మళ్లీ వై.ఎస్. సి.ఎం అవుతారని, ప్రజారాజ్యానికి 30 కి మించి సీట్లు రావని ; టి.ఆర్.ఎస్. భూతం కాదు అది బాటిల్లో భూతమని, చిత్తూరులో సి.కె. గెలుస్తారని . అందరు నన్ను బండబూతులు తిట్టారు. ముఖ్యంగా బాబు, చిరు అబిమానులు. వారికంతా నా మనవి ఏమంటే ‘నేను చెప్పాను కాబట్టి ఈ గెలుపు సాధ్యం కాలేదు. గెలుపు ఎప్పుడో నిర్ణయించబడింది దానిని నేను కాస్త ముందుగా చెప్పానంతే’.
బాబును జనం నమ్మరని చిన్నపిల్లలకు సైతం తెలుసు. ఈ చిన్న సత్యం బాబుకు తట్టక పోవడమే విధి బలీయమనడానికి తార్కాణం. బహుశా బాబు తమ పాత సంస్కరణలకే కట్టుబడి ఉండి ఎన్.టి.ఆర్ జపం అందుకోకున్నా కాస్త మెరుగు పడేదేమో?
ఏమైతేనేమి నా వాక్కు ఫలించిందని నేను విర్రవీగడం లేదు. జ్యోతిష్యశాస్త్రం జ్ఞాన కోశమని చెప్పడం లేదు. జిష్టు ఉంది. జ్యోతిష్కులే దానిని బ్రష్టు పట్టిస్తున్నారు.
కాస్త తెగింపు, అహంకార రాహిత్యం ఉన్నవారు ముందుకొస్తే జ్యోతిష్యాన్ని ఇంకాస్త ప్రక్షాళన చేసి, ఇంకాస్త హేతుబద్దతను కల్పించవచ్చు.