BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Tuesday, March 3, 2015

ఓ డెస్క్ జర్నలిస్ట్‌ ఓపెన్ ఛాలెంజ్!..(.ఫేస్ బుక్ కహానీ )

ఓ డెస్క్ జర్నలిస్ట్‌ ఓపెన్ ఛాలెంజ్!
--By ............

రిపోర్టర్లు సుబ్రహ్మణ్యస్వామిలాంటి వారైతే.. సబ్ ఎడిటర్లు వినాయకుల్లాంటివారు
ఈ విషయం జగమెరిగిన సత్యం. రిపోర్టర్ ఇచ్చింది యాజ్ ఇట్‌ ఈజ్ గా ఏ వార్తా
సంస్థ కూడా ప్రచురించదు.. ప్రసారం చేసే ధైర్యం చేయదు. వార్తను సంస్కరించేది..
అందులోని నిజానిజాలను గుర్తించేది.. డెస్కే. వార్త విలువను అంచనా వేసేది..
సమయం సందర్భాలను అర్ధం చేసుకుని దాన్ని ప్రపంచానికి చాటి చెప్పేది డెస్కే
అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఒక సబ్‌ ఎడిటర్ కావాలంటే రిపోర్టర్
కాగలడేమోగానీ, ఒక రిపోర్టర్ సబ్‌ ఎడిటర్ కావడం అంత తేలికకాదు. అందుకు
భాషమీద.. భావం మీద ఎంతో పట్టు- ఓర్పు- నేర్పు- విచక్షణ ఉండాలి. పరిపూర్ణమైన
జర్నలిస్టిక్ స్కిల్స్ ఉన్నది డెస్క్ జర్నలిస్టుకే. దర్శకుడు లేకుండా హీరో
ఎలా మనలేడో.. డెస్క్ సపోర్ట్‌ లేకుండా ఏ రిపోర్టింగూ మనజాలదు..
మనజాలదూ.. మనజాలదు. ఇదేదో అక్రిడేషన్ కోసం, అంగలార్చుతూ అర్రులు
చాస్తూ.. రాస్తున్న రాతలు కావు. వాస్తవం ఇదీ అని చెప్పడానికి చేస్తున్న
ప్రయత్నం. సబ్ ఎడిటర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు కారు. అలాంటి భ్రమల్లో ఉంటే
వాళ్లను ఏ ముఖ్యమంత్రీ కాపాడలేడు. ఓయ్ రిపోర్టరూ.. నీ వార్తను సర్వనాశనం
చేసినా.. సమర్ధవంతంగా ఎయిర్ చేయించినా.. అది మా చేతుల్లో ఉంటుందయ్యా
పిచ్చోడా.. అన్నదమ్ముల్లాంటి మన మధ్య ఇలాంటి దిక్కుమాలిన వాదన
తీసుకొచ్చిన వాళ్లెవరో గుర్తించి వెంటనే వారికి చెప్పుదెబ్బల సన్మానం అరేంజ్
చేయండి. డెస్క్ సమర్ధవంతమైన భార్యలాంటిది. నీళ్లిచ్చినా దాన్ని పరమాన్నం
చేయగల సామర్ధ్యం డెస్కుకు మాత్రమే సాధ్యం. ఇది ప్రతి చీఫ్‌ ఎడిటరూ ఒప్పుకునే
వాస్తవం. అసలు జర్నలిజమ్ మౌల్డెడ్ బై సబ్‌ ఎడిటర్స్ ఓన్లీ. చానెళ్లు,
పత్రికలను శాసించేది డెస్కులే. నడిపేది డెస్కులే. చీఫ్‌ ఎడిటర్ స్థాయిని
అలంకరించిన వారిలో ఎక్కువ శాతం డెస్కుల నుంచే వస్తారు. డెస్కులేని
ఛానెళ్లనూ, పత్రికనీ ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కూడా చూడలేరు. చానెల్
లేదా పత్రిక సిస్టమ్ అయితే,దానికి సాఫ్ట్‌ వేర్ ప్రొగ్రాం సబ్‌ ఎడిటింగే. ఇది కాదనే
దమ్ముధైర్యం ఎవరికైనా ఉందంటే ముందుకు రమ్మనండి. ఇది గుర్తించక తలలు
పండిన జర్నలిస్టులు డెస్కుల్లో పనిచేసేవారసలు జర్నలిస్టులే కాదన్నట్టు
మాట్లాడ్డం హాస్యాస్పదం. నెల రోజులు రిపోర్టర్లు లేక పోయినా చానెల్‌, పత్రికలను
నడపడం సాధ్యమే. కానీ ఒక్కరోజు డెస్కు లేకుండా జర్నలిజాన్ని నడపమనండి
చూద్దాం.. డెస్కు జర్నలిస్టులకు అక్రిడేషన్లు... వద్దనే వారీ ఛాలెంజ్ స్వీకరిస్తే
ముందుకు రండి.. చూసుకుందాం.

Monday, March 2, 2015

మీడియలో జర్నలిష్టు రియల్ ష్టోరీ...ఫేస్ బుక్ కహానీ

ను ఈ మధ్య అనుకోకుండా నా ఫ్రెండ్స్ లిస్ట్ లో లేని ఒక ఫ్రెండ్ పోస్ట్ చూసాను.అతడు ఒక న్యూస్ టివి చానెల్ ఉద్యొగి.అతడు రాసిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది.
అతడు రాసిన విధానం లో సెటైర్ ఉన్నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించే నిజం ఉంది.నాకైతే తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి.

.
.ఇవీ అతని అక్షరాలు.....ఉన్నది ఉన్నట్టుగా కాపీ పేస్ట్ చేసి పెడుతున్నాను..చదవండి.

నమస్తే మేము ఉద్యోగం ఉన్న నిరుద్యోగలం .. ! అదేనండి మీడియా లో పని చేసే నిరుద్యోగులం అనమాట . ల్బ్ . శ్రీరాం లా ఒకటో తేది రాగానే అమ్మో ఒకటో తేది అని మేము బయపడము . ఎందుకంటే మాకు ఒకటో తేది జీతం రాదుగా ! అలా అని 10 తేదినో , 20 తేదినో వస్తుంది అనుకునేరు . అసల మాకు జీతం ఎప్పుడు వస్తుందో .. ఇచ్చే వారికి కూడా సరైన క్లారిటీ ఉండదుగా.

రోజు లేవగానే మేము న్యూస్ వింటాం . వాటితో పాటు పాలోడు , పేపరోడు , ఇంటి ఓనరు తిట్టే తిట్లు కూడా హాయ్ గా వింటాం . ఇక ఇన్ షర్ట్ చేసి.. మెడలో "మీడియా" అన్న ఐడీ కార్డ్ వేసుకొని రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే .. సాఫ్ట్ వేర్ కూడా .. మమ్మల్ని సార్ అని పిలుస్తూ తెగ గౌరవించేస్తుంటాడు . కాని వాడికి ఎం తెలుసు..... కడుపు లోపల మాకు ఆకలి వేస్తుంది అని .

ఇక ఆఫీస్ లోకి రాగానే .. మాకు ప్రత్యేకంగా ఒక కుర్చీ , ఒక సిస్టం , అన్ని వేళల ఇంటర్నెట్ సదుపాయం అబ్బా ... కొత్త అల్లుడి భోగం అనుకోండి . " కాని మద్యాహ్నం తినడానికి మాత్రం జేబులో డబ్బులు ఉండవు" . మళ్ళీ మద్యలో మా జాబ్ అంతా కోట్ల కుంభకోణాల గురించి స్క్రిప్ట్ రాయడం , కోట్లు ఖర్చు పెట్టి తేసే సినిమాల గురించి రివ్యూ లు రాయడమే . "అయినా మాకు సాయంత్రం టీ నీళ్ళకి కూడా డబ్బులు ఉండవు" . కడుపు నిండా .. రాసిన స్క్రిప్ట్స్ ని నింపుకొని , క్యాంటీన్ లో ఫ్రీగా దొరికే చల్లని నీటిని నింపుకొని ... రాత్రికి ఇంటికి వెళ్ళడానికి సిద్దం అవ్వబోయే మాకు .. అక్కడ ఇంట్లో ఖాళీ కడుపులతో మా కోసం ఎదురుచూస్తున్న భార్యా బిడ్డల ఆకలి గుర్తుకి వచ్చి .. హైదరాబాద్ మహా నగరంలో ఈ రోజుకి అప్పు ఎక్కడో దొరకద్దో ... అక్కడకి మెడలో ఐడీ కార్డ్ వేసుకొని బయలుదేరిపోతాం . అదేందో మద్యలో ఎక్కడైనా , ఎప్పుడైనా మేము ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వెళ్ళిపోతున్నా .. పోలీస్ కూడా మమ్మల్ని పెద్దగా ఆపడు , ఫైన్ కూడా వేయడు . బహుశా మా జీవితాలకి జీతాలు ఉండవు అన్న విషయం ట్రాఫిక్ పోలీస్ లకి బాగా తెలుసు ఏమో ! ఇక ఏ ఫ్రెండ్ దగ్గరో అప్పు చేసి మేము ఇంట్లోకి దొంగల్లా దూరేస్తాం. నిజమే .. ఉదయం అంతా కలక్టర్ ఆఫీస్ లోకి కూడా ... క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయే మేము ... మా ఇంట్లోకి మాత్రం .. ఇంటి ఓనర్ చూడకుండా దొంగలా దూరేస్తాం .

( ముఖ్య గమనిక : ఇది ఏ ఒక్క చానెల్ వారినో టార్గెట్ చేసి వ్రాసింది కాదు .అన్ని చానెల్ వారిని టార్గెట్ చేసి వ్రాసింది . ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని చానెల్స్ లో మీడియా సోదరుల బ్రతుకులు ఇలాగే ఉన్నాయి .)