BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Thursday, May 31, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -4 ---->డాక్టర్ ఇన్నయ్య - రచయిత



గోలకొండ పత్రిక

సురవరం ప్రతాపరెడ్డి స్థాపించిన తెలంగాణ వాణిగా గోలకొండ పత్రిక వుండేది. నేనెరిగిన తరువాం దేవులపల్లి రామానుజరావు సంపాదకీయాలు రాస్తుండేవారు. పేరు నూకల నరోత్తమరెడ్డి అని వుండేది. హైదరాబాద్ లో బషీర్ బాగ్ లో కార్యాలయం వుండేది. పత్రిక అచ్చుగాని, తీరుగాని ఆకర్షణీయంగా వుండేది కాదు. అచ్చుతప్పులుండేవి.అయితే 1925లోనే నైజాం పాలనలో తెలుగు పత్రిక స్థాపించి సురవరం వారు చరిత్ర సృష్టించారు. మారు మూల గ్రామాలకు సైతం ఒక్కొక్క కాపీ అయినా వెళ్ళేది.

సంగారెడ్డి నుండి 1960-64 మధ్య తరచు గోలకొండ పత్రికకు వ్యాసాలు పంపేవాడిని. జి.వి. కృష్ణారావు తన పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథాన్ని ఇంగ్లీషులో వెలువరించారు. అది కళాపూర్ణోదయంపై రాసిన గ్రంథం. ముఖ్యంగా రామణీయకత అధ్యాయం గొప్ప పరిశీలన ఆ గ్రంధాన్ని తెలుగులో అనువదించాను. అప్పుట్లో కొంత గ్రాంధికం-కొంత వ్యావహారికం కలిసి అనువదించాను. గోలకొండ పత్రిక సీరియల్ గా ప్రచురించింది. పుస్తకంగా వెలకి తీసుకురావడానికి, ముందుగా భాషను మార్చి, అంతా వాడుకంలోకి తీసుకరావాలనుకున్నాను. అది వీలుపడలేదు. గోలకొండ పత్రిక కటింగ్స్ ఒక కాపీ స్టేట్ ఆర్కివ్స్ కు యిచ్చాను.


ఆంధ్రభూమి

1960-70 మధ్య సికింద్రాబాద్ నుండి వెలువడే ఆంధ్రభూమి దినపత్రికకు వ్యాసాలు రాశాను. ఎడిటోరియల్ పేజీలో వ్యాసాలు ప్రచురించారు. సంగారెడ్డి (మెదక్ జిల్లాలో ఉన్నంతకాలం (1960-64) ఎన్. శూలపాణి పేరిట రాశాను. ఎడిటోరియల్ పేజీలో వ్యాసాలన్నీ రాజకీయాలే ఎక్కువగా రాశాను. ఎప్పుడైనా లెటర్స్ రాశాను. 1965 నుండీ హైదరాబాదు వచ్చి, కొన్నాళ్ళు శూలపాణి పేరుతోనే కొనసాగించాను.1966లో గోరా శాస్త్రితో పరిచయం అయ్యింది. తొలిసారి ఆయన ఆఫీసులో కలిసినప్పుడు, ఆశ్చర్యపోయారు. అంత చిన్నవాడివనుకోలేదు అన్నారు. శూలపాణే ఇన్నయ్య అని మరీ ఆశ్చర్యపడ్డారు. క్రమేణా మేం కుటుంబ మిత్రులమయ్యాం. కొద్ది రోజులు వ్యాసాలు రాసి ఆపేశాను.

తరచుగా గోరాశాస్త్రిగారింట్లో కలసి చర్చించుకునేవాళ్ళం. ఆయన కొన్నాళ్ళు డక్కన్ క్రానికల్ కు సంపాదకీయాలు రాసేవారు. సీనియర్ జర్నలిస్టులు సీతారాం (యుఎన్ఐ) శ్రీకృష్ణగార్లతో ఫోను చర్చలు చేసేవారు. అప్పుడే నాకు డా.తిరుమలరావు, శశాంక, గోపాల శాస్త్రి, రావి శాస్త్రి, ఇచ్ఛాపురపు జగన్నాధం, భాట్టం శ్రీరామ మూర్తితో పరిచయాలయ్యాయి. గోరా శాస్త్రి 50వ జన్మదిన సంచిక వెలువరించి ఆయనను గురించి వివరాలు రాశాను. ఆంధ్రభూమిలో నాడు వరదాచారి, పొత్తూరి వెంకటేశ్వరరావు పని చేస్తుండేవారు. పొత్తూరితో నాకు సన్నిహిత పరిచయం ఏర్పడింది.


ఆంధ్రభూమిని యాజమాన్యం ఎన్నడూ అంతగా పట్టించుకున్నట్లు లేదు. సర్క్యులేషన్ అంతంత మాత్రమే. క్వాలిటీ ప్రింటింగ్ ఉండేది కాదు. అచ్చు తప్పులుండేవి. దక్కన్ క్రానికల్ ప్రధాన పత్రికగా యాజమాన్యం చూచేది. గోరా శాస్త్రితోబాటు ఆనాడు సి. ధర్మారావు, మండవ శ్రీరామమూర్తి తరచు కలుస్తుండే వాళ్ళం. సెట్టి ఈశ్వరరావు కూడా ఆయనింట్లోనే పరిచయం అయ్యారు. దిగంబర కవులకు, గోరాశాస్త్రికీ నిరంతర సిధ్ధాంత ఘర్షణ జరుగుతుండేది.

No comments: