BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Saturday, June 11, 2011

Venkat Krishna of TV5 ..join StudioN very soon

Venkat Krishna of TV5 will join StudioN very soon. Earlier Venkat Krishna worked in ETV2 as Senior Journalist and use to cover Chandra babu Naidu activities on behalf of ETV. He made good relationship with him and upon request of Chandra Babu Naidu Venkat Krishna is going to be part of StudioN Team. But StudioN management is failing to pay salaries regularly.


Narne Srinivasa rao, who is the founder of StudioN, wanted to give this channel to Jr.NTR as marriage gift, but Nara Lokesh who completely took over the channel is keeping Narne Srinivasa rao offline from channel activities. will join StudioN very soon. Earlier Venkat Krishna worked in ETV2 as Senior Journalist and use to cover Chandra babu Naidu activities on behalf of ETV. He made good relationship with him and upon request of Chandra Babu Naidu Venkat Krishna is going to be part of StudioN Team. But StudioN management is failing to pay salaries regularly.


Narne Srinivasa rao, who is the founder of StudioN, wanted to give this channel to Jr.NTR as marriage gift, but Nara Lokesh who completely took over the channel is keeping Narne Srinivasa rao offline from channel activities.

కాలక్షేపం న్యూస్ ఛానెళ్లు...newsaa.... Gasaaaaa

ఉదయానే్న రూపాయిన్నర మొదలు మూడు రూపాయలు పెట్టి న్యూస్ పేపర్ కొని ఇంకా చదువుతున్నారంటే 24 గంటలపాటు ప్రసారమయ్యే న్యూస్ ఛానళ్లపై విశ్వాసం అంతంత మాత్రంగానే ఉన్నట్టేనని లెక్క. లేకపోతే పెరిగే సాంకేతిక పరిజ్ఞానానికి ఈపాటికి ఎన్నో న్యూస్ పేపర్లు దుకాణం సర్దేయాల్సి వచ్చేది. దుకాణం సర్దేయడం మాట అటుంచి లేనిపోని కొత్త అభిమానం పుట్టుకొచ్చి పేపర్ సర్క్యులేషన్ అమాంతంగా పెరిగిపోతున్న సందర్భంలో కొన్ని పత్రికలు కూడా సొంత డబ్బానే బజాయించి నిరాశ కల్గిస్తున్నా నిజమైన వార్తాప్రియులు మాత్రం న్యూస్ ఛానళ్ల కంటే న్యూస్ పేపర్లకే తమ అభిమానాన్ని చాటడం వల్ల న్యూస్ విలువలకు ఇంకా పట్ట్భాషేకం జరుగుతూనే ఉంది.
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, టైమ్ మేనేజ్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని పాఠకులు కాస్తా ప్రేక్షకులుగా మారిన సందర్భంలో న్యూస్ ఛానళ్లు ఇదంతా తమ ప్రతిభా పాఠవాలేననుకుని న్యూస్‌ని జీడిపాకంలా సాగదీయడం మొదలుపెట్టాయి. ఈ ప్రక్రియతో నానాటికీ విసుగెత్తిపోతున్న ప్రేక్షక లోకం నెట్‌లో పత్రికలు చదవడమే మేలని భావిస్తున్నాయి. ఈ విధంగా నెట్‌లో కూడా పత్రికలకు పాఠకుల సంఖ్య క్రమేపీ పెరుగుతుంది.
వార్తల ప్రాధాన్యతా క్రమం ప్రకారం నిర్ణీత సమయంలో అవసరమైన అతి ముఖ్యమైన వార్తలే బుల్లితెర వచ్చిన కొత్తలో ప్రసారమయ్యేవి. సంక్షిప్తంగా అనవసర చర్చ లేకుండా హుందా భాషలో వార్తలు ప్రసారమయ్యేవి. ఇదంతా ప్రభుత్వ ఛానెల్ ప్రక్రియ. అది ఇప్పటికీ అదే హుందాను ప్రదర్శిస్తుంది. వార్తలను సైతం వాణిజ్యంగా మార్చేయవచ్చు అనే ప్రక్రియ తెలుగులో ఊపందుకునేసరికి దాదాపు డజను ఛానళ్లు పుట్టుకొచ్చాయి. వాటిలో వాటికే నెంబర్ వన్ స్థానం కోసం తహతహలు. దానిని నిర్ణయించే సంస్థలు రేటింగ్ ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టేసరికి వార్తా ఛానళ్ల హంగామా పనిలో పనిగా పెరిగిపోయింది.
ప్రస్తుతం ఏది వార్తో ఏది కాదో తెలియని పరిస్థితికి వార్తలను తిలకించేవారు వచ్చేశారు. దొరికిన పిసరంత వార్తకు హంగూ ఆర్భాటాలను అద్దేసి ఫలానా ఛానల్ వారి మార్కుతో మేమే మీకు ముందు అందిస్తున్నాం సుమా! అంటూ పదేపదే గుర్తు చేస్తూ వీక్షకులకు బోరెక్కించేస్తున్నారు. వార్తలో హుందాగా వినపడే భాషపోయి పరమ నీచమైన నాటు భాష, క్యాప్షన్లు న్యూస్ బులెటిన్‌లో కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. కొన్ని ఛానల్స్‌లో అయితే ఏకంగా వార్తలు చదివేవారు తమ పేరు వెనుక కుల శబ్దం వినిపించేలా చెప్పుకోవడం గమనార్హం.
సమాజ బాగు కోసం వారు అందిస్తారని మనం డిసైడ్ చేసుకోవాలి. బహుశా మనకు నచ్చినవే తీసుకోవాలనేమో వారి అర్థం. ఏదైతేనేం చెప్పిందే చెప్పి అటు తిప్పి ఇటు తిప్పి ముప్పుతిప్పలు పెట్టి అహర్నిశలు శ్రమించే ఛానల్ జర్నలిస్టుల మాటలు ప్రేక్షకులకు వార్తలను చూసేటప్పుడు ఫ్రీగా దొరికే కామెడీగా తయారయ్యింది. ‘కాదేది కవిత కనర్హం..’ అన్న శ్రీశ్రీ మాటలు నేటి ఛానళ్లకి ఆధారం, ఆదర్శం కాబోలు. అందుకే సమాజంలో దొరికే పెంట దగ్గర నుండి పెంటగాన్ వరకు దేనినీ వదలకుండా అవసరమున్నా లేకున్నా కవర్ చేసేస్తున్నాయి ఛానళ్లు.
వార్తలను యధాతథంగా అందించే రోజులు పోయాయి. దానికి కొన్ని క్లిప్పింగ్స్ (ఒక్కటి దొరికినా చాలు మసక మసకగా వున్నా ఫర్వాలేదు) మ్యూజిక్ హంగామా పెట్టేసి రాబోయే అరగంట ముందు నుండి ‘కమింగ్ అప్’ అంటూ వేసి మరీ వీక్షకుల్లో ఆసక్తి కలిగించాలి. తీరా చూస్తే తుస్సుమనేలా ఉండాలి. అవసరమైతే మరికొన్ని వార్తలను వండడం కూడా ఛానళ్లు నేర్చుకోవాలి. ఈ ప్రక్రియతో నిజాలు బయటకు లాగాలనేది ఓ టెక్నిక్. ఇలాంటి పోటీల మధ్య వార్తా ఛానళ్లు మేమే ముందు అంటే మేమే ముందు అనే తరహాలో పోటీ పడుతున్నాయి.
వార్తా ఛానళ్ల మధ్య పోటీ ఎంతగా పెరిగిపోయిందంటే ఒక ఛానల్‌ని మరో ఛానల్ అణగదొక్కే స్థాయికి వచ్చేసింది. దీనిని ఆసరాగా తీసుకుని ఒక ఛానల్ బురదజల్లిన వ్యక్తులు మరో ఛానల్‌ని వేదిక చేసుకుని తమ పాతివ్రత్యం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే సదరు ఛానల్ దానికి వత్తాసు పాడటం ఎలాంటి జర్నలిజమో వారికే తెలియాలి. ఛానళ్ల మధ్య రేటింగ్ పోటీ వారిని ఎంత వరకు తీసుకుపోతుందంటే వారి యజమానుల పర్సనల్ లైఫ్‌లోకి, వ్యాపారాల్లోకి తొంగిచూసి మరీ వెతికి బజారుకీడ్చేలా (్ఛనల్‌కి) చేస్తుంది. ఈ మధ్యకాలంలోనే ఓ ప్రముఖ ఛానల్ మరో ప్రముఖ ఛానల్ యజమానికి సంబంధించిన హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్ విశ్వసనీయతపై చర్చ పెట్టింది. చర్చా కార్యక్రమంతో ఏం సాధించిందో ఛానల్ వారికి, ప్రజలకు తెలియంది కాదు కాని చర్చకు గురైన సదరు ఛానల్ యజమాని తన ఛానల్‌లో తన ప్రొడక్ట్ గురించి టల కార్యక్రమం చేసుకోవాల్సిన పని పడింది. ఇది గమనించిన వారు ఇట్టే చెప్పేస్తారు ఇదంతా దేనికో?
వార్త చూస్తే భయం కలగడం.. చలించుకు పోవడం ఒకప్పుడు జరిగేది. ఇప్పుడు ఆ ధోరణి ప్రజల్లో కనుమరుగై టేకిట్ ఈజీ పాలసీ వచ్చేసింది. అందుకే ఒకే రకమైన వార్తలకు కారణమయ్యే సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. నిజంగా వార్త పట్ల భయం ఉంటే ఇలాంటివి జరగడానికి చాలాకాలం గ్యాప్ వచ్చేది. ఇప్పుడలా జరగడం లేదు. ప్రజలు జర్నలిస్టుల పనితీరు పట్ల ఛానల్స్ వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా పలు అనుమానాలను కలిగి ఉండటం జర్నలిజం చేసుకున్న పాపం. ఎవరో చేసిన దానికి అందరూ అదే తాడుకి కట్టబడటం నిజంగా దురదృష్టకరం. దీనిపై కూడా ఛానళ్లు దృష్టి పెట్టి ప్రజలను సహకరించమనడం మెచ్చుకోదగ్గ విషయం.
ఛానళ్లు అన్ని వర్గాల వారి కోసం కార్యక్రమాలను తయారుచేస్తున్నాయి. వీటిలో కొన్ని లైవ్‌గా కూడా ప్రసారవౌతున్నాయి. అయితే వాటిలో సరుకు ఎంత? అంటే మాత్రం కచ్చితంగా తక్కువనే చెప్పాలి. చర్చా కార్యక్రమం నిర్వహించేవాడు ఎవరినీ సరిగ్గా మాట్లాడనీయక పోవడం అతని నిర్వహణా దక్షతకు నిదర్శనం. చర్చా కార్యక్రమానికి ప్రతీ అంశం కూడా అర్హమే. అందుకే చర్చా కార్యక్రమాలు చూడాలంటే నేడు వీక్షకులకు బోరుగా అనిపిస్తుంది.
ఓ మూఢ నమ్మకం.. ఓ మాఫియా కథనం.. ఓ మాంచి సెక్స్ రాకెట్.. ఓ పరువు హత్య.. ఓ సినిమా గాసిప్ ఇలా దొరికిన అంశాలను దొరికినట్టు పచ్చిగా చూపించేస్తూ తమ బాధ్యతను నిలుపుకోవడంలో న్యూస్ ఛానళ్లు ‘్ఫస్ట్ ఇన్’గా ఉంటున్నాయి. ఇన్ని కబుర్లు చెప్పే ఛానళ్లు రోజులో కొన్ని గంటలపాటు విశ్వసనీయత సరిగా ఉందో లేదో తెలియని అనేక ఉత్పత్తులు, యంత్రాలను గురించి చూపడం దేనికో అర్థం కాదు.
నేడు ఎక్కువగా వార్తా ఛానళ్లు గ్లామర్ ప్రపంచం చుట్టూనే తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాయి. రోజులో దాదాపు ఐదారు గంటలు సినిమా న్యూస్‌తోనే కాలం వెళ్లదీస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. హర్రిబుర్రిగా చూపే వార్తలు, అసంపూర్ణంగా పూర్తయ్యే చర్చలు, సాగదీసి సాగదీసి విసుగెత్తించే కథనాలు ప్రజల్లో ఏ వర్గానికైనా ఎంతవరకు ఉపయోగపడతాయనేది వారికే తెలియాలి. చూపించడం వరకే వారి పని అంటే.. ఓకే. ప్రతి ఛానల్ ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తుందనే ముద్ర ప్రజల్లో పడిపోవడం వల్ల అందులో ప్రసారమయ్యే వార్తల సారాన్ని ఇట్టే అవగాహన చేసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం ప్రజల్లో వార్తా ఛానళ్ల పట్ల విశ్వసనీయత కంటే కాలక్షేప ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. కుదురుగా విశ్వసనీయతతో ఒక్క వార్తా ఛానల్‌ని కూడా చూడలేని వార్తాప్రియులు రిమోట్‌పై తరచూ వేళ్లను ఆడిస్తూ అందరికీ రేటింగ్ ఇవ్వడం కొసమెరుపు.

ఛానల్స్‌లో బోరు కొట్టిస్తున్న సెల్రబెటీల పెళ్లి గోల’




సెలబ్రిటీలకు పెళ్లి సంబంధం కుదురుతుంన్న వార్త పిసరంత మీడియాకు అందితే చాలు ఛానల్‌లో ఆకాశమంత పందిరేసి భూదేవంత అరుగు అలికి పచ్చని తోరణాలు కట్టి వారి పెళ్లి జరిగేంతవరకు మీనాలో (్ఛనల్) ఊరేగిస్తూనే ఉంటారు. పాపం! వారు మాత్రం కావాలని చేస్తారా? 24 గంటల కవరేజీకి సరుకు కావాలి కదా? అందుకే పిలవని పేరంటానికి సైతం మేమున్నామంటూ వెళ్లిపోయి కవరేజ్ చేసేస్తూ ఉడతా భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు.
పెళ్లికొడుకు ఎన్నిసార్లు బయటకు వచ్చి మీడియాకు చిక్కకుండా వెళ్లిపోయాడో వార్త నుండి పెళ్లి కోసం తయారౌతున్న పిండి వంటల వరకు తెగ ఆశ్చర్యపోతూ ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని ట్రై చేస్తారు. పిలవని పేరంటానికి తయారై వెళ్లిన యాంకరమ్మ సదరు సెలబ్రిటీ ఇంటి గేటు ముందో కల్యాణ మండపం బయటో ఛానల్ వారు లైవ్‌లో పిలిచేంతవరకు వేచి ఉంటుంది. తీరా లైన్‌లోకి తీసుకున్న తరువాత నోరు చప్పరించుకుంటూ చెప్పిందే చెప్పి కెమెరామెన్‌తో నానా తిప్పలు పడుతుంది. ఇలాంటి సన్నివేశాలు ప్రతి ఛానల్‌లో దర్శనమివ్వడంతో ప్రేక్షకుడు పరమ బోర్ ఫీలవుతున్నాడు.
లేనివాడు ఆకలితో ఏడుస్తుంటే ఉన్నోడు అరక్క ఏడ్చాడట. అలా ఉంటాయి సెలబ్రిటీల పెళ్లిళ్ల తీరు. పదిమందీ చెప్పుకోవాలని చేసుకునే హడావిడికి ఎక్కువమందిని రావద్దని శుభలేఖల్లో చెప్పకనే చెబుతారు. అయినా కూడా వేలల్లో జనాలు వస్తారు. వాటిలో ఛానల్స్ వారు కూడా ఉండటం వల్ల తాము చూసిన (నోరెళ్లబెట్టి) విషయాలను లక్షల్లో కాదు కోట్ల మందికి పదేపదే చెప్పే గురుతర బాధ్యతను భుజాన వేసుకుంటారు. ఏ ఛానల్‌లో చూసినా ఇదే వాయింపు.
కొన్ని ఛానల్స్ చేసుకున్న అదృష్టానికి పెళ్లి కార్యక్రమాన్ని లైవ్ ఓన్లీగా ప్రసారం చేసుకునే హక్కులు లభిస్తాయి. అంతే! ఆ ఓవర్ ప్రసారాలకు ప్రేక్షకులకు సైతం పెళ్లంటే ఇలా చేసుకోవాలి లేకపోతే పెళ్ళే చేసుకోకూడదనిపించేస్తుంది. అయి తే అందరి కీ సాధ్య పడుతుందా? వాళ్లు సెలబ్రిటీలు కనుక సాగుతుందని సరిపెట్టుకుని యధాప్రకారం పప్పన్నం లాగించేయాల్సిందే. అనుక్షణం హైరానా పడిపోతూ తెలుసుకోవాల్సినంత సీను సెలబ్రిటీల పెళ్లిళ్లకుందా అనేది సామాన్య ప్రేక్షకుడి మాట. అలాంటి హడావిడిని ఛానల్స్ సృష్టిస్తున్నాయనేది వీరి వాదన. పిలవని పేరంటానికి మేం వెళ్లాం కావాలంటే చూడండి దానికి మీరే సాక్ష్యం అన్నట్లు ప్రేక్షకులపై రుద్దే ధోరణిని ఛానల్స్ అనుసరిస్తున్నాయా? అనే అనుమానంలో ప్రేక్షకుడు కొట్టుమిట్టాడుతున్నాడు.
సెలబ్రిటీలు పర్సనల్ లైఫ్‌లోకి ఛానల్స్‌ని ఎలాగ ఎంటరవ్వనివ్వరు కనుక వారి రంగానికి సంబంధించి దొరికిన క్లిప్పింగ్స్ సినిమా పాటలతో తెగ హడావిడి చేసి (బులిటెన్ బులిటెన్‌కు) సంబరపడిపోతారు. ఏదో మూల సమాచారంతో సెలబ్రిటీలు నివసించిన, పుట్టిన ఊళ్లకు పోయి అక్కడి జనంతో కథనాలు అల్లడం మొదలెడతారు.
పెళ్లితంతు పూర్తయ్యేవరకు సెలబ్రిటీలు ఎలాగా దొరకరు. అంతవరకు ఊరుకుంటే రేటింగ్‌లో వెనుకబడి పోతామని భావించిన సదరు ఛానల్స్ ఆకాశమంత పందిరేసేవాణ్ని - భూదేవిని అలికి ముగ్గు పెట్టేవాడ్ని తీసుకొచ్చి గంటల తరబడి సోది కబుర్లు పెడతారు. పాశ్చాత్య వంటలతో నిత్యం ముద్ద దింపుకునే సెలబ్రిటీలు వెరైటీ కోసం (నేటివిటీ మరిచి) తెలుగు వంటలను విందుకు ఆర్డరిస్తే మీడియాకు పండుగే. వంట మాస్టర్ల వెంటబడి మరీ కవర్ చేస్తారు. ఆఖరికి ప్రదానం బోండాలపై కూడా కథనాలు ప్రసారం చేయాల్సిందేనని ప్రతినబూనతారు. ఇక పెళ్లి జరిపించే పండితుల సంగతి సరేసరి. వీళ్లంతా ఛానల్స్‌కి దొరికిపోయే విఐపిలు.
ప్రతి బులిటెన్‌లోనూ హేలీ తోకచుక్క కనిపిస్తుందన్నంత హడావిడి చేస్తూ మరి కొద్ది గంటల్లో మరి కొన్ని నిమిషాల్లో పెళ్లి ముహూర్తం అంటూ వారు ఆందోళన పడిపోతూ ప్రేక్షకులను టెలివిజన్ సెట్ల ముందు కూర్చోబెట్టడానికి వీరోచితంగా ప్రయత్నిస్తారు. మేమే ముందు చూపించాం.
మేమే ఎక్కువ మందికి చూపించాం అంటూ సంబరపడిపోతూ లోగో ముద్రను కార్యక్రమంపై వేసుకుంటారు.
పెళ్లి ముహూర్తాలున్న సమయాల్లో ఎన్నో జంటలు ఒకటవుతాయి. కాని సెలబ్రిటీల పెళ్లిళ్లే లోక కల్యాణం కోసం జరిగినట్లు ప్రత్యక్ష దైవాలకు జరిగినట్లు ఛానల్స్ పాత కొత్త క్లిప్పింగ్స్ కల్యాణ గీతాలతో ప్రసారం చేయడం రోజురోజుకీ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాయి. అతి హడావిడి ఇష్టపడేవారి చేత కూడా పెదవి విరిచేలా చేస్తుందని గమనించాలి. సినీ స్టార్స్.. క్రికెట్ స్టార్స్.. పారిశ్రామికవేత్తలు.. వంటి ఎందరో సెలబ్రిటీల పెళ్లిళ్లలో కనిపించే కృత్రిమ ఆనందం కంటే సామాన్య మానవుని పెళ్లిలో కనిపించే నిజమైన ఆనందమే ఎక్కువ కాలం నిలిచిపోతుంది. ఇటనైనా ఛానల్స్ సెలబ్రిటీల పెళ్లిళ్ల ఫోకస్ కోసం సారం ఏమీ లేకపోయినా ఏదో వున్న బిల్డప్ చేసే బులిటెన్‌లకు స్వస్తి పలికి హుందాగా పెళ్లి వార్తను పెళ్లి రోజు క్లిప్స్‌తో ప్రసారం చేస్తే ప్రేక్షకులు మరింతగా విశ్వసిస్తారు, ఆనందిస్తారు.

sorce :- http://www.andhrabhoomi.net