హెచ్.ఎం.టీవీ చీఫ్ ఎడిటర్ కె. రామచంద్రమూర్తి గారి సారథ్యంలో, సంచలనాత్మక ఎడిటర్ నాయర్ గారి సంపాదకత్వంలో ఆంగ్ల దినపత్రిక "ది హన్స్ ఇండియా" ఈ నెల 15 న మార్కెట్ లోకి విడుదల కాబోతున్నది. ముందుగా ప్లాన్ చేసిన ప్రకారమైతే...అవినీతిపై సమరం చేస్తున్న అన్నా హజారే ఈ పత్రికను ప్రారంభించాల్సి ఉంది. ఆయన హైదరాబాద్ పర్యటన ఖరారైందీ లేనిదీ తెలియరాలేదు.
ఇప్పటికే ఈ పత్రిక డమ్మీలు తేవడం ఆరంభించింది. మిగిలిన ఆంగ్ల దినపత్రికలకు భిన్నంగా, వినూత్నంగా, ఆకర్షణీయంగా తేవడానికి నాయర్ గారి బృందం కష్టపడి పనిచేస్తున్నది. వీరికి హెచ్.ఎం.టీవీ సీనియర్లు కూడా సహకరిస్తున్నారు. "ది హన్స్ ఇండియా" కోసమని నాయర్ గారు ఏరికోరి తెచ్చుకున్న సీనియర్ జర్నలిస్టు, "ది హిందూ" లో పనిచేసి మానేసిన సాయ శేఖర్ ఒక వారం కిందట సిటీ ఎడిటర్ పదవిని వదిలి త్వరలో రాబోయే మధ్యాహ్న ఆంగ్ల పత్రిక "నూన్ పోస్ట్" లో అసోసియేట్ ఎడిటర్ గా చేరారు. భారీ స్థాయిలో రాబోతున్న "నూన్ పోస్ట్" ను ఈ నెల 14 న ఆరంభిస్తారని చెబుతున్నారు. గతంలో డీ.ఎన్.ఏ. పత్రికలో బెంగళూరు లో పనిచేసిన ఒకరు దీనికి సంపాకుడిగా వ్యవహరిస్తున్నారు.
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
-
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది.
ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా
లుంగికట్టుకు...
6 years ago