డాక్టర్ చిగురుపాటి జయరామ్ స్థాపించిన ఎక్స్ ప్రెస్ టీవీ కి సీనియర్ ఎడిటర్ నేమాని భాస్కర్ రాజీనామా చేయడం, ఆయనకు మద్దతుగా ఒక 21 మంది జర్నలిస్టులు వైదొలగడం గత 48 గంటల్లో జరిగాయి. ఒక ఎడిటర్ కోసం ఇంతమంది వైదొలగడం ఈ మధ్య కాలంలో ఇదే ప్రథమం.
టీవీ-9 నుంచి దినేష్ ఆకుల ను సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (ఎడిటోరియల్ అండ్ ఆపరేషన్స్) గా నియమించినప్పటి నుంచి అసంతృప్తి తో ఉన్న భాస్కర్... వై. రాజశేఖర్ లాగా నరేంద్ర చౌదరి గారి ఎన్-టీవీ కి వెళ్లిపోతారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉన్నది ఉంది. అయితే ఇంతమంది తో కూడిన నేమాని భాస్కర్ బృందాన్ని తీసుకునే పరిస్థితి చౌదరి గారి చానెల్ లో లేదు. కాబట్టి భాస్కర్... త్వరలో రానున్న ఒక ఛానెల్ లోకి వెళతారని భావిస్తున్నారు.పోతూపోతూ నేమాని భాస్కర్... చిగురుపాటికి ఒక ఆరు పేజీల మెయిల్ రాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మాటలకు, చేతలకు పొంతన లేకపోవడం, దినేష్ ను తెచ్చే తప్పుడు తనను సంప్రదించకపోవడం.... వంటి అంశాలు అందులో పేర్కొన్నారు హెచ్-ఎం టీవీ లో అనేక మంది ఉద్యోగాలు పీకేసిన అపవాదు మూటగట్టుకుని... చివరకు మళ్ళీ ఎన్-టీవీ కి వచ్చిన వై.రాజశేఖర్ తన పని తాను చేసుకుపోతున్నారు. "వచ్చాడు... ఉద్యోగాలు పీకాడు... ఉడాయించాడు. దీనివల్ల ఏమి సాధించాడు? మా కుటుంబాల ఉసురు తగలకపోదు," అని ఒక బాధిత జర్నలిస్టు ఆవేదనతో అన్నారు

source :- http://apmediakaburlu.blogspot.in/2015/01/21-48.html
No comments:
Post a Comment