బీసీసీఐ- జీ టెలివిజన్‌ల మధ్య కుదిరిన ఐదేళ్ల ప్రసార ఒప్పందం రద్దయినట్లు ఓ నివేదిక వెల్లడించింది. దీనితో వచ్చే నెలలో దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌లతో భారత్ ఆడనున్న వన్డే సిరీస్ ప్రసారం సందేహంలో పడింది. జూన్ 26 నుంచి జూలై 1 వరకు జరిగే ఈ వన్డే సిరీస్ జరగనుంది. బీసీసీఐ- జీ ఒప్పందం ప్రకారం తటస్థ వేదికల్లో భారత్ ఆడే 25 మ్యాచ్‌లను జీ టెలివిజన్ ప్రసారం చేయనుంది.
ఇందుకోసం బీసీసీఐతో జీ టెలివిజన్ 2,19,000 అమెరికన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందం అమలుకు అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో మరో బ్రాడ్‌కాస్టర్‌తో బీసీసీఐ చర్చలు జరుపుతోందని క్రిక్‌ఇన్ఫో నివేదికలు వెల్లడించినట్లు పీటీఐ తెలిపింది. ఇదిలా ఉంటే దీనిపై మాట్లాడేందుకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు లలిత్ మోడి నిరాకరించారు.
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
-
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది.
ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా
లుంగికట్టుకు...
6 years ago
No comments:
Post a Comment