BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Tuesday, October 28, 2014

నిజంగ తెలంగాణా గుండె చప్పుడు 6టివి..అద్బుతమైన చానల్ కాదనేదెవ్వరు..?..(సంగప్పగారి కామెంట్ తో మీకోసం )

Source :- http://www.telugumediastudent.com

ఆ చానల్  CEO  గురించి రాసినదంతా కరెక్ట్ ...అందుకే కొత్త ప్రోగ్రాం లతో ముందుకు దూచుకెలుతుంది..కొందరు ఆ చానల్ ఇమేజ్ డామేజ్ చేయలని చూస్తున్నవారికి సంగప్పగారు సరైన సమాదానం చెప్పారు ఆ  కామెంట్స్ కూడా మీకోసం ఇక్కడ పెడుతున్నాం.. ఎందుకంటే కొన్ని అపోహలు సృష్టించి ఎదో చేయాలను చూస్తున్నవారికి తెలియాలి కాదు కాదు తెల్సుకోవాలి అన్నదే  మా ఉద్దేస్యం  ఒక మీడియాలో పనిచేసే వారిగా  మేమెందుకు  అక్కడ పనిచేయలేక పోయామే  అన్నుకున్న సందర్బాలు లేకపోలేదు  ..Keep Roking sir ,,, 


తెలుగులో న్యూస్‌ ఛాన‌ళ్ల ప‌రిస్థితి మీడియా జ‌నాల‌కు తెలిసిందే. ఎప్పుడు ఎక్కడ ఎవ‌రి ఉద్యోగం పీకేస్తారో ఎవ‌రికీ తెలియ‌దు. అది నంబ‌ర్ వ‌న్ నుంచి మొద‌లు ఏ ఛాన‌ల్ మిన‌హాయింపు కాదు. కానీ ఒక్కటంటే ఒక్క చోట మాత్రం పీకేయడాలు లేవ్… ఓన్లీ పెట్టుకోవ‌డాలే… అదే వీ6. మ‌హామ‌హులు ఛాన‌ళ్లను న‌డిపిస్తున్నారు. ఎంతో ప్రభ ఉన్న 9 ర‌వి కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితిలో ఉన్నాడు. అలాంటి ప‌రిస్థితుల్లో కూడా 6 ర‌వి దూసుకెళ్తున్నాడు. అందుకే వీడొక్కడే అనే టైటిల్ వాడాం.
నిజంగా ఆలోచిస్తే… ఇన్ని ఛానెళ్ల మధ్య ఒకే ఒక్కడు… సైలెంట్‌గా అందరికీ గట్టి పోటీనిస్తున్నాడు. పెద్దగా హంగులు, ఆర్భాటాలు లేకుండా తెరంగేట్రం చేశాడు. ఐ న్యూస్‌లో ప‌ర్వాలేద‌నిపించాడు. కానీ  ఆ ఒక్కడే ఛానెల్ పెట్టేస‌రికి సీన్ మారిపోవ‌డం స్టార్టైంది. వి6కి సిఈఓగా ఉన్నా పెద్దగా బ‌య‌ట మాత్రం క‌నిపించ‌డు. తెలంగాణ కల్చర్ కు కేరాఫ్ అడ్రస్గా ఛాన‌ల్‌ని మార్చేశాడు. అలా స్టాండ్ తీసుకున్న ఛాన‌ళ్లు మూసుకుంటున్న టైమ్‌లో కూడా  మేనేజ్ మెంట్ పై భారాన్ని క్రమంగా త‌గ్గించి, సొంత కాళ్ల పై ఛాన‌ల్ నిల‌బ‌డేలా చేయ‌డంలో స‌ఫ‌ల‌మౌతున్నాడు.
బ‌య‌ట ఛాన‌ళ్లు జీతాల కోత‌లంటూ వాత‌లు పెడుతున్న టైమ్‌లో వీ6లో అలాంటి ఛాయ‌లెక్కడా క‌నిపించ‌లేదు.  ముఖ్యంగా ఉద్యోగుల‌ను ర‌క్షించుకుంటున్నాడ‌నే మాట వినిపిస్తోంది. రవికి ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లో మంచి అనుభ‌వం ఉంది. కానీ ఎంత ప్రావీణ్యత ఉంది అన్నది ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతోంది. డిస్కషన్లు ఎలా చేశారు?  ఏం చేశారు అనే దాని కంటే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఛాన‌ల్‌లో ఏం వేయాలి? ఏం న‌డిపితే రేటింగ్ వ‌స్తుంది? ఏం ఇస్తే రెవెన్యూ జ‌న‌రేట్ అవుతుంది అనే క్లారిటీ ర‌వికి ఉంద‌నిపిస్తుంది. ఇండ‌స్ట్రీలో రేటింగ్ ఛార్ట్‌లో ఎక్కడో ఉన్న వీ6ని నెమ్మదిగా పైపైకి తీసుకొస్తున్న విధాన‌మే ఇందుకు నిద‌ర్శనం.
మ‌రో ప్ర‌యోగం….
ప్రయోగాలు వీ6లో ర‌వికి కొత్త కాదు. తీన్మార్ వార్తలు ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఆ ప్రోగ్రామ్ ఛాన‌ల్‌కు ఎంత పేరు తీసుకొచ్చిందో అంద‌రికీ తెలిసిందే. మొద‌ట రాములమ్మ… ఆ త‌ర్వాత ల‌చ్చవ్వ… ఆ త‌ర్వాత మంగ్లీ… ఇలా కొత్త కొత్త క్యారెక్టర్లు తెర‌పై ప‌రిచ‌య‌మ‌య్యాయి. స‌క్సెస్ సాధించాయి. అయితే ఇప్పుడు హైద‌రాబాద్ మార్కెట్ వ్యూయ‌ర్స్‌ని టార్గెట్ చేస్తూ మ‌రో కొత్త ప్రోగ్రాంకి ప్లాన్ చేస్తున్నార‌ట ర‌వి. ఇందుకోసం రెడ్ ఎఫ్ఎంలో సౌండ్ చేసే ప్రతీక‌ను ఎంచుకున్నార‌ట‌.
ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించిన ప్రోమో కూడా ఇప్పటికే యూట్యూబ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. రేడియో జాకీ ప్రతీక‌తో స‌రికొత్త త‌ర‌హా ప్రయోగంతో ఈ కార్యక్రమం ఉంటుంద‌ని టాక్‌. ప్రతీక హైద‌రాబాదీ తెలుగు లాంగ్వేజ్ బాగా మాట్లాడుతుంది. దాన్ని క్యాష్ చేసుకుంటూ ఈ ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రో వారంలో తెర‌మీద‌కు ప్రతీక బాణంగా దూసుకొస్తుంద‌ని టాక్. ప్రతికా షో పక్కా హైదరాబాది కోసం ప్రతీక‌కు మంచి ప్రీమియం శాల‌రీ పే చేసి మ‌రి తెస్తున్నార‌ట‌. అన్ని చోట్ల తీసివేత‌లు, కోత‌ల వెత‌లుంటే… ఇక్కడ చేరివేత‌తో పాటు భారీ వేత‌నాలు కూడా ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం.
ఇదే కాదు త‌న టీమ్‌ని ఇంకా విస్తృత ప‌ర‌చాల‌ని కూడా ర‌వి భావిస్తున్నార‌ట‌. ఇక ర‌వి ఫార్ములా కూడా ఒక‌టే అని చెప్పుకుంటున్నారు. అదేంటంటే… విష‌యం పాత‌దే అయినా కొత్తగా చెప్తే ఛాలు… అదే క్లిక్ అవుతుంద‌న్నది ఆయ‌న సూత్రం. ఫార్ములా ఏదైనా ఫార్ములా వ‌న్ రేసులో ఎవ‌రు ముందున్నార‌న్నదే ఇంపార్టెంట్‌. ఆ రేసులో ఇప్పుడిప్పుడే ర‌వి త‌న మైకును ముందుముందుకి చొప్పిస్తున్నాడు. లోగో నీడ‌లో ప‌దిమందికి ప‌ని క‌ల్పిస్తున్నాడు.
యాజ‌మాన్యం కూడా అంకం బాబుతో హ్యాపీయేన‌ట‌. ఇంత‌క‌న్నా ఏం కావాలి. ప్రారంభించిన మూడేళ్లలోనే మంచి పొజిష‌న్‌కి రావ‌డ‌మే కాదు… టీ లైన్ తీసుకుని మ‌రీ టోట‌ల్ రెండు స్టేట్స్‌లో స‌త్తా చాటుతున్నారు. కొస‌మెరుపు ఏంటంటే… మా తెలంగాణ సీఈఓల‌కు కూడా అద్భుతంగా న‌డిపే స‌త్తా ఉంద‌ని చూపాడు ర‌వి అని అనుకుంటున్నారు..

ఆ చానల్ గురించి అన్నీ క్లారిటీస్ తో సంగప్ప గారి కామెట్ కూడా మా తెలుగు మీడియా న్యూస్ చదివేవారికోసం 

RAKESH అనే పేరుతో తెలిసీ,తెలియకనో, కావాలనో V6 News పైనా, అంకం రవి గారిపైనా అభాండాలేసే ప్రయత్నం చేస్తున్నారు.  పెద్ద అభాండం వేసినావు. ముఖ్యంగా నా పేరును కూడా ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఈ వెబసైట్ పాఠకులకు వాస్తవం చెప్పాలని ఈ పోస్టు పెడుతున్నాను. ఇదె మొదటిది… చివరిది కూడా….
 తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్నటైంలో కొన్ని ఛానల్స్ నాలాంటి తెలంగాణ ఫిగర్ ఛానల్ పేస్ గా ఉంటుందని భావించాయి. నన్ను రమ్మని రకరకాల ఆఫర్స్ ఇచ్చినయి. అయినా వీసిక్స్ అనేది నాకు సొంత ఇంటిలాంటిది. కాబట్టి నేను రానని చెప్పేసినా. వాళ్లు ఓకే అన్నారు. కాని ఛానల్ ఇమేజ్ దెబ్బతీయాలనుకున్నా వాళ్లో, లేక నన్నే బద్ నాం చేయాలనుకున్న వాళ్లో … నేను ఛానల్ మారుతున్నట్లు ప్రచారం చేశారు. వాటిని నేను కాని, సీఈఓ సర్ కాని పట్టించుకోలేదు.
    ఇక కత్తి కార్తీక అంశం… ఆమె ఏమి అంతకు ముందు పేరున్న యాంకర్ కాదు… సెలబ్రిటీ కాదు వీసిక్స్ ను ప్రపంచానికి పరిచయం చేయడానికి. కేవలం సీఈఓ రవిగారె ఒక మార్కెటింగ్ గర్ల్ ను పెద్ద యాంకర్ గా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. ఒక్కసారి సక్సెస్ చూడగానే తనకు తానుగా ఆ యాంకర్ కళ్లు నెత్తికెక్కి తనకు మొత్తం సౌత్ ఇండియాలోనే ఏ యాంకర్ కు లేనంత శాలరీ ఇవ్వాలని డిమాండ్ పెట్టింది. అతి తక్కువ బడ్జెట్ ప్లాన్ తో నడుస్తున్న తమకు సాధ్యం కాదని మేనేజ్ మెంట్ చెప్పడంతో ఆవిడె వెళ్లిపోయింది.
    ఇక శ్రవణ్, రామలమ్మ ఇద్దరినీ వీసిక్స్ పంపించలేదు. వాళ్లకు వాళ్లె ఈ ఛానల్ లో ఉన్న కుటుంబ వాతావరణంలో తమ మాడ్రన్ ఆట్యీట్యూడ్ తో ఇమడలేమని వెళ్లిపోయారు. శ్రవణ్ తీన్మార్ క్రియేటర్ అనేది శుద్ధ తప్పు. ఆయనకు అంతకు ముందు ఎలక్ట్రానికి మీడియాతో సంబంధమే లేదు. వాయస్ ఓవర్ అంటే ఏంటో, ప్రొగ్రామ్స్ అంటే ఏంటో కూడా తెలియదు. కేవలం ట్యూషన్లు చెప్పుకునే ఒక యువకుడిని తీసుకొచ్చి ఆయనకు స్క్రిప్ట్ ఫార్మాట్ చెప్పి ప్ర్రాక్టీస్ చేయించి రాయించింది సీఈఓ సారే. అలాంటిది తనకు మొత్తం వచ్చేసిందంటూ నీడనిచ్చిన చెట్టును వదిలేసిండు. ముందుగా శ్రవణ్ మానేసిండు… ఆ తర్వాత కొన్నాళ్లకు రమ్య(రాములమ్మ) వెళ్లిపోయింది… అంతే. సీఈఓ గారు ఆమెను ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదు.�
    ఇక తీన్మార్ వాయిస్ ఓవర్, స్క్రిప్ట్ రైటర్ లను టీవీ 9 ఎక్కువగా ఊహించి చాలా ఎక్కువ శాలరీ ఇచ్చి తీసుకుపోయింది. ఇక్కడ ప్రతి అక్షరం, ప్రతి సెకన్ రవి గారు చూశాక తీన్మార్ బులెటిన్ ఫైనల్ అవుతుంది. టీవీ9 కు వెళ్లాక మిడిమిడి జ్ఞానంతో వాళ్లు చేసి పొరపాటు వల్ల ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇక మా ఇన్ పుట్ ఎడీటర్ క్రాంతి అన్న తనకు ఇష్టం లేకపోయినా ఒక ఛానల్ కు హెడ్ అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకోకూడదనే పోయిండు.�
    మా దగ్గర పనిచేసే ఏ యాంకర్ అయినా సొంత ఇంట్లో ఉన్నట్లు ఫీలవుతారు. కాని ఇక్కడి ఇమేజ్ ను చూసి వేరే వాళ్లు ఆశ చూపే ఎక్కువ శాలరీకి ఆశపడి కొందరు పోతే పోయిండొచ్చు. ఒక విషయం ఆలోచించు… తీన్మార్ మల్లన్న ఎందుకు ఎక్కడికి పోలేదు. ఆయనకు రాష్ట్రంలోని టాప్ రాజకీయ పార్టీలు, టాప్ ఛానల్ గా విర్రవీగేవాళ్లంతా మూడు రెట్లు, నాలుగు రెట్లు శాలరీ, ప్రత్యేక ప్యాకేజీలు ఆఫర్ చేసినయ్ అయినా ఆయన పోలేదంటే ఇక్కడ ఎంత కంఫర్ట్ గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఒక ఛానల్ లో స్రోలింగ్ లో పనిచేసే నవీన్ ను ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గర్వించే సెలబ్రిటీని తయారు చేసిందెవరు. ఒన్ అండ్ ఓన్లీ సీఈఓ రవి సారే. ఆ పాత్ర, ఆ ప్రొగ్రామ్ అంతా రవి గారి ఆలోచననుంచి పుట్టినవే.
   ఇదంతా … స్వచ్ఛమైన ఆలోచనలతో ఛానల్ ను నడుపుతూ మీడియా రంగానికే ఆదర్శంగా నిలుస్తున్న రవి సార్ గురించి ఇప్పు తెలంగాణ లోని ప్రతి పల్లెకు తెలుసు. ఇక నుంచి ఎవరైనా బురద జల్లె ప్రయత్నం చేస్తే… జాగ్రత్త… ఈ రోజుల్లో అమెజాన్ అడవుల్లో కూర్చున్నా… IP Address తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. తెలంగాణ సమాజానికి చేతనైనంత చేద్దామని వెళ్తున్నం. మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి… మీ పొగడ్తలు అవసరం లేదు. �