మేము " ఐ-న్యూస్"లో వర్క్ చేస్తున్నాం. గత ఆగస్టు వరకూ ఏ విషయంలోను ప్రాబ్లం రాలేదు, కానీ ఒక మూడు నెలల నుండి జీతం టైంకు ఇవ్వటంలేదు. కనీసం ఏ డేట్ కు జీతం ఇచ్చేదీ చెప్పడం లేదు. మా స్టాఫ్ లో చాలా మంది సిటీ ఔట్ స్కర్ట్స్ నుండి వస్తారు. పెట్రోల్ కి ప్రాబ్లం అవుతుంది. వచ్చేదేమో తక్కువ జీతం, అదీ ఎప్పుడు ఇస్తారో అని ఎదురుచూపులు. అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఎప్పుడు జీతమొచ్చేదీ తెలియకపోవడం వల్ల బయట డబ్బులు కట్టాల్సిన వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది. రేపటికి 2 నెలలు శాలరీలు రాక. కానీ ఇప్పటి వరకూ కచ్చితమైన డేట్ కూడా చెప్పలేదు.
అది ఒక రకమైన ఆవేదన అయితే... గత రెండు నెల్ల నుంచి డ్యూటీ టైం ఎనిమిదిన్నర గంటలు పెంచారు. కానీ సాలరీ మాత్రం పెంచలేదు. ఒక 15 నిమిషాలు లేట్ గా వచ్చినా జీతం కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టైం ని 9 గంటలు చేసారు. షిఫ్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
A -6:00 am to 3:00 pm
B -2:00 pm to 11:00 pm
C -10:00 pm to 6:30 am
ఈ టైమింగ్స్ వుంటే బస్సులు దొరకడం కష్టంగా ఉంది. మాకు మీ రవాణా తో సంబంధం లేదు... అని అంటున్నారు. కొద్దిగా ధైర్యం చేసి అడగటానికి ముందుకు వెళ్ళే వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. అదీ కాక... కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు. ఆఫీసులోకి మొబైల్స్ తీసుకొని రాకూడదట. ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే ఎలా అంటే... అది మాకు అనవసరం అంటున్నారు.
వర్క్ విషయంలోకూడా చాలా టార్చర్ పెడుతున్నారు. ఫీడ్ సరిగా ఇవ్వరు, కానీ అవుట్ పుట్ మంచిగా రావాలంటారు. ఎఫెక్టివ్ గా వర్క్ చేయమంటారు. చిత్ర హింసలు పెట్టి ఉద్యోగులను పంపాలని చూస్తున్నారు. మా బాధలను అర్ధం చేసుకుంటారని ఆసిస్తూ ఇది రాస్తున్నాను.
Note :- ఇది కచ్చితంగా శ్యాం పనే ..ఆయనగారు మేనేజ్ మెంట్ ను కాకా పట్టేందుకు ..ఉద్యోగులతో ఆడుకొంటున్నాడు... ఇలాంటి వాల్లను నమ్ముకొని ఉన్న ఉద్యోగులు ఇప్పటికైనా కల్లు తెరవండి..నిజాలు చూడండి...ఏం తెలియనట్టు ఉండి అన్ని వెనకుండి నడీపించే " శ్యాం" లాంటీ వాల్లను మీడీయాలో కచ్చితంగా దూరంగా పెట్టాలి . ఉద్యోగులను వేదించే .. ఇలాంటి వాళ్లు మీడియాలో చాలామందే ఉన్నారు ..సివిఆర్ CEO నర్సింహారావు లాంటి వాల్లు ఇది అందరికి తెల్సిందే మరి మీడియా లో జర్నలిష్టుల సంఘాల పెద్దలు వీల్లను పిలిచి వీరు చేసే దారునాలను అడగాళ్సిన అవసరం ఉంది
soure :- http://apmediakaburlu.blogspot.in/