* కోర్టుల చొరవతోనో, బ్యాక్ గ్రౌండ్ వర్క్ సఫలం కావడం వల్లనో... మొత్తం మీద మూడు, నాలుగు నెలల తర్వాత టీవీ-9 కార్యక్రమాలు పునఃప్రసారం అవుతున్నాయి. ఇది మంచి పరిణామం. తెలుగు జర్నలిజంలో వింత, వినూత్న పోకడలకు శ్రీకారం చుట్టిన ఈ ఛానల్ చూడకపోతే... అదోలా అనిపించిన జీవులు కోకొల్లలు. ఈ బ్యాన్ సమయంలో దీన్ని సాకుగా తీసుకుని ఈ ఛానల్ యాజమాన్యం ఉద్యోగుల జీతాలపై కోత పెట్టినట్లు సమాచారం.
బాగా వింతగా అనిపించిన విషయం ఏమిటంటే... టీవీ-1 వాళ్ళు పేరుమార్చుకుని ముందుకు రావడం. పైగా "జై తెలంగాణా" అని పేరుపెట్టుకుని మరీ...చేసిన తప్పుకు 'ప్రాయశ్చిత్తం' చేసుకున్నారా... అనిపించారు. ప్రభుత్వం ఒత్తిడి వల్ల ఈ పనిచేశారా? అని వాకబు చేశాం... కానీ సరైన సమాచారం దొరకలేదు. టీవీ-9 జర్నలిస్టులు కొందరు... కొత్త రూపు సంతరించుకున్న ఈ ఛానెల్ లో ప్రత్యక్షం కావడం కూడా...కొందరికి చివుక్కు మనిపించి ఉంటుంది. దీన్నిబట్టి మరొకసారి నిరూపితం అయ్యింది ఏమిటయా అంటే...మీడియా కింగులు పరిస్థితులను బట్టి వంగమన్నా వంగుతారు. ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే క్రమంలో ఇవన్నీ తప్పవండీ!
source :-http://apmediakaburlu.blogspot.in/
No comments:
Post a Comment