగా ఎండగట్టాడు .



తెలంగాణా ప్రాంతం,రాజకీయనాయకుల మీద వివక్ష చూపే కొమ్మినేని శ్రీనివాస్ రావు ఫై నాగం జనార్ధన్ రెడ్డి గట్టిగానే బదులిచ్చాడు .

*ఇక వేమూరి రాధాకృష్ణ కి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని మూర్ఖుడు .యంగిస్తాన్ లో ఆయన గారు చేస్తున్నబీభత్స కాండను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు తీరు మార్చుకోవటం లేదు . దీనికి అయన గారి KCR తో ఓపెన్ హార్ట్ ,యంగిస్తాన్ లే సాక్ష్యిం .
ఎవరు ఎలా బుద్ది చెప్పిన వీళ్ళ తీరుమాత్రం మారడంలేదు . తెలంగాణా ప్రాంతం,రాజకీయనాయకుల మీద వివక్ష చూపే కొమ్మినేని శ్రీనివాస్ రావు ఫై నాగం జనార్ధన్ రెడ్డి గట్టిగానే బదులిచ్చాడు ..ఎవరు ఎలా బుద్ది చెప్పిన వీళ్ళ తీరు మాత్రం మారడంలేదు .

మీడియా లో సంచలనం సృష్టిస్తున్న మరో లేఖ

తెలుగు న్యూస్ మీడియా లో లేఖల పర్వం కొనసాగుతుంది .నిన్న tv9 ceo రవిప్రకాష్ మారాలన్న ఉద్దేశంతో ఒక అజ్ఞాత వక్తి లేఖ రాస్తే ,నేడు జెమిని త్రయం సాగిస్తున్న అవినీతి అరాచకాలను ఎండగడుతూ మరో వక్తి (బాదితుడుకావచ్చు) లేఖాస్త్రాన్నిఎక్కుపెట్టాడు . జెమిని లో కీలక పదవిలో ఉన్న సాయి ఆలయాస్ సత్యనారాయణ అమలు చేస్తున్న "క'సాయి' పాలనకు అంత మెప్పుడు ???,జెమిని న్యూస్ లో ముగ్గురి మూర్ఖుల మూడు ముక్కలాట ఇంక్కేనాళ్ళు?? "అన్న శిర్షికలతో ఉన్న లేఖhttp://chaatimpu.blogspot.com/ చిక్కింది.ఈ లేఖ లో ప్రదానంగా వాసుదేవన్ తెలంగాణా ఉద్యోగులను వేదిస్తున్న తీరును ,జెమిని సాయి చేస్తున్న అవినీతి, అక్రమ ,అశ్లీల ,కార్యక్రమ విషయాలతో పాటు,ఆంధ్రజాతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఫై సాయి చేసిన కామెంట్స్ ని ,సన్ నెట్ వర్క్ ఆంధ్ర హెడ్ సంజయ్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చెఇస్తున్న విషయాలను లేఖ లో అజ్ఞాత వక్తి వివరించాడు .ఈ లేఖ వెలువడ్డాక జెమిని యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి .



ఆ లేఖ యధాతదంగా మీకోసం







NOTE :- http://chaatimpu.blogspot.com/

ఇళ్ల స్థలాలను తెలంగాణ జర్నలిస్టులకు కేటాయించినంకనే సీమాంధ్ర జర్నలిస్టులకు కేటాయించాలి

జవహర్‌లాల్‌ హౌసింగ్‌ సొసైటి జర్నలిస్టులకు నెంబర్‌లు ఇవ్వడంలో కొంత గ్యాంబ్లింగ్‌ జరిగిందని తెలంగాణ లబ్దిదారులు వాపోతున్నరు. ఎక్స్‌పీరియన్స్‌ బేస్డ్‌గా పాయింట్లు ఇచ్చినమని చెప్పుతున్న సొసైటీ లీడర్లు సీమాంధ్ర జర్నలిస్టుల విషయంలో పక్షపాతంగా వ్యవహరించి ముందు నెంబర్‌లు వచ్చేలా చూసిన్రని తెలంగాణ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. 1100 మంది లబ్ధిదారుల్లో 800 మంది సీమాంధ్రులు, 300 మంది తెలంగాణవాళ్లుండగా కొంతమందికి మాత్రమే ముందు నెంబర్లు వచ్చినయి. మిగతావారందరికీ 750 తర్వాత వచ్చినయి. పాయింట్లు గీయింట్లు జాన్తా నై. 300 మంది తెలంగాణ జర్నలిస్టులకు స్థలాలు కేటాయించినంకనే సీమాంధ్ర జర్నలిస్టులు స్థలాలు తీసుకోవాలని పోరుతెలంగాణ డిమాండ్‌ చేస్తుంది.

జర్నలిస్టులను ఆదుకోవడంలో ముందు నిలిచిన ఉర్ధూ పత్రికలు

జర్నలిస్టులను ఆదుకోవడంలో ఉర్దూ పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా ముందు నిలిచింది. ఇళ్ల స్థలాలకోసం రూ.2లక్షలు కట్టాల్సివుండగా పత్రిక యాజమాన్యాలు ఆదుకున్నయి. రూ.2లక్షలు లోన్‌గా ఇచ్చినయి. సియాసత్‌, మున్సిఫ్‌, 4టీవీలు తమ ఉద్యోగులకు ఇళ్లస్థలాల కొసం అవసరమైన డబ్బంతా ఇవ్వాలని నెలకిందనే డిసైడ్‌ చేసుకున్నయి. టీవీ9 ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకుని కొందరి 2లక్షలు, కొందరికి రూ.లక్ష లోన్‌ ఇచ్చినయి. మీడియా సంస్థలు ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవడం సంతోషకరం. కీపిటప్‌.

Sunday, June 19, 2011

సాక్షి టీవీని మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్‌ తీసుకున్న ఎన్డీటీవీ

తెలుగు మీడియాలోకి ఎన్డీటీవీ ప్రవేశించింది. జగన్‌ చానల్‌ సాక్షిని మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్‌ తీసుకుంది. ఎన్డీటీవీ నుంచి ముగ్గురు ఆల్‌రెడీ చానల్‌కు వచ్చి హల్‌చల్‌ చేస్తున్నరు. కాంటెంట్‌, విజుబిలిటిపై ప్రత్యేక శ్రద్ధ పెడ్తున్నరు. సాక్షి టీవీ అంటే కేవలం జగన్‌ అని కాకుండా మంచి బ్రాండ్‌ ఇమేజ్‌ ఉన్న చానల్‌గా తీర్చిదిద్దాలని జగన్‌ అనుకుంటున్నడట. అందుకే సాక్షిని ఎన్డీటీవీ చేతిలో పెట్టిండని సాక్షివర్గాలు చెప్తున్నయి

- source http://www.porutelangana.com

Saturday, June 18, 2011

అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి మీడియాలో ప్రేమ ,DATING గోలలు




అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి మీడియాలో ప్రేమ గోలలు..పిల్లి పాలు తాగుతూ ఎవ్వరూ చూడలేదు అనుకుంటుందంటా...మీడియాలో మేమేంచేసినా ఏవ్వరూ ఏమీ అనలేరనే దానికోసం బ్లాగులొచ్చాయి..తప్పును తప్పు ఒప్పును ఒప్పుగా చూపించి అప్పటికీ మారక పోతే..నిజాలు బయట పెటాల్సి వస్తుంది...బ్యూరో చీఫ్ ల స్థాయిలో ఈ ప్రేమ కలాపాలు నడుస్తున్నాయి ... అందరూ చూస్తున్నా ...ఎవ్వరూ ఏమనలేరని వారి దైర్యం...కొన్ని చానల్స్ లో చానల్ యజమానులే ఇలా చేస్తున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి..కొన్ని చానల్స్ లో బాత్ రూం బాగోతాలు ఇప్పటికే బయటకు పొక్కాయి...అక్కడ అందరికీ తెల్సిన ఓ పెన్ సీక్రెట్ అయినా చానల్ యజమానులు ఎందుకు పట్టించుకోవడం లేదో.మరొ చానల్ లో అమ్మాయిల ఫోటోలను పిచ్చి సైట్లలో పెట్టి వేదిచడం ఆవిషయం యాజమాన్యిం దృష్టికి తీసుకెళ్ళినా వారు పట్టించుకోక పోవడం విడ్డూరం కదూ .... బ్యూరో చీఫ్ లమని ప్రేమాయనాలు నడిపిస్తున్నారు ....పాపం వారు ఎవ్వరికి తెలీదు అని అనుకుంటున్నారు...లాంగ్ డ్రైవ్ లూ మీటింగ్ లు డేటింగ్ లు నడుస్తున్నాయి...పాపం తమను ఎవ్వరూ చూడలేదని అనుకుంటున్నారు...వారు వీళ్ళని చూసిన జనాలు ఆ ఫొటోలు బయట పంచుతున్నారు..పెళ్ళి కాని వాళ్ళు ఇలాంటి యవారాలు నడిపారంటే దానికి ఏదో కుర్రాల్లు అనుకోవచ్చు..పెళ్ళైన బ్యూరో చీఫ్ లు బరితెగించి ఇలా రోడ్డున పడితే జనాలు ఊరుకుంటారా ఎంచక్కా ఫొటోలు తీసారు..మీడివాళ్ళుకదా అందుకే పబ్లిక్ బాగా ఇంట్రష్టు చూపిస్తున్నారు..టీవీల్లో కనిపించే వారు ఇదేంటి ఇలా అంటూ...ఆ ఫొటోలు బ్లూటూత్ లో షేర్ చేసుకుంటూ చివరకు మాకు చేరాయి...ఓ హెచ్చరికి చేస్తున్నాం...నీతులు చెప్పల్సిన వాల్ళే ఇలా బజారున పడితే...పబ్లిక్ పబ్లిక్ గా ఉమ్మేస్తారు...అందరికీ నీతులు చెప్పి మీరు చేసేదేంటి అంటూ...కొన్ని ఆఫీసుల్లొనే ఈ ప్రేమ కలాపాలు నడుస్తున్నాయి ... మరి చానల్ నిర్వాహకులు ఇప్పటికైనా ఇలాంటీ వారిపైదృష్టి పెట్టకపోతే ...అంతే మరి..డ్యూటీలో ఉండగానే డేటింగ్ అంటూ బయట తిరుగుతున్న మిడియాలో పెద్దలూ కాస్త జాగ్రత్త అటు అమ్మాయిల
తల్లి దండ్రులకు తెల్సినా...ఇటు బార్యిలకు తెల్సినా ఉద్యోగం ఊడితే సీన్ సితార అవుతుంది ..మీ బాగోతాలు అందరూ చూస్తున్నారు..కొన్ని చానల్స్ లో జరిగే బాగోతాలు బయట పెట్టేందుకు ఎవ్వరు ఇలా ఉషారు చేస్తున్నారో..ఎవ్వరు ఫోన్లలో మాట్లాడుకుంటున్నారో..క్యాంటిలలో చేరి ఫోన్లలో మాట్లాడేవారు సహజంగా అందరి దృష్టిలో పడతారు వారిని వెంటనే గుర్తించి కొందరు రిపోర్టర్లు వాల్ల ఫోన్ కాల్ రిజిష్ట్ర్రి (Details )తెప్పించుకొని అవతల ఎవ్వరితో మాట్లాడూతున్నారో తెల్సుకొని SMS వివరాలు లాగి .. ఆయా చానల్లలో టాపిక్ లను మాదృష్టికి తీసుక వస్తున్నారు...అందుకే మేము అందరినీ హెచ్చరిస్తూ ఈపొష్టు చేస్తున్నాం మావద్ద అన్ని సాక్ష్యాదారాలు ఉన్నాయి కారల్లో షికారు చేసేయి..పార్కుల్లో డేటింగ్ ల ఫోటోలు కూడా ఉన్నాయి మావద్ద..కాపురాలు కూలుతాయని ..ఉద్యోగాలు ఊడుతాయని ఊరుకుంటున్నాం..అటుపక్క అమ్మాయిల్లో పెళ్ళైన వాళ్ళు పెళ్ళికాని వాళ్ళు ఉన్నారు...మరి ఆ పని చేసేవాళ్ళు ఇది అవసరమా ఆలో చించండి మీరు పబ్లిక్ మనుషులు ..ఆఫీసుల్లో పనులు మానేసి ఫోన్లు మాట్లాడే వారిని పసిగట్టిన కోందరు అవుత్సాయిక రిపోర్టర్లు వాళ్ళ ఫోన్ కాల్ డీటైల్స్ తెప్పించి మరి చూస్తున్నారు..ఇంకేముంది ఆ సాక్ష్యాలు మాకు చేరవేస్తున్నారు ...ఇలానే కొందరు మీడీయాలో పని చేసే అమ్మాయిలు ఎప్పుడు చూసినా ఫోన్లలో మాట్లాడూతూ.. ఉంటూ..తమ లవర్సు కోసం సింలను మార్చి అదేపనిగా ఫోన్లలో మాట్లాడుతున్నారంటమరి...కొందరు బ్యూరో చీఫ్ లు తమ ప్రేమ కలాపాలు అందమైన అమ్మాయి తో ( మీడియాలో పని చేసే అమ్మాయే ) తనకు వచ్చే SMS లను చూపించి ఆఫీసుల్లో గొప్పగా చెప్పుకోని బుక్ అవుతున్నారు అవతల అమ్మాయిని బుక్ చేస్తున్నారు ఈ విషయం అవతలి అమ్మాయిలకు తెలీదంట మరి...కాలం మారింది మీరు ఎక్కువగా ఆఫీసుల్లో పని మానేసి ఫోన్లలో మాట్లాడుతుంటే జర బద్రం మీ పేర్లు అవతలి వాల్ల పేర్లు సాక్ష్యాలతో సహా బయటికొస్తాయి...కొందరు బ్యూరో చీఫ్ లు డ్యూటీ టైంలో పని ఉందని బయటకు వచ్చి డేటీంగ్ చేస్తున్నారు ... ఆఫోటోలు ఇప్పటికే మావద్ద ఉన్నాయి.. పబ్బులకేళ్ళేయి ఉన్నాయి వీళ్ళా అని చూసి ఆచ్చర్యం వేసింది....కొందరు యాంకర్లు క్యాబ్ ఎక్కినప్పటినుంచి దిగేదాకా ఫోన్ లలో మాట్ళాడుతూనే ఉన్నారట అంతగా ఏం మాట్లాడు కుంటారో మరి అలా మాట్లాడే మాటలు డ్రైవర్లు విని ఆ మాటలను హాట్ టాపిక్ లు చేస్తున్నారు

Note :- చానల్ హెడ్లు..చానల్ యజమానులు ఈ పోష్టును కాస్త నోటీస్ బోర్టులో పెడితే మీడియా పరువు నిలబడుటుంది లేదంటే పబ్లిక్ ఊస్తారు..నీతులు చెప్పి జనాలను ఊదరగొట్టే న్యూస్ చానల్లలో పని చేసే వాళ్ళ బాగోతం ఇదాని అనుకుంటారు..ఈ విషయాని మేను బయట పెడితే దమ్మున్న చానల్ కచ్చితంగా వాటిని పబ్లిక్ చూపిస్తుంది SO BE CARE FULL

Saturday, June 11, 2011

Venkat Krishna of TV5 ..join StudioN very soon

Venkat Krishna of TV5 will join StudioN very soon. Earlier Venkat Krishna worked in ETV2 as Senior Journalist and use to cover Chandra babu Naidu activities on behalf of ETV. He made good relationship with him and upon request of Chandra Babu Naidu Venkat Krishna is going to be part of StudioN Team. But StudioN management is failing to pay salaries regularly.


Narne Srinivasa rao, who is the founder of StudioN, wanted to give this channel to Jr.NTR as marriage gift, but Nara Lokesh who completely took over the channel is keeping Narne Srinivasa rao offline from channel activities. will join StudioN very soon. Earlier Venkat Krishna worked in ETV2 as Senior Journalist and use to cover Chandra babu Naidu activities on behalf of ETV. He made good relationship with him and upon request of Chandra Babu Naidu Venkat Krishna is going to be part of StudioN Team. But StudioN management is failing to pay salaries regularly.


Narne Srinivasa rao, who is the founder of StudioN, wanted to give this channel to Jr.NTR as marriage gift, but Nara Lokesh who completely took over the channel is keeping Narne Srinivasa rao offline from channel activities.

కాలక్షేపం న్యూస్ ఛానెళ్లు...newsaa.... Gasaaaaa

ఉదయానే్న రూపాయిన్నర మొదలు మూడు రూపాయలు పెట్టి న్యూస్ పేపర్ కొని ఇంకా చదువుతున్నారంటే 24 గంటలపాటు ప్రసారమయ్యే న్యూస్ ఛానళ్లపై విశ్వాసం అంతంత మాత్రంగానే ఉన్నట్టేనని లెక్క. లేకపోతే పెరిగే సాంకేతిక పరిజ్ఞానానికి ఈపాటికి ఎన్నో న్యూస్ పేపర్లు దుకాణం సర్దేయాల్సి వచ్చేది. దుకాణం సర్దేయడం మాట అటుంచి లేనిపోని కొత్త అభిమానం పుట్టుకొచ్చి పేపర్ సర్క్యులేషన్ అమాంతంగా పెరిగిపోతున్న సందర్భంలో కొన్ని పత్రికలు కూడా సొంత డబ్బానే బజాయించి నిరాశ కల్గిస్తున్నా నిజమైన వార్తాప్రియులు మాత్రం న్యూస్ ఛానళ్ల కంటే న్యూస్ పేపర్లకే తమ అభిమానాన్ని చాటడం వల్ల న్యూస్ విలువలకు ఇంకా పట్ట్భాషేకం జరుగుతూనే ఉంది.
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, టైమ్ మేనేజ్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని పాఠకులు కాస్తా ప్రేక్షకులుగా మారిన సందర్భంలో న్యూస్ ఛానళ్లు ఇదంతా తమ ప్రతిభా పాఠవాలేననుకుని న్యూస్‌ని జీడిపాకంలా సాగదీయడం మొదలుపెట్టాయి. ఈ ప్రక్రియతో నానాటికీ విసుగెత్తిపోతున్న ప్రేక్షక లోకం నెట్‌లో పత్రికలు చదవడమే మేలని భావిస్తున్నాయి. ఈ విధంగా నెట్‌లో కూడా పత్రికలకు పాఠకుల సంఖ్య క్రమేపీ పెరుగుతుంది.
వార్తల ప్రాధాన్యతా క్రమం ప్రకారం నిర్ణీత సమయంలో అవసరమైన అతి ముఖ్యమైన వార్తలే బుల్లితెర వచ్చిన కొత్తలో ప్రసారమయ్యేవి. సంక్షిప్తంగా అనవసర చర్చ లేకుండా హుందా భాషలో వార్తలు ప్రసారమయ్యేవి. ఇదంతా ప్రభుత్వ ఛానెల్ ప్రక్రియ. అది ఇప్పటికీ అదే హుందాను ప్రదర్శిస్తుంది. వార్తలను సైతం వాణిజ్యంగా మార్చేయవచ్చు అనే ప్రక్రియ తెలుగులో ఊపందుకునేసరికి దాదాపు డజను ఛానళ్లు పుట్టుకొచ్చాయి. వాటిలో వాటికే నెంబర్ వన్ స్థానం కోసం తహతహలు. దానిని నిర్ణయించే సంస్థలు రేటింగ్ ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టేసరికి వార్తా ఛానళ్ల హంగామా పనిలో పనిగా పెరిగిపోయింది.
ప్రస్తుతం ఏది వార్తో ఏది కాదో తెలియని పరిస్థితికి వార్తలను తిలకించేవారు వచ్చేశారు. దొరికిన పిసరంత వార్తకు హంగూ ఆర్భాటాలను అద్దేసి ఫలానా ఛానల్ వారి మార్కుతో మేమే మీకు ముందు అందిస్తున్నాం సుమా! అంటూ పదేపదే గుర్తు చేస్తూ వీక్షకులకు బోరెక్కించేస్తున్నారు. వార్తలో హుందాగా వినపడే భాషపోయి పరమ నీచమైన నాటు భాష, క్యాప్షన్లు న్యూస్ బులెటిన్‌లో కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. కొన్ని ఛానల్స్‌లో అయితే ఏకంగా వార్తలు చదివేవారు తమ పేరు వెనుక కుల శబ్దం వినిపించేలా చెప్పుకోవడం గమనార్హం.
సమాజ బాగు కోసం వారు అందిస్తారని మనం డిసైడ్ చేసుకోవాలి. బహుశా మనకు నచ్చినవే తీసుకోవాలనేమో వారి అర్థం. ఏదైతేనేం చెప్పిందే చెప్పి అటు తిప్పి ఇటు తిప్పి ముప్పుతిప్పలు పెట్టి అహర్నిశలు శ్రమించే ఛానల్ జర్నలిస్టుల మాటలు ప్రేక్షకులకు వార్తలను చూసేటప్పుడు ఫ్రీగా దొరికే కామెడీగా తయారయ్యింది. ‘కాదేది కవిత కనర్హం..’ అన్న శ్రీశ్రీ మాటలు నేటి ఛానళ్లకి ఆధారం, ఆదర్శం కాబోలు. అందుకే సమాజంలో దొరికే పెంట దగ్గర నుండి పెంటగాన్ వరకు దేనినీ వదలకుండా అవసరమున్నా లేకున్నా కవర్ చేసేస్తున్నాయి ఛానళ్లు.
వార్తలను యధాతథంగా అందించే రోజులు పోయాయి. దానికి కొన్ని క్లిప్పింగ్స్ (ఒక్కటి దొరికినా చాలు మసక మసకగా వున్నా ఫర్వాలేదు) మ్యూజిక్ హంగామా పెట్టేసి రాబోయే అరగంట ముందు నుండి ‘కమింగ్ అప్’ అంటూ వేసి మరీ వీక్షకుల్లో ఆసక్తి కలిగించాలి. తీరా చూస్తే తుస్సుమనేలా ఉండాలి. అవసరమైతే మరికొన్ని వార్తలను వండడం కూడా ఛానళ్లు నేర్చుకోవాలి. ఈ ప్రక్రియతో నిజాలు బయటకు లాగాలనేది ఓ టెక్నిక్. ఇలాంటి పోటీల మధ్య వార్తా ఛానళ్లు మేమే ముందు అంటే మేమే ముందు అనే తరహాలో పోటీ పడుతున్నాయి.
వార్తా ఛానళ్ల మధ్య పోటీ ఎంతగా పెరిగిపోయిందంటే ఒక ఛానల్‌ని మరో ఛానల్ అణగదొక్కే స్థాయికి వచ్చేసింది. దీనిని ఆసరాగా తీసుకుని ఒక ఛానల్ బురదజల్లిన వ్యక్తులు మరో ఛానల్‌ని వేదిక చేసుకుని తమ పాతివ్రత్యం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే సదరు ఛానల్ దానికి వత్తాసు పాడటం ఎలాంటి జర్నలిజమో వారికే తెలియాలి. ఛానళ్ల మధ్య రేటింగ్ పోటీ వారిని ఎంత వరకు తీసుకుపోతుందంటే వారి యజమానుల పర్సనల్ లైఫ్‌లోకి, వ్యాపారాల్లోకి తొంగిచూసి మరీ వెతికి బజారుకీడ్చేలా (్ఛనల్‌కి) చేస్తుంది. ఈ మధ్యకాలంలోనే ఓ ప్రముఖ ఛానల్ మరో ప్రముఖ ఛానల్ యజమానికి సంబంధించిన హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్ విశ్వసనీయతపై చర్చ పెట్టింది. చర్చా కార్యక్రమంతో ఏం సాధించిందో ఛానల్ వారికి, ప్రజలకు తెలియంది కాదు కాని చర్చకు గురైన సదరు ఛానల్ యజమాని తన ఛానల్‌లో తన ప్రొడక్ట్ గురించి టల కార్యక్రమం చేసుకోవాల్సిన పని పడింది. ఇది గమనించిన వారు ఇట్టే చెప్పేస్తారు ఇదంతా దేనికో?
వార్త చూస్తే భయం కలగడం.. చలించుకు పోవడం ఒకప్పుడు జరిగేది. ఇప్పుడు ఆ ధోరణి ప్రజల్లో కనుమరుగై టేకిట్ ఈజీ పాలసీ వచ్చేసింది. అందుకే ఒకే రకమైన వార్తలకు కారణమయ్యే సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. నిజంగా వార్త పట్ల భయం ఉంటే ఇలాంటివి జరగడానికి చాలాకాలం గ్యాప్ వచ్చేది. ఇప్పుడలా జరగడం లేదు. ప్రజలు జర్నలిస్టుల పనితీరు పట్ల ఛానల్స్ వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా పలు అనుమానాలను కలిగి ఉండటం జర్నలిజం చేసుకున్న పాపం. ఎవరో చేసిన దానికి అందరూ అదే తాడుకి కట్టబడటం నిజంగా దురదృష్టకరం. దీనిపై కూడా ఛానళ్లు దృష్టి పెట్టి ప్రజలను సహకరించమనడం మెచ్చుకోదగ్గ విషయం.
ఛానళ్లు అన్ని వర్గాల వారి కోసం కార్యక్రమాలను తయారుచేస్తున్నాయి. వీటిలో కొన్ని లైవ్‌గా కూడా ప్రసారవౌతున్నాయి. అయితే వాటిలో సరుకు ఎంత? అంటే మాత్రం కచ్చితంగా తక్కువనే చెప్పాలి. చర్చా కార్యక్రమం నిర్వహించేవాడు ఎవరినీ సరిగ్గా మాట్లాడనీయక పోవడం అతని నిర్వహణా దక్షతకు నిదర్శనం. చర్చా కార్యక్రమానికి ప్రతీ అంశం కూడా అర్హమే. అందుకే చర్చా కార్యక్రమాలు చూడాలంటే నేడు వీక్షకులకు బోరుగా అనిపిస్తుంది.
ఓ మూఢ నమ్మకం.. ఓ మాఫియా కథనం.. ఓ మాంచి సెక్స్ రాకెట్.. ఓ పరువు హత్య.. ఓ సినిమా గాసిప్ ఇలా దొరికిన అంశాలను దొరికినట్టు పచ్చిగా చూపించేస్తూ తమ బాధ్యతను నిలుపుకోవడంలో న్యూస్ ఛానళ్లు ‘్ఫస్ట్ ఇన్’గా ఉంటున్నాయి. ఇన్ని కబుర్లు చెప్పే ఛానళ్లు రోజులో కొన్ని గంటలపాటు విశ్వసనీయత సరిగా ఉందో లేదో తెలియని అనేక ఉత్పత్తులు, యంత్రాలను గురించి చూపడం దేనికో అర్థం కాదు.
నేడు ఎక్కువగా వార్తా ఛానళ్లు గ్లామర్ ప్రపంచం చుట్టూనే తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాయి. రోజులో దాదాపు ఐదారు గంటలు సినిమా న్యూస్‌తోనే కాలం వెళ్లదీస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. హర్రిబుర్రిగా చూపే వార్తలు, అసంపూర్ణంగా పూర్తయ్యే చర్చలు, సాగదీసి సాగదీసి విసుగెత్తించే కథనాలు ప్రజల్లో ఏ వర్గానికైనా ఎంతవరకు ఉపయోగపడతాయనేది వారికే తెలియాలి. చూపించడం వరకే వారి పని అంటే.. ఓకే. ప్రతి ఛానల్ ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తుందనే ముద్ర ప్రజల్లో పడిపోవడం వల్ల అందులో ప్రసారమయ్యే వార్తల సారాన్ని ఇట్టే అవగాహన చేసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం ప్రజల్లో వార్తా ఛానళ్ల పట్ల విశ్వసనీయత కంటే కాలక్షేప ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. కుదురుగా విశ్వసనీయతతో ఒక్క వార్తా ఛానల్‌ని కూడా చూడలేని వార్తాప్రియులు రిమోట్‌పై తరచూ వేళ్లను ఆడిస్తూ అందరికీ రేటింగ్ ఇవ్వడం కొసమెరుపు.

ఛానల్స్‌లో బోరు కొట్టిస్తున్న సెల్రబెటీల పెళ్లి గోల’




సెలబ్రిటీలకు పెళ్లి సంబంధం కుదురుతుంన్న వార్త పిసరంత మీడియాకు అందితే చాలు ఛానల్‌లో ఆకాశమంత పందిరేసి భూదేవంత అరుగు అలికి పచ్చని తోరణాలు కట్టి వారి పెళ్లి జరిగేంతవరకు మీనాలో (్ఛనల్) ఊరేగిస్తూనే ఉంటారు. పాపం! వారు మాత్రం కావాలని చేస్తారా? 24 గంటల కవరేజీకి సరుకు కావాలి కదా? అందుకే పిలవని పేరంటానికి సైతం మేమున్నామంటూ వెళ్లిపోయి కవరేజ్ చేసేస్తూ ఉడతా భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు.
పెళ్లికొడుకు ఎన్నిసార్లు బయటకు వచ్చి మీడియాకు చిక్కకుండా వెళ్లిపోయాడో వార్త నుండి పెళ్లి కోసం తయారౌతున్న పిండి వంటల వరకు తెగ ఆశ్చర్యపోతూ ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని ట్రై చేస్తారు. పిలవని పేరంటానికి తయారై వెళ్లిన యాంకరమ్మ సదరు సెలబ్రిటీ ఇంటి గేటు ముందో కల్యాణ మండపం బయటో ఛానల్ వారు లైవ్‌లో పిలిచేంతవరకు వేచి ఉంటుంది. తీరా లైన్‌లోకి తీసుకున్న తరువాత నోరు చప్పరించుకుంటూ చెప్పిందే చెప్పి కెమెరామెన్‌తో నానా తిప్పలు పడుతుంది. ఇలాంటి సన్నివేశాలు ప్రతి ఛానల్‌లో దర్శనమివ్వడంతో ప్రేక్షకుడు పరమ బోర్ ఫీలవుతున్నాడు.
లేనివాడు ఆకలితో ఏడుస్తుంటే ఉన్నోడు అరక్క ఏడ్చాడట. అలా ఉంటాయి సెలబ్రిటీల పెళ్లిళ్ల తీరు. పదిమందీ చెప్పుకోవాలని చేసుకునే హడావిడికి ఎక్కువమందిని రావద్దని శుభలేఖల్లో చెప్పకనే చెబుతారు. అయినా కూడా వేలల్లో జనాలు వస్తారు. వాటిలో ఛానల్స్ వారు కూడా ఉండటం వల్ల తాము చూసిన (నోరెళ్లబెట్టి) విషయాలను లక్షల్లో కాదు కోట్ల మందికి పదేపదే చెప్పే గురుతర బాధ్యతను భుజాన వేసుకుంటారు. ఏ ఛానల్‌లో చూసినా ఇదే వాయింపు.
కొన్ని ఛానల్స్ చేసుకున్న అదృష్టానికి పెళ్లి కార్యక్రమాన్ని లైవ్ ఓన్లీగా ప్రసారం చేసుకునే హక్కులు లభిస్తాయి. అంతే! ఆ ఓవర్ ప్రసారాలకు ప్రేక్షకులకు సైతం పెళ్లంటే ఇలా చేసుకోవాలి లేకపోతే పెళ్ళే చేసుకోకూడదనిపించేస్తుంది. అయి తే అందరి కీ సాధ్య పడుతుందా? వాళ్లు సెలబ్రిటీలు కనుక సాగుతుందని సరిపెట్టుకుని యధాప్రకారం పప్పన్నం లాగించేయాల్సిందే. అనుక్షణం హైరానా పడిపోతూ తెలుసుకోవాల్సినంత సీను సెలబ్రిటీల పెళ్లిళ్లకుందా అనేది సామాన్య ప్రేక్షకుడి మాట. అలాంటి హడావిడిని ఛానల్స్ సృష్టిస్తున్నాయనేది వీరి వాదన. పిలవని పేరంటానికి మేం వెళ్లాం కావాలంటే చూడండి దానికి మీరే సాక్ష్యం అన్నట్లు ప్రేక్షకులపై రుద్దే ధోరణిని ఛానల్స్ అనుసరిస్తున్నాయా? అనే అనుమానంలో ప్రేక్షకుడు కొట్టుమిట్టాడుతున్నాడు.
సెలబ్రిటీలు పర్సనల్ లైఫ్‌లోకి ఛానల్స్‌ని ఎలాగ ఎంటరవ్వనివ్వరు కనుక వారి రంగానికి సంబంధించి దొరికిన క్లిప్పింగ్స్ సినిమా పాటలతో తెగ హడావిడి చేసి (బులిటెన్ బులిటెన్‌కు) సంబరపడిపోతారు. ఏదో మూల సమాచారంతో సెలబ్రిటీలు నివసించిన, పుట్టిన ఊళ్లకు పోయి అక్కడి జనంతో కథనాలు అల్లడం మొదలెడతారు.
పెళ్లితంతు పూర్తయ్యేవరకు సెలబ్రిటీలు ఎలాగా దొరకరు. అంతవరకు ఊరుకుంటే రేటింగ్‌లో వెనుకబడి పోతామని భావించిన సదరు ఛానల్స్ ఆకాశమంత పందిరేసేవాణ్ని - భూదేవిని అలికి ముగ్గు పెట్టేవాడ్ని తీసుకొచ్చి గంటల తరబడి సోది కబుర్లు పెడతారు. పాశ్చాత్య వంటలతో నిత్యం ముద్ద దింపుకునే సెలబ్రిటీలు వెరైటీ కోసం (నేటివిటీ మరిచి) తెలుగు వంటలను విందుకు ఆర్డరిస్తే మీడియాకు పండుగే. వంట మాస్టర్ల వెంటబడి మరీ కవర్ చేస్తారు. ఆఖరికి ప్రదానం బోండాలపై కూడా కథనాలు ప్రసారం చేయాల్సిందేనని ప్రతినబూనతారు. ఇక పెళ్లి జరిపించే పండితుల సంగతి సరేసరి. వీళ్లంతా ఛానల్స్‌కి దొరికిపోయే విఐపిలు.
ప్రతి బులిటెన్‌లోనూ హేలీ తోకచుక్క కనిపిస్తుందన్నంత హడావిడి చేస్తూ మరి కొద్ది గంటల్లో మరి కొన్ని నిమిషాల్లో పెళ్లి ముహూర్తం అంటూ వారు ఆందోళన పడిపోతూ ప్రేక్షకులను టెలివిజన్ సెట్ల ముందు కూర్చోబెట్టడానికి వీరోచితంగా ప్రయత్నిస్తారు. మేమే ముందు చూపించాం.
మేమే ఎక్కువ మందికి చూపించాం అంటూ సంబరపడిపోతూ లోగో ముద్రను కార్యక్రమంపై వేసుకుంటారు.
పెళ్లి ముహూర్తాలున్న సమయాల్లో ఎన్నో జంటలు ఒకటవుతాయి. కాని సెలబ్రిటీల పెళ్లిళ్లే లోక కల్యాణం కోసం జరిగినట్లు ప్రత్యక్ష దైవాలకు జరిగినట్లు ఛానల్స్ పాత కొత్త క్లిప్పింగ్స్ కల్యాణ గీతాలతో ప్రసారం చేయడం రోజురోజుకీ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాయి. అతి హడావిడి ఇష్టపడేవారి చేత కూడా పెదవి విరిచేలా చేస్తుందని గమనించాలి. సినీ స్టార్స్.. క్రికెట్ స్టార్స్.. పారిశ్రామికవేత్తలు.. వంటి ఎందరో సెలబ్రిటీల పెళ్లిళ్లలో కనిపించే కృత్రిమ ఆనందం కంటే సామాన్య మానవుని పెళ్లిలో కనిపించే నిజమైన ఆనందమే ఎక్కువ కాలం నిలిచిపోతుంది. ఇటనైనా ఛానల్స్ సెలబ్రిటీల పెళ్లిళ్ల ఫోకస్ కోసం సారం ఏమీ లేకపోయినా ఏదో వున్న బిల్డప్ చేసే బులిటెన్‌లకు స్వస్తి పలికి హుందాగా పెళ్లి వార్తను పెళ్లి రోజు క్లిప్స్‌తో ప్రసారం చేస్తే ప్రేక్షకులు మరింతగా విశ్వసిస్తారు, ఆనందిస్తారు.

sorce :- http://www.andhrabhoomi.net

Tuesday, February 8, 2011

తెలుగు న్యూస్ చానల్ల GRp's WK 6th లేటేష్టు రేటింగ్ (TG :CS 15+ yERS)

1) టివి9 :---> 129 లాష్ట్ వీక్ -->129

2) టివి5 :---> 89 లాష్ట్ వీక్ --> 80

3) HM Tv :---> 61 లాష్ట్ వీక్ --> 53

4)Zee 24 :---> 51 లాష్ట్ వీక్ --> 45

5) Etv2 :---> 46 లాష్ట్ వీక్ --> 47

6) Sakshi :---> 44 లాష్ట్ వీక్ --> 59

7) ABN :---> 34 లాష్ట్ వీక్ --> 35

8) Mahaa :---> 27 లాష్ట్ వీక్ --> 27

9) Raj N :---> 21 లాష్ట్ వీక్ --> 19

10) I-News :---> 21 లాష్ట్ వీక్ --> 24

11) STudo-N:---> 14 లాష్ట్ వీక్ --> 16

12) Gemini :---> 06 లాష్ట్ వీక్ --> 06

Tuesday, February 1, 2011

మోహన్ బాబు సొంత టీవీ ఛానల్ యత్నాలు


కలెక్షన్ కింగ్ మోహన్ బాబు న్యూస్ ఛానల్ పెట్టాలకుంటున్నట్టు సమాచారం. దీనిపై టీవీ జర్నలిస్టులు చర్చించుకుంటున్నారు. న్యూస్ ఛానల్ తో పాటు ఒక ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ ప్రారంభించాలని ఆయన ఉద్దేశంగా కన్పిస్తోంది. టీవీ రంగంలో తన కుమార్తె లక్ష్మీ ప్రసన్న బాగా రాణించడంతో ఈ రెండు టీవీ ఛానళ్ళ బాధ్యతను ఆమెకు అప్పగించాలన్నది ఆయన ఆలోచన. మోహన్ బాబుకు మంచి బిజినెస్ సెన్స్ ఉంది. విద్యా వ్యాపారంలో ఆయన బాగా రాణించారు.


మోహన్ బాబు కుమారుడు విష్ణుకు థింక్ స్మార్ట్ అనే గ్రాఫిక్స్ స్టూడియో ఉంది. ఆ స్టూడియో టీవీ ఛానళ్ళకు సపోర్టివ్ గా ఉంటుంది. కొత్తగా న్యూస్ ఛానల్స్ కు అనుమతి ఇవ్వకూడదని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే మోహన్ బాబు నష్టాల్లో ఉండి జీతాలు ఇవ్వలేకపోతున్న ఏదైనా ఒక ఛానల్ ను టేకోవర్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కాదలుచుకున్న మోహన్ బాబుకు న్యూస్ ఛానల్ మీద మంచి ఆసక్తి ఉంది.

Source: thatstelugu.oneindia.in

ఛానెల్స్ రేటింగ్‌ రేసు ... తిరకాసు... (ప్రజాశక్తి సౌజన్యంతో)


చానెళ్ళు పెరిగితే ప్రేక్షకుల సంఖ్య అమాంతం పెరిగిపోదు. ఉన్న ప్రేక్షకుల్ని పంచుకునేందుకే అన్ని ఛానళ్లూ పోటీ పడుతుంటాయి. ఈక్రమంలో కొందరు కొత్త ప్రేక్షకులు కూడా పుట్టుకురావచ్చు. అయితే ఆపోటీలో బలంగా నిలిచేదెవరు, గెలిచేదెవరనే ప్రశ్న టీవీ చూసే ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది. సగటు ప్రేక్షకుడికి కూడా ఏ ఛానల్‌కి ఆదరణ ఎక్కువ అనే విషయం తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. ఈ ఆదరణను బట్టే ర్యాంకింగ్స్‌ నిర్ణయించుకుంటారు. ఇక మార్కెట్‌ విస్తృతికి ఎవరికి తోచిన రీతిలో వారు కసరత్తు చేస్తుంటారు. వీటన్నిటికీ మూలాధారంగా వచ్చినవే రేటింగ్స్‌. శాస్త్రీయంగా జీఆర్పీ (గ్రాస్‌ రేటింగ్‌ పాయింట్స్‌) లేదా టీఆర్పీ (టార్గెట్‌ రేటింగ్‌ పాయింట్స్‌) అంటారు. సింపుల్‌గా ఇది ప్రేక్షకాదరణ కొలమానం(ఆడియన్స్‌ మెజర్‌మెంట్‌) అన్నమాట. టీవీఆర్‌ (టెలివిజన్‌ రేటింగ్స్‌)గా ఇది బాగా ప్రాచుర్యం పొందింది. రేటింగ్స్‌ అంటే ఒక నిర్దిష్ట సమయంలో, ఒక నిర్దిష్ట ప్రసారాన్ని చూసే ప్రేక్షకుల శాతం. ఇందులో వయో, లింగ వర్గీకరణ కూడా ఉంటుంది.వస్తు ఉత్పత్తి తర్వాత, వినియోగదారుల అభిప్రాయమే కీలకం. ఆ స్పందనలకు అనుగుణంగా మార్కెట్‌ విస్తృతిపైన ఉత్పత్తి సంస్థలు దృష్టి పెడతాయి. టెలివిజన్‌ ప్రసారాలకు సంబంధించినంతవరకు అటువంటి ప్రయత్నమే రేటింగ్స్‌. పత్రికల్లో సులువుగా సర్వే పద్ధతి మీద ఆధారపడవచ్చు. పాఠకుల అభిప్రాయాలు, పంపిణీ వివరాలు సేకరించి ప్రతిస్పందనల్ని తెలుసుకోవచ్చు. ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ ఆరు నెలలకొకసారి ఈ ప్రక్రియని నిర్వహిస్తుంది. కానీ టీవీల విషయంలో ఇది సాధ్యం కాదు. ప్రసారమయ్యే కార్యక్రమం, ప్రేక్షకునికి ప్రసారాలు అందుబాటులో ఉండే పరిస్థితి వంటి అంశాల్ని దృష్టిలో ఉంచుకొని రేటింగ్స్‌ నిర్ణయించాలి. ఇది ఎప్పటికప్పుడు జరిగే ప్రక్రియ. వ్యాపార లావాదేవీలు, ఇతరులతో సంబంధాలు, ఛానళ్లకు దిశానిర్దేశం, వాణిజ్య ప్రయోజనాల విషయంలో వీటిదే కీలక పాత్ర కావడంతో రేటింగ్స్‌ సేకరించే సంస్థలకు కూడా ప్రాధాన్యం పెరిగింది. మన దేశంలో ఈ రంగంలో రెండు సంస్థలు పనిచేసేవి. ఒకటి టామ్‌, రెండోది ఇన్‌టామ్‌. పదేళ్ల కిందట మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ఈ రెండు సంస్థలూ పోటాపోటీగా పనిచేశాయి. వీటిని నడిపిస్తున్న సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు రెండూ కలిసిపోయి, టామ్‌గా అవతరించాయి. అంతకుముందు ఇవి సేకరించిన రెండు రకాల శాంపిళ్లలో ఉన్న తేడాల వల్ల రేటింగ్స్‌లోనూ కొన్ని అంతరాలు కనిపించేవి. కొన్ని సందర్భాల్లో భారీ తేడాలు కూడా ఉండేవి. విలీనం తర్వాత భారతీయ టెలివిజన్‌ మార్కెట్‌లో టామ్‌ ఆధిపత్యానికి తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు ఈ సంస్థ గీసిందే గీత. ప్రకటనకర్తలకూ, టెలివిజన్‌ యాజమాన్యాలకు, ఏజెన్సీలకు అదే ప్రామాణికం. రేటింగ్స్ సేకరించే విధానం
టామ్‌ అంటే టెలివిజన్‌ ఆడియన్స్‌ మెజర్‌మెంట్‌. ఈ సంస్థ ఎప్పటికప్పుడు మీడియా అధ్యయనాల్ని నిర్వహిస్తూ ప్రేక్షకుల నాడిని అందించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడొకసారి రేటింగ్స్‌ తీసే విధానాన్ని పరిశీలిద్దాం. రేటింగ్స్‌ సేకరించడానికి టామ్‌ సంస్థ ''పీపుల్‌ మీటర్‌'' అనే పరికరాన్ని ఉపయోగిస్తుంది. ఎంపిక చేసిన ఇళ్లలో వీటిని ఏర్పాటు చేసి, టీవీ రిమోట్‌తో అనుసంధానిస్తారు. ప్రేక్షకుల వర్గీకరణ కోసం దీనిపై ప్రత్యేకంగా మీటలు ఉంటాయి. అంటే స్త్రీలు, పురుషులు, పిల్లలు... ఇలా వయసుల్ని బట్టి వర్గీకరిస్తారు. సంబంధిత వర్గాలు టీవీ చూస్తున్నప్పుడు ఆయా బటన్లను నొక్కాలి. టీవీ దగ్గర నుంచి వెళ్లిపోయేటప్పుడు మళ్లీ ఆఫ్‌ చేసి వెళ్లాలి. ఈ ప్రక్రియ అంతా టామ్‌ ప్రధాన కార్యాలయంలో రికార్డు అవుతుంది. వారు చూసే ఛానళ్లు, చూస్తున్న సమయం కూడా నమోదవుతుంది. దీన్నిబట్టి రేటింగ్స్‌ నిర్ణయిస్తారు. రేటింగ్స్‌ వ్యవస్థకు కీలకమైన పీపుల్‌ మీటర్ల ఏర్పాటుకి టామ్‌ పదిహేనేళ్ల కిందట దేశంలో క్లాస్‌1 సిటీస్‌గా ఉన్న 29 నగరాల్ని ఎంపిక చేసింది. తర్వాత పెరిగిన అవసరాలకు అనుగుణంగా విస్తరిస్తూ పోయింది. ప్రస్తుతం దేశం మొత్తంలో సుమారు పన్నెండు వేల పీపుల్‌ మీటర్లు పనిచేస్తున్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో పన్నెండు వందల వరకు పీపుల్‌ మీటర్లు పనిచేస్తున్నాయి. టెలివిజన్‌ ఛానళ్ల ఎంపిక, చూసే కార్యక్రమాలు, సమయ పరిమితులు, చూస్తున్న వర్గాలు వంటి అంశాల్ని ఈ మీటర్ల సాయంతో గుర్తిస్తారు. మన రాష్ట్రంలోని పట్టణాల్ని మూడు రకాలు విభజించారు. రాజధాని హైదరాబాద్‌కి ప్రత్యేక స్థానం ఉంది. రెండో విభాగంలో విశాఖ, విజయవాడ నగరాలు ఉన్నాయి. మరో పది పట్టణాల్లో కూడా పీపుల్‌ మీటర్లను అమర్చి రేటింగ్స్‌ పరిశీలనని జరుపుతున్నారు. ఈ మీటర్లు అమర్చడంలో వివిధ సామాజిక, ఆర్థిక నేపథ్యాలు ఉన్న ఇళ్లనే ఎంపిక చేసుకోవడం విశేషం.
ఆంధ్రప్రదేశ్‌లో ట్రెండ్‌
సాఫ్ట్‌వేర్‌ బూమ్‌, రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ గురించి వినీ, వినీ బోర్‌ కొట్టేసింది. ఇప్పుడు నడుస్తోంది మీడియా బూమ్‌. దేశంలోని ఇతర రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా, నేషనల్‌ మీడియా తర్వాత ఆ బూమ్‌ని ఆస్వాదిస్తోంది ఆంధ్రప్రదేశే. ఏడేళ్ళ కిందట న్యూస్‌ ఛానల్‌ పెట్టడం అంటే ప్రాంతీయ భాషల్లో సాధ్యమా? అనిపించింది. ఇప్పుడది ప్రాంతీయ భాషలకే సాధ్యమనిపిస్తోంది. జాతీయ మీడియా కూడా చొరబడలేని ప్రాంతాల్లోకి, పల్లెల్లోకి, సెక్షన్లలోకి ప్రాంతీయ మీడియా మాత్రమే ప్రవేశించి, ప్రభావం చూపగలుగుతోంది. తెలుగులో రెండు న్యూస్‌ ఛానళ్లు పుట్టిన తొలి నాళ్ళలో మీడియా పరిశీలకులు జరిపిన అధ్యయనాలన్నీ ఇదే అంశాన్ని ధ్రువీకరించాయి.

వినోద ఛానళ్ల ప్రియులుగా మారిన పేక్షకుల్ని క్రమంగా న్యూస్‌ఛానళ్ల వైపు మళ్లించడంలో నిర్వాహకులు సఫలమయ్యారు. టామ్‌ జరిపిన పరిశీలనలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రేక్షకుడు న్యూస్‌ ఛానళ్లను చూసే సగటు, జాతీయ సగటు కంటే విపరీతంగా పెరిగింది. మార్కెట్‌ సామర్ధ్యం విషయంలోనూ ఇతర రాష్ట్రాలకంటే భిన్నమైన అభిరుచులు ఇక్కడ ఉండటం ఛానళ్ల విస్తృతికి దోహదం చేసింది. ఇండియన్‌ టెలివిజన్‌ డాట్‌ కామ్‌ వంటి సంస్థలు కూడా ఈ అంశాన్ని శాస్త్రీయంగా నిరూపించాయి. 2009లో వచ్చిన ఎన్నికలు, కొత్త ఛానళ్ల వెల్లువ వల్ల పెరిగిన మోజు వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ టీవీ ప్రేక్షకుల సంఖ్య స్థిరంగా ఉండటం ఆసక్తిని కలిగించే అంశం. టామ్‌ ఇటీవల నిర్వహించిన డిజిటల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ సర్వేలో డీటీహెచ్‌ సేవలు కూడా వేగంగా విస్తరిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో మార్కెట్‌లో పోటీ మరింత వేగవంతం అయ్యింది. ఈ పోటీ విధానంలో రేటింగ్స్‌కి తప్ప మరే విషయానికీ ప్రాధాన్యం లేకుండా పోయింది. అందుకే రూపొందిన కార్యక్రమాలకు వచ్చిన రేటింగ్స్‌ తెలుసుకునే రోజులు ఇప్పుడు పోయాయి. రేటింగ్స్‌ కోసమే ప్రసారాల్ని రూపొందించాల్సిన పరిస్థితి దాపురించింది. ఛానళ్ల పోటీలో రేటింగ్‌ల వేట మొదలయ్యాక నైతిక నియమావళి మాట అలా ఉంచితే మీడియాలో విపరీత ధోరణులు పెరిగిపోయాయి. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక మీడియా దిశ మార్చుకుందంటూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సీనియర్‌ జర్నలిస్టు రామ్‌కరణ్‌ చేసిన వ్యాఖ్యలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ''బడ్జెట్‌ స్టోరీలు రాసే బాధ్యతను బిజినెస్‌ జర్నలిస్టుల కంటే, సంస్థ ఎకౌంటెంట్లకు అప్పగించడంతోనే ఎడిటర్ల వ్యవస్థను కుప్పకూల్చే ప్రక్రియ ప్రారంభమైంది.'' ఛానళ్ల వెల్లువ ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది.

ఇటీవల హైదరాబాద్‌లో తెలుగు ఛానళ్ల తీరుపై సీఎంఎస్‌ నిర్వహించిన ఫోకస్‌ గ్రూప్‌ వర్క్‌షాప్‌లో సీనియర్‌ జర్నలిస్టు ఒకరు ఇలా వ్యాఖ్యానించారు. ''మీడియా అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పనిచేసే సంస్థలు.. వారు కచ్చితంగా లాభాపేక్షతోనే పనిచేస్తారు. డబ్బు పెట్టేవారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయక తప్పదు. వస్తున్న కార్యక్రమాలు ప్రజలకు నచ్చకపోతే చూడటం మానేయవచ్చు. అలానే మంచి కార్యక్రమాలు చేసినప్పుడూ చూస్తున్న పరిస్థితి లేదు. అందుకే మంచో చెడో అనవసరం. ప్రజల అవసరాలకు తగింది కాదు, ప్రజలకు నచ్చేదేంటో చూపిస్తాం... అప్పుడే రేటింగ్స్‌ వస్తాయి.'' ఈ మాటలు ఛానళ్ల పోకడకు అద్దం పడుతున్నాయి. జర్నలిస్టులు ఈ పరిస్థితిని నిలువరించలేరా. రేటింగ్స్‌ వెంపర్లాటలో అన్నీ వదిలేయాల్సిందేనా. పోటీ కాస్తా ఛానళ్ల మధ్య యుద్ధంగా మారుతున్న సందర్భాలు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న సంస్కృతి, ప్రచారమే పరమావధిగా మారిపోతున్న ఎయిర్‌టైమ్‌, జర్నలిస్టులే కుట్రదారులుగా దొరికిపోతున్న స్టింగ్‌ (దొంగ) ఆపరేషన్లు, వీటన్నిటి మధ్య మీడియా సంస్కర్తలుగా మనం చేస్తున్న ఉద్యమాలు.. అసలు వ్యాపార ప్రయోజనాల కోసమే నిర్వహిస్తామంటున్న సంస్థలకు మీడియా హక్కులు, పత్రికా స్వేచ్ఛ వంటి అంశాలు వర్తిస్తాయా... ఇంకా మీడియాలో జర్నలిజం మిగిలి ఉందా..? దీనికి 'ఛానలిజం' అని పేరు పెట్టుకోవాలా? మీడియా పెద్దలే ఒకసారి ఆలోచించాలి.
రేటింగ్స్‌కి ప్రామాణికత ఎంత?
మీడియాలో పోటీకి, పెడ పోకడలకు అన్నిటికీ కారణం రేటింగ్సే అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ రేటింగ్స్‌ని ఎంతవరకు సీరియస్‌గా తీసుకోవాలన్న విషయాన్నీ పరిశీలించాలి. టామ్‌ సేకరిస్తున్న రేటింగ్స్‌ అన్నీ శాంపిళ్లమీద ఆధారపడినవే. వాటి శాతాన్ని ఒకసారి గమనిస్తే... దేశంలో సుమారు 12 కోట్ల కేబుల్‌ టీవీ కనెక్షన్లు ఉన్నట్లు ఒక అంచనా. వంద కోట్ల జనాభా దాటిన దేశంలో పీపుల్‌ మీటర్లు అమర్చింది కేవలం పన్నెండు వేల ఇళ్లల్లో మాత్రమే. అంటే ఇన్ని కోట్ల జనాభాలో దాదాపు 50 వేలమంది అభిప్రాయమే రేటింగ్‌గా మారుతోంది. ఈ శాంప్లింగ్‌ విధానంపై సీఎంఎస్‌ వంటి సంస్థలు ఎన్నో రకాల అభ్యంతరాల్ని లేవనెత్తాయి. ప్రధానంగా పీపుల్‌ మీటర్ల ఏర్పాటులో పట్టణ ప్రాంతాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శ ఉంది. శాంపిల్‌గా తీసుకున్న ఒక ఇల్లు కొన్ని వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏకరూప సమాజాలు కలిగిన కెనడా, అమెరికా వంటి దేశాలకు సరిపడే విధానాన్నే ఇక్కడ అమలు చేయడంపైనా అభ్యంతరాలు ఉన్నాయి. పీపుల్‌మీటర్‌ ఆపరేషన్‌లోను అనేక సమస్యలు. ఇందులో పల్లెప్రజల అభిమతాన్ని తీసుకోవడానికి ఏమాత్రం వీలుపడదు. ఇండియాలో వినియోగంలో ఉన్న టీవీ సెట్లలో అరవై శాతం పల్లెలు, చిన్న పట్టణాల్లోనే ఉన్నాయని అంచనా. కానీ లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల్ని, మండల కేంద్రాల్ని, గ్రామాల్ని కూడా టామ్‌ లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇది ప్రజాభిప్రాయాన్ని ఎలా ప్రతిబింబిస్తుందనేది అంతుబట్టని విషయం. ఇక రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా ఎన్నో తేడాలు, ప్రసారాల్లోను ఎన్నో విలక్షణతలు కనిపిస్తాయి.

ఈ విషయంలో టామ్‌ సమతుల్యత పాటించకపోవడం, ముంబై వంటి నగరాల్లోనే సుమారు వెయ్యి మీటర్లు పెట్టడం పైనా విమర్శలు ఉన్నాయి. అయితే పీపుల్‌ మీటర్లకు అయ్యే ఖర్చు భారీగా ఉండటం, వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి రావటంతో ఈ విమర్శలన్నిటినీ టామ్‌ తోసిపుచ్చింది. ఇక కేబుల్‌ ఆపరేటర్లు ఛానళ్ల ప్లేస్‌మెంట్స్‌ని మార్చే విధానం, మీటర్ల టాంపరింగ్‌, మేనేజ్‌మెంట్‌ వంటివి కూడా రేటింగ్‌ని ప్రభావితం చేస్తాయి. పీపుల్‌ మీటర్లు పెట్టిన ప్రాంతాలతో పాటు, అవి పెట్టిన ఇళ్ల జాబితా కూడా రహస్యమని టామ్‌ చెబుతున్నప్పటికీ... ఇదొక బహిరంగ రహస్యమని చాలా సందర్భాల్లో నిరూపణ అయింది. స్థానిక ఎంఎస్‌ఓల (మల్టీ సిస్టమ్‌ ఆపరేటర్‌) సహకారంతోనే టామ్‌ పీపుల్‌ మీటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. కాబట్టి వీటి ఆనుపానులన్నీ వారికి తెలుసనేది మీడియా పరిశీలకుల వాదన. దూరదర్శన్‌ కూడా ఈ రేటింగ్స్‌ మాయాజాలంలో చిక్కుకొని దిశను మార్చి ప్రయాణించిన సందర్భాలు ఉన్నాయి. అయితే త్వరలోనే తప్పు తెలుసుకొని డార్ట్‌ విధానంలో డీడీ ప్రత్యేకంగా అభిప్రాయ సేకరణ చేస్తోంది. డార్ట్‌ అంటే 'దూరదర్శన్‌ ఆడియన్స్‌ రేటింగ్‌'.

మరోవైపు టామ్‌ ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టేందుకు 2005లో ఇంకో సంస్థ రంగప్రవేశం చేసింది. ఆడియన్స్‌ మెజర్‌మెంట్‌ అండ్‌ ఎనలిటిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఎమ్యాప్‌ని ప్రారంభించింది. అనుకున్నంత వేగంగా ఇది విస్తరించలేకపోయింది. అప్పటికే వంద కోట్ల పెట్టుబడితో ఒక్కో క్లైంట్‌ దగ్గరా అయిదు నుంచి 15 లక్షల వరకు వసూళ్లు జరుపుతున్న టామ్‌ మార్కెట్‌లో పాతుకుపోయింది. కానీ ఎమ్యాప్‌ ఆన్‌లైన్‌ సేవలు, కోరినవారికి ఏ రోజుకారోజు, ఏ ప్రోగ్రామ్‌కి ఆ ప్రోగ్రామ్‌ రేటింగ్స్‌ అందించేందుకు సిద్ధపడింది. ఈ పోటీని అర్థం చేసుకున్న టామ్‌, వారానికోసారి రేటింగ్స్‌ ఇవ్వడంతో పాటు తాజాగా 'మిడ్‌వీక్‌' పేరుతో ముందుగానే 'రిజల్ట్‌ లీక్‌' చేస్తోంది.

టెలివిజన్‌ రేటింగ్స్‌ సేకరించే పద్ధతి ఒక్క మన దేశంలోనే కాదు, అనేక దేశాల్లో అమల్లో ఉంది. అయితే ఈ విధంగా గుత్తాధిపత్యానికి అవకాశం కల్పించిన దేశాలు మాత్రం చాలా తక్కువ. అందుకే ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ఫౌండేషన్‌ వంటి సంస్థలు జోక్యం చేసుకోవాలని మీడియా నిపుణులు కోరుతున్నారు. అమెరికాలో టామ్‌ మాతృసంస్థ ''ఏసీ నీల్సెన్‌'' ఒంటెత్తుపోకడల విషయంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంది. రేటింగ్స్‌ ట్యాంపరింగ్‌కి సంబంధించిన అనేక అక్రమాలు వెలుగు చూడటంతో చివరికి కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. అమెరికాలో రేటింగ్స్‌ పర్యవేక్షణకు మీడియా రేటింగ్స్‌ కౌన్సిల్‌ ఉన్నప్పటికీ ఈ దారుణాలను పసిగట్టలేకపోయింది. మన దేశంలో అలాంటి వ్యవస్థలేవీ లేవు. నియంత్రణ కోసం ఇదే తరహాలో ఓ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతున్నా ఇంతవరకు ఆచరణలోకి రాలేదు. అనేక సంప్రదింపుల తర్వాత 2010 మేలో భారతదేశంలో రేటింగ్స్‌, టీవీ ప్రసార వ్యవస్థలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం కోసం ఫిక్కీ సెక్రటరీ జనరల్‌ అమిత్‌ మిత్రా ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యుల కమిటీని కేంద్రం నియమించింది. మూడు నెలల కాలపరిమితితో నియమించిన ఈ కమిటీ రేటింగ్‌ పద్ధతిలోని లోపాలతో పాటు ప్రేక్షక బాహుళ్యాల సామాజిక స్థితిగతులు, శాంపిళ్ల సేకరణతీరు, వాటి కచ్చితత్వం, పరిమాణం, ప్రాంతీయ విలక్షణత, కేబుల్‌, డీటీహెచ్‌ వంటి ప్రసార సరఫరా వ్యవస్థల తీరుతెన్నుల్ని కూడా అధ్యయనం చేయనుంది. బ్రాడ్‌కాస్టింగ్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ వంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలన్న ట్రారు ప్రతిపాదనల్ని కూడా అమిత్‌ మిత్రా కమిటీ పరిశీలించనుంది. సీనియర్‌ జర్నలిస్టులు, టెలికం, మేనేజ్‌మెంట్‌ రంగ నిపుణులతో కూడిన ఈ కమిటీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు సూచిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే భావప్రకటన స్వేచ్ఛ పేరుతో వస్తున్న పోకడలతో జనం విసిగిపోయి ఉన్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే నమ్మకాన్ని కోల్పోయే స్థితిలోకి మీడియా వెళుతుందన్న ఆందోళన ఎక్కువైంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఛానళ్లలో విషయాన్ని (కంటెంట్‌) నియంత్రిస్తోంది. జర్నలిస్టులు కాదు, యాజమాన్యాలు కాదు... ఎంఎస్‌ఓలు, రేటింగ్స్‌. తమకు నచ్చని విషయాలు టెలికాస్ట్‌ చేస్తే, వెంటనే ఛానల్‌ ప్రసారాన్నే ఆపేస్తారు ఎంఎస్‌ఓలు. ఎక్కువగా రాజకీయ ప్రయోజనాలతోనేే వీరి సంబంధాలు ముడిపడి ఉంటాయి కనుక, ఒక్క నెగిటివ్‌ వార్తను కూడా సహించలేరు! ఇక ఎంత అద్భుతమైన ప్రోగ్రామ్‌ చేసినా రేటింగ్‌ రాకపోతే వెంటనే ఆపేయమంటుంది యాజమాన్యం. ఎందుకంటే ప్రకటనలకు, స్పాన్సర్‌షిప్‌లకు రేటింగ్సే ప్రామాణికం. ఈ పరిస్థితి తప్పనిసరిగా మారాల్సిన అవసరం ఉంది. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశారు మాటల్లో చెప్పాలంటే ''పోటీ తత్వం పేరుతో ఒకరిపై ఒకరు నియంత్రణ కోల్పోతున్న దశలో స్వీయ నియంత్రణ అనే అంశాన్ని నేను నమ్మను. ఓ పదేళ్లక్రితం అడిగితే మీడియాకు ఈలక్ష్మణరేఖలేవీ అవసరం లేదనే చెప్పేవాణ్ణి, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బ్రిటన్‌ తరహాలో స్వతంత్రంగా పనిచేసే ఒక రెగ్యులేటరీ వ్యవస్థ మనకు కావాలి. రేటింగ్స్‌, కేబుల్‌ వ్యవస్థలతో సహా న్యూస్‌ఛానళ్ల ప్రసారానికి సంబంధించిన అన్ని అంశాల్నీ దీని పరిధిలోకి తీసుకురావడం అత్యవసరం''.

Thursday, January 6, 2011

త్వరలో యాంకర్ల ( న్యూస్ ప్రెజెంటర్లు ) పై లైంగిక వేదిపుల ఆడియో ,వీడియో టేపులు పోష్టుచేస్తాము

యాంకర్ల ( న్యూస్ ప్రెజెంటర్లు ) పై లైంగిక వేదిపుల ఆడియో ,వీడియో తేపులను త్వరలో పోష్టు చేస్తాము గతంలో ఈ విషయమై మేము చేసిన పోష్టుకు మంచి రెస్పాన్సు వచ్చింది...కొందరు యాంకర్లను అసభ్యకరంగా వేదించడం మాట్లడటం సెల్ఫోన్ లో రికార్డు చేసి మాకు పంపారు..మేజెర్ చానల్స్ కు సంబందిచిన ఉద్యోగుల ఆడియో వీడియో టేపులు వచ్చాయి..ఒక వారంలో ఆ ఆడియో వీడియోలు పోష్టుచేస్తాము...ఇప్పటి కైనా ఎవ్వరైతే యాంకర్లను మానసికంగా వేదిస్తున్నారో ఆపని మానుకుంటే మంచిది...

...గతంలో మేము పోష్టు చేసీన పోష్టు కు మంచి రెస్పాన్స్ వచ్చింది

.
న్యూస్ రీడర్లను మానసికంగాఎందుకు వేదిస్తున్నారు....?..

న్యూస్ రీడర్లను మానసికంగాఎందుకు వేదిస్తున్నారు....?..వాల్లు మనం తీసుక వచ్చిన రిపోర్టును సరిగ్గా చదవక పోతే..ప్రెజెంట్ చేయకపోతే మనం తెచ్చిన న్యూస్ ప్రజల్లోకి పోదు..అలాంటిది కొందరు ఈ న్యూస్ ప్రెజెంటర్లు(యాంకర్లను) సెక్సువల్ హెరాస్ మెంట్ చేసున్నట్టు మాకు అనే మైల్స్ వస్తున్నాయి...పై స్థాయి వ్యక్తుల అలు చూసుకొని..ఇలాంటి వేదింపులకు పాల్పడుతున్నట్టు మావద్ద సమాచారం ఉంది..మావద్ద వీడియో క్లిప్పింగ్స్..ఆడియోరికాడ్సు కూడా ఉన్నాయి..ఇప్పుడు వస్తున్న లేటేష్టు సెల్ఫోన్ లలో రికార్డు చేసుకునే అవకాసం ఉండటంతో వారు మాకు ఆ ఆడియో,వీడియోరికార్డులు పంపారు..కొంత మంది కీలక వ్యక్తులు ఇలాంటి పనులకు పాల్ప్డుతున్నట్టు మావద్ద సాక్ష్యలు ఉన్నాయి..ఓ ప్రముఖ చానల్ లో కొత్తగ యాంకర్లుగా జాయిన్ అవ్వగానే ఓ వ్యక్తి పై స్తాయి వక్తుల అండ చూసుకొని డైరెక్టుగా అసబ్యికరంగా...నీకు ఉద్యోగం ఇప్పించింది నేను నాకేమిస్తావు అని డైరెక్టుగా అడిగిన ఆడియోరికార్దు ఉంది..అదేకాదు కొందరు యాంకర్లు అసబ్యికరమైన ఫోటోను మాకు వచ్చాయి ఎలా తీసారొ తెలీయదు ..ఎవ్వరొ కొందరు చేస్తున్న పనులకు అందరు యాంకర్లను బ్లైం చేయడం ఎంతవరకు సబబు..మేల్ యాంకర్లు..ఫిమేల్ యాంకర్లను ఇలా వేదిస్తున్నట్టు తెలుస్తొంది...యాజమాన్యాలు ఇప్పటికైనా..పట్టీంచుకుంటే మంచిది...కొందరు చానల్ ప్రముఖులు ఇలాంటివి చేస్తున్నట్టు సమాచారం..మాదో రిక్వష్టు ఇలా ఎవ్వరైనా సెక్సువల్ హెరాస్ మెంట్లకు పాల్పడు తునట్టు మాకు సమాచారం ఇవ్వండి...మేము ఆడియో వీడియో క్లిప్పింగ్స్ ఈ బ్లాగ్ లో పోష్టు చేస్తాము..యాంకర్ల్ పై లైంగిక వేదింపులకు పాల్పడే వారు ఇప్పటి కైనా మానుకుంటే మంచిది..యాంకర్లు మన తెలుగింటి ఆడపడుచులే...వారిని గౌరవిద్దాం..ఇలాంటి ఇలాంటి సమాచారం మీకు తెలిస్తే మాకు సమాచరం ఇవ్వండి.. ....(యాంకర్ల్ ( న్యూస్ ప్రెజెంటర్ల ) పై వేదింపులు చేసిన చేస్తున్న వారి ఆడియో వీడియో క్లిప్పింగ్ లు త్వరలో తెలుగు మీడియా న్యూస్ బ్లాగ్ స్పాట్ లో వస్తాయి చూడండి )....

ముఖ్యి గమనిక :-( ఓ న్యూస్ యాంకర్ ను వ్యభిచారం రొంపిలోకి దించాలంకున్న ఓ ప్రముఖుడి రియల్ ష్టోరీ కూడా వస్తుంది త్వరలో )

Saturday, January 1, 2011

2010లో 57 మంది పాత్రికేయులు హత్య


ప్రపంచ వ్యాప్తంగా 2010లో మొత్తం 57 మంది పాత్రికేయులు హత్యకు గురయినట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ ప్రకటించింది. అలాగే పాత్రికేయులకు పాకిస్తాన్‌ అత్యంత ప్రమాదకరంగా ప్రాంతమని విశ్లేషించింది. అత్యధిక పాత్రికేయులు నేరస్తుల చేతుల్లో మృతిచెందారు. 2009లో 76 మంది చనిపోయారు. వాస్తవానికి పాలకుల పరోక్ష, ప్రత్యక్ష మద్దతుతోనే పాత్రికేయులను నేరస్తులు దాడులకు పాల్పడుతున్నట్లు అనేక రుజువులున్నాయి. అందువలనే పాత్రికేయులను హత్యచేసినవారిని శిక్షించేందుకు ప్రభుత్వాలు పూనుకోవటం లేదు. 2010లో చనిపోయినవారిలో పాకిస్తాన్‌లో అత్యధికంగా 11 మంది, మెక్సికో, ఇరాక్‌లలో ఏడుగురి చొప్పున, ఫిలిఫ్పైన్స్‌లో నలుగురు మృతిచెందారు. 51 మంది పాత్రికేయులను అపహరించినట్లు వివిధ దేశాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌ పాత్రికేయులు హర్వీ జెస్క్విరీ, స్టీఫెన్‌ టపోనియర్‌తోపాటు మరో ముగ్గురు ఏడాదికిపై నుంచే ఆఫ్ఘనిస్తాన్‌లో నిర్బంధంలో ఉన్నట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపింది.