తెలంగాణలో 9 నంబర్ ఛానల్ కనిపించడం లేదని ఫీలయ్యే వారికి ఒక వార్త… టీజీ9 అనే టీవీ వచ్చేస్తోంది. టీవీ9 ఖాళీ చేసిన ప్లేసుని భర్తీ చేసుకునే దిశగా అడుగులు వేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త రికార్డులతో హైదరాబాద్ మార్కెట్ పెరుగుతూనే ఉంది.
అంతేకాదు టీజీ అంటూ తెలంగాణ వీక్షకులు ఓన్ చేసుకునేలా రావాలన్నది ప్లాన్. అంటే తెలంగాణ మార్కెట్‌లో మాత్రమే పోటీపడే వారికి గట్టిగా కాంపిటీషన్ ఇచ్చి, మిగిలిన మార్కెట్‌ను కొల్లగొట్టే ఆలోచన. తెలంగాణ ఎన్నారైలు దీనికి పెట్టుబడిదారులు. ఇది పూర్తిగా ఎక్స్‌క్లూజివ్ తెలంగాణ న్యూస్ ఛానల్.
టీజీ9… టీజీ తెలంగాణను రిప్రెజెంట్ చేస్తోంది. 9 మొన్నటి వరకు నంబర్ వన్ స్థానాన్ని పొందిన లీడింగ్ ఛానల్‌ను గుర్తు చేస్తుంది. ఇవే వ్యూయర్‌ను తమ దగ్గరకు రాబడతాయి, నిల్చోబెడతాయని ఆశిస్తున్నారు. టీఎంఎస్ఓల పుణ్యమాని పోటీ నుంచి కనుమరుమైన 9 స్థానాన్ని కబ్జా చేసే యత్నమే ఈ ఛానల్ లక్ష్యం.
ఈ ఛానల్ ప్రణాళికలు కూడా భారీగానే ఉన్నాయి. ఏదో ఒక పచారీ కొట్టు పెట్టినట్టు ఇరుకు ఇరుకుగా కాకుండా, భారీగానే పెడుతున్నారట. మంచి ఎక్విప్‌మెంట్‌తో పాటు ఛానల్ అంటే ఇలా ఉండాలి అనేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం 20000 స్క్వేర్ ఫీట్ స్థలాన్ని కేటాయించారట. అది కూడా హైదరాబాద్‌లో ప్రైమ్ ఏరియాలో, అందరి దృష్టి పడేలా నిర్మించనున్నారట.
ఇక నియామకాలకు దీపావళి ముహూర్తం ఖరారు చేసుకున్నారని సమాచారం. దీపావళి నుంచి రిక్రూట్‌మెంట్ స్టార్ట్ చేసి డిసెంబర్‌కు పూర్తి చేయాలని టార్గెట్. 2015 సంక్రాంతి తర్వాత ఛానల్‌ను గాల్లోకి పంపాలని ప్లాన్. అయితే ఈ ఎన్నారైల పేర్లు మాత్రం బయటకి రావడం లేదు. అంతా గోప్యంగా జరుగుతోంది. కానీ రవీందర్ అనే జర్నలిస్టు మొత్తం వ్యవహారాలు చూసుకుంటున్నారని టాక్. సాక్షి పత్రికలో పనిచేసే పాత్రికేయుడి కనుసన్నల్లోనే ప్రణాళికలు రూపొందుతున్నాయని ఇన్ఫర్మేషన్. మరికొన్ని రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.
No comments:
Post a Comment