జవహర్‌లాల్ హౌసింగ్ సొసైటి జర్నలిస్టులకు నెంబర్‌లు ఇవ్వడంలో కొంత గ్యాంబ్లింగ్ జరిగిందని తెలంగాణ లబ్దిదారులు వాపోతున్నరు. ఎక్స్‌పీరియన్స్ బేస్డ్‌గా పాయింట్లు ఇచ్చినమని చెప్పుతున్న సొసైటీ లీడర్లు సీమాంధ్ర జర్నలిస్టుల విషయంలో పక్షపాతంగా వ్యవహరించి ముందు నెంబర్‌లు వచ్చేలా చూసిన్రని తెలంగాణ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. 1100 మంది లబ్ధిదారుల్లో 800 మంది సీమాంధ్రులు, 300 మంది తెలంగాణవాళ్లుండగా కొంతమందికి మాత్రమే ముందు నెంబర్లు వచ్చినయి. మిగతావారందరికీ 750 తర్వాత వచ్చినయి. పాయింట్లు గీయింట్లు జాన్తా నై. 300 మంది తెలంగాణ జర్నలిస్టులకు స్థలాలు కేటాయించినంకనే సీమాంధ్ర జర్నలిస్టులు స్థలాలు తీసుకోవాలని పోరుతెలంగాణ డిమాండ్ చేస్తుంది.
No comments:
Post a Comment