ఓ డెస్క్ జర్నలిస్ట్ ఓపెన్ ఛాలెంజ్!
--By ............
రిపోర్టర్లు సుబ్రహ్మణ్యస్వామిలాంటి వారైతే.. సబ్ ఎడిటర్లు వినాయకుల్లాంటివారు
ఈ విషయం జగమెరిగిన సత్యం. రిపోర్టర్ ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ గా ఏ వార్తా
సంస్థ కూడా ప్రచురించదు.. ప్రసారం చేసే ధైర్యం చేయదు. వార్తను సంస్కరించేది..
అందులోని నిజానిజాలను గుర్తించేది.. డెస్కే. వార్త విలువను అంచనా వేసేది..
సమయం సందర్భాలను అర్ధం చేసుకుని దాన్ని ప్రపంచానికి చాటి చెప్పేది డెస్కే
అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఒక సబ్ ఎడిటర్ కావాలంటే రిపోర్టర్
కాగలడేమోగానీ, ఒక రిపోర్టర్ సబ్ ఎడిటర్ కావడం అంత తేలికకాదు. అందుకు
భాషమీద.. భావం మీద ఎంతో పట్టు- ఓర్పు- నేర్పు- విచక్షణ ఉండాలి. పరిపూర్ణమైన
జర్నలిస్టిక్ స్కిల్స్ ఉన్నది డెస్క్ జర్నలిస్టుకే. దర్శకుడు లేకుండా హీరో
ఎలా మనలేడో.. డెస్క్ సపోర్ట్ లేకుండా ఏ రిపోర్టింగూ మనజాలదు..
మనజాలదూ.. మనజాలదు. ఇదేదో అక్రిడేషన్ కోసం, అంగలార్చుతూ అర్రులు
చాస్తూ.. రాస్తున్న రాతలు కావు. వాస్తవం ఇదీ అని చెప్పడానికి చేస్తున్న
ప్రయత్నం. సబ్ ఎడిటర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు కారు. అలాంటి భ్రమల్లో ఉంటే
వాళ్లను ఏ ముఖ్యమంత్రీ కాపాడలేడు. ఓయ్ రిపోర్టరూ.. నీ వార్తను సర్వనాశనం
చేసినా.. సమర్ధవంతంగా ఎయిర్ చేయించినా.. అది మా చేతుల్లో ఉంటుందయ్యా
పిచ్చోడా.. అన్నదమ్ముల్లాంటి మన మధ్య ఇలాంటి దిక్కుమాలిన వాదన
తీసుకొచ్చిన వాళ్లెవరో గుర్తించి వెంటనే వారికి చెప్పుదెబ్బల సన్మానం అరేంజ్
చేయండి. డెస్క్ సమర్ధవంతమైన భార్యలాంటిది. నీళ్లిచ్చినా దాన్ని పరమాన్నం
చేయగల సామర్ధ్యం డెస్కుకు మాత్రమే సాధ్యం. ఇది ప్రతి చీఫ్ ఎడిటరూ ఒప్పుకునే
వాస్తవం. అసలు జర్నలిజమ్ మౌల్డెడ్ బై సబ్ ఎడిటర్స్ ఓన్లీ. చానెళ్లు,
పత్రికలను శాసించేది డెస్కులే. నడిపేది డెస్కులే. చీఫ్ ఎడిటర్ స్థాయిని
అలంకరించిన వారిలో ఎక్కువ శాతం డెస్కుల నుంచే వస్తారు. డెస్కులేని
ఛానెళ్లనూ, పత్రికనీ ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కూడా చూడలేరు. చానెల్
లేదా పత్రిక సిస్టమ్ అయితే,దానికి సాఫ్ట్ వేర్ ప్రొగ్రాం సబ్ ఎడిటింగే. ఇది కాదనే
దమ్ముధైర్యం ఎవరికైనా ఉందంటే ముందుకు రమ్మనండి. ఇది గుర్తించక తలలు
పండిన జర్నలిస్టులు డెస్కుల్లో పనిచేసేవారసలు జర్నలిస్టులే కాదన్నట్టు
మాట్లాడ్డం హాస్యాస్పదం. నెల రోజులు రిపోర్టర్లు లేక పోయినా చానెల్, పత్రికలను
నడపడం సాధ్యమే. కానీ ఒక్కరోజు డెస్కు లేకుండా జర్నలిజాన్ని నడపమనండి
చూద్దాం.. డెస్కు జర్నలిస్టులకు అక్రిడేషన్లు... వద్దనే వారీ ఛాలెంజ్ స్వీకరిస్తే
ముందుకు రండి.. చూసుకుందాం.

No comments:
Post a Comment