సీవీఆర్ ఛానెల్ అమ్మేస్తున్నారా? అలాంటి ఆలోచనలు యాజమాన్యానికి ఏమైనా ఉన్నాయా? మంచి రేటొస్తే అమ్మేయాలని ఓనర్‌గారు యోచిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ విషయాన్ని మీడియా బ్రోకర్లు చర్చించుకుంటున్నారు.
మీడియా ఛానల్స్ లైసెన్స్‌లు సమకూర్చిపెట్టే ఒక మీడియేటర్ సంస్థకు సీవీఆర్ ఛానల్ అమ్మే బాధ్యతలు అప్పగించినట్టు మీడియా మీడియేటర్లు మాట్లాడుకుంటున్నారు. చాలా కాన్ఫిడెన్షియల్, ఎక్కడ లీక్ చెయ్యొద్దంటూ ఒకరికి ఒకరు చెప్పేసుకుంటున్నారు. అటు తిరిగి, ఇటు తిరిగి ఈ రూమర్ లేదా వార్త టీఎంఎస్ చెవిన పడింది.
ఇంతకీ సీవీఆర్ తన ఛానల్స్ పై ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో తెలుసా? 200 కోట్లు. ప్రస్తుతం సీవీఆర్ వద్ద న్యూస్, హెల్త్, ఓమ్ భక్తి ఛానల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ పెట్టేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు నడుస్తున్న న్యూస్, హెల్త్, ఓమ్ ల లైసెన్స్‌లు ఒక్కో దానికి మూడేసి కోట్లనుకున్నా 10 కోట్లు అవుతుంది. కొత్త ఆంగ్ల ఛానల్‌తో కలిపి మొత్తం విలువ 15 కోట్లు. మూడు స్టూడియోలు, పీసీఆర్ ఎక్విప్మెంట్‌తో కలిపి 5 కోట్లు చేస్తాయని మీడియేటర్ల అంచనా.
ఈ లెక్కన 20 కోట్లు విలువైన ఛానల్ మెటీరియల్ లభిస్తుంది. ఇక బ్రాండ్ వేల్యూ, స్టాఫ్, గుడ్ విల్ కలిపి ఒక 5 కోట్లు రఫ్‌గా అనుకుంటున్నారు. అంటే 25 కోట్లు. తర్వాత బిల్డింగ్. ఇది జూబ్లీహిల్స్ ప్రైమ్ సెంటర్‌లో ఉంది. దీని విలువ బాగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
అయితే బిల్డింగ్‌తో సహా 100 నుంచి 120 కోట్ల వరకు అయితే అమ్మడం కొంత సులువని మీడియా లైసెన్సుల మీడియేటర్లు అనుకుంటున్నారు. ఆ మధ్య టీవీ9 బోకే 300 కోట్లకు అమ్మకానికి పెడితే కూడా పలకలేదు నెంబర్ 1లో ఉన్న ఛానల్స్‌కే పెద్దగా రేటు లేనప్పుడు అంతంత మాత్రమే ఉండే సీవీఆర్‌కు ఇంత రేటు వస్తుందా అని అనుకుంటున్నారు.
ఈ మీడియా గుసగుసల్లో, రేటులో ఎంత నిజమున్నా లేకున్నా, సీవీఆర్ యాజమాన్యానికి అమ్మే ఆలోచన ఉందని మాత్రం సమాచారం. సీవీఆర్ పెట్టే క్రమశిక్షణ కష్టాలు కొత్త యాజమాన్యంతోనైనా తీరుతాయంటే అమ్ముడుపోవడమే బెటరని ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. చూడాలి ఈ వదంతుల్లో ఎంత పస ఉందో..!
source :- http://www.telugumediastudent.com/