" ఇది కథ కాదు... ఓ కన్నీటి వ్యధ "
మమ్మీ..... నా కోసం ఏం తెచ్చావు..?
అమ్మను చూస్తూనే పరుగెత్తుకుని వచ్చి, వచ్చీరాని మాటలతో అడిగింది సహస్ర. దుంకుతున్న అశ్రుధారలకు కట్టిన అడ్డుకట్ట ఒక్కసారిగా తెగిపోయింది. దారంతా బలవంతంగా దాచుకున్న గుండె కోత తన బిడ్డను చూసేసరికి ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. అంతే, అమాంతం సహస్రను పట్టుకుని ఏడ్చేసింది శిశిర. లెక్క వేసుకుంటే 20నిముషాలు, కొలవాలనుకుంటే లెక్కకు అందనంత భారాన్ని గుండెలో దాచుకుని అలసిపోయింది కదా, శిశిరను చూడగానే సహస్ర తట్టుకోలేకపోయింది. ఇన్నాళ్లు అడగకుండానే ఏదో ఒకటి తెచ్చి పెట్టే అమ్మ, ఇప్పుడు అడిగినా ఇవ్వకపోవటం, పైగా దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తుండటంతో మూడేళ్ల పాప కూడా తట్టుకోలేకపోయింది. పాలనురగలాంటి కళ్లు, పాలబుగ్గలు కందిపోయేలా ఏడవటం ప్రారంభించింది. కన్నపేగు గుక్కపట్టి ఏడవటాన్ని చూసి తట్టుకోలేకపోయింది శిశిర. వెంటనే తమాయించుకుంది. సారీ బేబి, సారీ తల్లి అంటూ సహస్రను బుజ్జగిస్తూ ఏడుపుకు కామా పెట్టింది. వేదనకు విరామమయితే ఇచ్చింది కానీ గడ్డ కట్టిన కన్నీటి చుక్కలు మాత్రం గుండెకోతకు సాక్ష్యాలుగా మిగిలాయి. పాపం శిశిరకు తనివితీరా ఏడ్చేందుకు కూడా స్వేచ్ఛలేదు. అచ్చంగా ఈ సమాజంలో పట్టపగలే తిరగలేని ఓ ఆడకూతురికి మల్లే........
..................
శిశిర. నెల్లూరులోని ఓ మధ్యతరగతి కుటుంబానికి గారాల పట్టి. ఆడపిల్ల పుడితే చంపేయ్యాలనుకునే మనుషులున్న ఈ జనారణ్యంలో, ఆడపిల్ల పుడితే చాలు అనుకునే మానవత్వం నడయాడే నట్టింట్లో పుట్టింది. అందుకే తల్లి గర్భం నుంచి ఈ లోకానికి పరిచయం కాగానే సంబురాలు చేసుకున్నారు. మహాలక్ష్మి పుట్టిందంటూ పండుగ చేసారు. అప్పుడు మాత్రమే కాదు శిశిరకు 23యేళ్లు వచ్చే వరకు పెళ్లిమాటే ఎత్తలేదు. చదువుకోవాలి, చదువుకొనలేని వారికి తను చదువుచెప్పించాలని ఎన్నో కలలు కన్నారు శిశిర తల్లితండ్రులు. అనుకున్నవి అన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది... తమ ఆశలన్నీ అడియాశలే అవుతాయ్ అని తెలిసేందుకు ఎంతో కాలం పట్టలేదు. సరిగ్గా వారం తర్వాత పిడుగులాంటి వార్త చెప్పింది. శేఖర్ లేకపోతే బతకలేను, పెళ్లంటూ చేసుకుంటే శేఖర్‌నే చేసుకుంటాను అని తెగేసి చెప్పింది శిశిర. అంతే ఎన్నో ఏళ్ల నుంచి కన్న కలలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. ఒక్కగానొక్క బిడ్డ కదా సర్ధిచెపితే వింటుందిలే అనుకుంటే, అక్కడా నిరాశే ఎదురైంది. పోనీలే అతనికే ఇచ్చి మూడు ముళ్లు వేయిద్దామనుకుంటే... నిలువెత్తు నిర్లక్ష్యానికి ప్రతిరూపం శేఖర్, ఆవారాగాళ్లకే అంబాసిడర్, వాడి నిజస్వరూపం ఇది చెప్పినా వినలేదు సరికదా ఒకరోజు రాత్రి ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకుని, అందరిని వదిలేసి శేఖర్‌తో వెళ్లిపోయింది. వెళ్లిపోయింది శిశిర కాదు కుటుంబపరువు అనుకున్న ఆమె తండ్రి ఉరి వేసుకుని చనిపోయాడు.
...................
నెల్లూరు టూ హైద్రాబాద్. మూసాపేట్ జంక్షన్‌కు సమీపాన ఉన్న భరత్‌నగర్లో ఒక రూమ్ అద్దెకు తీసుకున్నారు. శిశిర ఊహాలన్నీ ఎప్పటికి నిజం కావనే సత్యాన్ని శేఖర్ త్వరగానే బోధించాడు. తాగుడుకు బానిసయ్యాడు. శేఖర్‌ను మార్చుకునే ప్రయత్నంలోనే తాను ఒట్టిమనిషిని కాదని తెల్సుకుంది. మరికొన్ని నెలల్లో తాను మరో ప్రాణానికి ప్రాణం పోయబోతున్నానని తెలుసుకుంది. శుభవార్త విని సంతోషపడతాడనుకుంటే శేఖర్ రాక్షసుడిలా ప్రవర్తించాడు. అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేసాడు.శిశిర ససేమిరా అనటంతో, గర్భిణి అని చూడకుండా చితకబాది ఎటో వెళ్లిపోయాడు. ఎంతగానో ప్రయత్నిస్తే కానీ 12 రోజుల తర్వాత శేఖర్ ఆచూకీ తెలియలేదు. తన అత్తగారింట్లోనే ఉన్నాడని తెలిసి నెల్లూరుకు బయలుదేరింది. అత్తగారింటికి వెళ్లేసరికి గేటుకు వేసిన తాళం వెక్కిరించింది. పక్కింటి వారిని ఆరా తీస్తే రేపు శేఖర్ పెళ్లి.. అందుకే అందరూ కలిసి తిరుపతి వెళ్లారనే సమాధానం వచ్చింది. ఒక్కసారిగా కుప్పకూలింది శిశిర. కాళ్లకింది భూమి కంపించినట్లైంది. నడిరోడ్డు మీదే పిచ్చిదానిలా ఏడ్చింది. పాపం ఏమైందోనని కంగారుపడిన వారు ఆమెను అక్కున చేర్చుకున్నారు. అపస్మారక స్ధితికి చేరుకునే ప్రమాదం ఉండటంతో దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
....................
మీ మానవత్వానికి సలాం సార్. సకాలంలో తీసుకొచ్చారు. మీరు స్పందించకుంటే తల్లి,బిడ్డ ఇద్దరికి ప్రమాదమై ఉండేదని చెప్పాడు డాక్టర్ హర్ష. డోంట్ వర్రీ వియ్ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అంటూ అందరిని పంపించేసాడు. హర్ష ఇప్పుడు డాక్టర్ అయ్యాడు కానీ ఒకప్పుడు శిశిర క్లాస్‌మేట్. పదిమంది బావుండాలని కోరుకునే శిశిర, ఇలా అనాధగా వచ్చిందేంటని బుర్ర బ్రద్దలు కొట్టుకున్నాడు. 24గంటలు గడుస్తున్నా తన వారెవరు రాకపోవటంతో మిగతా ఫ్రెండ్స్‌కు కబురు చేసి, శిశిర ఫ్యామిలీ గురించి వాకబు చేసారు. శిశిర తండ్రి మరణంతో దిక్కు మొక్కులేనిదైన ఆమె తల్లి, నెల్లూరును వదిలి పెట్టి ఎవరో చుట్టాల వద్దకు వెళ్లిపోయిందని తెల్సింది. ఈలోపే శిశిరకు స్పృహ వచ్చిందని తెలిసి హాస్పిటల్‌కు వచ్చాడు హర్ష. శేఖర్ నమ్మకద్రోహం తెలుసుకుని చలించిపోయాడు. జీవితంతో పోరాటం ఇప్పుడే ప్రారంభమైందనే చేదు నిజాన్ని తన సహచరి విప్లవతో చెప్పించి కావాల్సినంత ధైర్యాన్ని శిశిరకు నూరిపోసాడు. అంతే కాదు సహస్ర, శిశిరను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. శిశిర ఈ లోకంలో అడుగుపెట్టే వరకు ఇద్దరిని కన్నబిడ్డలా చూసుకున్నారు.....
To b Continued...

పచ్చిబాలింత శిశిర పొట్ట చేత పట్టుకుని హైద్రాబాద్‌కు ఎందుకు వచ్చింది..?
పస్తులుండేంత అష్టకష్టాలను శిశిరఎలా అనుభవించింది..?
మీడియా మృగం బోనులోకి శిశిర ఎలా వెళ్లింది..?
రేపటి ఎపిసోడ్స్‌లో.....

( ఫేస్ బుక్ లో జర్నలిష్ట్ ల కలం నుండి వెలువడుతున్న సాక్ష్యాలు .. వారి అనుమతిలేకుండా ఏన్నోరోజుల తరువాత ఈ బ్లాగ్ లో పోష్ట్ చేస్తున్నందు కు వారు మా " తెలుగుమీడియా న్యూస్ " టీం ను క్షమిస్తారు అని అనుకుంటున్నాం ఒకవేల ఇలా బ్లాగ్ లో పెట్టడం అబ్యంతరం అయితే మీ ఫేస్ బుక్ లో మెస్సెజ్ పెడితే కచ్చితంగా ఈ బ్లాగ్ నుండి రిమూవ్ చేస్తాము
No comments:
Post a Comment