ఇప్పటి వరకు మనం రాజకీయ పార్టీల చానళ్లే చూశాం.. దీనికోసం ఏ రాష్ట్రమూ మినహాయింపు కాదు. పక్కరాష్ట్రాల గోల మనకెందుకు గానీ.. మన రాష్ట్రంలో మాత్రం జగన్ సిండికేట్, ఎల్లో సిండికేట్ అనే యమాకేటుగాళ్లు చానళ్లను నడిపిస్తున్నారని ఆ చానళ్లే ఒకరిపై ఒకరు దుమ్ము దూళి ఎత్తిపోసుకుంటున్నాయి. మళ్లీ ఇందులో తెలంగాణ అనుకూల చానళ్లు, వ్యతిరేక చానళ్లనే రెండు వర్గాలు, మళ్లీ ఇందులో తెలంగాణ వాదులందరి వాయిస్ వినిపించే చానళ్లు, కేవలం కేసీఆర్‌ను మాత్రమే ఉద్యమ సారధిగా చూపించే చానళ్లు.. ఇలా విభజించుకుంటూ పోతే.. ఆటంబాంబ్ శృంకలాలంత చిట్టా బయటపడుతుంది. ఇక రాజకీయ పార్టీల చానళ్లలో పాత కుల గజ్జి మళ్లీ చెలేస్తోంది. ఇప్పటికే ఇటు పత్రికల్లో.. అటు ఎలక్ట్రానిక్ మీడియాలో కమ్మరాజ్యం కలవరపెడుతున్న విషయం పాతదే.. ఆ తరువాత బ్రాహ్మణాధిపత్యం షరా మామూలే.. వీళ్ల చేష్టలు భరించి... భరించి రెండవ స్థానల్లో ఉండి విసుగు చెందిన బీసీ, దళితులు అవకాశం కోసం ఎదురు చూశారు. తాజాగా చానళ్లలో బీసీల ఆధిపత్యం ఎక్కువయిందన్నది పరిశోధనా సత్యం. ఇక్కడ ఆధిపత్యం అంటే పెద్ద పెద్ద పదవులను కుంటే పొరపాటే.. మీడియా ఉద్యోగాల్లోకి ప్రవాహంలా వచ్చి చేరుతూనే.. పై ఉద్యోగాలకు పోటీ పడుతున్న సంఖ్య అధికంగా ఉంది. దీంతో బాటు బీసీల్లో వచ్చిన చైతన్యం మూలాన.. పై స్థాయిలో ఉన్న బీసీలు సాధ్యమైనంత వరకు బీసీలకే ప్రాధాన్యమిచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. దీంతోపాటు కులాల గొడవ.. యాదవులు, గౌళ్లు, కాపులు, పద్మశాలీలు బాగా పోటీపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. గౌడ కులస్థులు, కాపు కులస్థులు, పద్మశాలీలు రెండవ స్థాయిల్లో ఉన్నారు. పద్మశాలీలు చాపకింద నీరులా విస్తరిస్తున్నారు. చారీలు ఇందులో కంసాలీలు కూడా కాస్త చొరవగానే దూసుకుపోతున్నారు..
అందుకే తాజాగా వచ్చే చానళ్లలో ఎక్కువ సంఖ్యలో కులాన్ని చూసి కొలతలేసి మరీ రిక్రూట్ చేసుకుంటున్నారని బాగా ప్రచారం జరుగుతోంది. ఎంపీ వివేకా పెడుతున్న వి6 చానల్ లో ఎంపీగారు దళితులకు ప్రాధాన్యమివ్వమని చెప్పారని వినికిడి.. కానీ సీఈఓగా పనిచేస్తున్న అంకం రవి, ఇన్‌పుట్/ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేస్తున్న పసునూరి శ్రీధర్ బాబు, ఫీచర్స్ ఇన్‌చార్జిగా నియమితుడైన చల్లా శ్రీనివాస్ వీళ్లంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కావడంతో.. తమ సామాజిక వర్గానికి రిక్రూట్‌మెంట్లో పెద్ద పీఠ వేస్తున్నారని మీడియా కోడై కూస్తోంది. ఇదే విషయమై ఆ చానల్‌లో పనిచేస్తున్న నా ఫ్రెండ్ ను అడిగినపుడు అందరి కులాలు తెలియవు కానీ ఇతర కులాల వారు కూడా ఉన్నట్టుంది అన్నారు. కానీ ఓ పెద్ద మనిషి సేకరించిన సమాచారం ప్రకారం గ్రాస్ రూట్స్ నుంచి పై స్థాయి వరకు ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించినట్టు తెలుస్తోంది. ఈ పద్దతి విడనాడాలని విజ్ఞప్తి చేయడం మినహా మరేమీ చేయలేం. ఇదే కొనసాగితే ఇతర చానళ్లలో బీసీల పై అగ్రవర్ణాల దాడి( తీసివేతలు) తప్పదేమోననిపిస్తోంది.
దాని తరువాత కొత్తగా తులసీ సీడ్స్ ఆధ్యర్యంలో వస్తున్న మరో చానల్ కూడా ఇదే పద్దతిని పద్దతిగా అనుసరిస్తుందనే ప్రచారం జోరుగా ఊపందుకుంది. తులసీ సీడ్స్ అధినేత కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం.. వీరు చానల్ పెట్టేటపుడే కాపులకో చానల్ కావలని నిర్ణయించుకొని పెట్టారట. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు హడావుడి చేసిన తులసీ అధినేత ఇప్పుడు చానల్ పెట్టడం వెనుక రకరకాల కారణాలున్నాయని విశ్లేషకుల అంచనా.
అయితే ఇప్పటి వరకు ఉన్న పొలిటికల్ మౌత్ పీసులు కాస్తా.. క్యాస్ట్‌లీ మౌత్ పీసులుగా మారబోతున్నాయన్నమాట.. చూడాలి... త్వరలో యాదవులకో చానల్, గౌండ్ల కులానికో చానల్ వస్తుందేమో..
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
-
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది.
ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా
లుంగికట్టుకు...
6 years ago
No comments:
Post a Comment