(తెలంగాణ శ్రీనివాస్)
జవహర్ లాల్‌నెహ్రూ హౌసింగ్ సొసైటీలో ఏం జరుగుతుంది. సొసైటీ లబ్దిదారుల లిస్ట్ ను కొంతకాలం ఎందుకు గోప్యంగా ఉంచారు. స్వయంగా లబ్దిదారులే అడిగినా సొసైటీ పెద్దలు మొదట ఎందుకు నిరాకరించిన్రు. 1100 మంది లబ్దిదారుల్లో 800మంది సీమాంధ్ర జర్నలిస్టులున్నరన్న విషయాన్ని పోరుతెలంగాణ ఎప్పుడో చెప్పింది. కానీ ఈ 800 మందిలో ఎంతమంది నిజమైన జర్నలిస్టులున్నరు. ఎంతమందికి అర్హత ఉన్నది. వీరిలో జర్నలిజం వృత్తిని వదిలేసినవాళ్లు ఎందరున్నరు. ఎంతమందికి ఎక్స్ పీరియన్స్‌బేస్డ్ గా 800లోపు నెంబర్లు ఇచ్చిన్రు. వీళ్ల సీమాంధ్ర అర్హతతో పాయింట్లు వేసిన్రా. తెలంగాణవాళ్లందరికీ ఎందుకు 700 తర్వాత నెంబర్లు ఇచ్చిన్రు. కేవలం తెలంగాణ వాళ్ల పేర్లే ఎందుకు వెనుకబడ్డయి. సొసైటీ పెద్దలు ఫేర్‌గా లేరని తెలంగాణ లబ్దిదారులు వాపోతున్నరు. జవహర్‌లాల్‌నెహ్రూ హౌసింగ్ సొసైటీ సుప్రీంకోర్టుకు సమర్పించిన లిస్ట్ పోరుతెలంగాణ సేకరించింది. లిస్ట్ ను gallery లో పోస్ట్ చేసిన. ఈ లిస్ట్ లో నిజమైన లబ్దిదారులు ఎందరున్నరు. ఎవరన్నా ఎక్స్ పీరియన్స్ లేకుండా ఉన్నవాళ్లు, స్థలం పొందడానికి అనర్హులు ఉంటే వాళ్ల పేర్లు పోరుతెలంగాణకు చెప్పండి. ఇందులో మీకు తెలిసిన జర్నలిస్టులు అర్హులా..? కాదా? ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. తెలంగాణవాళ్లందరినీ ఎందుకు వెనక్కి నెట్టాల్సి వచ్చింది. ఉన్న 300 మందికి స్థలాలు రాకుండా కుట్రలు ఎందుకు చేస్తున్నరు. తెలంగాణ ఉద్యమానికి ఆటంకాలు సృష్టిస్తూ, విషప్రచారం చేయడమే కాక తెలంగాణలో తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు రాకుండా చేస్తున్నరు. 1100 మందిలో 800 మంది సీమాంధ్రులే. కేవలం 800 మందికి మాత్రమే స్థలాలు వచ్చేటట్టు ఉన్నయి. అంటే తెలంగాణవాళ్లకు రావు. తెలంగాణ జర్నలిస్టులంతా ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. హైదరాబాద్ లో సీమాంధ్ర జర్నలిస్టులు ఇళ్లస్థలాలు ఇవ్వొద్దని తెలంగాణ జాతి మొత్తుకుంటుంటే సీమాంధ్ర జర్నలిస్టులు ఒక్క తెలంగాణ జర్నలిస్టుకు కూడా స్థలం రాకుండా కుట్ర చేస్తున్నరు. సీమాంద్ర జర్నలిస్టుల తీరును తెలంగాణ జర్నలిస్టులంతా నిరసించాలి. తెలంగాణ వచ్చినంకనే జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి. Gallery లో ఉన్న ఈ లిస్ట్ ను చదివి అర్హులెవరో, బినామీ లెవరో తెలంగాణ జర్నలిస్టులు తేల్చండి. తెలంగాణ జర్నలిస్టుల కోసం పోరుతెలంగాణ పోరాడుతుంది. పోరుతెలంగాణతో తెలంగాణ జర్నలిస్టులంతా గొంతుకలపండి. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కూడా దీనిపై పోరాడాలని పోరుతెలంగాణ విజ్ఞప్తి చేస్తుంది.
Feedback: telanganasree@gmail.com
SOURCEV:-http://www.porutelangana.com
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
-
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది.
ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా
లుంగికట్టుకు...
6 years ago
1 comment:
మందిమీద పడి ఏడ్సుడు అల్వాటయింది గాడ్ది కొడ్కులకు. తెలంగాణను బద్నాం చేస్తుండ్రు ఈ దేడ్ దమాక్ గాండ్లు. సీనియారిటీ లెక్కన నెంబర్లు ఇచ్చిండ్రని ఎవలన్న చెప్పిండ్రా ఈ గమారి గాండ్లకు..? సీనియారిటీ లెక్కన ఇస్తె ఏడనన్న ఆర్గనైజేషన్ ప్రకారం పేర్లు వస్తయా? ఈల్ల మెదడు దెబ్బతిన్నదా?
బాబులూ ఈ 1100 మందిల 300 మందే తెలంగాణ బిడ్డలు ఉన్నరని ఎవలు చెప్పిండ్రు రా.? చాన ఏండ్ల తర్వాత ప్లాట్లు వస్తున్నయిరా. పుల్లలు పెట్టకండ్రి. కొత్త సంఘం పెట్టుకోని తెలంగాణ బిడ్డలందరికి ఇప్పించుకుంది కాని దీనికి మటుకు అడ్డం పడకుండ్రి బిడ్డా.
Post a Comment