మీడియాలో పెద్దల్లా ఎందుకు నీతివాక్యాలు చెబుతారు ..మీడియాలో మేనే మెంట్లను కాకా పట్టడం .. ఎవ్వరి తెలీకుండా రణ్కు సాగించడం అందరూ చూస్తున్నారని తెల్సినా అదేదో గొప్ప చేసినట్టు బిల్డప్... తనకిష్టమైన వాల్లకోసం మరొకరి పొట్ట గొట్టే సివిఆర్CEO నర్సింహారావు ..ఐన్యూస్ లో " syam "లాంటి పెద్దలు చాలామందే వున్నారు ...రక్తం మరిగిన పులి లాంటి వాల్ల పాపం ఎప్పుడు పండుతుండో మరి వీల్లకు ఎక్కడా ఉద్యోగాలు రాకుoడా చూస్తే ఆబాదేదో అప్పుడు తెలుస్తుంది .. మరి మీడియా యాజమాన్యాలు ఇలాంటి వారి పట్ల కాస్త నిఘా పెట్టండి చాలా దారుణాలు తెలుస్తాయి ...
ఐన్యూస్ లో " syam " స్కెచ్ వేశాడంటే ..పెడ్డ పోస్టుళ్ళొ వాల్లనుష్టూడియోలో వీడియో లు తీసి మరీ బైటికి పంపించగల తెలివి తేటలున్న మేధావి .. చివరకు హెఆర్ లను కూడా ఉద్యోగా లు ఉడగొట్టగల టాలెంట్ ఆయనది ..ఒకటా రెండా ...తనకు నచ్చని వారికి ఐన్యూస్ లో వుద్యోగాలు రానీయకుండా చానల్ వదిలి వెల్లిన వారికోసం ఆపోష్టును అలానే అట్టి పెట్టి న ఘనుడు ..ఎందుకంటే డబ్బులు ఇప్పిచగలవాల్లే ఆయన దృష్టిలో టాలెంట్ వున్న వాల్లు ఈ విషయం ఇప్పుడిప్పుడే సదరు మేనేజ్ మెట్ కు తెలిసినట్టు సమాచారం మరి ఈయన గారి పాపం ఎప్పుడు పండుతుండో మరి
మీడియా… అటు సినిమా వాళ్లంత కాదు…. అలా అని సాధారణ జనంలా కాదు…. మధ్యలో ఉంటారు. అంటే… వాళ్లంతా విచ్చలవిడిగా ఉండరు. అలా అని ఊరికే ఉండరు. ఇదే సమస్య. దీంతో కొంతమంది అలా, కొందరు ఇలా ఉంటున్నారు. దీంతో అలా ఉన్నవాళ్లు ఇలా ఉన్నవాళ్లని కెలికినప్పుడు సమస్యలు పుడుతున్నాయి. అవి పదవులకే ఎసరు పెడుతున్నాయి. పరువును గంగపాలు చేస్తున్నాయి. అలా కాకపోతే అవతలి వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. (పైన చెప్పినట్టు అందరు సినిమా వాళ్లు అలానే ఉంటారనికాదు)
తెలుగు టీవీ మీడియాలో ప్రేమలు, పెళ్లిళ్లూ సహజమే. వాటిలో చాలా అసహజంగా ఉండడమే ఇబ్బంది. 40 ఏళ్ల యువకుడికి 20 ఏళ్ల మహిళతో పెళ్లి. అప్పటికే పెళ్లై, పిల్లలు కూడా ఉన్న అమ్మాయికి, పెళ్లికాని ప్రసాదుతో వివాహం. ఇవన్నీ కాకపోతే… నాకు 30, నీకు 30, మన ఫ్లాటు నెంబర్ 30 అంటూ సహజీవనం. ఇదికాకపోతే… ఇంకా పలు రకాలు. ఇక స్క్రీను మీద కనిపించే పుంగవుల కథలు కోకొల్లలు. కేసులు, గొడవలు, దాడులు, ఆస్పత్రులు… అబ్బో… అదో యాసిడ్ చరిత్ర.
ఇక విడిపోవడాలు… కొత్త కలయికలు మరీ కామన్. మైండ్‌సెట్ సెట్ అవలేదని వదిలేసుకోవడం, వేరే వారితో జతకట్టేసుకోవడం వెరీ కామన్. ఇదంతా అవేర్‌నెస్. దీన్ని తప్పుపడితే తుప్పు వదలిపోద్ది. ఎవరి స్వేచ్ఛ వాళ్లది. ఇక అనధికారికంగా… వివాహ ఇతర పరిచయాలు, థై రిలేషన్స్ కనపడకుండా కానిచ్చేస్తుంటారని చెప్పుకుంటారు. అనుభవం ఉన్నవాళ్లు నిజమేనంటారు. ఈ భిన్న సంస్కృతులకు స్క్రీను రాణులేమీ మినహాయింపు కాదు. అలా అని అందరూ అలాంటి వారు కాదు.
చాలా మంది స్క్రీను రాణుల చరిత్ర పుటల్లో మారు మనువులు మామూలే. పెనిమిటి పోయి కాదు… ఎనిమిటీ ఎక్కువై విడిపోయి… ఇలాంటి వారిలో ఛానళ్లకు పెద్దతలకాయలుగా పనిచేస్తున్న వారి నుంచి మామూలు వ్యాఖ్యాతలుగా పనిచేసే వారి వరకు ఉన్నారు. అయితే ఈ కబుర్లలో వదంతులు కొన్నైతే, నిజాలు మరికొన్ని. అవీ ఇవీ రెండూ ఉంటాయి. నిజాల కారణంగా వదంతులని నమ్మాల్సి వస్తుంది. నిలకడ మీద నిజం బయటపడుతుంది.
ఇవన్నీ ఒక బాపతైతే… మరో బాపతుంది. అది దారుణమైనది. ఇష్టంతో ఇద్దరు ఎలా పోతే మనకేంటి. కానీ ఒకరి ఇష్టానికి మరొకరిని బలి చేయాలనుకోవడమే పెద్ద సమస్య. ఛానళ్ల బాసుల కోరికల కొలిమిలో కాలిపోయిన కోకలెన్నో. కాదన్నారో కాగితం చిరిగిపోతుంది. ఒక స్క్రీను ఎక్కాలంటే, పడకింటి మెట్లు తొక్కాల్సిందే అనే కాన్సెప్ట్ కూడా కొన్ని కొలువుల్లో ఉండడం దరిద్రమే. ఎలాగైనా స్క్రీనుని ఏలాలనే తపనతో ఒక్కసారే కదా, గుట్టుచప్పుడు కాదు కదా అనుకుంటారు. కానీ ఒకసారి తొక్కితే ఇక అంతే… ముద్రవేసి ముం… చేస్తారు.
ఛానళ్ల బాసులు, ఎడిటర్ల పై ఎన్నో అభియోగాలు. కూలిన కాపురాలు. ఇవన్నీ విన్న వార్తలే. తాజాగా ఈ లిస్టులో హెచ్ఆర్ పుంగవులు కూడా వేలు, కాలు, వేరే అంగాలు పెట్టేస్తున్నారు. కొన్ని చోట్ల హెచ్ఆర్ పురుషులే తమ కామపైత్యాన్ని ఉద్యోగం కోసం వచ్చే వారిపై చూపిస్తున్నట్టు చాలా కంప్లైంట్లున్నాయి. వీటిలో తాజాగా ఒకానొక ఛానెల్లో పెద్ద తప్పే జరిగిందని ఇన్ఫర్మేషన్.
ఊరికే ఉంటే మనిషికి గొడ్డుకి తేడా ఏటుంటదీ… కూసింత గులా పోషణ ఉండాలని అనుకున్నాడో ఏమో… ఒక యాంకరమ్మను కెళికాడట. గోకడానికి ట్రై చేశాడట. అయితే అది కాంక్రీటు గోడని మనోడికి ఆలస్యంగా తెలిసింది. గోళ్లు అరిగి, రక్తం కారి, సెప్టిక్ అయ్యే దాకా వచ్చింది పరిస్థితి. అందరితో కాకపోయినా, నచ్చని వాళ్లతో నిప్పులా ఉండే ఆ అమ్మడు చెప్పిచ్చుకు కొడతానంది. అంతటితో ఆగలేదు… ఆధారాలతో సహా అధినేతను ఆశ్రయించింది. మనోడికి దిమ్మదిరిగి బొమ్మ కనిపించింది.
నేను దేవాలయంలా ఎంతో పవిత్రంగా చూసుకునే నా ఛానల్‌లో… దేవతల్లాంటి నా ఇంటి ఆడపడుచుల పై నువ్వు వేలు, కాలు ఏవిపడితే అవి పెట్టేయడానికి ట్రై చేస్తావా అని కుర్చీస్వామికి కోపమొచ్చింది. లాత్ మార్ కే బాహర్ ఫేంక్‌దో సాలే కో అన్నాడట. చచ్చాను మహాప్రభో ఈ ఒక్క తప్పూ కాయండని కాళ్లు పట్టుకున్నాడట. వేరే ఏదైనా తప్పైతే కాసేవాడినే, నువ్వు డైరెక్టుగా ఆ తప్పే చేసేశావ్… కాయడాల్లేవ్… కనిపిస్తే కా…కోసి చేతిలో పెడితా అన్నాడట.
కాళ్లు సరిపోలేదని వేరేవి కూడా పట్టుకున్నాడట. అదేనండీ… కాళ్లా వేళ్లా అంటారు కదా.. అలా. ఒక్క నెల సమయం ఇవ్వండి. ఈలోగా ఏదో ఒక గోదారి చూసుకుని వెళ్లిపోతా అని అడుక్కున్నాడట. ఆఖరికి ఆ పెద్దసారు ఒప్పుకున్నాడట. ఆ అమ్మోరి విశ్వరూప దర్శనంతో బాబుకి జ్ఞానోదయం అయ్యి, ఆమెకు కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పాడట. మరో నెల రోజుల్లో కుర్చీ ఖాళీ చేసి వెళ్లిపోనున్నాడు. ఏ కొలువు? ఎవరాయన? ఎక్కడిది అని మాత్రం అడక్కండి. అది మీ జ్ఞానానికే వదిలేశాం.
ఇది కథ. ఇది కథ కాదు, హెచ్ఆర్‌లకు హెచ్చరిక. బాసు చేస్తున్నాడు కదా అని మీరూ చేస్తే బాక్సు బద్దలైపోద్ది. చూశారుగా పైన స్టోరీ మారిపోయింది. కాబట్టి… మీ గులానందాలను గూట్లో పెట్టేయండి. గప్‌చుప్‌గా పనిచేసుకోండి. జీతాలు, జీవితాలు మన చేతుల్లో ఉన్నాయి కదా అని మీడియాలో వేషాలు వేస్తే… ఎవరికైనా దేడ్ తడి పోచమ్మ గుడే. పదవి పెరిగే కొద్దీ ఈ తీటలు పెరగడం బాగా కామన్‌గా కనిపిస్తోంది మీడియాలో. ఫేమ్‌లో ఉన్నవాళ్లే ఫ్రేముల్లోకి ఎక్కేశారు. మనమెంత… మైండ్ ఇట్.
No comments:
Post a Comment