హక్కుల గురించి నోరు తెరిచి అడిగిన ఉద్యోగులపై కత్తి కట్టే 'ఈనాడు' సంస్థ మరొక దారుణానికి పాల్పడింది. జర్నలిస్టుగా తన హక్కుల గురించి, న్యాయంగా రావలసిన పదోన్నతి గురించి అడిగిన పాపానికి ఇప్పటికే ఒరిస్సా రాజధానికి బదిలీ చేసిన సీనియర్ జర్నలిస్టు మల్లికార్జున శర్మను 'ఈనాడు' నిన్న సాయంత్రం ఉన్నపళంగా ఈటానగర్ బదిలీ చేసింది. మర్నాడే (అంటే ఈ రోజు) రిలీవ్ అయి ఈ నెల పద్నాలుగో తేదీన అక్కడ జాయిన్ కావాలని ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది.
కిందటి నెల పదిహేను రోజులకే జీతం ఇచ్చి ఇబ్బంది పెట్టడంపై మల్లికార్జున్ లేబర్ శాఖ కు ఫిర్యాదు చేయడం, ఈ నెల పందొమ్మిదవ తేదీన శ్రీకాకుళం లో అసిస్టంట్ లేబర్ కమిషనర్ ముందు జాయింట్ మీటింగ్ ఉండడం తో శర్మను మానసికంగా దెబ్బ తీయడానికే ఈ బదిలీ చేసినట్లు ఆయన స్నేహితులు చెబుతున్నారు.
"పిల్లల విద్యా సంవత్సరం ఆరంభం అయ్యాక ఇలా బదిలీ చేయడం దారుణం. తమకే పుట్టిన పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. అయినా ఈనాడు యజమానులు ఇలాంటి నీచానికి పాల్పడ్డారు. దీనికి వారు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు," అని ఒక మిత్రుడు కాస్త పరుషంగా అన్నారు.
"న్యూస్ టుడే" అనే సంస్థను నెలకొల్పి దాని నుంచి 'ఈనాడు' వార్తలను కొనుక్కుంటూ పత్రిక నడుపుతున్నట్లు.... లోకానికి పొద్దున్న లేచిన దగ్గరి నుంచి సుద్దులు చెప్పే రామోజీ రావు, ఆయన కొడుకు పేపర్ల మీద చూపించారు. ఇదీ కాక జర్నలిస్టులకు వేజ్ బోర్డు ప్రకారం రావలసిన జీతాలు ఇవ్వకుండా 'ఈనాడు' దోచుకోవడాన్ని మల్లికార్జున్ కోర్టులలో ప్రశ్నించారు.
దానికి ప్రతీకారంగా ఈ బదిలీ వేటు వేసినట్లు భావిస్తున్నారు. ఢిల్లీ లోని ఆర్.టీ.ఐ. అధికార్లకు, ఈనాడు యాజమాన్య ప్రతినిధులకు, మల్లికార్జున్ కు మధ్య వీడియో కాన్ఫరెన్స్ జరిగిన కొద్ది సేపట్లోనే ఈ జర్నలిస్టు పై బదిలీ వేటు వేసారని సమాచారం.
source :- http://apmediakaburlu.blogspot.com/
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
-
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది.
ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా
లుంగికట్టుకు...
6 years ago
No comments:
Post a Comment