*మరి తెలుగు జర్నలిజంలో నీతి-నిజాయితీ, ధైర్యం-సాహసం తనకెక్కువ అని ప్రకటించుకునే వేమూరి రాధాకృష్ణ గారు వంగలేదేమిటి? అన్న ప్రశ్న తలెత్తడం సహజం. ప్రసారాల పునరుద్ధరణ కోసం పోరాడడంకన్నా... "ఎన్నాళ్ళీ సంకెళ్ళు" అని రోజూ పత్రికలో ప్రచురించడం ద్వారా పొందే సానుభూతి నిజానికి ఎక్కువ. దీనివల్ల జర్నలిజంలో నిజంగానే దమ్మున్న మొనగాడు అని తెలీనోళ్ళకు తెలియజెప్పవచ్చు.
అటు పక్క ఉన్న మన ప్రభుత్వం దృష్టిలో, ప్రజల దృష్టిలో చెరగని ముద్ర వేయవచ్చు. ఎందుకంటే... బుష్ గారు అన్నట్లు ఒకరి దృష్టిలో తీవ్రవాది మరొకరి దృష్టిలో సమరయోధుడు (one man's terrorist is another man's freedom fighter). సరే... ఈ కాలిక్యులేషన్స్ పట్టించుకోకుండా ఏబీఎన్ ప్రసారాలు కూడా పునరుద్ధరించి పత్రికా స్వాతంత్ర్యాన్ని గౌరవిచాల్సిన బాధ్యత తెలంగాణా ప్రభుత్వం మీద... ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఉంది.
source :-http://apmediakaburlu.blogspot.in/
No comments:
Post a Comment