BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Wednesday, September 30, 2015

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చామంటున్న నెక్స్ట్ డిజిటల్ శ్రీకుమార్..( http://telugutv.info )

కేబుల్ రంగంలో తొలితరం ప్రముఖులు శ్రీకుమార్. సిటీ కేబుల్ అనగానే గుర్తొచ్చే వాళ్ళలో ఆయన ముందు వరసలో ఉంటారు. శాసనసభ సభావేశాల ప్రత్యక్ష ప్రసారం మొదలుకొని కేబుల్ టీవీ చరిత్రలో అనేక మైలురాళ్ళలో ఆయన కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. రెండున్నర దశాబ్దాలకు మించిన అనుభవాన్ని రంగరించి ఇప్పుడు డిజిటైజేషన్ లోనూ విభిన్నమైన మార్గంలో తనదైన ముద్ర వేస్తున్నారు. హిందుజా గ్రూప్ వారి హిట్స్ వేదిక నెక్స్ట్ డిజిటల్ కు తెలంగాణ, రాయలసీమ హెడ్ గా నియమితులైన కొద్ది కాలంలోనే అత్యంత ప్రాచుర్యం కల్పించటమే కాదు.. భారతదేశంలో తొలి ఒప్పందం చేయించిన ఘనత కూడా దక్కించుకున్నారు. ప్రసారాలు ప్రారంభించటంలోనూ అదే వేగం, చొరవ ప్రదర్శించారు. కార్పొరేట్ ఎమ్మెస్వోలతోబాటు స్థానికంగా కొందరు పెద్ద ఎమ్మెస్వోలు కూడా ఫీడ్ ఇస్తామంటూ చిన్న ఎమ్మెస్వోలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో విభిన్నమైన ఆఫర్స్ తో ముందుకొచ్చిన నెక్స్ట్ డిజిటల్ పనితీరుమీద, ప్రత్యేకతలమీద, అనుమానాలమీద శ్రీకుమార్ తో తెలుగుటీవీ జరిపిన ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు:

NXT Noida
నెక్స్ట్ డిజిటల్ కూడా ఒక రకంగా కార్పొరేట్ ఎమ్మెస్వో కదా… మిగతా కార్పొరేట్ ఎమ్మెస్వోలకూ, మీకూ తేడా ఏంటి ?
ఇది కార్పొరేట్ సంస్థ అనే మాట నిజం. అయితే మా పరిధిలో ఎమ్మెస్వోలు ఉంటారు. వాళ్ళు ఎమ్మెస్వోలుగా కొనసాగుతారు. బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు చేసుకుంటారు. మా ద్వారా అదనపు సౌకర్యాలు అందుకుంటారు. అంతే తప్ప వాళ్ళ అస్తిత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని మేం మా పరిధిలోకి తీసుకోం. వాళ్ళ స్వేచ్ఛను గౌరవిస్తాం. దశాబ్దాల తరబడి వాళ్ళు నిర్మించుకుంటూ వచ్చిన కేబుల్ వ్యాపారాన్ని మేం లాక్కోవటం లేదు. వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకోవటం లేదు. వాటా అడగటం లేదు. మేం అందించే సేవలకు కనెక్షన్ కి ఇంత చొప్పున సర్వీస్ చార్జీలు తీసుకుంటున్నాం. వాళ్ళను ఎమ్మెస్వోలుగా గుర్తిస్తున్నాం. గుర్తింపును కాపాడుతున్నాం. మీరు అంటున్న కార్పొరేట్ ఎమ్మెస్వోల పరిధిలో ఫీడ్ తీసుకునే వాళ్ళు ఎమ్మెస్వోలుగా మిగలరు. అదే అసలు తేడా.

ఎమ్మెస్వో లైసెన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఫీడ్ తీసున్నంతమాత్రాన ఎమ్మెస్వోలు కాకుండా పోతారా? 
అవును. టెక్నికల్ గా వాళ్లను ఎమ్మెస్వోలుగా గుర్తించే వీల్లేదు. లైసెన్స్ తీసుకున్నవాళ్ళందరూ ఎమ్మెస్వోలు కాలేరు. సొంతగా బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకోగలగాలి, సొంతగా హెడ్ ఎండ్ పెట్టుకోవాలి. చందాదారుల దరఖాస్తు ఫారాలను ట్రాయ్ కి సమర్పించాలి. కాస్ నిర్వహణ వాళ్ళనుంచే జరగాలి. అప్పుడే వాళ్ళను ప్రభుత్వం డిజిటల్ ఎమ్మెస్వోలుగా గుర్తిస్తుంది.

మరి ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ సంగతేంటి ?
లైసెన్స్ తీసుకోగానే సరిపోదు. అది అమలులోకి రావాలి. అంటే సొంత హెడ్ ఎండ్ పెట్టుకోవాలి. పెద్ద ఎమ్మెస్వో నుంచి ఫీడ్ తీసుకుంటే అస్తిత్వం పోయినట్టే. అప్పుడు లైసెన్స్ కూడా ఆటోమేటిక్ గా రద్దవుతుంది. ఇక ఎప్పటికీ మామూలు ఆపరేటర్ గా మిగిలిపోవాల్సి వస్తుంది. మొదటి రెండు దశల కోసం లైసెన్స్ తీసుకొని కూడా వాడుకోని వాళ్ళ లైసెన్సులు రద్దయిన సంగతి తెలుసు కదా.. ఇవీ అంతే

నెక్స్ట్ డిజిటల్ నుంచి ఫీడ్ తీసుకున్నా అదే పరిస్థితి వస్తుంది కదా?
నెక్స్ట్ డిజిటల్ అందించే సేవలు రెండు రకాలుగా ఉంటాయి. ఎమ్మెస్వోగా లైసెన్స్ తీసుకున్నవాళ్ళకు అందించే సేవలున్నాయి. లైసెన్స్ లేని వాళ్ళకు అందించే సేవలు కూడా ఉన్నాయి. లైసెన్స్ ఉన్నవాళ్ళు సొంతగా బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు చేసుకోవచ్చు. వాళ్ళకు మేమిచ్చే హెడ్ ఎండ్ సొల్యూషన్ తో వాళ్ళ పంపిణీ సాగుతుంది. కాబట్టి వాళ్ళ ఎమ్మెస్వో లైసెన్స్ కు ఢోకా లేదు. ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన వర్క్ షాప్ లో ప్రభుత్వ సలహాదారు కూడా అదే విషయం స్పష్టం చేశారు. ఇది అనేక రాష్ట్రాలలో డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ పొందినవారి సమక్షంలోనే జరిగింది. అన్ని అనుమానాలు నివృత్తి చేస్తూ నెక్స్ట్ డిజిటల్ కింద ఉండే ఎమ్మెస్వోల హోదాకు ఆయన వివరణ ఇచ్చారు. ఇక రెండో రకమైన సేవలు ఎమ్మెస్వో లైసెన్స్ లేనివాళ్ళకు మేమే ఎమ్మెస్వోగా ఉంటూ అందించే సేవలు.వాళ్ళు బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు చేసుకునే వీలు లేదు కాబట్టి వాళ్ళకు మేమే ఫీడ్ అందిస్తాం.

NXT Pooja

ఎమ్మెస్వోల సంగతి అలా ఉంచితే…. మీ దగ్గర ఫీడ్ తీసుకునే వాళ్ళకూ, ఇతర ఎమ్మెస్వోల దగ్గర ఫీడ్ తీసుకునేవాళ్ళకూ తేడా ఏంటి ?


కచ్చితంగా తేడా ఉంది. ఎమ్మెస్వోల దగ్గర ఫీడ్ తీసుకునేవాళ్ళు ఎప్పటికీ ఎమ్మెస్వో కాలేరు. కానీ మా దగ్గర ఫీడ్ తీసుకుంటూ ఉంటే తరువాత కాలంలోనైనా వాళ్ళు ఎమ్మెస్వో లైసెన్స్ తీసుకొని ఎమ్మెస్వో కాదలచుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. అప్పుడు కూడా వాళ్ళకు మా సేవలు అవసరమవుతాయి. అప్పుడు వాళ్ళ ఒప్పందాల ప్రకారం నడుపుకుంటూ నెక్స్ట్ డిజిటల్ సేవలు అందుకుంటారు. ఆ విధంగా మేం అందించే రెండు రకాల సేవల్లో ఎవరికి అనువైనది వాళ్ళు ఎంచుకోవచ్చు.. ఎమ్మెస్వో లైసెన్స్ ఉన్నవాళ్ళకూ, లేని వాళ్ళకూ వేరువేరుగా పథకాలు రూపొందించి అందించటం మా ప్రత్యేకత.

నెక్స్ట్ డిజిటల్ ఏ విధంగా భిన్నమైనదో చెప్పండి.. అంటే మీరందించే ప్రత్యేకమైన సేవలేంటి ?
చాలా ఉన్నాయి. డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ కాపాడుకోవటం, నెట్ వర్క్ మీద యాజమాన్యాన్ని నిలుపుకోవటం,సెట్ టాప్ బాక్స్ మీద యాజమాన్యం లాంటివి ముందే చెప్పాను. స్థానికంగా కేబుల్ చానల్స్ జోడించుకోవచ్చు. చందాదారు చాయిస్ కి అనుగుణంగా పాకేజీ, బిల్లింగ్ చేసుకునే స్వేచ్ఛ మా ఎమ్మెస్వోకి ఉంటుంది. ఫీడ్ కోసం ఎలాంటి బాండ్ విడ్త్ చార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు. వాల్యూ యాడెడ్ సేవలు అందుకోవచ్చు. రికార్డింగ్ సౌకర్యం కూడా ఉండే ఎంపెగ్4 సెట్ టాప్ బాక్సులిస్తున్నాం. ఏడాది తరువాత కూడా సెట్ టాప్ బాక్స్ మెయింటెనెన్స్ చూస్తాం. ఒక్కో కనెక్షన్ కి మా సేవలకు గాని నిర్దిష్టమైన ఫీజు తీసుకోవటమే తప్ప ఆదాయంలో వాటా అడగం. పెద్ద ఎమ్మెస్వోలమని చెప్పుకుంటూ ఫీడ్ ఇస్తామనే వాళ్ళలాగా నెట్ వర్క్ యాజమాన్యంలో వాటా కూడా అడగం. మా అగ్రిమెంట్ చాలా పారదర్శకంగా ఉంటుంది. ఎలాంటి దాపరికాలూ, దాచుకోవటాలూ, దోచుకోవటాలూ ఉండవు.

దోచుకోవటం లేదంటున్నారు గాని మీ పరిధిలోకి చాలామంది స్వతంత్ర ఎమ్మెస్వోలు వచ్చే అవకాశముంది. అంటే వాళ్ళందరి తరఫునా మీకే క్యారేజ్ ఫీజ్ ఆదాయం వస్తుంది కదా ? 
కాదు. మాకు కారేజ్ ఫీజులో ఎలాంటి వాటా కూడా ఉండదు. ఎమ్మెస్వో అంటే ఎమ్మెస్వోనే. వాళ్ళే ఫ్రీ టు ఎయిర్ చానల్స్ నుంచి కారేజ్ ఫీజు తీసుకుంటారు. మేం తలదూర్చం. వాటా తీసుకోం. ముందు నుంచీ అదే చెబుతున్నాం. మళ్ళీ చెబుతున్నా. ఎలాంటి దాపరికాలకూ చోటు లేదు. మేం న్యాయబద్ధంగా, పారదర్శకంగా ఉంటాం. మిగతా కార్పొరేట్ ఎమ్మెస్వోలకంటే ఈ విషయంలో కూడా మేం భిన్నంగా ఉంటాం. ఇక్కడ మీకు ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. కారేజ్ ఫీజులో వాటా తీసుకోకపోవటమే కాదు, చానల్స్ తో కారేజ్ ఫీజు బేరమాడుకోవటానికి కూడా సాయం చేస్తాం. మా ఎమ్మెస్వోలు ఉమ్మడిగా డిమాండ్ చేస్తే ఎక్కువ లాభం పొందుతారు. ఎక్కువ కారేజ్ ఫీజు వసూలు చేసుకోగలుగుతారు. అందరి తరఫునా కేబుల్ చానల్స్ నడిపి లభం పొందటానికి కూడా ఎమ్మెస్వోలను ఏకం చేస్తున్నాం. మా ఎమ్మెస్వోలు వీలైనంత ఎక్కువ లాభం పొందాలన్నదే మా లక్ష్యం.

మరి ఆపరేటర్లకు ఇన్వాయిస్ ఇచ్చేదెవరు ?
మా పరిధిలో ఉండే ఎమ్మెస్వోలకు ఆ అధికారం ఉంటుంది. ఇతర ఎమ్మెస్వోలనుంచి ఫీడ్ తీసుకునే ఎమ్మెస్వోలకు ఆ అధికారం ఉండదు. పెద్ద ఎమ్మెస్వో ఇచ్చిన ఇన్వాయిస్ లు తన ప్రాంతంలోని ఆపరేటర్లకు పంచటం వరకే అతడి పాత్ర పరిమితం. మా ఎమ్మెస్వోలకు పూర్తి స్వతంత్రత ఉంటుందనటానికి ఇది మరొక ఉదాహరణ.

ఫీడ్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళను వేధిస్తున్న ఇంకో పెద్ద అనుమానం.. వాళ్ళ సొంత చానల్స్ విషయం. ఎక్కడికక్కడ సొంత చానల్స్ జోడించుకోవటం సాధ్యమేనని కొంతమంది ఎమ్మెస్వోలు చెబుతున్నారు. మీరేమంటారు ?
టెక్నికల్ గా వీలవుతుంది. కానీ డిజిటైజేషన్ చట్టం ఒప్పుకోదు. ఎక్కడికక్కడ కేబుల్ చానల్ కలుపుకోవటానికి వీల్లేదు. ఎన్ క్రిప్షన్ జరగాల్సిందే. అంటే, ఆ చానల్ ను వాళ్ళు ఫీడ్ అందుకుంటున్న ఎమ్మెస్వో డిజిటల్ హెడ్ ఎండ్ కి పంపి అక్కడినుంచి అన్ని చానల్స్ తోబాటే ఇది కూడా వచ్చేట్టు చూసుకోవాలి. ఫీడ్ తెచ్చుకోవటానికి బ్రాడ్ బాండ్ ఖర్చు భరించినట్టే, వాళ్ళ లోకల్ చానల్స్ కు కూడా హెడ్ ఎండ్ కు పంపుకోవటానికి ఖర్చు భరించాలి. పైగా, ఎన్ని చానల్స్ ఇస్తారనేది కూడా అనుమానమే.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మీ టార్గెట్ ఎంత ఉంటుంది ?
నా పరిధిలో తెలంగాణ రాష్ట్రంతోబాటు రాయలసీమ కూడా ఉంది. కనీసం 30-35 లక్షల కనెక్షన్లకు హిట్స్ సర్వీస్ అందించాలని అనుకుంటున్నాం.

మొదటి రెండు దశల డిజిటైజేషన్ లో లేకపోవటం లోపంగా భావిస్తున్నారా?
కొంతవరకు నిజమే. మొదటి రెండు దశల్లో ఉన్న కార్పొరేట్ ఎమ్మెస్వోలు బలపడ్డారు. చిన్న ఎమ్మెస్వోలు వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోయారు. ప్రారంభం నుంచి ఉండి ఉంటే మరింత మంది ఎమ్మెస్వోల స్వతంత్రతను కాపాడగలిగే వాళ్ళం. పైగా, మొదటి నుంచి ఉంటే ఈ పాటికే హిట్స్ ప్రయోజనాలు అందరికీ తెలిసి ఉండేవి కాబట్టి ప్రచారానికి ఇంతగా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు. ఏమైనా, హిట్స్ అవసరం మూడు, నాలుగు దశల్లోనే ఎక్కువగా ఉందని అనుకుంటున్నాం. ఆ విధంగా చూస్తే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్టే.

జైన్ హిట్స్ ప్రభావం మీమీద ఎలా ఉంది ?
జైన్ హిట్స్ ఏ విధంగానూ మాకు పోటీ కాదు. కానీ జైన్ హిట్స్ వైఫల్యం వలన మొత్తం హిట్స్ నే అనుమానించే పరిస్థితి రావటంతో నెక్స్ట్ డిజిటల్ మళ్ళీ హిట్స్ వ్యవస్థ మీద నమ్మకాన్ని పెంచే పనిలో ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. మా పాకేజీలు, లక్ష్యాలు, ఫిలాసఫీ అందరికీ అర్థమయ్యాయి. పెద్ద ఎమ్మెస్వోల ప్రతికూల ప్రచారానికి తెరపడింది. వాళ్ళు ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారు. ఇప్పుడు ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు హిట్స్ అనగానే హిందుజా హిట్స్ వేదిక నెక్స్ట్ డిజిటల్ మాత్రమే అనే పరిస్థితి వచ్చింది.

చివరగా ఒక ప్రశ్న. ఇప్పుడు జరుగుతున్న డిజిటైజేషన్ పోరు అవాంఛనీయ ధోరణులకు దారితీయవచ్చుననే అనుమానాలున్నాయి. ఒక ఎమ్మెస్వో బాక్సులు మరో ఎమ్మెస్వో ఎత్తుకెళ్ళటం ద్వారా కనెక్షన్లు సొంతం చేసుకోవటానికి (భొక్ష్ శ్వప్పింగ్) ప్రయత్నాలు జరుగుతాయేమో అంటున్నారు. మీరేమంటారు ?

అనుమానాలున్నమాట నిజమే. ఊహిస్తున్న పరిస్థితేకాని ఆశిస్తున్నది మాత్రం కాదు. మొదటి రెండు దశల్లో డిజిటైజేషన్ జరిగిన చోట చందా పాకేజీలు అసంతృప్తికరంగా ఉన్నప్పుడు, ఆపరేటర్లు అసంతృప్తితో ఉన్నప్పుడు, ఎమ్మెస్వోలు నిరంకుశంగా వ్యవహరించినప్పుడు ఇటువంటి పరిస్థితికి ఆస్కారముంటుంది. అందుకే కేబుల్ ఆపరేటర్ల ప్రయోజనాలు కాపాడటం కూడా ముఖ్యం. మార్కెట్ ని అలా వదిలేస్తే బలం ఉన్నవాళ్ళదే రాజ్యమవుతుంది. కార్పొరేట్ ఎమ్మెస్వోల ధాటికి చిన్న ఎమ్మెస్వోలు బలవుతారు. ఒకసారి మొదలైందంటే ఆపటం కష్టం. కానీ చందాదారుకు కూడా తెలియకుండా సర్వీస్ ప్రొవైడర్ మారిపోవటానికి వీలుకల్పించేలా సెట్ టాప్ బాక్సులు మార్చేసే ధోరణిని అడ్డుకోవటానికి ప్రభుత్వం చట్టం చేస్తుందేమో చూడాలి.


source :- http://telugutv.infoNxt Digital

No comments: