జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72లోని ప్రశాసన్‌నగర్‌లో నివాసం ఉండే డీ శ్రీదేవికి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 22లో ప్లాట్ నంబర్ 395లో 3063 గజాల స్థలం ఉంది. జూబ్లీహిల్స్ సొసైటీలో భూమికి సంబంధించిన అన్ని పత్రాలు కూడా ఆమె పేరు మీదనే ఉన్నాయి. గత కొంతకాలంగా ఈ స్థలంపై సొసైటీకి ఆమె చార్జీలు కూడా చెల్లిస్తున్నారు అని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 2లో నివసించే వ్యాపారవేత్త, సీవీఆర్ చానల్ అధినేత, ఆయన కూతురు నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా తన ప్లాట్‌లోకి అక్రమంగా ప్రవేశించారని, ఈ విషయంపై ప్రశ్నించిన తనను, తన కుటుంబ సభ్యులను అంతం చేస్తానంటూ బెదిరిస్తున్నారన్న ఆరోపణలతో శ్రీదేవి కోర్టును ఆశ్రయించారు.
ఈ ప్లాటును తమదేనంటూ మరొకరికి విక్రయించడానికి ప్రయత్నాలు చేపట్టారని కోర్టుకు ఆమె తెలిపారు. దాంతో వీరిపై కేసు నమోదు చేయాలంటూ కోర్టు జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో చలసాని వెంకటేశ్వర్‌రావు, చలసాని సందీపలపై ఐపీసీ సెక్షన్ 406, 420, 468, 471, 506ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భూవివాదంలో కోర్టు ఆదేశాలతో చలసాని వెంకటేశ్వర్‌రావు, అతని కూతురు సందీపలపై కేసు నమోదు చేసిన మాట వాస్తవమేనని జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి ధ్రువీకరించారు.
సదరు యాజమాన్యియానికి వెనకవుండి పధకరచన చేసేది CEO నర్సింహారావని .. అతని అనుచలు ఈమెను బెదిరించారని సమాచారం.. బెదిరింప్ కాల్ డీటైల్స్ .. బెదిరించిన వారిని అరెష్టుచేస్తే కలుగులో దాక్కున్న వెలుకలు చాలానే బైట పడతాయి... ఇదే కాదు ఇప్పుడున్న ఆఫీస్ స్థలం కూడా చాలా వరకు కబ్జా చేసినట్టు అరోపలను వస్తున్నాయి ..ఇలా కబ్జాలు చేసిన స్థలాలు చాలానే ఉన్నాయి అని తెలుస్తోంది ఇప్పటీకే ఇలాంటి వ్యవహారాలపై ద్రృష్టి పెట్టిన కేసిఆర్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొన్నట్టు తెలుస్తోంది
sorce :- http://telanganamedia.net
sorce :- http://telanganamedia.net
No comments:
Post a Comment