BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Friday, May 17, 2013

జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ అక్రమాల్లో జర్నలిస్టు పెద్దలు

జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ అక్రమాల్లో జర్నలిస్టు పెద్దలు హైదరాబాద్‌ భూములను ఆక్రమణలతో ఆంబుక్క పెట్టడమే కాకుండా.. హౌసింగ్‌ సొసైటీల్లోనూ ఆంధ్రోళ్లు అవకతవకలకు పాల్పడ్డరు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ అక్రమాల్లో జర్నలిస్టు పెద్దలు, సినీ పెద్దలు, రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తల హస్తం ఉందని సీఐడీ నిర్ధారించింది. 1998లో ప్రభుత్వానికి చెందిన వెయ్యి ఎకరాల భూములను కబ్జా చేసి సొసైటీ ప్లాట్లు చేసుకుని అమ్ముకుందని అప్పటి కలెక్టర్‌ ధృవీకరించిన్రు. త్వరలోనే వీళ్ల అవకతవకలపై చార్జిషీట్‌ దాఖలు చేయనుంది. ఇందులో సీవీఆర్‌ చానల్‌ ఓనర్‌ సీ వెంకటేశ్వరరావు ఏ-4 ముద్దాయిగా చేర్చుతున్నరు. ఎన్‌ టీవీ చౌదరి, మహా న్యూస్‌ ఐవీఆర్‌లపై కూడా కేసు నమోదయ్యే అవకాశముందని సీఐడీ వర్గాలు చెప్తున్నయి. . అవకతవకలకు పాల్పడ్డ సభ్యులకు ఎలాంటి శిక్ష వేయాలో కూడా చార్జిషీట్‌లో పొందుపరిచినట్లు తెలుస్తుంది. శుక్రవారం సీఐడీ ఎస్పీ కల్పానాయక్ ఆధ్వర్యంలో సొసైటీ ట్రెజరర్ హన్మంత్‌రావును రెండు గంటలపాటు ప్రశ్నించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ స్కాంలో పెద్దపెద్ద తలలు ఉండటంతో సీఐడీపై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తున్నది. చార్జిషీట్‌లో మీడియా ప్రముఖులు, రాజకీయ, సినీ పెద్దల పేర్లను చేర్చవద్దని వారిపై ప్రెషర్‌ పెడుతున్నట్టు తెలుస్తున్నది. ఈవార్త కవర్‌ కాకుండా ఆంధ్రా మీడియా మేనేజ్‌ చేస్తున్నది. జూబ్లీహిల్స్‌ హౌసింగ్ సొసైటీ అంశాన్ని సీఐడీ సీరియస్‌గా తీసుకున్నది. 

soure :-http://porutelangana.in/జూబ్లీహిల్స్‌-హౌసింగ్‌-స

CVR నర్సింహా రావు RVS కు జంపా...?

సివిఆర్ ను సగంనాశనం చేసి ... ఇప్పుడు ఆర్వియస్ చనల్ తో తన టీం తో వెళ్ళడానికి ఇప్పటికే తన అనుచరులను సందేశం పంపాడు.. ఇప్పటికే చెప్పా పెట్టకుండా క్రైంటీం సివిఆర్ ను వదలి జీ 24 గంటలకు వెళ్ళారు. దీనికి ప్రదాన కారనం మన నర్సింహారావే ఆయన హెరాస్ మెంటుకు తట్టుకోలేక చానల్ నుంచి బైటకు వెల్లారు .. ఇప్పుడు ఎమైందో ఏమో ఈ రోజు ఆర్విఎస్ చైర్మన్ కల్సి మంతనాలు జరిపాడ ని తెలుస్తోంది Telugu Media News . కు అందిన సమాచారం ప్రకారం సివిఆర్ నుంచి దాదాపు అందర్ని ఆర్విఎస్ కుతీసుకెళ్ళడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కొన్నట్టు సమాచారం.ఇప్పటికే అక్కడ పని చేస్తున్న ఒకప్పటికి టివి5 సీనియర్ జర్నలిష్టు A.రఘు పరిస్థితి ఏంటి

Tuesday, April 9, 2013

Botsa Under Fire For Misusing Zee Brand?

Zee Television Network, which has its own brand image in the media world, is said to be terribly upset with Pradesh Congress Committee president Botsa Satyanarayana and of late, the differences between Zee management and Botsa have reached the peak. Botsa has acquired 49 per cent stake in Zee 24 Ghantalu channel and has taken over the entire operation of the channel in Andhra Pradesh. While Botsa is the channel's promoter, it is only for for name sake and the entire management affairs are being looked after by one Fayeem. Though Botsa's brother Satish Babu comes to the office regularly, it is Fayeem who is running the show, right from managing the financial affairs to conducting bureau meetings on a day to day basis. Satish Babu is restricted to his own work and he does not interfere in the functioning of Fayeem. The Zee TV management is now focusing on who this Fayeem is. The management reportedly fumed at Botsa group for messing up the affairs in the news channel, which was supposed to be run on professional lines by maintaining certain principles and ethical values. Even Sivaramakrishna, who is heading the city division of Zee, is learnt to have expressed displeasure over the mismanagement of the channel by Botsa group at a recent meeting. The Zee management brought to the notice of Botsa that there was a talk in the market that Zee 24 ghantalu channel had earned notoriety of being a blackmailing channel, rather than a professionally run news channel. There were allegations against Fayeem that he had appointed a reporter for doing sting operations against big people and making money through blackmailing them, What is worse, he is bringing pressure on the reporters to do negative stories against certain personalities and demand money from them, while leaving those who give advertisements to the channel. This bad talk has had its impact on Zee Telugu channel as well," the Zee TV management told Botsa. The differences between Zee management and Botsa have reached such a stage that the former had threatened to take back the channel, if he was not in a position to run it on professional lines. "Otherwise, you can apply for your own logo. But you have no business to misuse Zee brand and bring it a bad name," the management told Botsa. It remains to be seen how far these differences would go and what the repercussions would be. Source :- http://www.greatandhra.com/viewnews.php?id=45454&cat=15&scat=16

Monday, September 10, 2012

త్వరలో తిరిగి ప్రారంబం కానున్న జీ 24 గంటలు న్యూస్ చానల్

త్వరలో తిరిగి ప్రారంబం కానున్న జీ 24 గంటలు న్యూస్ చానల్ త్వరలో తిరిగి ప్రారంబం కానున్న జీ 24 గంటలు న్యూస్ చానల్ ..ఈ నెల 20 తారీకునుంచి మూసి వేస్తాం అని జీ యాజమాన్యిం ప్రకటించినప్పటినుంచి..మిడియాలో.. జీ 24 గంటలు ప్రతినిధులకు అనేక అవమానాలు ఎదురైయ్యాయి.... వందలాది మంది జర్నలిస్టులు బాధ పోయింది. జీ యాజమాన్యంతో బొత్స సత్యనారాయణ, సతీష్ డీల్‌ కుదిరిందని సమాచారం. కానీ జీ 24గంటలును మొత్తం టేక్‌వోవర్‌ చేయడం లేదు. లీజ్‌కు మాత్రమే తీసుకుంటున్నారు 70 బొత్సాకు 30 జీ 24 గంటలు యాజమాన్యిం షేర్ తో. జీ 24 గంటలు ఇప్పుడు సీ (C) 24 గంటలుగా రాబోతున్నది. ఇన్నాళ్లు డిస్ట్రిబ్యూషన్‌ సమస్యతో సతమతమైన జీ 24గంటలు ఇప్పుడు ఆ బాధ నుంచి బయటపడనుంది. మీడియా ప్రో ఒంటెత్తు పోకడవల్ల జీ 24 గంటలు డిస్ట్రిబ్యూషన్‌ అనేక సమస్యలను ఎదుర్కొన్నది. అయినా జీ 24 ఆరోస్థానంలో కొనసాగింది. ఇప్పుడు బొత్స లీజ్‌ తీసుకోవడం వల్ల డిస్ట్రిబ్యూషన్‌ సమస్య తొలగిపోతది. సొంత కేబుల్‌ వ్యవస్థ ఉన్న బొత్స జీ 24గంటలను మరింత స్పేస్‌ కల్పించనున్నరు. ఏదిఏమైనా జీ 24గంటలు ఉద్యోగులకు ఇది శుభవార్తే. ఉద్యోగం కావాలని పోతే సీమాంధ్ర మీడియా జీ ఉద్యోగులను ఘోరంగా అవమానించింది. 18 వేల జీతం ఉన్నవాళ్లు వెళ్తే 6వేలకు వస్తారా? 7 వేలకు వస్తారా అని జీ 24 గంటలు ఉద్యోగులను అవమానించారు ఇతర చానల్ యాజమాన్యీయాలు ఇక మిగతావాళ్లని 15 పర్సెంట్ లేదా 20 పర్సెంట్‌ తగ్గించుకుంటేనే తీసుకుంటమని నిల్చోబెట్టి మాట్లాడారు. 13 చానల్స్ లో 5,6 ,రేటింగ్ ఉండటం అదీ మిగిలిన చానల్స్ లో ఉన్న ఉద్యోగుల కంటే తక్కువ మంది తో వారానికి రెండురోజుల సెలవు తీసుకుంటూనే ఇలాంటి రేంటిం తెచ్చిపెట్టీన తన టీం ఎలాంటి ఇబ్బందులు పడకూడదని సైలేష్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించింది.. ఇప్పుడు మిగిలిన్ చానల్స్ కు దడ మొదలౌతుంది.. కచ్చితంగా మొదటి రెండోస్తానాలకు పోటీ పడేందుకు సన్నదం అవుతున్నట్టు సమాచారం ...

Monday, November 21, 2011

తెలుగులో మరో కొత్త న్యూస్ చానల్... ఇమేజ్ 24 గంటల న్యూస్ చానల్

ఇప్పటికే కెమెరా స్టాండ్లు పట్టే ప్రెస్ మీటింగ్ హాల్ వెతుక్కోడానికి ప్రెస్ మీట్ పెట్టేవాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే రిపోర్టర్లు కెమేరా మెన్స్, ప్రింట్ కెమెరా మెన్లు, ప్రింట్ జర్నలిస్టులతో కిటకిట లాడిపోతుంది. ఏదైనా ధర్నాజరిగినా.. మీటింగ్ జరిగినా.. జస్ట్ మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ స్టాఫ్ తోనే సక్సెస్ అవుతుందనే సెటైర్లు కూడా ఈ మద్య పేలాయి. ఇప్పటికే ఉన్న న్యూస్ చాలదన్నట్టు... మరో మూడు చానళ్లు క్యూ కట్టిన విషయం తెలిసిందే.. వి6, టీఎన్‌ఎన్, తులసీ సీడ్స్ వారి చానల్ తో బాటు.. కొత్తగా ఇమేజ్ బ్రాడ్ కాస్టింగ్ రంగంలోకి దిగింది.. ఇప్పటికే ఆ సంస్థ జోరుగా రిక్రూట్‌చేసుకుంటోంది. ఇప్పటి వరకు వైద్యవ్యాపారంలో ఉన్న ఆ సంస్థ వార్తా వ్యాపారంలోకి దిగడంతో.. జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకునే వాళ్లకు.. ఇప్పటికే ఎంచుకొని రకరకాల అనుభవాలతో, అనుభూతులతో అవస్థలు పడే వాళ్లకు మరో మంచి అవకాశం వచ్చినట్టే. ఇమేజ్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ... అన్ని విభాగాల్లో రిక్రూట్ చేసుకుంటోంది.. ఆశావహులు అప్లై చేసుకోవచ్చు.....

పొలిటికల్ చానల్స్ బోర్ కొట్టాయి.. ఇక కులాల చానళ్లు వస్తున్నాయి

ఇప్పటి వరకు మనం రాజకీయ పార్టీల చానళ్లే చూశాం.. దీనికోసం ఏ రాష్ట్రమూ మినహాయింపు కాదు. పక్కరాష్ట్రాల గోల మనకెందుకు గానీ.. మన రాష్ట్రంలో మాత్రం జగన్ సిండికేట్, ఎల్లో సిండికేట్ అనే యమాకేటుగాళ్లు చానళ్లను నడిపిస్తున్నారని ఆ చానళ్లే ఒకరిపై ఒకరు దుమ్ము దూళి ఎత్తిపోసుకుంటున్నాయి. మళ్లీ ఇందులో తెలంగాణ అనుకూల చానళ్లు, వ్యతిరేక చానళ్లనే రెండు వర్గాలు, మళ్లీ ఇందులో తెలంగాణ వాదులందరి వాయిస్ వినిపించే చానళ్లు, కేవలం కేసీఆర్‌ను మాత్రమే ఉద్యమ సారధిగా చూపించే చానళ్లు.. ఇలా విభజించుకుంటూ పోతే.. ఆటంబాంబ్ శృంకలాలంత చిట్టా బయటపడుతుంది. ఇక రాజకీయ పార్టీల చానళ్లలో పాత కుల గజ్జి మళ్లీ చెలేస్తోంది. ఇప్పటికే ఇటు పత్రికల్లో.. అటు ఎలక్ట్రానిక్ మీడియాలో కమ్మరాజ్యం కలవరపెడుతున్న విషయం పాతదే.. ఆ తరువాత బ్రాహ్మణాధిపత్యం షరా మామూలే.. వీళ్ల చేష్టలు భరించి... భరించి రెండవ స్థానల్లో ఉండి విసుగు చెందిన బీసీ, దళితులు అవకాశం కోసం ఎదురు చూశారు. తాజాగా చానళ్లలో బీసీల ఆధిపత్యం ఎక్కువయిందన్నది పరిశోధనా సత్యం. ఇక్కడ ఆధిపత్యం అంటే పెద్ద పెద్ద పదవులను కుంటే పొరపాటే.. మీడియా ఉద్యోగాల్లోకి ప్రవాహంలా వచ్చి చేరుతూనే.. పై ఉద్యోగాలకు పోటీ పడుతున్న సంఖ్య అధికంగా ఉంది. దీంతో బాటు బీసీల్లో వచ్చిన చైతన్యం మూలాన.. పై స్థాయిలో ఉన్న బీసీలు సాధ్యమైనంత వరకు బీసీలకే ప్రాధాన్యమిచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. దీంతోపాటు కులాల గొడవ.. యాదవులు, గౌళ్లు, కాపులు, పద్మశాలీలు బాగా పోటీపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. గౌడ కులస్థులు, కాపు కులస్థులు, పద్మశాలీలు రెండవ స్థాయిల్లో ఉన్నారు. పద్మశాలీలు చాపకింద నీరులా విస్తరిస్తున్నారు. చారీలు ఇందులో కంసాలీలు కూడా కాస్త చొరవగానే దూసుకుపోతున్నారు..
అందుకే తాజాగా వచ్చే చానళ్లలో ఎక్కువ సంఖ్యలో కులాన్ని చూసి కొలతలేసి మరీ రిక్రూట్ చేసుకుంటున్నారని బాగా ప్రచారం జరుగుతోంది. ఎంపీ వివేకా పెడుతున్న వి6 చానల్ లో ఎంపీగారు దళితులకు ప్రాధాన్యమివ్వమని చెప్పారని వినికిడి.. కానీ సీఈఓగా పనిచేస్తున్న అంకం రవి, ఇన్‌పుట్/ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేస్తున్న పసునూరి శ్రీధర్ బాబు, ఫీచర్స్ ఇన్‌చార్జిగా నియమితుడైన చల్లా శ్రీనివాస్ వీళ్లంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కావడంతో.. తమ సామాజిక వర్గానికి రిక్రూట్‌మెంట్లో పెద్ద పీఠ వేస్తున్నారని మీడియా కోడై కూస్తోంది. ఇదే విషయమై ఆ చానల్‌లో పనిచేస్తున్న నా ఫ్రెండ్ ను అడిగినపుడు అందరి కులాలు తెలియవు కానీ ఇతర కులాల వారు కూడా ఉన్నట్టుంది అన్నారు. కానీ ఓ పెద్ద మనిషి సేకరించిన సమాచారం ప్రకారం గ్రాస్ రూట్స్ నుంచి పై స్థాయి వరకు ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించినట్టు తెలుస్తోంది. ఈ పద్దతి విడనాడాలని విజ్ఞప్తి చేయడం మినహా మరేమీ చేయలేం. ఇదే కొనసాగితే ఇతర చానళ్లలో బీసీల పై అగ్రవర్ణాల దాడి( తీసివేతలు) తప్పదేమోననిపిస్తోంది.
దాని తరువాత కొత్తగా తులసీ సీడ్స్ ఆధ్యర్యంలో వస్తున్న మరో చానల్ కూడా ఇదే పద్దతిని పద్దతిగా అనుసరిస్తుందనే ప్రచారం జోరుగా ఊపందుకుంది. తులసీ సీడ్స్ అధినేత కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం.. వీరు చానల్ పెట్టేటపుడే కాపులకో చానల్ కావలని నిర్ణయించుకొని పెట్టారట. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు హడావుడి చేసిన తులసీ అధినేత ఇప్పుడు చానల్ పెట్టడం వెనుక రకరకాల కారణాలున్నాయని విశ్లేషకుల అంచనా.
అయితే ఇప్పటి వరకు ఉన్న పొలిటికల్ మౌత్ పీసులు కాస్తా.. క్యాస్ట్‌లీ మౌత్ పీసులుగా మారబోతున్నాయన్నమాట.. చూడాలి... త్వరలో యాదవులకో చానల్, గౌండ్ల కులానికో చానల్ వస్తుందేమో..

పోటా పోటీగా ముస్తాబవుతున్న కొత్త చానళ్లు- జనవరికి విడుదల

తెలంగాణ ప్రాంతానికి పరిమితమై వాదాన్ని, నినాదాన్ని వినిపించడానికి మరో రెండు కొత్త చానళ్లు జనం ముందుకు రానున్నాయి. ఎంపీ వివేక్ టీం వి6 పేరుతో చానల్ తెస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఈ చానల్లో ఇప్పటికే ట్రైనీ ఉద్యోగులను నియమించుకొని శిక్షణ ఇస్తున్నారని సమాచారం. సీనియర్లను తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరిస్తున్నారని వినికిడి. జీతాల విషయంలో కూడా గతంలో కొన్ని చానళ్లలాగా బోల్తా పడకుండా.. కాస్తో కూస్తో ప్రతిభ ఉన్నవారికే పట్టం కట్టాలని యోచిస్తున్నట్టు ఆ చానల్‌తో సంబంధం ఉన్న నా సహచరుడు తెలిపాడు. అయితే అదే సాకుతో చానల్ ను ట్రైనీల చేతిలో పెట్టినా ఇబ్బందేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తెలంగాణ ప్రాంత జర్నలిస్టులకు మరిన్ని అవకాశాలు దొరికినట్టే.. ఇప్పటికే తెలంగాణ కళారూపాలను బుల్లితెరపై ఆవిష్కరించడంలో ముందున్న టీన్యూస్‌ని మరికొందరు అనుసరించబోయి బోల్త పడ్డారు. హెచ్ఎంటీవీ మాత్రం రసమయితో చేసే మార్మోగినపాట మాత్రం కాస్త సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక టీన్యూస్ లో ప్రేమ్‌రాజ్, జనార్దన్‌లు మొదలు పెట్టిన మాటా ముచ్చట నిరాటంకంగా కొనసాగుతోంది. ఇదో ట్రెండ్ సెట్టర్‌గా మారడం ఆ చానల్ సాధించిన విజయమే.. తరువాత మా టీవీని అనుసరించి పెట్టిన రేలారే ధూంధాం.. ఆరభశూరత్వంగా మారింది. టీవీ9 మాపల్లెపాట బొక్కాబోర్లా పడింది. గానపదమని,.. ఇంకా రకరకాలపేర్లతో పెట్టిన చానళ్లన్నీ ప్రొడక్షన్ క్వాలిటీ లేక, సరియైన ప్రొడ్యూసర్ లేక చతికిల పడ్డాయి. తాజాగా వి6 చానల్ కూడా ఇటువంటి కార్యక్రమం ఒకటి జజ్జనకరి జనారే.. పేరుతో రూపొందిస్తుందని అవిశ్వసనీయ సమాచారం. ఇక టిఎన్ఎన్ పేరుతో వచ్చే మరో తెలంగాణ నెట్‌వర్క్ చానల్.. రిక్రూట్ చేసుకుంటోంది. ఇందులో కళాకారులు, జర్నలిస్టు వృత్తిలో ఉన్నవారు ఇరువురూ పాలు పంచుకుంటున్నారు. అయితే ఈ చానల్ పై మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నా.. తెలంగాణ ప్రజల గొంతు వినిపించేందుకు మరోవేదకి దొరికినట్టయింది. కొత్తగా జర్నలిజంలోకి రావాలని ఉబలాట పడేవారికి ఇవి వేదికలుగా మారనున్నాయి. చానళ్లు ఎన్ని వచ్చినా 1వ తారీఖు వరకు జీతాలు చెల్లించేలా ఉంటే అదే పదివేలు..(స్టార్టింగ్ వేతనం ఐదువేలేలెండి)

Monday, August 29, 2011

ఓ హోటల్లో క్యాట్ వాక్ లతో న్యూస్ యాంకర్ల హలచల్ .....

ఓ హోటల్లో క్యాట్ వాక్ లతో యాంకర్ల హలచల్ .....పొటోలతో సహా ఎప్పుడు ఎందుకు ఎలా..ఎవరు అనే పూర్తి విషయాలు వచ్చే పోష్టులో చూడండి..ఫొటోలతో సహా..ఏఏ న్యూస్ చానల్ల యాంకర్లు ఈ క్యాట్ వాక్ లో పాల్గొన్నారు..ఏ హోటల్ లో యాంకర్లు హల చల్ చేసి సందడి చేశారు...మాకూ హక్కులున్నాయంటూ..మేమూ కల్సిఉన్నామంటూ ఆ పూర్తి వివరాలు వచ్చేపోష్టులో యాంకర్లు చేస్తున్న డిమాడ్లేంటి ...అవిసాద్యిమా..? ఉద్యోగాలకు బద్రతకల్పించగలరా..?అంటూ కొన్ని డిమాడ్లతో ఏకం అయిన యాంకర్లు , వాయిస్ వోవర్ ఆర్టిష్టులు.. .....ఏంటా డిమాండ్లు..ఎంతమంది హాజరు అయ్యారు ఆ ట్రూప్ లో కొందరు మేము రాము ఇబ్బందుల్లో ఉన్నప్పుడూ మీరు సహాయం చేశారా అంటూ రిజెక్ట్ చేశారు..మరీ ఈ యాంకర్ల లీడర్ ఎవరు..? హోటల్లో వీరు చేసిన సందడేంటి అన్నీ విషయాలు త్వరలో..రెండు రోజులు సందడి చేసిన యాంకర్లు.......సందట్లో సడేమియా అన్నట్టు మేల్ , ఫిమేల్ యాంకర్లు షేర్ చేసుకున్న ఫోన్ నెంబర్లు ..ఆఫీసుల కు వచ్చి పచ్చి కామేంట్సు చేస్తున్న మేల్ యాంకర్లు..అసలేం జరుగుతుంది..ఫిమేల్ యాంకర్లు చేస్తున్న క్యాట్ వాక్, సందడిని సెల్ఫోన్లలో రికార్డుచేసి ఆఫీసుల్లో అందరికీ చూపిస్తూ..చండాలమైన కామెంట్సు మరి ఇదేంటి తోటి యాంకర్లను ఇలా అనటం అవసరమా.?....యూనియన్ పెట్టుకోవలనుకోవడం బాగానే ఉంది మరి కోతి వేషాలేంటి..వాటిని వీడియోలు తీసి కామెంట్స్ ఏంటి..?

పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో రిపోర్టర్ల..దందా..20లక్షలు హాంపట్

పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో రిపోర్టర్ల..దందా..20లక్షలు హాంపట్...వినాయక చవితి మట్టివినాయకుల పంపినీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్టు ఫ్రీగా వినాయకుల పంపినీ చేస్తుంది...అదీ స్వచ్చంద సంస్తలను ఎన్నుకొన్మి వారికి డబ్బులు ఇచ్చి వారి ద్వారా ప్రజలకు ఫ్రీ గా మట్టీ గనపతులను ఇస్తున్నారు..అంతే ఇంకేముంది ...బెలం చుట్టూ ఈగలు వాలినట్టు అక్కడ రిపోర్టర్లు చేరి..తమకూ స్వచ్చంద సంస్థ్జ ఉందంటూ బినామి స్వచ్చంద సంస్థ పేరుతో డబ్బులు దండుకుంటున్నారు...ఇప్పటీకే సాక్షిరిపోర్టర్ ,ఇలాగే డబ్బులు కొట్టేశారని సమాచారం..పెద్ద నీతిమంతులం అని చెప్పుకునే ఆంద్రజ్యోతి రాధాకృష్టగారు మీ రీపోర్టర్ కూడా ఈ దందా చేస్తున్నట్టు సమాచారం .ఇలా ప్రింట్ మీడియా రిపోర్టర్లు ఇప్పటిక్కే 20లక్షలకు టోపీ పెట్టారని తెలుసోంది...సాక్షి రిపొర్టర్ ఎక్కువగా పొల్యూషన్ కంట్ర్లోల్ బోర్డులోనే కనిపిస్తున్నాడు ...ఇప్పటీకైనా ఇలాంటివి ప్రజలు తెల్సుకొని చీ అనకముందే మీడియా యాజమాన్యిం జాగ్రత్త పడితే మంచిది..ఇది ఓ స్వచ్చంద సంస్థ నిర్వాహకుడు ఇచ్చిన సమాచారం ఈసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎవరెవరు ఎంత ఎంత డబ్బులు కొట్టేశారో పేర్లు ప్రటిస్తాం

Thursday, August 18, 2011

ఈవారం TRP రేటింగ్స్‌

Etv2 -5.94

Ntv -4.24

T NEWS -2.88

TV5 -2.88

TV9 -2.27

Zee 24 -1.54

Sakshi -1.21

INEWS -0.74

Maha -072

HMtv -0.62

ABN -0.62

http://www.porutelangana.com

మీడియా రంగం లోకి ఇమేజ్ హాస్పిటల్

త్వరలో తెలుగు ప్రేక్షకుల నెత్తిన మరో పిడుగు పడబోతుంది. ప్రజల ప్రాణాలతో బిజినెస్ చేస్తున్న ఇమేజ్ హాస్పిటల్ ఇప్పుడు మీడియా రంగం లోకి అడుగు పెట్టలనుకుంటుంది. ఇమేజ్ న్యూస్ ఛానల్, ఇమేజ్ హెల్త్‌ ఛానల్ ను తెచ్చేందుకు రంగం సిద్దమ్యంది. అందుకోసం కొందరు మీడియా ప్రముఖులతో లంచ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసిన్రట. సర్లే నిరుద్యోగులకు, సో కాల్డ్ జర్నలిస్ట్ ల వేధింపులతో నలిగిపోతున్నవారికి ఇక్కడో ప్లాట్ ఫాం దొరికితే చాలు.

ఆర్టీసీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌ టెస్ట్ సిగ్నల్‌ స్టార్ట్‌



ఆర్టీసీ సంస్థ చానల్‌ను ప్రారంభించింది. హైటెక్‌, వోల్వో బస్సుల్లో ప్రయాణికులు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు వివిధ స్థలాల ప్రాముఖ్యతను తెలియజేసే ఏర్పాట్లను చేస్తున్నది. త్వరలో పూర్తిస్థాయిలో ప్రసారాలు చేయనున్నది. ఆర్టీసీ చానల్స్‌ యాడ్స్‌ కూడా బాగానే వస్తున్నయి. ఎందుకంటే బస్సుల్లోని ప్రయాణికులు చచ్చినట్టు టీవీ చూస్తరు. వేరే మార్గం లేదు కాబట్టి యాడ్‌ మార్కెట్‌ ఆర్టీసీ చానల్‌ వైపు చూస్తున్నది. ఎనీవే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి చానల్‌ ఊరటనిస్తుందని భావిద్దాం. రాష్ట్రం విడిపోయే నాటికి నష్టం లేకుండా మన డిపోలను అప్పగిస్తే చాలు.

source :- http://www.porutelangana.com

Friday, August 12, 2011

రిపోర్టర్లూ మీఫోన్లు ట్యాప్ అవుతున్నాయి..జాగ్రత్త..?



రిపోర్టర్లూ మీఫోన్లు ట్యాప్ అవుతున్నాయి..జాగ్రత్త..?..రాష్ట్రంలో పరిస్థితులు మీరు ఇప్పటికే గమనించి ఉంటారు ..అదీ మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు రిపొర్టర్లను టార్గెట్ చేసి మరీ చితగ బాదారు..ఇదేదో అప్పటికప్పుడు తీసుకున్న నిర్నయంకాదు..పోలీసు ఉన్నతాదికారులు దాడి జరుగక ముందు తీసుకున్న నిర్నయం..రక్తంకారేలా కొట్టిన వాళ్ళను ఎంచేయలేకపోయిన మన యూనియన్ లీడర్లు ఏంచేస్తున్నారు..అందుకే ఇప్పుడు పోలీసులు రిపోర్టర్లను మానసికంగా దెబ్బతీసేందుకు ప్లాన్ వేశారు..ప్రతి రిపోర్టర్ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు..ఇది మాకు అందిన పక్కా సమాచారం మీఫోన్ ట్యాప్ అవుతుందా లేదాని మీరు గుర్తించాలంటే మీకు ఏదైనా కాల్ వచ్చినప్పుడు బుస్ మనే సౌండ్ వస్తుంది...గమనించండి..లైన్ క్లియర్ గా ఉండదు..గతంలో పోలీసులను టార్గెట్ చేస్తూ పేపర్లలో రాసిన రిపోర్టర్లు..కొందరు టాస్క్ ఫోర్సు పోలీసుల జీవితాలను బయట పెడతామని చానల్ల్ లో వేసి ఆతరువాత మేనేజ్ చేసిన వారు ఇలా అనేక మందిని టార్గెట్ చేసిన పోలీసులు ఫోన్లను ట్యాప్ చేసి వారి ఇళ్ళీగల్ సంబందాలు...బిజినెస్ లు ఏమైనా ఉంటే వారిని మానసికంగా దెబ్బతీసేందుకు పోలీసులు వ్యూహం పన్నారు..దీనిలో బాగంగానే నిన్ని అరెష్టు అయిన గురుదెవ్ MLM కంపెనీ పై పోలీసులు ఎన్నోసార్లు దాడి చేసి పట్టుకున్నా డబ్బులతో మేనేజ్ చేసుకొని వదలి పెట్టారు..మరి ఇప్పుడు MP స్థాయి రికమండేషన్ ఉన్నా ఎందుకు అరెష్టు చూపించ వలసి వచ్చింది ...ఈసారి మీడీయా వారితో వారికి లింకులు ఉన్నాయని తెల్సి ...వారిచే కొందరి MEDIA పేర్లు కావాలని చెప్పించి తమ ప్లాన్ ను అమలు చేస్తున్నారు...సో మీరు ఎవరైనా అమ్మాయిల తో ఇల్లీగల్ ఎఫైర్ ఉంటే జాగ్రత్త పోలీసులు మీమీద నిఘా పెట్టారు..మీరు మీ గర్ల్ ప్రెండ్ తో ఎక్కడైనా గెష్టుహౌస్ కు కాని పబ్ లకు వెళ్ళినా మఫ్టీలో మిమ్మల్ని వెంటాడుతున్నారు..రిపోర్టర్ల్ ఫోన్లలో మాట్లాడే అన్ని ఇల్లీగల్ మ్యాటర్లు ,ఇల్లీగల్ ఎఫైర్లను రికార్టు చేస్తున్నారు...జాగ్రత్త..రక్తం కారేట్టు కొడీతేనే మనం ఏంచేయలేక పోయాం రిపోర్టర్లను మానసికంగా దెబ్బతీసేందుకు అనే పోలీసులు రెడీగా ఉన్నారు మీరు అమ్మాయి ల ఎఫైర్లు మనీడీలింగ్ లను రెడ్ హేండెడ్ గా పట్టుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నట్టు సమాచారం..పోలీసుల తో జాగ్రత్త ..అదీ మనం పదిమందికి నీతులు చెప్పే మంచి వృత్తిలో ఉన్నాం మనమే తప్పు చేస్తే ఎదుటి వానిగురించి ఏం చెబుతాం మన వృత్తిన అవమాన పరచినట్టేకదా ..సో గతంలో తప్పులు చేసినా కనీసం ఇప్పటినుంచైనా మన వృత్తికి న్యాయం చేద్దాం..సో మరోసారి హెచ్చరికి మీ ఫోన్లు పోలీసులు ఇల్లీగల్ గా ట్యాప్ చేస్తున్నారు ఇప్పటికే చాలా ఫోన్లు ట్యాప్ లో ఉన్నాయి..ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పిన సమాచారం..BE CARE FULL

యాంకర్ ను పెళ్ళీ చేసుకున్న లైఫ్ ష్టైల్ రిపొర్టర్ మరోయాంకర్ తో సరసాలు

యాంకర్ ను పెళ్ళీ చేసుకున్న లైఫ్ ష్టైల్ రిపొర్టర్ మరోయాంకర్ తో సరసాలు...ఎం మాయచేశాడో తెలీదు మొత్తనికి ఓ యాంకర్ ను పటాయించి పెద్దల సహాయంతో పెళ్ళి చేసుకున్నాడు ..బాగానే ఉంది..అసలే లైఫ్ ష్టైల్ రిపోర్టర్ అమ్మాయిలతో బాగా టచ్ ఉండే బీట్ అనుకున్నాడో ఏమో ...ఓ యాంకర్ ను పెళ్ళీ చేసుకొని ఆఫీసులో అందరు ఉండగానే మరో యాంకర్ తో .......ఫోన్లలోనే సృంగార సంభాషన ఫోనులో ఆదివారాల్లొ ఎప్పుడు వస్తావు ఎంజాయ్ చేద్దాం అంటూ సంభాషన సాగుతుందట పక్కన ఎవ్వరు ఉందీ పట్టించుకోకుండా..ఈ విషయాన్ని గమనించిన ఓ ఔత్సాహిక రిపోర్టర్ కాల్ డీటైల్స్ తెప్పించి ఎవ్వరాని ఆరాతీస్తే మరో చానల్ యాంకర్ అని తేలింది..ఈ విషయాని సదరు రిపోర్టర్ తెలుగు మీడియాన్సూస్ కు తెలిపడు ఈ కాల్ డీటైల్స్ ను సదరు లైఫ్ ష్టైల్ రిపోర్టర్ భార్యికు చేరవేస్తాను అంటున్నాడు ...ఇదే జరిగితే లైఫ్ ష్టైల్ రిపోర్టర్ రిపోర్టర్ భార్యి కు చూచాయనగా విషయం చెప్పగానే అదే జరిగితే ఆయాంకర్ ను తను పని చేసే చానల్ కు వెళ్ళీ చెప్పుతీసుకొని కొడతాను అన్నట్టు సమాచారం...లైఫ్ ష్టైల్ రిపోర్టర్ గారు కాస్త మీదూకుడు తగ్గిస్తే మంచిది లేకుంటే రచ్చ రచ్చ అవుతుంది....మీరేదే కాస్త గ్లామర్ గా ఉన్నారని ఇలా సృంగార పాఠాలు అందరికి చెబితే మీకు చివరికి చిరిగి చాట అవ్వడమేకాక సదరు యాంకర్ జీవితం బుగ్గిపాలవుతుంది...చానల్ పరువుపోతుందని ఆమెను ఎవ్వరూ తీసుకోరు...అసలే రోజులు బాగాలేవు...అమ్మా యాంకరమ్మా తమరు కూడా జర జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే నీవు సీక్రెట్ గా మాట్లాడు తున్నావు అనుకుంటున్నావు..కాని యాంకర్లతో రిలేషన్ గొప్పగా ఫీల్ అయి అందరికీ తెల్సేలా ఫోన్లలో మాట్లాడుతుంటే చివరికి చిరిగేదినీకే..మనవాడీ నోట్లో ఏదీ దాగదంట అందరికీ టాంటాం చేస్తున్నాడు జర బద్రం బిడ్డా..సదరు లైఫ్ ష్టైల్ రిపోర్టర్ బార్యికు తెల్సి మీచానల్ కు వచ్చి కొట్టిందనుకో మీ తల్లి దండ్రులు తలలు ఎక్కడ పెట్టుకోవాలి ...కాస్తా నీ లైఫ్ గురించి ఆలోచించుకోతల్లి ..కాస్తమనిషి గ్లామర్ గా కనిపించగానే రిలేషన్ మైటైన్ చేస్తున్నాను అంతా సీక్రెట్ గా జరిగిపోతుంది అనుకుంటున్నావు మనవాడు అదేగొప్పగా ఫీల్ అయి నీ బ్రతుకు బయట పెడుతున్నాడు..

టెలివిజన్ రేటింగ్స్ : నిజాలూ, నిష్ఠురాలూ.-(bhavanarayana.గారి విష్లేషన )



ప్రతి బుధవారం మధ్యాహ్నం కనీసం మూడు న్యూస్ చానల్స్ నుంచి మిత్రులు గడిచిన వారం రేటింగ్స్ పంఫుతుంటారు. చిత్రమేమిటంటే వాళ్ళ వాదనలకు పొంతన ఉండదు. ఎవరికి వాళ్ళు తమ మార్కెట్ వాటా ఎక్కువ ఉన్నట్టు చెప్పుకుంటారు. అదెలా సాధ్యమనేది సహజంగా ఎదురయ్యే ప్రశ్న. అసలు చిక్కు అక్కడే ఉంది. ఫలానా పట్టణాల్లో ఆ చానల్ ముందుందంటే చాలు, సంబంధిత అంకెలతో ఒక ఎస్ ఎం ఎస్. వస్తుంది. ఫలానా వయోవర్గంలో ఎక్కువ మంది ఆ చానల్ చూసినట్టు తేలితే మరో ఎస్ ఎమ్ ఎస్. వారంలో మొదటి 30 కార్యక్రమాల్లో మావే ఎక్కువ ఉన్నాయంటూ ఇంకొకరి వాదన. అందరి వాదనలూ నిజమే కావచ్చు. కానీ సామాన్యులకు ఇదొక గందరగోళం. కానీ ఫలానా చానల్ కి ఎక్కువ రేటింగ్ ఉందని చర్చించుకోవటం మాత్రం ఆగదు. చానల్ గొప్పదనానికి అదే నిదర్శనమనే అభిప్రాయం సామాన్యప్రజలకూ ఏర్పడింది. కేవలం రేటింగ్స్ ఆధారంగా చానల్ గొప్పతనాన్ని నిర్థారించటమే ఒక దారుణమైతే, అదే రేటింగ్స్ ని అన్ని చానల్స్ ఒక పౌరసంబంధాల ఆయుధంగా మలుచుకోవటం మరింత దురదృష్టకరం. ప్రకటనలు సంపాదించుకోవటానికే రేటింగ్స్ పరిమితం కావటం లేదని తేలిపోయింది.

టెలివిజన్ చానళ్ల ప్రేక్షకాదరణను అంకెల్లోకి అనువదించే ప్రక్రియగా రేటింగ్స్ ను నిర్వచించుకోవచ్చు. ప్రకటనకర్తలకు ప్రేక్షకులను సమకూర్చిపెట్టటమే చానల్స్ పని కాబట్టి వీలైనంత ఎక్కువమందిని ఆకట్టుకోగలుగుతున్నట్టు నిరూపించుకోవటం వాటి బాధ్యతగా మారింది. ఆ విధంగా మరిన్ని ప్రకటనలు తెచ్చుకోగలిగే స్థోమతను చానల్స్ చాటుకుంటున్నాయి. తమ కార్యక్రమాలకు వస్తున్న రేటింగ్స్ ను బట్టి ప్రకటనలు తెచ్చుకునే పరిస్థితి దాటిపోయింది. కేవలం రేటింగ్స్ కోసమే కార్యక్రమాలు రూపొందిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీనివలన ప్రేక్షకులకు అవసరమైన కార్యక్రమాలకంటే ప్రేక్షకులు కళ్లు తిప్పుకోకుండా చూస్తారనుకునే కార్యక్రమాలమీదనే చానల్స్ దృష్టిపెడుతున్నాయి. ఈ ధోరణి మీద విమర్శలు ఏ స్థాయికి వెళ్ళాయంటే అసలు రేటింగ్స్ అనేవే ఉండకూదదనే వాదన ఇప్పుడు తెరమీదకొచ్చింది. ఇది రేటింగ్స్ తప్పా ? రేటింగ్స్ ను ఆపాదించుకోవటంలో ఉన్నతప్పా?వాటిలో శాస్త్రీయత లోపించటం తప్పా ? ఇన్ని రకాల ప్రశ్నల మధ్య ప్రభుత్వం మొదటిసారిగా రేటింగ్స్ మీద దృష్టి సారించాలనుకుంటోంది. ఒక కమిషన్ ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. అయితే ఈ రేటింగ్స్ లెక్కించే విధానం మొదలుకొని ఆపాదిస్తున్న తీరు వరకూ సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

పత్రికల సర్క్యులేషన్ నిర్థారించటానికి కచ్చితమైన లెక్కలుంటాయి.అందువలన ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ( ఎబిసి) పని చాలా సులభం. టీవీ విషయానికొచ్చేసరికి అది కుదరదు. కేవలం సర్వే పధ్ధతి మీద ఆధారపడాలి. అందుకే ఇది వివాదాస్పదంగా మారింది. పత్రికల పట్ల పాఠకుల ఆదరణలో గంటలూ రోజులూ అంతగా ముఖ్యం కాదు. ఆరు నెలలకొకసారి ఫలితాలు వస్తాయి. టీవీలకు వారానికొకసారి రేటింగ్స్ వెలువడతాయి. ఇందుకోసం ప్రతి నిమిషం చానల్స్ ను రేటింగ్స్ సంస్థ గమనిస్తూ ఉంటుంది. అందుకే ప్రతిటీవీ చానల్ క్షణ క్షణానికీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కృషి చేయాలి. లేకపోతే రిమోట్ తన పని తాను చేసుకుపోతుంది. ఒకసారి ప్రేక్షకుడు అటువైపు వెళ్ళిపోతే ఇక్కడ ఎంత మంచి కార్యక్రమం ప్రసారం చేసినా ప్రయోజనం ఉండదు. ఇటువంటి పోటీ వాతావరణంలో టీవీ రేటింగ్స్ అత్యంత సున్నితమైన అంశంగా మారిపోయాయి.

రేటింగ్స్ లెక్కించేందుకు భారతదేశంలో టామ్ ( టెలివిజన్ ఆడియెన్స్ మెజర్‍మెంట్ ) అనే సంస్థ ఉంది. నిజానికి పదేళ్ల కిందట టామ్, ఇన్‍ టామ్ అనే రెండు సమ్స్థలుండేవి. ఈ రెండూ సంస్థలూ భిన్నమైన ఫలితాలు ప్రకటిస్తూండటంతో అప్పట్లో కొంత వివాదం చెలరేగింది. అయితే, అదే సమయంలో అమెరికాలోని వీటి మాతృసంస్థలు కలిసిపోవటంతో సహజంగానే ఇక్కడ గుత్తాధిపత్యం ఏర్పడింది. ఇన్‍టామ్ మాయమైంది. ఇప్పుడు టామ్ చెప్పిందే వేదం. ప్రకటనకర్తలూ. ఏజెన్సీలూ , చానల్ యాజమాన్యాలూ తప్పనిసరిగా టామ్ సమాచారం మీదనే ఆధారపడాలి. ఇటువంటి గుత్తాధిపత్యంలో టామ్ ఎంత మేర బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నదో, ఏపాటి విశ్వసనీయత సంపాదించుకున్నదో పరిశీలించాలంటే లెక్కింపు విధానాన్నే సమీక్షించాల్సి ఉంది.

ముందే చెప్పినట్టు, రేటింగ్స్ లెక్కించటమంటే సర్వే మాత్రమే. ఈ సర్వే ఎంత దారుణంగా ఉంటుందో చూస్తే రేటింగ్స్ మీద కొద్దిపాటి గౌరవం కూడా మిగలదు. దేశం మొత్తం మీద 12 కోట్లకు పైగా కేబుల్ కనెక్షన్లు ఉంటే కనీసం 12వేల ఇళ్లు కూడా ఈ సర్వే లో లేవు. అంటే పదివేల ఇళ్లలో ఒకటి చొప్పున మాత్రమే సర్వే చేసి దాన్నే ప్రేక్షకుల అభిప్రాయంగా చెబుతున్నారు. 120 కోట్ల జనాభాలో 50 వేల లోపు మంది అభిప్రాయమే రేటింగ్ అవుతోంది. అంటే పాతిక వేలమందిలో ఒకరిని లెక్కపెడుతున్నారన్నమాట. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, ఇక్కడున్న కోటికిపైగా కనెక్షన్లలో 1200 ఇళ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇంకోవిధంగా చెప్పాలంటే , ఇంటికి ఐదుగురి చొప్పున దాదాపు 6 వేల మందిని సర్వే చేస్తున్నారు. ఈ లెక్కలనే మనం ప్రేక్షకుల తీర్పుగా చాటుకుంటున్నాం.

సర్వే పధ్ధతి కూడా అయోమయమే. ఆంధ్ర ప్రదేశ్ లో పట్టణాలను మూడు రకాలుగా విభజించారు. మొదటిది హైదరాబాద్ నగరం. ఆ తరువాత విభాగంలోకి విశాఖపట్నం, విజయవాడ నగరాలొస్తాయి. ఈ మూడు నగరాలు కాకుండా పది పట్టణాలు కూడా రేటింగ్ పరిశీలనలో ఉన్నాయి. వీటి జాబితా రహస్యమని టామ్ సంస్థ చెబుతుంది గాని ఇది బహిరంగ రహస్యమే. అన్ని చానల్స్ కూ ఈ పట్టణాలు తెలుసు. అందుకే అక్కడ చానల్ తప్పనిసరిగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంటర్‍టైన్‍మెంట్ చానల్స్ అయితే రకరకాల కార్యక్రమాల ప్రిలిమినరీ సెలక్షన్స్ కు ఈ పట్టణాలనే ఎంచుకుంటాయి. న్యూస్ చానల్స్ కూడా ఆయా పట్టణాల వార్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. అక్కడి ఎమ్ ఎస్ ఓ ( చానల్స్ పంపిణీదారుడు ) కు క్యారేజ్ ఫీజు చెల్లిస్తాయి. వీటితో బాటు అక్కడ ఎవరెవరి ఇళ్లలో మీటర్లు పెట్టారో తెలుసుకుని తగిన ” జాగ్రత్తలు ” తీసుకుంటారని కూడా చెబుతారు గాని స్పష్టంగా అది నిరూపించటం కష్టం కాబట్టి ఆ విమర్శల జోలికి వెళ్ళనక్కర్లేదు.

ఇక లెక్కింపు విషయానికొస్తే, ఈ ఎంపిక చేసిన ఇళ్లలో పీపుల్స్ మీటర్ ఏర్పాటు చేస్తారు. దీన్ని ఒక రిమోట్ తో అనుసంధానం చేస్తారు. ఎవరైనా టీవీ ఆన్ చేయాలంటే ఈ మీటర్ మీద తమకు సంబంధించిన బటన్ నొక్కాలి. స్త్రీపురుషులకు వేరువేరు బటన్స్ ఉంటాయి. వయసులను బట్టి కూడా బటన్స్ మారతాయి. ఎవరైనా టీవీ దగ్గరనుంచి పక్కకి వెళ్ళిపోవాలంటే వాళ్ల బటన్ ఆప్ చేసి వెళ్ళాలి. ఆ విధంగా ఎవరెవరు ఎంత సేపు ఏ చానల్ చూశారో బరోడాలోని టామ్ కార్యాలయ రికార్డులలో నమోదవుతుంది. ” అందరూ అంత కచ్చితంగా టీవీ చూసేముందూ, అక్కడినుంచి వెళ్ళేముందూ బటన్ నొక్కుతారా “ లాంటి ధర్మసందేహాలకిక్కడ తావు లేదు. లక్షలోపు జనాభా ఉన్న మండలకేంద్రాలూ, గ్రామపంచాయితీలూ లెక్కకు రావా అంటే రావన్నదే సమాధానం. సగం జనాభా అభిప్రాయాలు లెక్కలోకి తీసుకోకుండా ఇది సరైన సర్వే ఎలా అవుతుందనేది జవాబుదొరకని ప్రశ్న.


టామ్ రేటింగ్స్ మీద ఇప్పటికే ఎన్నో విమర్శలున్నాయి. అతి తక్కువ శాంపిల్స్ తో రూపొందించే నివేదికలు సమగ్రంగా ఉండే అవకాశమే లేదు. అయినా సరే టామ్ దగ్గర ఒక రెడీమేడ్ గడసరి సమాధానం ఉండనే ఉంది. రక్తపరీక్ష చేయటానికి ఎంత రక్తమ్ తీస్తారన్న ఎదురు ప్రశ్నే వాళ్ళ సమాధానం. భిన్నమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న భారతదేశంలో ఏకరూపత ఉండదని తెలిసినా ఇదే బుకాయింపు. అసలు కారణం ఏమిటంటే, రేటింగ్స్ లెక్కించటానికి ఇళ్లలో టీవీలకు బిగించే పీపుల్స్ మీటర్ ఖరీదు లక్షరూపాయలు. ఇప్పటికే దేశంలో పదివేల మీటర్లకు వంద కోట్లు ఖర్చుపెట్టిన టామ్ ఇంతకుమించి ఖర్చు వద్దనుకుంటోంది. రేటింగ్స్ నిర్ణయించే ఏకైక సంస్థ గనుక అందరినీ శాసించే స్థితిలో ఉండి గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది.

చివరికి చానల్స్ అన్నీ టీ ఆర్ పీ ( టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ ) చట్రంలో ఇరుక్కు పోయాయి. మొత్తం టీవీ పరిశ్రమనే శాసించే స్థానంలో రేటింగ్స్ స్థిరపడ్డాయి. చానల్స్ కూడా మంచి రేటింగ్ వస్తే ఆనందించటం, రాకపోతే రేటింగ్స్ ని తిట్టుకుంటూ టామ్ ని విలన్ గా చిత్రీకరించటమే ఇప్పటిదాకా చూశాం. అయితే, ప్రత్యామ్నాయ వ్యవస్థ మీద దృష్టి పెట్టటంతో బాటు టామ్ పనితీరుమీద పర్యవేక్షణ ఉందాలన్న కోణంలో ఇప్పుడు చర్చ మొదలైంది. ఒకే రేటింగ్ ఏజెన్సీ సరిపోతుందా, ఎక్కువ దేశాల్లో ఉన్నట్టు కనీసం రెండు ఉండాలా అనేది కూడా ఇప్పటి చర్చలో భాగమే. టీవీ రేటింగ్స్ లెక్కించే టామ్ మీద విమర్శలు భారతదేశానికే పరిమితం కాలేదు.అమెరికాలో టామ్ మాతృ సంస్థ ఏసీ నీల్సెన్ కూడా ఎన్నో ఆరోపణలు ఎదుర్కోక తప్పలేదు. ఏసీ నీల్సెన్ గుత్తాధిపత్యానికి అక్కడి మరో సంస్థ టీ ఎన్ ఎస్ బ్రేక్ వేసింది. ఒక్కసారిగా ఏసీ నీల్సెన్ అరాచకాలు వెలుగు చూడటంతో ఎన్నో కోర్టుకేసులు ఎదుర్కోవలసి వచ్చింది.

అమెరికాలో మీడియా రేటింగ్స్ కౌన్సిల్ ఉంది.అది రేటింగ్స్ తీసే క్రమాన్ని పర్యవేక్షిస్తుంది. భారత్ లో మాత్రం అలాంతి వ్యవస్థ ఏదీ లేదు. ట్రాయ్ ఎప్పుడు ఏ విశయంలో జోక్యం చేసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఏయే అంశాలలో దాని పాత్ర ఉంటుందో ఇప్పటికీ ఎవరూ చెప్పలేరు. కార్యక్రమాలకు సంబంధించినంతవరకు తన ప్రమేయం ఎంతమాత్రమూ ఉండదని ట్రాయ్ చెబుతుంది. ఇది సాంకేతిక మైన అంశం కాదుగనుక పట్టించుకోనంటుంది. ఈ రేటింగ్స్ ఆధారంగానే కార్యక్రమాలు తయారవుతున్నాయి కాబట్టి సమాచార ప్రసారాల శాఖ పరిధిలోనివని మరో వాదన. ప్రకటనకర్తలు, యాడ్ ఏజెన్సీలు, చానల్స్ కలసి అంగీకరించి ఏర్పాటుచేసుకున్న ఈ వ్యవస్థ మీద అభ్యంతరాలుంటే వాళ్ళే సరి చేసుకోవాలని ట్రాయ్ సూచిస్తోంది.మరో వైపు సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ కూడా చేతులెత్తేసింది. ఒక దశలో అప్పటి సమాచార కార్యదర్శి అరోరా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ ” మియా బీవీ రాజీ హై తో క్యా కరేగా హాజీ ” అన్నారు. అంటే, ఇది కేవలం ప్రకటనదారులకూ, సంస్థలకూ, చానల్స్ కూ సంబంధించిన వ్యవహారంగానే ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

అయితే ప్రబుత్వం చెబుతున్నట్టుగా ఇది నిజంగా కేవలం మార్కెట్ కి సంబంధించిన సమస్యేనా ? రేటింగ్స్ ని ప్రజాదరణగా అర్థం చేసుకోవటమే తప్పన్న విషయాన్ని ప్రభుత్వమే పట్టించుకోకపోతే చౌకబారు కార్యక్రమాలతో ప్రేక్షకులు ఇబ్బంది పడాలా ? సెక్స్, క్రైమ్ లాంటి కార్యక్రమాలు ప్రసారమవుతున్నప్పుడు చాలామంది ఆసక్తితో చూడవచ్చు. ఆ తరువాత అలాంటి కార్యక్రమాలు మంచివి కావనే అభిప్రాయానికి రావచ్చు.అంతమాత్రాన ఆ కార్యక్రమాలకు ప్రజాదరణ ఉన్నట్టు భావించటం సమంజసం కాదు. చూస్తే తప్ప మంచో చెడో తెలియనప్పుడు తీరా చూశారు కాబట్టి మంచి కార్యక్రమమనే నిర్ధారణకు రావటం మీద విమర్శలొస్తున్నాయి. కేవలం రేటింగ్ వచ్చినంత మాత్రాన అది మంచి కార్యక్రమం అనుకోవటానికి వీల్లేదు. దురదృష్టవశాత్తూ అలా అనుకోవటం వల్లనే మిగిలిన చానల్స్ కూడా అటువంటి కార్యక్రమాన్నే ప్రసారం చెయ్యాలని తహతహలాడుతున్నాయి. కనీసం ప్రయోగాత్మకంగానైనా మంచి కార్యక్రమాలు అందించే ప్రయత్నం చేయటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే చానల్స్ కంటే ప్రకటనకర్తలే కాస్త బాధ్యతతో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. రేటింగ్స్ ఎక్కువ వస్తున్నప్పటికీ క్రైమ్ కార్యక్రమాలకు ప్రకటనలు ఇవ్వటానికి ముందుకు రావటం లేదు. ప్రకటనకర్తలకు సహాయ పడాల్సిన రేటింగ్స్ ఇప్పుడు కార్యక్రమాల రూపకల్పనకు మార్గదర్శనం చేస్తున్నాయి. ఆ మాట కొస్తే , యాడ్ ఏజెన్సీల కంటే చానల్స్ ఎక్కువగా రేటింగ్స్ ని వాడుకుంటున్నాయేమో అనిపిస్తుంది.

మరో సారి రేటింగ్స్ తీరు గమనిస్తే, గ్రామీణ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోవటం లేదని టామ్ స్వయంగా అంగీకరిస్తోంది. లక్షలోపు జనాభా ఉన్న ప్రదేశాలను పట్టించుకోదు. దీన్ని బట్టి చానల్స్ కూడా గ్రామీణప్రజలకు అవసరమయ్యే కార్యక్రమాల గురించి ఆలోచించటమే అనవసరమనే అభిప్రాయానికొచ్చాయి. అంతెందుకు.. చానల్స్ ఉపయోగించే భాష విషయంలోనూ అదే ధోరణి కనిపిస్తోంది. ఇంగ్లిష్ పదాలు అలవోకగా దొర్లిస్తూ పట్టణప్రాంత ప్రజలు ఉపయోగించే భాషనే చానల్స్ ఎంచుకోవటానికి కారణమూ రేటింగ్స్ లెక్కించే విధానమే. ఎంటర్‍టైన్‍మెంట్ చానల్స్ తమ కార్యక్రమాలలో ప్రేక్షకులకు భాగస్వామ్యం కల్పించాలనుకుంటే రేటింగ్స్ లెక్కించే పట్టణాలనే ఎంచుకుంటాయి. అక్కడి ప్రేక్షకుల దృష్టిలో పడాలన్న ఆశే అందుకు కారణం. న్యూస్ చానల్స్ అయితే రేటింగ్ పట్టణాల వార్తలౌ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం, అటువంటి “కీలక పట్టణాల” లో గట్టి రిపోర్టర్లను నియమించటం రహస్యమేమీ కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదా, లేదా? ఇది కేవలం చానల్స్,అడ్వర్టైజర్, యాడ్ ఏజెన్సీ సమస్య మాత్రమేనా ?

రేటింగ్స్ లెక్కించటమనేది ఒకే సంస్థ చేతిలో ఉండటం కూడా రేటింగ్స్ విశ్వసనీయతను ప్రశ్నార్ధకంగా మార్చింది. ఈ మధ్యనే ఎ మాప్ అనే సంస్థ వచ్చింది. ఇది టామ్ లాగా వారానికొకసారి కాకుండా ఏ రోజుకారోజు, ఇంకా కావాలంటే ఎప్పటికప్పుడు ఆన్‍లైన్ లో రేటింగ్స్ ఇస్తానంటోంది. అదే జరిగితే న్యూస్ చానల్స్ ప్రేక్షకులను రాబట్టుకోవటానికి ఎప్పటికప్పుడు ఎన్ని రకాల అవలక్షణాలు నేర్చుకుంటాయో ఊహకు అందదు. ఈ పరిస్థితుల్లో సాంకేతికత ఎక్కువగా ఉన్న రేటింగ్స్ ను పక్కన బెట్టి కార్యక్రమాల నాణ్యత మీద సర్వే జరిపించటం మంచిది. చానల్స్ కూడా పరోక్షంగా ఇదే కోరుకుంటున్నాయి. రేటింగ్స్ ను ప్రభుత్వం నియంత్రించ లేకపోతే ఎక్కువ నష్టపోయేది ప్రజలే. సమాచార శాఖామంత్రి చెబుతున్న రేటింగ్స్ కమిషన్ నిజంగా ఏర్పాటై రేటింగ్స్ లో లొసుగులు తొలగించి కార్యక్రమాల నాణ్యతకు రేటింగ్ ఇస్తే ప్రేక్షకులు సంతోషిస్తారు.
Source :- http://bhavanarayana.co.tv లోనిది