ం.శ్.ంఎదీహౌసె ఈందీ ఫ్వ్త్ ళ్త్ద్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి కేంద్రంగా అతి త్వరలో ప్రారంభం కానున్న తెలుగు మీడియా 24న్యూస్ ఛానల్ లోగోను పలువురు పాత్రికేయ దిగ్గజాల సమక్షంలో, వారి ఆశీర్వాదంతో సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్ శ్రీ షేక్ ఖాజా మొహియిద్దీన్ ఆవిష్కరించారు. అమరావతి కేంద్రంగా ప్రారంభంకానున్న మీడియా 24 తొలి తెలుగు న్యూస్ ఛానల్ ను ఆహ్వానితులైన పెద్దలంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఛానల్ విజయవంతం కావాలని మనసారా దీవించారు.
అమరావతితో పాటు హైదరాబాద్ కేంద్రంగా మరో న్యూస్ ఛానల్ కూడా ప్రారంభించనున్నట్టు ఛైర్మన్ షేక్ ఖాజా మొహియిద్దీన్ ఈ సందర్భంగా ప్రకటించారు. గత ఆరు నెలల పైగా గ్రౌండ్ వర్క్ చేస్తున్న పాత్రికేయ బృందానికి ఎడిటోరియల్ డైరెక్టర్ నేమాని భాస్కర్ నేతృత్వం వహిస్తున్నారు. యువతకు ఈ టివి ఛానల్ లో ఎక్కువ అవకాశం కల్పించానున్నరు
మీడియా 24 న్యూస్ ఛానల్ లోగో ఆవిష్కరణతో పాటు శిక్షణాతరగతుల ప్రారంభోత్సవం కూడా లబ్దప్రతిష్టులైన జర్నలిస్టుల సమక్షంలో జరిగింది. సంపాదక ప్రముఖులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు, ఇతర అనుభవజ్ఞులైన పాత్రికేయ ప్రముఖులు శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, శ్రీ తెలకపల్లి రవి గారు, శ్రీ భండారు శ్రీనివాస రావు గారు, శ్రీ శైలేష్ రెడ్డి గారు, శ్రీ మంగు రాజగోపాల్ గారు, శ్రీ దిలీప్ రెడ్డి గారు, శ్రీ ఎన్.వంశీ శ్రీనివాస్ గారు, సీనియర్ న్యూస్ ప్రెజెంటర్ స్వప్న గారు హాజరై ప్రసంగ సందేశాలిచ్చారు.
source :- FB Telugu Media News Community