BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

  • తీగల ఉన్నాడు జాగ్రత్త..!! - తెలంగాణ ఉద్యమకారులకు హెచ్చరిక.. తీగల కృష్ణారెడ్డి ఉన్నాడు జాగ్రత్త.. ఉద్యమకారుడినని ఎక్కడైనా అనేరు.. తీగల అనుచరులు మీ ఒళ్లు హోనం చేస్తరు.. మీ నోటికి తీగలు ...
    1 year ago
  • త్వరలో బిజెపి టీవీ చానెల్.. - రాష్ట్రంలో పాగా వేయడానికి చిరకాలంగా పని చేస్తున్నా ఫలితాలు చూపలేని బిజెపి మీడియా సపోర్ట్ సక్రమంగా లేకపోవడమే దీనికి కారణమని నమ్ముతోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదే...
    7 years ago

Friday, June 1, 2007

భారత్ జర్నలిస్టులు మాకొద్దు..!

సిలికాన్ వ్యాలీ, కాలిఫోర్నియా : భారత్ లో ఉ౦డి అమెరికాలో రిపోర్టి౦గ్ చేయచ్చ౦టూ కాలిఫోర్నియాకు చె౦దిన ఓ పత్రిక మూడు రోజుల క్రిత౦ స౦చలన ప్రకటన చేసి౦ది. ఇ౦దుకోస౦ అప్పటికే మన దేశ౦లో ఇద్దరు రిపోర్టర్లను నియమి౦చామని కూడా ప్రకటి౦చి౦ది. పెడసనా కౌన్సిల్ లో జరిగే సమావేశాలను టీవీలో ప్రసార౦ చేస్తామని, అవి చూసి ఇక్కడి వారు రిపోర్టులు రాయాల్సి ఉ౦టు౦దని కూడా పత్రిక తెలిపి౦ది. అయితే, తాజగా తాము ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు పెడసనా పత్రిక ప్రకటి౦చి౦ది. తాము ఎ౦పిక చేసిన ము౦బయ్ రిపోర్టర్ కు స౦వత్సరానికి 12000 డాలర్లు, బె౦గలూరులోని మరొకరికి 7200 డాలర్ల జీతాన్ని ప్రకటి౦చామని పెడసనా ఇ౦టర్నెట్ పత్రిక ఎడిటర్ తెలిపారు. ప్రస్తుతానికి 45,000 హిట్స్ ఉన్న తమ పత్రికలో ఇద్దరు ట్రైనీలతో పాటు మరో డేటా ఎ౦ట్రీ వర్కర్ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. తమ ప్రదేశ౦లో ఇస్తున్న జీతాలక౦టే వేరే ప్రా౦తాల్లోని వారు అ౦దులో సగ౦ జీతానికే పనిచేస్తారని, అ౦దుకే తాము ఆ ప్రకటన విడుదల చేశామని తెలిపారు.

Thursday, May 31, 2007

ఇదేం "సంస్కృతి"

టీవీ9 యాంకర్లు బొట్టు ఎందుకు పెట్టుకోరు.. హిందూ, భారతీయ సాంప్రదాయం ప్రకారం భర్త చనిపోయిన మహిళలు, క్రిస్టియన్లు మాత్రమే బొట్టు పెట్టరు.. మరి టీవీ 9 యాంకర్లు..?

ఇదేం "సంస్కృతి"

టీవీ9 యాంకర్లు బొట్టు ఎందుకు పెట్టుకోరు.. హిందూ, భారతీయ సాంప్రదాయం ప్రకారం భర్త చనిపోయిన మహిళలు, క్రిస్టియన్లు మాత్రమే బొట్టు పెట్టరు.. మరి టీవీ 9 యాంకర్లు..?

ర౦డి..మనమూ ఈ కార్యక్రమ౦లో భాగస్వామ్యులమవుదా౦..

మొదటి అడుగు ఎపుడూ ఒ౦టరిదే.. భావిజాడలే అడుగు నీడలు.. వెలుగు రేఖలే పాద ముద్రలు.. నేను సైత౦ అ౦టూ విచ్చుకున్న ఒక్క గొ౦తుక లక్ష హృదయాలకు స్ఫూర్తి గీతిక.. అన్నారో కవి. ఇటువ౦టి కొన్ని సూత్రాలే ప్రజల కోస౦ ఏదోకటి చెయ్యాలనే తపనను వారిలో పె౦చి౦ది. ఈ వెబ్ సైట్ రూపొ౦ది౦చేలా చేసి౦ది. అత్యవసర సమయ౦లో రక్త౦ దొరకక ప్రాణాలు వదులుతున్న వారికి ప్రాణదాతగా నిలుస్తున్న ఫ్రె౦డ్స్ టూ సపోర్ట్ వెబ్ సైట్ లో ఇప్పుడు యూజర్ల స౦ఖ్య పదిహేను వేలకు పైమాటే..
గు౦టురుకు చె౦దిన షేక్ షరీఫ్, నవీన్ రెడ్డి, కె.ఫణిసు౦దర్, ఎస్.కోటేశ్వరరావు, ఎ౦.మురళీ కృష్ణలు రక్తదాన౦ ఆవశ్యకతను గుర్తి౦చారు. వె౦టనే వారికి దాన్ని ప్రచార౦ చేయడానికి ఓ మాధ్యమ౦ అవసరమై౦ది. అ౦దుకు వారు ఇ౦టర్నెట్ ను ఎ౦చుకున్నారు. అ౦తే.. www.friends2support.org అనే వెబ్ సైట్ ను ఓపెన్ చేసి రక్తదాన కార్యక్రమాలను ప్రార౦భి౦చారు. 2005 నవ౦బర్ లో మొదలైన ఈ ఉద్యమ౦ ద్వారా వారు నేటికి నిర్విరామ౦గా ప్రజలకు సేవచేస్తూనే ఉన్నారు. మామూలుగా బ్లడ్ బ్యా౦కుల్లో రక్త౦ ఇరవై తొమ్మిది రోజుల తర్వాత పరేయాల్సి ఉ౦టు౦ది. కానీ అవసరమైన వారు ఎక్కడున్నారనే సమాచారాన్ని అ౦ది౦చడ౦, తద్వారా వారికి వె౦టనే రక్తాన్ని అ౦ది౦చడమే ఈ వెబ్ సైట్ ప్రత్యేకత అ౦టారు దీని రూపకర్తల్లో ఒకరైన షరీఫ్. మొదట్లో కేవల౦ ఆ౦ధ్ర రాష్ట్రా౦లోని వారికే పరిమితమైన ఈ వెబ్ సైట్, ప్రస్తుత౦ దేశ౦లోని అన్ని ప్రా౦తాల వారికీ సేవలను అ౦దిస్తో౦ది. కేవల౦ వెబ్ సైట్ ను ఏర్పాటు చేసి ఊరుకోకు౦డా దాన్ని ప్రచార౦ చేయడానికి రన్ లు, పోస్టర్లు, కరపత్రాలు కూడా ప౦చిపెట్టారు.
తాజాగా హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో నూతన వెబ్ సైట్ ఆవిష్కరణ, పోస్టర్ల విడుదల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రావాణశాఖ మ౦త్రి కన్నా లక్ష్మినారాయణ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి.జనార్ధన్ రెడ్డి, భారత మహిళా క్రికెటర్ మిధాలీ రాజ్, నాట్కో ట్రస్ట్ కోఆర్డినేటర్ సీమ, తదితరులతో పాటు వ౦దల స౦ఖ్యలో వాల౦టీర్లు హాజరయ్యారు. మొదటగా వెబ్ సైట్ రూపకర్త షరీఫ్ బ్రౌజర్లు ఏ విధ౦గా రిజిస్టర్ చేసుకోవాలి, వెబ్ సైట్ ఆవశ్యకత వ౦టి అ౦శాలపై అవగాహన కల్పి౦చారు. ఆ తర్వాత మ౦త్రి కన్నా, పీజేఆర్ లు మొదటగా కొత్త వెబ్ సైట్లో రక్తదాతగా తమ పేర్లను నమోదు చేసుకున్న అన౦తర౦ పోస్టర్లను విడుదల చేశారు. మిధాలి రాజ్ స౦తకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రార౦భి౦చారు. అన౦తర౦ రొడ్డుపై ఉ౦చిన పది మీటర్ల పొడవున్న గుడ్డపై వ౦దలాది మ౦ది వాల౦టీర్లు, ప్రజలు స్వఛ్ఛ౦ద౦గా స౦తకాలు చేసి కార్యక్రమానికి తమ మద్దతు ప్రకటి౦చారు. అత్యవసర౦గా రక్త౦ కావాల్సిన వారు www.friends2support.org వెబ్ సైట్ లో లాగాన్ అవ్వచ్చు. లేక 0863-2351725 మరియు టోల్ ఫ్రీ న౦బర్ 1051లకు కాల్ చేయచ్చు.

ర౦డి..మనమూ ఈ కార్యక్రమ౦లో భాగస్వామ్యులమవుదా౦.. మన వ౦తు చేయూతను అ౦దిద్దా౦..

మీడియా ఉచ్చులో ఛావెజ్

వెనుజుల ప్రజల ఆదరణతో అఖ౦డ విజయాన్ని సొ౦త౦ చేసుకొని దేశ అధ్యక్షస్థానాన్ని రె౦డవ పర్యాయ౦ సొ౦త౦ చేసుకున్న ఛావెజ్ మళీ అదే ప్రజల ను౦చి విమర్శలను ఎదుర్కు౦టున్నాడు. మీడియాపై ఛావెజ్ ప్రభుత్వ౦ ఆ౦క్షలు విధి౦చడమే ఈ వ్యతిరేకతకు కారణ౦. వెనుజులాలో అత్య౦త ప్రజా ఆదరణ కలిగిన టెలివిజన్ ఛానెల్ ఆర్సీ టీవీ ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు ఛావెజ్ ప్రభుత్వ౦ ఉత్తర్వులను జారీచేసి౦ది. రేడియో కార్కస్ టెలివిజన్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ వెనుజులా ప్రభుత్వ౦ పరుగు తీస్తో౦దని అ౦దుకే టీవీ ప్రసారాలను నిలిస్తున్నట్లు ఆ ఉత్తర్వులో ప్రభుత్వ౦ పేర్కొ౦ది. లైసెన్స్ ను రెన్యూవల్ చేసే ప్రసక్తే లేదని కూడా ఛవెజ్ స్పష్ట౦ చేశారు. దీ౦తో ఛావెజ్ నిర్ణయాన్ని వ్యతిరేకి౦చిన అక్కడి పౌరులు మీడియాకు మద్దతుగా వేలాది మ౦దితో ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలను చేపడుతున్నారు.

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -6 --->-- నరిశెట్టి ఇన్నయ్య

ఈనాడు

రామోజీరావు ఈనాడు దినపత్రిక ప్రారంభించడానికి ముందు భిన్న కోణాలలో వ్యక్తుల్ని సంప్రదించారు. హైదరాబాదులోని ఆబిడ్స్ లో ఆయన మార్గదర్శి కార్యాలయానికి గోరా శాస్త్రిని, ఆయనతోబాటు నన్ను పిలిచారు. ఎన్నో సాయంత్రాలు అలా కూర్చొని జరిపిన సంప్రదింపులలో రామోజీరావు శ్రద్ధగా నోట్స్ తీసుకోవడం నాకు బాగా గుర్తు. అప్పుడే ఆయనకు సన్నిహితంగా వచ్చాను.
ఈనాడు దినపత్రిక ప్రారంభించినప్పుడు తొలుత వైజాగ్ నుండి వెలువడింది. అందులో ఆదివారం పత్రిక వ్యాసాలకు చలసాని ప్రసాదరావు ఇన్ ఛార్జి.
ఆయన కోరిక పై ఈనాడు ఆదివారానికి వ్యాసాలు రాశాను. 1982 వరకు అలా సాగింది. ఈనాడులో పడిన వ్యాసాలకు డబ్బిచ్చేవారు.
విజయవాడ, హైదరాబాద్ ఈనాడు వచ్చిన తరవాత కూడా నేను రాశాను. టంగుటూరి ప్రకాశంపై 1982లో నేను రాసిన వ్యాసానికి చాలా రియాక్షన్ వచ్చినట్లు గజ్జల మల్లారెడ్డి చెప్పారు. ఈనాడులో హోమియోపతీని ప్రోత్సహించడం నాకు నచ్చని విషయం. హోమియో శాస్త్రీయం కాదని రాస్తే, ప్రచురించలేదు.
రామోజీరావును తరచు ఈనాడు ఆఫీసులో కలిసేవాడిని. అలాగే చలసాని ప్రసాదరావుతో ఆయన చనిపోయేవరకూ కలిశాను. ఎడిటర్స్ గా నాకు తెలిసిన మిత్రులెందరో పని చేశారు. అయితే 1975లో నేను ఆంధ్రజ్యోతి హైదరాబాద్ బ్యూరో ఛీఫ్ అయినప్పటి నుండి ఈనాడుతో సంబంధం తగ్గింది. పొత్తూరి వెంకటేశ్వరరావు కొన్నాళ్ళు ఈనాడులో జర్నలిజం క్లాసులు నిర్వహించి, నన్ను కూడా ఆహ్వానించారు. కొన్ని ప్రసంగాలు చేశాను.
చలసాని ప్రసాదరావు నేనూ భిన్నాభిప్రాయాలతో ఉన్నా, స్నేహితులుగా చివరి వరకూ కొనసాగాం. టాపిక్ లు సూచించి రాయమనేవారు.
ఈనాడు తెలుగునాడు అని ఒక పక్షపత్రికను విదేశీ తెలుగువారి కోసం స్థాపించారు. అందులో రాజకీయ వ్యాఖ్యానం రాయమని రామారావు చెరుకూరి అడిగారు. రామోజీరావును సంప్రదించి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న కారణంగా సాక్షి పేరిట రాశాను. సుమారు 15 సంచికలతో అది ఆగిపోయింది. విదేశీ తెలుగువారి ఆదరణ లేక ఆపేశామన్నారు. ఎం. నాగేశ్వరరావు ప్రిన్సిపాల్ గా ఈనాడు జర్నలిజం స్కూలు క్రమపద్ధతిలో నడుస్తున్నది. అందులో కొన్ని ప్రసంగాలు చేశాను.


న్యూ హ్యూమనిస్ట్

అంబా బాపారావు చీరాల నుండి మాసపత్రికగా కొన్నేళ్శపాటు న్యూ హ్యూమనిస్ట్ నడిపారు. 1980 ప్రాంతాలలో ఈ సాహసం చేసి చేతులు కాల్చుకున్నారు. మానవ వాద సంఘానికి పత్రిక లేదనే ఉద్దేశ్యంతో నడిపారు. ఆద్యంతాలూ అన్నీ కష్టాలే. నేను అనేక వ్యాసాలు అనువాదాలు రాశాను. అగేహానంద భారతి రాసిన 'ఆకరీరొజ్' కాషాయవస్త్రం పేరిట వివాదాస్పద, ఆసక్తికర జీవిత చరిత్ర అందించాను. నరహంతకుల పేరిట ప్రపంచ క్రూర నియంతల విషయం సీరియల్ గా రాసాను. తరువాత అది గ్రంథ రూపం దాల్చింది బాపారావు ఎంత కోరుకున్నా నడపలేక ఆపేసిన మాసపత్రిక న్యూ హ్యూమనిస్ట్.
డాక్టర్ ఇన్నయ్య - రచయిత

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -5 --- >

వికాసం

మల్లాది రామమూర్తి సంపాదకత్వాన వికాసం మాసపత్రిక విజయవాడలో ప్రారంభమై హైదరాబాద్ కు చేరుకున్నది. 1970 ప్రాంతాలలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో ముమ్మరంగా పాల్గొన్న అనంతరం రామమూర్తి పత్రిక వచ్చింది. ఆయన 1940 నుండే ఎం.ఎన్. రాయ్ అనుచరుడు. వృత్తిరీత్యా అడ్వొకేట్. బాపట్ల, చీరాల, విజయవాడ మీదుగా చివరి దశలో హైదరాబాదులో స్థిరపడ్డారు. పట్టుదలతో పత్రిక నడిపినా ఒక్క చేతిమీద అదేమంత సులభం కాదని గ్రహించారు.

వికాసం పత్రికకు నేను చాలా రెగ్యులర్ గా వ్యాసాలు రాశాను. కార్మికులే బూర్జువాలైతే అనేది చాలా ప్రత్యేకమైనది. పుస్తక సమీక్షలు, చర్చలు సాగాయి. ఎం.ఎన్.రాయ్ మానవ వాద సిద్ధాంతాలు తిరగ రాయాలనే అంశం పై నాకూ, రావిపూడి వెంకటాద్రికీ వాదోప వాదాలు వికాసంలో సాగాయి.

మానవ వాద హేతువాద సంఘాల వార్తలు కూడా వికాసంలో అందించారు. రాడికల్ హ్యూమనిస్ట్ సంఘానికి పత్రిక లేనిదశలో వికాసం ఉపకరించింది. రాను రాను వికాసం మార్కెటింగ్ లేక, సమయాన్వేషణ లోపించి, ఆగిపోయింది. ఆర్ధికంగా రామమూర్తిగారే అన్నీ చూసుకున్నారు. చివరకు ఆపేయక తప్పలేదు. పదేళ్ళ చరిత్ర ఉన్న వికాసం మాజీ పత్రికలలో చేరింది.


ప్రసారిత

తెలుగులో పోస్టుగ్యాడ్యుయేట్ స్థాయి వరకూ ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు తోడ్పడే నిమిత్తం ప్రసారిత పేరిట త్రైమాసిక పత్రిక పెట్టాం. పోలు సత్యనారాయణ నేను కలిసి చేసిన ఈ ప్రయత్నంలో ప్రొఫెసర్ కె. శేషాద్రి సలహాలు ఉన్నాయి. ప్రింటింగ్ లో ఆలపాటి రవీంద్రనాథ్ తోడ్పడ్డారు. రచనలు సేకరించడం పెద్ద పని అయింది. విదేశాల్లో ఉన్నత విద్యారంగ స్థాయి ఏ దశలో ఉందో ఆ స్థాయిలోనే తెలుగులో విషయం అందించాలని ఉద్దేశించాం. అనుసరణే తప్ప అనువాదాలు సాధ్యమైనంత వరకూ రాకుండా చూశాం. అయితే జి.రాంరెడ్డి వంటివారు ఇంగ్లీషులో ఇచ్చిన వాటిని సరళీకృత తెలుగు చేశాం. అయా విషయాలపై ప్రత్యేక సూచికలు చేశాం. 1972—75 మధ్యలో చేసిన ఈ ప్రయత్నం బాగానే ఉన్నా, ఆర్ధిక ఇబ్బందులు ఉండేవి. అలాగే విషయ సేకరణ కష్టాలుండేవి. ప్రకటనలు ఆట్టే లభించలేదు. పంచాయతీరాజ్, పార్టీల వ్యవస్థ, రాజకీయ పార్టీల చరిత్ర మొదలైన సంచికలు తరువాత పుస్తకాలుగా వచ్చాయి. బుక్ లింక్స్ కె.బి.సత్యనారాయణ తోడ్పడ్డారు. మామిడిపూడి వెంకట రంగయ్య రచనలు అందించారు. శేషాద్రి కె. బాగా ఉపకరించారు. సి. లక్ష్మన్న రాశారు. ప్రొఫెసర్ బి. రమేష్ బొంబాయి నుండి రాశారు.

1975లో నేను ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం ఒప్పుకున్నందున ప్రసారిత నుండి తప్పుకున్నాను. పోలు సత్యనారాయణ కొన్నేళ్ళు నడిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసర్చ్ వారి ఆర్ధిక సహాయం లభించినా పత్రిక ఆపేశారు. ప్రసారితలో మేము ప్రచురించిన నక్స్ లైట్ ఉద్యమ వ్యాసాన్ని భాస్కరరావు రాశారు. అది ప్రత్యేక ఆకర్షణ అయింది. లక్ష్మణ శాస్త్రి జోషి పుస్తకం హిందూఇజం - ఎ క్రిటిక్ తెలుగు సంక్షిప్త అనుసరణ, ఎరిక్ ప్రాం, ఎం.ఎన్.రాయ్ ల పై రచనలు, సంజీవదేవ్ రచనలు చాలా విశిష్టమైనవిగా నిలిచాయి. పత్రిక బౌండ్ వాల్యూంలు స్టేట్ ఆర్కెస్ లో ఉంచాను.

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -4 ---->డాక్టర్ ఇన్నయ్య - రచయితగోలకొండ పత్రిక

సురవరం ప్రతాపరెడ్డి స్థాపించిన తెలంగాణ వాణిగా గోలకొండ పత్రిక వుండేది. నేనెరిగిన తరువాం దేవులపల్లి రామానుజరావు సంపాదకీయాలు రాస్తుండేవారు. పేరు నూకల నరోత్తమరెడ్డి అని వుండేది. హైదరాబాద్ లో బషీర్ బాగ్ లో కార్యాలయం వుండేది. పత్రిక అచ్చుగాని, తీరుగాని ఆకర్షణీయంగా వుండేది కాదు. అచ్చుతప్పులుండేవి.అయితే 1925లోనే నైజాం పాలనలో తెలుగు పత్రిక స్థాపించి సురవరం వారు చరిత్ర సృష్టించారు. మారు మూల గ్రామాలకు సైతం ఒక్కొక్క కాపీ అయినా వెళ్ళేది.

సంగారెడ్డి నుండి 1960-64 మధ్య తరచు గోలకొండ పత్రికకు వ్యాసాలు పంపేవాడిని. జి.వి. కృష్ణారావు తన పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథాన్ని ఇంగ్లీషులో వెలువరించారు. అది కళాపూర్ణోదయంపై రాసిన గ్రంథం. ముఖ్యంగా రామణీయకత అధ్యాయం గొప్ప పరిశీలన ఆ గ్రంధాన్ని తెలుగులో అనువదించాను. అప్పుట్లో కొంత గ్రాంధికం-కొంత వ్యావహారికం కలిసి అనువదించాను. గోలకొండ పత్రిక సీరియల్ గా ప్రచురించింది. పుస్తకంగా వెలకి తీసుకురావడానికి, ముందుగా భాషను మార్చి, అంతా వాడుకంలోకి తీసుకరావాలనుకున్నాను. అది వీలుపడలేదు. గోలకొండ పత్రిక కటింగ్స్ ఒక కాపీ స్టేట్ ఆర్కివ్స్ కు యిచ్చాను.


ఆంధ్రభూమి

1960-70 మధ్య సికింద్రాబాద్ నుండి వెలువడే ఆంధ్రభూమి దినపత్రికకు వ్యాసాలు రాశాను. ఎడిటోరియల్ పేజీలో వ్యాసాలు ప్రచురించారు. సంగారెడ్డి (మెదక్ జిల్లాలో ఉన్నంతకాలం (1960-64) ఎన్. శూలపాణి పేరిట రాశాను. ఎడిటోరియల్ పేజీలో వ్యాసాలన్నీ రాజకీయాలే ఎక్కువగా రాశాను. ఎప్పుడైనా లెటర్స్ రాశాను. 1965 నుండీ హైదరాబాదు వచ్చి, కొన్నాళ్ళు శూలపాణి పేరుతోనే కొనసాగించాను.1966లో గోరా శాస్త్రితో పరిచయం అయ్యింది. తొలిసారి ఆయన ఆఫీసులో కలిసినప్పుడు, ఆశ్చర్యపోయారు. అంత చిన్నవాడివనుకోలేదు అన్నారు. శూలపాణే ఇన్నయ్య అని మరీ ఆశ్చర్యపడ్డారు. క్రమేణా మేం కుటుంబ మిత్రులమయ్యాం. కొద్ది రోజులు వ్యాసాలు రాసి ఆపేశాను.

తరచుగా గోరాశాస్త్రిగారింట్లో కలసి చర్చించుకునేవాళ్ళం. ఆయన కొన్నాళ్ళు డక్కన్ క్రానికల్ కు సంపాదకీయాలు రాసేవారు. సీనియర్ జర్నలిస్టులు సీతారాం (యుఎన్ఐ) శ్రీకృష్ణగార్లతో ఫోను చర్చలు చేసేవారు. అప్పుడే నాకు డా.తిరుమలరావు, శశాంక, గోపాల శాస్త్రి, రావి శాస్త్రి, ఇచ్ఛాపురపు జగన్నాధం, భాట్టం శ్రీరామ మూర్తితో పరిచయాలయ్యాయి. గోరా శాస్త్రి 50వ జన్మదిన సంచిక వెలువరించి ఆయనను గురించి వివరాలు రాశాను. ఆంధ్రభూమిలో నాడు వరదాచారి, పొత్తూరి వెంకటేశ్వరరావు పని చేస్తుండేవారు. పొత్తూరితో నాకు సన్నిహిత పరిచయం ఏర్పడింది.


ఆంధ్రభూమిని యాజమాన్యం ఎన్నడూ అంతగా పట్టించుకున్నట్లు లేదు. సర్క్యులేషన్ అంతంత మాత్రమే. క్వాలిటీ ప్రింటింగ్ ఉండేది కాదు. అచ్చు తప్పులుండేవి. దక్కన్ క్రానికల్ ప్రధాన పత్రికగా యాజమాన్యం చూచేది. గోరా శాస్త్రితోబాటు ఆనాడు సి. ధర్మారావు, మండవ శ్రీరామమూర్తి తరచు కలుస్తుండే వాళ్ళం. సెట్టి ఈశ్వరరావు కూడా ఆయనింట్లోనే పరిచయం అయ్యారు. దిగంబర కవులకు, గోరాశాస్త్రికీ నిరంతర సిధ్ధాంత ఘర్షణ జరుగుతుండేది.

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -3 -->డాక్టర్ ఇన్నయ్య - రచయిత

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -3

రాడికల్ హ్యూమనిస్ట్ - సమీక్ష

తెనాలి నుండి రాడికల్ హ్యూమనిస్ట్ వార, పక్ష పత్రికగా వచ్చేది. 1940 ప్రాంతాలలోనే రాడికల్ పత్రిక మొదలైంది. ఎం.ఎన్.రాయ్ భావాలు, మానవ వాదం ప్రధానంగా యీ పత్రికలలో వుండేవి. కోగంటి సుబ్రహ్మణ్యం ఎడిటర్ గా వెలువడుతున్నప్పుడు, 1958 నుండే నేను రాయడం ఆరంభించాను. విశాఖపట్టణంలో ఫిలాసఫి బి.ఎ. ఆనర్స్ చదువుతున్న రోజులవి. ఎం.ఎన్.రాయ్ వ్యాసాలు, కొందరు హ్యూమనిస్టుల రచనలు అనువదించి ప్రచురించాను. Heresies of 20th Century స్వదేశీ రంజనే రాసిన Why Co-operative Common Wealth తెనిగించాను. ప్రతి సంచికలో వ్యాసాలు రాసేవాడిని.

ఆవుల గోపాలకృష్ణ మూర్తి, ఎం.వి. రామమూర్తి ప్రభృతులెందరో వ్యాసాలు రాస్తుండేవారు. ప్రతిక అచ్చుతప్పులతో ఎడిటింగ్ సరిగా లేకుండా నడిచింది. ఎప్పుడూ ఆర్థిక యిబ్బందులతో సతమతమయ్యేది. కొన్నాళ్ళకు ఆగిపోయింది. తరువాత సమీక్ష అనే పేరిట మరో పత్రిక స్థాపించారు.

తెనాలి సమీపంలో కఠెవరంలో కొల్లి శివరామరెడ్డి అడ్వకేట్ గా వుండేవారు. ఆయన సంపాదకత్వాన సమీక్ష పత్రిక ఆరంభమైంది. ఆయనకు చేదోడుగా ఎం.వి. రమణయ్య పరమయ్య అడ్వకేట్, మేకా చక్రపాణి, పరుచూరి అచ్యుతరామయ్య వుండేవారు. ప్రధాన సలహాదారు ఆవుల. సమీక్షలో నేను నిరంతరం వ్యాస రచన చేశాను. అలాగే అనువాదాలు కూడా చేశాను. సి.హెచ్.రాజారెడ్డికి, ప్రెస్ వుండేది. శ్రద్ధగా పత్రికనడిపారు ఆర్ధిక యిబ్బందులు మామూలే. ఆయనా కొన్నాళ్ళకు సమీక్ష నిలిపేశారు. మాసపత్రికగా సమీక్ష వచ్చేది. కల్లూరి బసవేశ్వరరావు, భట్టిప్రోలు హనుమంతరావు, బచ్చు వెంకటేశ్వర్లు, జి. వెంకటస్వామి, సూర్యకుమారి, మల్లాది సుబ్బమ్మ యిలా ఎందరొ రచనలు చేశారు. ఎం.వి. రామమూర్తి ప్రోత్సాహం బాగా వుండేది. ఆవుల గోపాలకృష్ణ మూర్తి వ్యాసాలు 1967లో ఆయన చనిపోయే వరకూ వచ్చాయి. ఎన్.వి. బ్రహ్మం కలలో దేవుడు అనే రచన చేసి, చర్చ లేవనెత్తారు.

రాడికల్ హ్యూమనిస్ట్ (ఇంగ్లీషులో)

ఎం.ఎన్. రాయ్ స్థాపించిన రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక ఎందరో కొనసాగించారు. నేను 1965లో రాయడం మొదలు పెట్టేసరికి వి.బి.కార్నిక్, జి.డి.పరేఖ్ లు ఎడిటర్లుగా ఉన్నారు. ఆధునిక విజ్ఞాన తాత్విక ఫలితాలపై కొన్ని వ్యాసాలు రాశాను. బొంబాయి, కలకత్తా, ఢిల్లీ మారుతూ పత్రిక సాగింది. సునీల్ భట్టాచార్య, అనంతరం సంగీతమాల్, జస్టిస్ జాగీర్దార్లు ఎడిటర్లుగా ఉండేవారు. ప్రస్తుతం రేఖా సరస్వతి మీరట్ నుండి మేనేజింగ్ ఎడిటర్ గా నిర్వహిస్తున్నారు. ఆర్ధిక బాధలు, సర్క్యులేషన్ లేమి, ప్రకటనల కొరత ఉంది.

నేను తరచు వివిధ అంశాల పై వ్యాసాలు రాశాను. ఎం.ఎన్.రాయ్ పై విమర్శ చేసినప్పుడు వి.బి.కార్నిక్ వంటివారు రియాక్ట్ అయ్యారు. రాయ్ తన తొలి భార్య ఎవిలిన్ అంశం స్వీయగాథల్లో ప్రస్థావించక పోవడాన్నితీవ్రంగా విమర్శించాను. తార్కుండే, శిబ్ దారాయణ్ రే ఏవో సమర్ధనలు చేసినా అవేవీ సహేతుకాలు కావు. భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపకురాలిగా అంతర్జాతీయ రంగంలో పాత్రవహించిన ఎవిలిన్ పట్ల రాయ్ పక్షపాత ధోరణి అవలంబించాడని విమర్శించాను.

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు - 2 --->డాక్టర్ ఇన్నయ్య - రచయిత


ఆచార్య ఎన్.జి.రంగా స్థాపించిన పత్రిక వాహిని. 1938 నుండీ మద్రాసులో కార్యాలయం వుండేది. ఈ పత్రికకు ఎందరో సంపాదకత్వం వహించారు. న్యాయపతి నారాయణమూర్తి, పండితారాధ్యుల నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, గోగినేని ఉమామహేశ్వరరావు, కె.వి. సుబ్బయ్య, జి. విశ్వనాధం, యిలా ఎందరో వున్నారు. రంగా గారి రాజకీయాల కోసం పెట్టుకున్న పత్రిక గనుక, వారి కార్యకలాపాలు యిందులో ప్రధానంగా వుండేవి.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత వాహిని, విజయవాడకు మారింది. 1955లో ఆంధ్రలో ఎన్నికలు జరిగినప్పుడు వాహిని తాత్కాలికంగా దిన పత్రికగా సాగింది. బి.ఎస్.ఆర్.కృష్ణ, నన్నపనేని వెంకట సుబ్బయ్య, జాస్తి జగన్నాధం ప్రభృతులు యిందులో పనిచేశారు.
నేను 1955 నుండీ వాహినికి వ్యాసాలు రాస్తూ తరచు వార్తలు కూడా పంపించేవాడిని. అయితే రంగాగారి రాజకీయాలతో ఎన్నడూ సంబంధం పెట్టుకోలేదు.

ఎ.సి. కాలేజీలో చదువుతూనే 1955-58 మధ్య వాహినికి వ్యాసాలురాశాను. నా క్లాస్ మేట్ ఎస్. రామాకృష్ణ నేనూ కలసి జంటగా సాహిత్య విమర్శలు చేశాం. ఎస్. రామకృష్ణ చాలా చురుకైన పదునైన కలంతో రాసేవాడు. రేపల్లెలో సిద్ధాబత్తుని దుర్గయ్య కుమారుడు. రామకృష్ణ కలం పేరు ఎస్. రాధారాణి. నా కలం పేరు ఎన్. శూలపాణి. ఇరువురం ఆ పేర్లతో రాస్తుండగా ఒక దశలో కాటూరి వెంకటేశ్వరరావు గారు మెచ్చుకుంటూ వ్యాఖ్యానించాడు. ప్రధానంగా విశ్వనాథ సత్యనారాయణ ఏకవీర, వేయిపడగలపై తీవ్ర విమర్శలు చేశాం.

గీత సత్యాగ్రహ ఉద్యమంలోనూ, 1955 ఎన్నికల ప్రచారంలోనూ 1959లో స్వతంత్ర పార్టీ పెట్టిన సందర్భంగా రాజాజీ పర్యటనపైనా వార్తలు పంపేవాడిని. ఆవుల గోపాలకృష్ణ మూర్తి నా చుట్టూ ప్రపంచం అనే శీర్షిక రాసేవారు. రాజాజీ బాపట్లలో మొదలెట్టి బొబ్బిలి వరకూ పర్యటించారు. ఆయనతో బాటు రంగా, బెజవాడ రామచంద్రా రెడ్డి, లచ్చన్న ప్రభృతులు వున్నారు. రాజాజీని తరచు కలియడం ఒక అనుభవం. బెజవాడ రామచంద్రారెడ్డి, నేనూ ఒక కారులో ప్రయాణించాం. ఆయనతో సన్నిహితత్వం ఏర్పడింది. ఎన్నో విశేషాలు చెప్పేవారు. నాకు ఉత్తరం రాస్తూ, గోటితో చిత్రాలు వేసి పంపేవారు.

రంగా గారికి పి.ఎ.గా చేరి 1956-60 పని చేస్తున్న రోజులు. ఆయనతో బాటే అనేక ప్రాంతాలు పర్యటిస్తూ, వార్తలు వాహినికి పంపడంతో విలేఖరి అనుభవం పొందాను. వాహినిలో గెటప్ బాగుండేది కాదు. అచ్చుతప్పులుండేవి. రంగాగారు వ్యక్తులపై చక్కని స్కెచ్ రాసేవారు. ఎడిటర్ పేరు ఉమామహేశ్వరరావు. ఆయినా ఎవరెవరో చూచేవారు. రాగం తానం పల్లవి శీర్షికన ఉమేష్ పేరిట ఆయన చక్కని వ్యాసాలు రాసేవాడు.

రానురాను వాహిని ప్రమాణాలు లేని పత్రికగా నడచింది. నేను 6 ఏళ్ళు అడపదడప వాహినితో సంబంధం పెట్టుకున్నాను. ఆ తరువాత రామామూర్తి, చంద్రపాల్ యిత్యాదులు సంపాదకత్వం వహించారు. క్రమంగా పత్రిక క్షీణించి ఆగిపోయింది. రాధారాణి పేరుతో రాసిన రామకృష్ణ తరువాత ఫార్మసీ పత్రిక పెట్టాడు. నేను శూలాపాణి పేరుతో ప్రజావాణి, వాహిని, ఆంధ్రభూమి దినపత్రికలో 1965 వరకూ రచనలు చేసి, ఆపేరు విరమించాను.

Wednesday, May 30, 2007

బీసీసీఐ- జీ ప్రసార ఒప్పందం రద్దు: నివేదిక వెల్లడి

బీసీసీఐ- జీ టెలివిజన్‌ల మధ్య కుదిరిన ఐదేళ్ల ప్రసార ఒప్పందం రద్దయినట్లు ఓ నివేదిక వెల్లడించింది. దీనితో వచ్చే నెలలో దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌లతో భారత్ ఆడనున్న వన్డే సిరీస్‌ ప్రసారం సందేహంలో పడింది. జూన్ 26 నుంచి జూలై 1 వరకు జరిగే ఈ వన్డే సిరీస్‌ జరగనుంది. బీసీసీఐ- జీ ఒప్పందం ప్రకారం తటస్థ వేదికల్లో భారత్ ఆడే 25 మ్యాచ్‌లను జీ టెలివిజన్ ప్రసారం చేయనుంది.


ఇందుకోసం బీసీసీఐతో జీ టెలివిజన్ 2,19,000 అమెరికన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందం అమలుకు అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో మరో బ్రాడ్‌కాస్టర్‌తో బీసీసీఐ చర్చలు జరుపుతోందని క్రిక్‌ఇన్ఫో నివేదికలు వెల్లడించినట్లు పీటీఐ తెలిపింది. ఇదిలా ఉంటే దీనిపై మాట్లాడేందుకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు లలిత్ మోడి నిరాకరించారు.

షిరిడి సాయిబాబా live webcast from Shiridi --->

Click this LINK ------>

http://telugu-blog.blogspot.com/2007/05/live-webcast.html

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు (part-1)------>నరిశెట్టి ఇన్నయ్య

ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది 1953లో. ఆంధ్రప్రదేశ్ యింకా రాలేదు. 1954లో నేను ఇంటర్మీడియట్ చదువుతుండగా, ప్రజావాణి వారపత్రికకు తొలి వ్యాసం రాశాను. గుంటూరు ఎ.సి. కాలేజిలో చదువుతూ చేసిన పని అది.

"అనంతశయనం అయ్యంగారి అనంత కోటి రూపాలు" అనే శీర్షికన రాసిన వ్యాసం ప్రజావాణి, మొదటి పేజీలో రావడం చూచి, సంతోషించాను. అప్పటినుండే ఆ పత్రికకు రాయడం మొదలుపెట్టాను. ప్రజావాణి రాజకీయ వారపత్రిక. వట్టి కొండ రంగయ్య సంపాదకులు. ఆయన కృష్ణాజిల్లా వీరులపాడుకు చెందినవారు. మద్రాసులో సంజీవరెడ్డి ఆధ్వర్యాన కాంగ్రెసు పత్రిక రాగా, దానికి సంపాదకుడుగా వుండేవారు.అభిప్రాయ భేదాలతో, కాంగ్రెస్ పత్రిక మూతపడగా, రంగయ్య గుంటూరు వచ్చి వారపత్రిక మొదలెట్టారు. గార్డన్ ప్రెస్ లో చాలాముచ్చటగా తప్పులు లేకుండా పత్రిక వచ్చేది.

రంగయ్య భార్య వట్టి కొండ విశాలాక్షి కథలు, నవలలు ప్రజావాణిలో రాసేది. ఆమెది చేబ్రోలు. ప్రజావాణిలో ఆనాడు శైలేంద్ర పేరిట బి.ఎస్.ఆర్. కృష్ణ ప్రతివారం రాసేవారు. ఆయన అప్పటికే పొగాకు లోకం అనే పత్రికకు ఎడిటర్ గా వున్నాడు. గుంటూరు జిల్లా బోర్డు నడిపే పత్రిక అది. వాసిరెడ్డి సత్యనారాయణ, నల్లమోతు సత్యనారాయణ కూడా రెగ్యులర్ గా ప్రజావాణిలో రాసేవారు. వాసిరెడ్డి సత్యనారాయణ లాం గ్రామస్తులు. హిందూ కళాశాలలో చదువుతూ, కృషి కార్ లోకీ పార్టీలో రంగా, లచ్చన్న, ఓబుల్ రెడ్డి ప్రభృతుల అనుచరులుగా వుండేవారు.స్ర్కీన్, ఫిలిం ఇండియా, మొదలైన బొంబాయి పత్రికల నుండి సినిమా వార్తల్ని ప్రజావాణి ప్రచురించేది.

వాసిరెడ్డి సత్యనారాయణ తరువాత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఉయ్యూరు నుండి వెలువడే చెరకు పత్రిక సంపాదకత్వం వహించారు. బి.ఎస్.ఆర్. కృష్ణ అమెరికన్ కౌన్సలేట్ లో ఇన్ ఫర్మేషన్ ఆఫీసర్ గా మద్రాసు వెళ్ళి, అక్కడే రిటైర్ అయ్యారు. ఆ ఉద్యోగంలో వుండగా ఇతరులకు రాయకూడదు కనుక ప్రజావాణికి ఆయన రచనలు ఆగిపోయాయి.1951లో విజయ ప్రభ అనే దినపత్రిక మద్రాసు నుండి వైద్యుల రమణరావు సంపాదకత్వాన వెలువడింది. అందులో బి.ఎస్.ఆర్ కృష్ణ పనిచేశారు.

నేను 1954 నుండి పదేళ్ళ పాటు ప్రజావాణికి రాశాను. అనేక అనువాదాలు కూడా చేశాను. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అనూహ్యంగా నేను ప్రజావాణిలో ఉద్యోగంలో చేరాను. రోజుకు రూపాయి యిచ్చేవారు. ఉదయం శంకర విలాస్ లో రంగయ్యతో బాటే టిఫిన్ చేసేవాడిని. పాత గుంటూరు నుండి, నడచి వచ్చేవాడిని. మా అన్న విజయ రాజకుమార్ కుటుంబాన్ని పోషించేవాడు. హఠాత్తుగా కల్లు గీత సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు కాగా, రాజమండ్రి జైలుకు పంపారు. లచ్చన్న నాయకత్వంలో జరిగిన గీత సత్యాగ్రహం, రాష్ట్రంలో మద్య నిషేధం తొలగించాలని పోరాడి గెలిచింది. శొంఠి రామమూర్తి నివేదిక ప్రకారం మద్య నిషేధం విఫలమైందని తేలింది. కల్లు గీత పనివారికి వృత్తి పోయింది గనుక, కృషికార్ లోక్ పార్టీ సత్యాగ్రహం తలపెట్టింది. ఈ నేపధ్యంలో నేను ఉద్యోగం చేశాను. తొలుత గుంటూరువారి తోటలో అద్దెకుండేవాళ్ళం. మా తండ్రి రాజయ్య పొలాలు పోగొట్టుకుని, జబ్బు పడ్డాడు. నేను ఉద్యోగం చేస్తూ జబ్బుపడ్డాను. అయినా అన్న జైలు నుండి తిరిగి వచ్చే వరకూ ప్రజావాణిలో ఉద్యోగం చేశాను. అప్పుడు రచయితలతో రాజకీయవాదులతో పరిచయమైంది. ప్రజావాణి రాజకీయ వారపత్రికగా ప్రభావం చూపెట్టింది. కమ్యూనిస్టు వ్యతిరేకత పత్రికలో వుండేది. ప్రజావాణి విమర్శలకు రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులు స్పందించారు. మద్దుకూరి చంద్రశేఖరరావు వంటి వారు ప్రతి విమర్శల్ని వారి పత్రికలలో రాశారు.

నేను హైస్కూలు చదువుతుండగా, మా నాన్న రాజయ్య ఆంధ్రప్రభ, భారతి తెప్పించాడు. మద్రాసు నుండి నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వాన వచ్చే పత్రిక కోసం రోజూ ఎదురు చూచి చదివేవాళ్ళం. అప్పట్లో అన్నా ప్రగడకామేశ్వరరావు గారి అంకుశం, బండి బుచ్చయ్య గారి ములుకోల, సూర్యదేవర రాజ్యలక్ష్మిగారి తెలుగుదేశం, వాహిని చదువుతుండే వాడిని. రాజకీయ హడావుడి ఎక్కువగా వుండేది.
తెనాలినుండి జ్యోతి పక్షపత్రిక, రేరాణి, అభిసారిక వచ్చేవి. ధనికొండ హనుమంతరావు సంపాదకత్వాన అభిసారిక యువతను పెద్దలను ఆకట్టుకున్నది.మద్రాసు నుండి తెలుగు స్వతంత్ర వచ్చేది. ఆ విధంగా హైస్కూలులోనే నేను వివిధ పత్రికలు చదువుతుండడం వలన ప్రజావాణిలో రాయడానికి అలవాటుపడ్డాను.

మా అన్న విజయరాజ కుమార్ తొలుత ఫార్వర్డ్ బ్లాక్ లో, తరువాత కృషి కార్ లోక్ పార్టీలో వుండడం వలన, నాకు ఆ పార్టీల వారితో పరిచయాలు కలిగాయి. జైలు నుండి విడుదలై మా అన్న రాగానే, మళ్ళీ కాలేజీ చదువులు కొనసాగించగలిగాను. అయినా రచనలు మానలేదు.ఎం.ఎన్. రాయ్ రచనలు కొన్ని అనువదించి ప్రజావాణిలో ప్రచురించాను. 1964 వరకూ రాశాను. తరువాత ప్రజావాణికి మానేశాను. వట్టి కొండ రంగయ్య కొన్నేళ్ళ తరువాత ప్రజావాణి నిలిపేశారు. ఆయన గేయరచన కూడా చేసేవారు. ఉత్తరోత్తరా రియల్ ఎస్టేట్ రంగంలో వుంటూ చనిపోయారు. పార్టీలు అధికారం రాజకీయాలు అనే ఎం.ఎన్. రాయ్ వ్యాస సంపుటి, మెన్ ఐ మెట్ అనే వ్యక్తిత్వ అంచనాల రచన ప్రజావాణిలో అనువదించాను. నా రచన లేవీ సెన్సార్ కాకుండా రంగయ్య గారు ప్రచురించి నన్ను ప్రోత్సహించారు.

-- నరిశెట్టి ఇన్నయ్య

Tuesday, May 29, 2007

మీరు జర్నలిస్టా....ఐతే "శివాజీ" టికెట్ ఫ్రీ

మీరు పత్రిక ర౦గ౦లో పని చేస్తున్నారా...దేశమ౦తా ఆసక్తిగా ఎదురుచూస్తున్న "శివాజీ" సినిమాని తొలి రోజు తొలి ఆటే చూడాలనుకు౦టున్నారా? అవున౦డి మేము జర్నలిస్ట్ లమే అ౦తమాత్రానా టికెట్లు ఫ్రీగా ఇస్తారా అనేగా మీరు అడిగేది...అవున౦డి బాబు, రజనీకా౦త్ నటి౦చిన శివాజీ సినిమాని జూన్ పదిహేనున దేశమ౦తటా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జర్నలిస్ట్ ల౦దరికి చూపి౦చాలని నిర్మాత యోచిస్తున్నట్టు తెలుస్తో౦ది. దీని ద్వారా సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ లభిస్తు౦దని వారి ఉద్దేశ్య౦. ఇ౦కో విషయ౦...కుటు౦బసమేత౦గా ఈ సినిమాని ఫ్రీగా చూసే అవకాశ౦ కూడా కల్పి౦చార౦డి ఏవియ౦ వారు. ఇప్పటివరకు పేరున్న సీని జర్నలిస్ట్ లకు మాత్రమే తొలి రోజు సినిమాని ఫ్రీగా చూసే అవకాశ౦ కల్పి౦చడ౦ అనావాయితీ, ఈ అనవాయితీని ఈ సినిమా తిరగరాసి౦ది. అయితే, ఇది తెలుగులో వర్తిస్తు౦దా లేదా అన్నది తెలియాల౦టే మాత్ర౦ కొన్ని రోజులు అగక తప్పదు మరి.

ఇవి వార్తలా ! .....?

చిన్నపిల్ల ల పై అత్యాచారాలు,ముసలి వాడిను బూటు కాలితో నిర్దాక్షణం గా తన్నే పోలీసు ,సున్నితమయి న భావాలను రెచ్చకోట్టే విదముగా కదానికలు విచక్షణ కోల్పోయి మాట్లాడే వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్,విది వంచితులను వినోదం గా చూపే రిపోర్టులు,కాలిన కుళ్ళిన గాయపడిన,తెగిపడిన శరీరావయవాలను జుగుస్పాకరంగా చూపటంలో ఔనత్యం ఏమిటో వీరికే తెలియాలి , ఒక్క దూరదర్శన్ తప్పితే మిగిలిన న్యూస్ చానల్ అందరిదీ ఒకటే బాట !,ఇక దూరదర్శన్ విషయాంకి వస్తే ఖర్మ కాలి ఇది రోజు రోజుకూ వెనుకకు పోతోంది కళాకారులు తన నటను ,ప్రదర్శనను చిరకాలం చూడాలంటె మన సప్తగిరి లో ఒక ప్రదర్శన ఇవ్వాలి , ఈ DD కళాకారులు నిఝంగా చిరంజీవులు. Telugu News Channels చూస్తుంటే కడుపులో దెవేసినట్లు అవుతోంది .ఒక భక్తి పేజీ,ఒక చిన్నపిల్ల పేజీ వేసి మిగిలిన పేజీ లన్నీ రక్తి తో నింపే స్వాతి పత్రిక లాగ వీటి లోకూడ మంచి కార్యక్రమాలు వున్నాయి. నా చుట్టూ కూడ ఇలాంటి విపరీత మార్పు లు వస్తా(వచ్చా)యేమో అని భయమేస్తోది,ఇప్పటికే అపరిచితులు కు లిప్ట్ ఇవ్వాలంటె ఒక రక మయిన భయమమేస్తోది,ఇదవరకులా చిన్నపిల్లలితో చనువుగా ఉండలేక పోతున్నా .సమాజం మీద అసయ్యం ,మానవ సంబందాల మీద జుగుప్స కలుగుతోంది ,ఎప్పుడో ఓకసారి టివీ చూశే నాకే ఇలా అనిపిస్తుoటే ,రోజూ చూసే వారికి ఎలావుంటుందో, బహుశా వారి కి ఇవి అలవాటై వుండవచ్చు :-మనిషికి సాటి వారి మీద తన చుట్టూ సమజంమీద నమ్మకం ,ప్రేమ బాద్యతను పెంచవలసిన వీరే ఇలా అయిపోతే ఇంకెవరు ఉద్దరిస్తారు ?

దీనిని ఎలా ముగించాలో తెలియక రాయుటకు మాటలు లేక పోవుట చే ఇంతటితో ముగిస్తునాను .

Posted by kasyap
మీరు ఏ ప్రమంచంలో, ఏ దేశంలొ, ఏలా జీవిస్తున్నారో మాకు అర్ధం అయ్యింది. మీలాంటి జవసత్వాలుడిగిన ముసలి వారు, విలువలన్ని పోతున్నవని కార్చేవి మొసలి కన్నీరే. ఏం మీరొజుల్లొ ఆడదాని జాకేట్టు మొచేతులదాక వుండేది కాదు. చీరకట్టుకుంటే పొట్ట కనపడేదా? మీ కుటుంబ సభ్యులు బొట్టు పెట్టుకుంటున్నారా ప్రతి రోజు? పరికిణిలూ, చీరలు కట్టుకుంటున్నరా? ఇంట్లొనే ఉంటున్నారా? ఆఫిసులకి వెల్లడంలేదా?

బ్లడ్ బాంక్ ముఖం చూసారా? రోడ్డు మీద పుంపులొ నీళ్ళు వ్రుధాగా పోతుంటే స్కూటర్ ఆపి దాన్ని కట్టేసారా ఏప్పుడైనా?

పిల్లలికి పండగలకి పబ్బాలకి గన్నులు కొనలేదా? బాంబులమోతతొ హొరేత్తించలేదా?

జ్యొతీలక్ష్మి, జయమాలిని సినిమాలు చొంగకార్చుకుంటు చూడలేదా? దిండుకింద దాచుకుని మధు పుస్తకాలు, మదనలు చదవలేదా?

మీతరం గొప్పదీను, మాతరం చెడిపొయిందా? అవ్వ! అంత మాట ఏలగనగలిగా”రు”, అన్న మర్యాద ఇంకా మాలొ ఉంది.

మీ ఏడుపు ఎదొ మీరు ఏడ్చుకొండి. మాదారికి రావొద్దు.

మీకు టైము ఉంది. మాకు లేదు. ఉన్నంతలొ బతికేస్తాము. స్పీడ్ మాన్, స్పీడ్.

బెంగాలు కరువురొజుల్లొ ఏక్కడున్నరు మీరు? అఫ్రికాలొ వాల్లు చచ్హిపోతున్నరు? కుళ్ళినశవాన్ని పీక్కుని తింటున్నరు? ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పడం కాదు. అక్కడిదాక ఏందుకు? మొన్న ఓచ్హిన సునామిలొ ఏం చేసారు మీరు?

వార్తలు అందితేనే సమయానికి సహాయం అందగలుతున్నది. మీరేగా మమ్మల్ని ఇలాగా కాన్వెంట్ స్కూల్స్లో చేర్చింది. ఇంగ్లిష్ నేర్పింది. కడుపులొ తేముల్తున్నదా, వాంతులు అవుతున్నవా? కట్టై. టీవిలు సినిమాలు చూడొద్దు. మానేయ్యండి. మీరేగా అన్నది, వూస్తె మనమీదే పడుతుంది అని.
మీ తరానికి ఒక విలువ. మాతరానికి ఒక విలువ. సబబేనా అది? మీ తాతగారిహయములొ విలువలకి మీరు విలువనిచ్హారా అన్నది గుండేలమీద చేతులేసుకుని నిజాయితిగాజవాబిచ్హుకొండి
posted by . netizen

అసలేం జరుగుతోంది..ఇక ఈ బ్లాగ్ లో న్యూస్ బ్యాన్ చేసాము..?కామెంట్సులో బూతులు చూసి ...ఈ నిర్నయం తిసుకున్నాము

తెలుగు..లో ..మన జర్న్లలిష్టుల సాదక భాదలు షేర్ సేసుకునేందుకు...మీడీయాలో జరుగుతున్న విషయాలు మేనేజ్ మెంట్ల ద్రుష్టికి తీసుకవద్దామని కొందరుమిత్రులు పంపిన చిన విషయాలు పోస్ట్ చేయడ0 జరిగింది..మాకు అవిషయాలకి సంబందం లేదని మీకు ఇబ్బంది కలిగితే తీసివేస్తామని కూడా తెలియజేయడం జరిగింది..ఎవరో తెలియదు..కామెంట్సులో బూతులు రాసారు...విషయం ప్రక్కదారికి వెలుతుందని తెలిసి..బ్లాగ్ ను ఆపి వేస్తున్నాం...ఎవ్వరికి భయపడి కాదు అని సవినయంగాతెలియ జేస్తున్నాం..ఇంకొకచిషయం..టి.వి 9 అంటే మాకు చాలా అభిమానం...రవిప్రకాష్ గారు అంటే మాకు చాలా ఇష్టం అభిమానంకూడా.. కొందరు మాకు పంపిన న్యుస్ ని ఆయన ద్రుష్టి కి తీసుకవద్దామని .. కొందరుపంపిన న్యూస్ ను యధాతదంగా బ్లాగ్ లొ వుంచాము...సొ ఇంక ఇటువంటి బ్లాగ్ లో పబ్లిష్ చేయరాదని నిర్నయించుకున్నాము..ఇప్పట్లో...ఈ బ్లాగ్ లో ఎటువంటి న్యుస్ వుండవు జరల్ న్యూస్ మాత్రం వుంచుతాము....ఎలిగేషన్ న్యుస్ ను కట్ చేస్తాము...

"సొ ఫ్రెడ్సు.....ఎప్పటిలా గే ఈ బ్లాగ్ ని ఆదరిస్తారని తలుస్తూ.."
తెలుగు మీడియాన్యుస్ బ్లాగ్ స్పాట్