BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Friday, January 3, 2014

telugutv.info... వెబ్సైట్ పై V6 NEWS మిత్రుల ఫైర్...

భావనారాయణ గారు, మీ లాంటి సీనియర్ జర్నలిస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేశారంటే చాలా మంది జూనియర్లకు కొంతైనా విలువైన సమాచారం దొరుకుందని భావిస్తారు. కాని మీ మనసులో పుట్టిందే పక్కా సమాచారం అయినట్లు, కీ బోర్డుపై మీ వేళ్లు కదిలిందే వార్త అయినట్లు రాసేస్తున్నారు. మొత్తం వ్యవస్థ అంతా బురదగుంట అని, మీరే సచ్ఛీలురు లాగా బయటకొచ్చిన తామర పువ్వులాగా ఫీలవుతున్నట్లున్నారు. మీకు మీరు అలాగే భావించినా మాకు అభ్యంతరం లేదు. కనీసం ఇప్పుడైనా న్యూస్ మీడియాపై స్వచ్ఛమైన అనాలసిస్ వస్తుందని భావిస్తాం. కాని మైనార్టీ కార్పోరేషన్ డబ్బులు కొట్టేసి, అవినీతి డబ్బుతో ఛానల్ పెట్టే ప్రయత్నం చేసి అడ్డంగా సీఐడీకి బుక్కైన తోట భావనారాయణ వేరే ఛానల్స్ ఆర్థిక స్థితి గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంది. V6 NEWS రేటింగ్ లో వెనుకబడిందని, ప్రొగ్రామ్స్ తప్పా న్యూస్ లో కొత్తదనం లేదని మీరు బ్లాగ్ లో రాశారు. పైగా రెవెన్యూ పరంగా కూడా వెనుకబడ్డారని మీరు రాశారు. ఉత్తర భారత దేశంలో న్యూస్ ఛానల్ ప్రారంభించి ఏడాది లోగా బ్రేక్ ఈవెన్ సాధించిన ఛానల్ కేవలం V6 NEWS కే దక్కుతుందని హైదరాబాద్ లోని సగటు జర్నలిస్టుకు కూడా తెలుసు. కాని మీకు మాత్రం తెలియకపోవడం దురదృష్టకరం. అయినా బూతు కార్యక్రమాల్ని చూపించి, అమ్మాయిలు, కాల్ గర్ల్స్ జీవితాలతో ఆడుకుంటూ బ్లాక్ మెయిల్ ఛానల్స్ చూపే న్యూస్ మీకు నచ్చుతోంది. బూతుకు, క్రైం కు దూరంగా ఉంటూ ఉన్న వార్తల్ని సామాన్య జనానికి అర్థమయ్యే రీతిలో న్యూస్ ఇస్తున్న V6 NEWS ఛానల్ మీకు నచ్చదు.ఎందుకంటే మీరు కూడా మూసలో పుట్టి, మూస లో పెరిగి ఆంధ్ర పెట్టుబడి దారులతో కలిసి తెలంగాణా వాదాన్ని తొక్కే వెటరన్ జర్నలిస్టు కాద. మీ రక్తంలో ఉన్న బుద్ధులు మీ పెన్నులో రాకుండా ఎలా ఉంటాయి. వాస్తవాల్ని రాస్తే ఫీల్డ్ లోకి వస్తున్న యువ జర్నలిస్టుకు మేలు చేసిన వారవుతారు. లేదా మీ కుళ్లు, రొచ్చు బుద్ధిని వాళ్లకు అంటగట్టే ప్రయత్నం చేస్తే మీరు కుర్రాళ్ల ముందు అభాసుపాలవుతారు ... జాగ్రత్త. వాస్తవాలు తెలుసుకొని రాయండి. .... జయ్.... jaibheem

విశ్లేషణల పేరుతో విపరీత బుద్దిని ప్రదర్శించడం మానండి. అతి తెలివిని చూపించడం అంత మంచిది కాదు. న్యూస్ చానల్స్ పాలసీ ల పై చర్చించే దమ్ము మీకు లేదు. మీరు స్కూప్స్ పేరుతో అధారాలు లేని, అడ్డమైన వార్తలు రాస్తూ పొట్ట పొసుకుంటున్న విషయం అందరికీ తెలుసు. వీ6 పై విపరీత ఆర్థాలతో చేస్తున్న పోస్టింగుల వెనక మీ కుళ్లు కుతంత్రాలను అర్ధం చేసుకోగలం . ఎవరి చానల్ ఎంటో రోజూ టీవీ ముందు కూర్చునే సగటు ప్రేక్షకుడికి తెలుసు. ఏసీ లో కుర్చోని ఇష్టం వచ్చినట్టు సచ్చు రాతలు రాస్తామంటే ఎవరూ భరించరు. అసలు వీ6 గురించి మీకు ఏం తెలుసని ఇష్టమొచ్చిన పొస్టిగులు పెడుతున్నారు. తోకగుంజడం ఎందుకు చేస్తున్నోరో మీకే తెలియాలి. మీ వెనక ఎవరైనా ఉన్నారో లేక కుళ్లి కంపుకొట్టే ఆలోచనలు మీకే పుట్టాయో తెలియదు కాని, మీరు రాసే చండాలపు రాతలన్నీ శుద్ధ అబధ్దాలని తెలుసుకుంటే మంచిది. తెలుసుకోలేకపోతే....అర్థమయ్యేలా ఎలా చెప్పాలో మాకు కూడా మహాబాగా తెలుసు. తెలంగాణ గత కొంత కాలంగా ఉద్యమాల సుడిగుడంగా మారింది. ఇంకా రగులుతునే ఉంది. ఇక్కడున్న రాజకీయ వ్యవస్ధ అనివార్యంగా జై తెలంగాణ అంటూ ప్రజలతో గొంతు కలుపుతోంది. అందులో భాగంగానే యంపీ వివేక్ టీఆర్ఎస్ లో చేరిపోయారు. అంత మాత్రన వీ6 వ్యూహాలు మార్చుకుంటోందని కధలు ప్రచారం చేయడం మంచిది కాదు. వీ6 భవిష్యత్తు గురించి అంత చింత పడల్సిన అవసరం మీకు లేదు. వీ6 ప్రారంభమైన సంవత్సర కాలంలో మర్కెట్లో నిలబడి సొకాల్డ్ చానల్స్ కు సవాలుగా నిలబడింది. సై అంటే సై అంటు అందరికంటే ముందే వార్తా ప్రసారాలను అందిచే ప్రయత్నం చేసింది. సరికొత్త ఫ్రోగ్రామ్స్ తో కొత్త ఒరవడిని సృష్టించింది. ఊహకు అందని కార్యక్రమాలతో దూసుకుపొతుంది. రెటింగ్స్, మర్కెట్ షేర్ల గురించి పట్టించుకోకుండా సాగిపొతుంది. పైగా ఏడాది లోపే బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డు స్రుష్టించింది. ఇదంతా గిట్టని మీలాంటి వాళ్లు మా పై తప్పుడు ప్రచారన్ని చేస్తునే ఉన్నారు. మీ రాతలను పరిశీలిస్తే ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా ఆర్ధం అవుతోంది. తెలంగాణ ప్రాంతానికి చేందిన పెట్టుబడి వీ6 లో ఉండడం మీకు నచ్చనట్టుంది. అందుకే ఈ విషప్రచారం అనుకుంటా. వీ6 మీదా నెగిటివ్ ప్రచారం తో మీరు ఏం సాదించాలనుకుంటున్నారో నాకైతే ఆర్ధం కాలేదు. తెలంగాణ ఉద్యమం మీడియా సృష్టించిన కత్రిమ ఉద్యమం అంత కంటే కాదు. టీ న్యూస్ ను ఫాలో కావల్సిన అవసరం మాకు లేదు. మాకు మర్కెట్లో నిలబడే సత్త ఉంది. ఇప్పటికే వీ6 అంటే ఏమిటో నిరూపించుకుంది. మేం ప్రజల పక్షం. ప్రజలు ఏది కొరుకుంటే వాటిని వార్తలు గా మార్చి అందిస్తాం. ప్రజల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా, మైనారిటి జనం గొంతుక గా నిలబడుతాం. పార్టీలకు నాయకులకూ వంత పాడే నైజం మాకులేదు. మీ గురించి చాలా ప్రచారాలు బయట వినబడుతున్నాయి. వాటి గురించి చర్చించుకుందామా సారూ. వేబ్ దూనియాలో ఉన్నవీ లేనివి నేనూ రాయగలను. అలా చేస్తె మీకు మాకు ఏం తెడ ఉంటోంది? వీ6లో పని చేస్తున్నా వారంతా నూటికి నూరు శాతం జర్నలిజన్ని బుక్తి మార్గంగా నమ్ముకున్న వాళ్లే అన్న విషయాన్ని తమరు గమనించాలి. కుల, ప్రాంత, జెండర్ ల వివక్షలను వొదిలి సమస్యలను విశ్లేషిస్తు అర్టికాల్స్ రాయలని కొరుతున్నా. మీ పద్దతి మార్చుకోకపొతే మీ దారిలో రావల్సి ఉంటుందేమో? జర్నలిజంలో సెన్సిటివిటి అనే పదనికి కాలం చెల్లకుండా చూడండి. satish.v

భావనారాయణ గారూ... ‘టీ న్యూస్ కంటే రేటింగ్ లో వెనుకబడ్డ వీ6 వ్యూహం మారుతుందా?’ అని విశ్లేషణ పేరుతో... మీ ఆలోచన పరిధిలో అభిప్రాయాలు రాశారు. (మాజీ) సీనియర్ జర్నలిస్ట్ గా... చానెల్ అంటే రాజకీయ పార్టీ కాదని మీకు బాగా తెలుసుండాలి. వ్యూహాలు మార్చుకోవడానికి ఇదేం రాజకీయం కాదు. ప్రతి చానెల్ కు ఒక పాలసీ ఉంటుంది. దాని ప్రకారం అవి పనిచేస్తాయి. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా రాసే ప్రయత్నంలో విశ్లేషణలో, విచక్షణలో మీరు విఫలమైనట్టు కనిపిస్తోంది. ప్రచారం కోసం బాగానే ఖర్చుపెట్టారన్నప్పుడు ఎంత ఖర్చుపెట్టారో తెలుసుకొని రాస్తే బాగుండేది. అప్పుడు బాగా ఖర్చుపెట్టారో లేదో చదివేవాళ్లు తెలుస్తుంది. చానెల్ మొదటి నుంచీ డోలాయమాన పరిస్థితిలో ఉందని మీరు అభిప్రాయపడ్డారు. డోలాయమానంలో ఉన్న చానెళ్లు అసలు పుట్టవు. అలాంటి స్వానుభవాలు మీకు ఉన్నాయనుకుంటాను. డోలాయమానంలో చానెళ్లు పుట్టినా వాటి బతుకు కూడా డోలాయమానంలోనే ఉంటుంది. వీ6లో అలాంటి పరిస్థితి లేదు. వీ6 గురించి తెలిస్తే మీరు ఇలా రాసుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. వీ6 పుట్టిన ఏడాది తర్వాత భవిష్యత్ ను నిర్ణయించుకోవాల్సిన కీలకదశ వచ్చిందని మీరు ఏ ఉద్దేశంతో రాశారో మీకే తెలియాలి. ఇక పాలసీ రూపొందించుకోవడం అంటే ఏంటో కూడా మీకే తెలియాలి. చిన్న పిల్లల కిడ్నాపుల్ని మేమే చేశాం అన్న స్థాయిలో చెప్పుకోవడం... ప్రపంచంలో క్రైం వార్తలు తప్ప మరేం లేవన్నట్టు ప్రసారం చేయడం... సెక్స్ స్కాండల్స్ నే గొప్ప పరిశోధనలుగా చెప్పుకోవడం... అర్ధరాత్రి మసాలా ప్రోగ్రామ్స్... ఇవన్నీ లేకపోవడమే మీ ఉద్దేశంలో వీ6 పాలసీ లోపం, అసమర్థత కావచ్చు. అలాంటి లోపాలున్నందుకు సంతోషిస్తున్నాం. దాన్ని మీరు అర్థం చేసుకోనందుకు చింతిస్తున్నాం. చాలా చానెల్స్ లో లేని క్రమశిక్షణ కాదు... ఎవరికీ లేని క్రమశిక్షణ ఇక్కడ ఉంది. జర్నలిస్టుల పీఎఫ్ లు, ఈఎస్ఐలు నొక్కేసే మేనేజ్ మెంట్ మహానుభావులు, జీతాలు ఎగ్గొట్టే పెద్దమనుషులు లేకపోవడం కూడా ఇక్కడ పాలసీ లోపమే. వ్యాపారాలు నిర్వహించిన అనుభవం, అక్కడి వ్యవస్థల వల్ల క్రమశిక్షణ వస్తుందనుకుంటే... అలాంటి అనుభవం ఉన్నవాళ్లు ఏం క్రమశిక్షణ పాటిస్తున్నారో కూడా మీకు స్వానుభవమే. మీరు లేదనుకుంటున్న పాలసీ ఉంటేనే... ఇలాంటి క్రమశిక్షణ సాధ్యం అవుతుంది. మీ అభిప్రాయాలు చూస్తే... ప్రతి చానెల్ కూ ఒక వాదం ఉండాల్సిందేనని సుదీర్ఘ మీడియా జీవితంలో మీరు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఏ వాదం తీసుకోవాలో చెప్పాల్సింది మీరు కాదు. ఏ వైఖరి తీసుకోకపోవడం సందిగ్ధంలో ఉండడం అని మీరనుకోవడం మీ అనుభవాన్ని అనుమానించేలా చేస్తోంది. ఇన్వెస్టర్ ఏ ప్రాంతం వాళ్లన్నదాన్ని బట్టి చానెల్ వైఖరి ఉండాలా? ఇలాంటి అభిప్రాయాలతో చానెల్ విఫలమైందని మీరు జడ్జిమెంట్ ఇచ్చేశారు. చానెల్ సక్సెస్, ఫెయిల్యూర్స్ ని ప్రేక్షకులు నిర్ణయిస్తారు. విఫలమైన జర్నలిస్టులు కాదు. దయచేసి మీరు తీర్పులు ఇవ్వడం మానేయండి. చానెల్ ఏ వాదాన్ని అనుసరించాలో సందిగ్ధంలో ఉందని చెబుతూనే... నష్టనివారణ చర్యలు ఆలస్యమయ్యాయని అభిప్రాయపడ్డారు. ఏ సందిగ్ధాలు లేని చానెళ్లు అసలు ఆన్ ఎయిర్ లోకే రాలేకపోయాయి. ఈ సంగతి మీకే బాగా తెలుసు. వీ6 గురించి మీరు తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే... ఇక్కడ ఔట్ పుట్ లో ఎవరున్నారు? న్యూస్ లో ఫైనల్ డెసిషన్ ఎవరిది? వాళ్లు ఏ ప్రాంతంవాళ్లు? లాంటివి కూడా మీరు తెలుసుకోవాలి. ఇక వీ6 టెక్నికల్ వివరాల గురించి కూడా ఏమీ తెలియకుండానే మీరు రాసేశారు. చానెల్ బ్యాండ్ విడ్త్ ఎంతో తెలుసుకోకుండానే మెరుగ్గా కనిపించడానికి ఎక్కువ తీసేసుకున్నారని తీర్పుచెప్పారు. మీకున్న సుదీర్ఘ అనుభవంతో ఇండియా సైన్ వాళ్లని సంప్రదించి వివరాలు తెలుసుకొని అభిప్రాయాలు రాస్తే బాగుండేది. యావరేజ్ బ్యాండ్ విడ్త్ తో కూడా మెరుగైన ప్రసారాలు ఇచ్చే అవకాశం ఉండదని తెలియని అజ్ఞానులు మీడియాలో ఉండడం వల్ల... తెలిసీ తెలియని అభిప్రాయాలు వ్యక్తంచేసే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. మెరుగైన ప్రసారాలు ఇచ్చే టెక్నికల్ సిస్టం వీ6కు ఉందని మీరు తెలుసుకొని ఉంటే బాగుండేది. యాంకర్లు అందంగా కనిపించినంత మాత్రాన చానెళ్లు సక్సెస్ కావు. అదే నిజమైతే... బ్యూటీ కాంటెస్టుల్లో గెలిచేవాళ్లంతా యాంకర్లైపోతారు. యాంకర్లను దిగుమతి చేసుకోవడానికి వాళ్లేమైనా ఫెరారీ కార్లా... పెట్రోలు ట్యాంకర్లా? అందంగా ఉండడంతో పాటు కనీసం అర్హత లేకుండా ఎవరూ యాంకర్లు కాలేరని మీకు తెలీదా? యాంకర్లు అందంగా ఉన్నంత మాత్రాన చానెళ్లు సక్సెస్ అయితే... మీ దృష్టిలో టాప్ చానెల్స్ అనుకునేవాళ్లు... యాంకర్ల ముఖాలు చూపించుకొని బతుకుతున్నారా? న్యూస్ కంటెంట్ లేకుండా యాంకర్ల ముఖాలు బాగుంటే జనం చూస్తారని మీ అభిప్రాయమా? వీ6కు మొదటి ఏడాదిలోనే జాతీయ స్థాయిలో బెస్ట్ న్యూస్ యాంకర్, బెస్ట్ న్యూస్ ప్రజెంటర్ అవార్డులు రెండూ వచ్చాయని మీరు తెలుసుకొని ఉంటే బాగుండేది. ప్లానింగ్, మెచ్యూర్డ్ ప్రెజెంటేషన్, కంటెంట్, టీం వర్క్, క్రమశిక్షణ వల్లే వీ6 సక్సెస్ సాధ్యమైంది. జడ్జిమెంట్లు ఇచ్చే ముందు ఇవన్నీ పరిశీలించాలి. తెలియకపోతే తెలుసుకోవాలి. తెలంగాణ యాస, వెటకారం... గురించి రాశారు. సీరియస్ కంటెంట్ మీద శ్రద్ధ లేదన్నారు. ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాలు, 23 జిల్లాలున్నాయని మీకు తెలిసే ఉంటుంది (!) మూడు ప్రాంతాల్లోనే కాదు జిల్లాకు జిల్లాకు యాస మారిపోతుంది. అందులో 10 జిల్లాల్లో వాడుకలో ఉన్న భాషను ఒక ప్రోగ్రాంలో వాడడం వల్ల వచ్చిన సమస్యేంటో మీకే తెలియాలి. ఎవరూ చేయని ప్రయోగాన్ని చేయడం, అది సక్సెస్ కావడం, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ చూడడం, చర్చించుకోవడం మీకు సమస్యగా కనిపించిందా? వార్తలను జనం చూసే కోణంలో వ్యంగ్యంగా ప్రెజెంట్ చేయడం మీకు నాన్ సీరియస్ కంటెంట్ గా అనిపించిందా? సినిమా ప్రోగ్రాంలు, సెక్స్ ప్రోగ్రాంలే టాప్ లిస్ట్ లో ఉండే సోకాల్డ్ చానెల్స్ లో మీకు సీరియస్ కంటెంట్ కనిపించిందా? ‘చానెల్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది’... లాంటి పాసింగ్ కామెంట్లు సీనియర్ జర్నలిస్టులు చేయకుండా ఉండే బాగుంటుంది. దీనికి ప్రమాణం ఏంటో చెబితే ఇంకా బాగుంటుంది. వీట్యూబ్, తీన్మార్, జజ్జనకరి జనారే, డెత్ సీక్రెట్... లాంటి సక్సెస్ ఫుల్ ప్రోగ్రామ్స్ చానెల్ సక్సెస్ లో ఒక భాగం మాత్రమే. అవి కూడా న్యూస్ బేస్డ్ కార్యక్రమాలే. రేటింగ్ తో తప్ప చానెల్స్ ను అంచనా వేసే స్థాయికి మన మెదళ్లు ఎదగలేకపోవడం... మీడియా దౌర్భాగ్యం. జనానికి రేటింగ్ తో పనిలేదు కాబట్టి... వాళ్లకు నచ్చిన చానెల్స్ ను, నచ్చిన ప్రోగ్రామ్స్ చూస్తారు. మార్కెట్ షేర్ ను ఏ బేసిన్ మీద తీసుకున్నారో మీకే తెలియాలి. చానెల్ సక్సెస్ జనం నుంచి వచ్చే రెస్పాన్స్, ప్రోగ్రామ్స్ గురించి వచ్చే టాక్ ను బట్టింది ఉంటుంది. ఎక్కువ మంది చూస్తారా? లేదా? అన్నదాంతో సంబంధం లేకుండా క్వాలిటీతో, వర్క్ తో ఇచ్చే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఇవేం చూడకుండా చానెల్ విఫలమైందని చెప్పడానికి... ఇదేమైనా గవర్నమెంట్ స్కీమా? ఇక చానెల్ సక్సెస్ ను మరో కోణం చూద్దాం. ఖర్చుల గురించి మీరు మాట్లాడారు? ఇన్వెస్ట్ మెంట్, మ్యాన్ పవర్, పాలసీ, నడిపించే వ్యక్తులు వీటిపై సరైన అంచనాల్లేకుండా కామెంట్లు చేయకూడదు. వాణిజ్యపరంగా వీ6 విఫలమైందని మీరు లెక్కలేసుకున్నారు. మీరు అవగాహనతో రాసి ఉంటే... తెలుగు మీడియాలోనే కాదు ఇండియన్ మీడియాలోనే వీ6 ప్రాజెక్ట్ రోల్ మోడల్ అని రాయాల్సి వచ్చేంది. చానెల్ నిర్వహణ గురించి మీకు అవగాహన ఉండుంటే, కనీసం వీ6 ప్రాజెక్ట్ గురించి తెలుసుకొని ఉండుంటే... మీరు ఇప్పుడు టైంపాస్ అభిప్రాయాలు రాసుకోవాల్సిన అవసరం ఉండేది కాదేమో. నష్టాలు భరించగలిగే మేనేజ్ మెంట్ ఉంటే చానెల్ నడుస్తుందని అవుతుందని మీరనుకుంటే... అది బిజినెస్ ఎలా అవుతుంది? రాజకీయాల కోసం మాత్రమే చానెల్స్ పుడతాయి, నడుస్తాయనుకుంటే... అలాంటి చానెల్స్ వేరే ఉన్నాయి. వాటి గురించి రాసుకోండి. నష్టాలు భరిస్తూ నడిపించి చానెల్స్ మూతపడే స్థాయి చేరిన ఉదాహరణలు కళ్లముందే ఉన్నాయి. రాజకీయాల కోసమే వాటిని నడిపిస్తున్న పరిస్థితి కూడా మీకు తెలుసు. చానెల్ మేనేజ్ మెంట్ ఎవరన్నది మీకు తెలిసింది రాస్తే బాగుంటుంది. వాళ్లూ వీళ్లూ అనుకునేది రాయాలనుకుంటే... విశ్లేషణలో కాదు గాసిప్స్ కాలమ్ లో రాసుకోవాలి. చానెల్ ఎలా నడుస్తుంది? భవిష్యత్ ఎలా ఉంటుంది? పాలసీ ఏంటి? ఇలాంటివాటిపై వీ6కు స్పష్టత ఉంది. అలాంటి విధానం ఉండడం వల్లే జనంలోకి వెళ్లగలిగింది. ఏడాదిలోనే బ్రేక్ ఈవెన్ స్థాయికి చేరుకుంది. వీ6లో న్యూస్ వస్తుందా? లేదా? అన్నది ప్రేక్షకులకు తెలుసు. భారీ ఇన్వెస్ట్ మెంట్ పెట్టి, డీటీహెచ్ లలో వచ్చే చానెల్స్ కంటే వీ6 న్యూస్ కి మంచి గుర్తింపే ఉంది. ఇక మీ వెబ్ సైట్ ఆడియన్స్ వ్యూలో 18 తెలుగు న్యూస్ చానెల్స్ లో వీ6లో మార్నింగ్ షో డిఫరెంట్ గా ఉందని మీరే రాశారు. అలాంటివి వీ6లో చాలా ఉన్నాయి. మీ కామెంట్ కు ఒక వ్యూయర్ రెస్పాన్స్ కూడా ఉంది. ఆ ప్రేక్షకుడు స్పందించినంత నిష్పాక్షికంగా కూడా మీరు మీ అభిప్రాయాలను చెప్పలేకపోయారు. అభిప్రాయాలు చెప్పడానికి అనుభవం ఒక్కటే సరిపోదు... పరిశీలన, విచక్షణ కూడా అవసరం. మీ విశ్లేషణల్లో వాటిని కూడా ఉపయోగిస్తే బాగుంటుంది. -మురళీకృష్.కె.

ప్రభుత్వ  ఉద్యోగులు 56ఏళ్లకు రిటైర్ అవుతారు ఎందుకో తెలుసా...వయసు పెరిగాక వాళ్లలో చాదస్తం పెరిగిపోతుంది. ఆ చాదస్తాన్ని తోటి ఉద్యోగులు భరించలేరు...అందర్ని వాళ్లు డిస్టర్బ్ చేస్తారు. అందుకే వయసు మీరాక రిటైర్ మెంట్ తీసుకోవాలి. లేదంటే అది చాలా మందికి ఇరిటేట్ కలిగించడమేగాకుండా ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అందుకే జౌట్డే ట్ అయ్యాక వ్రత్తి నుంచి హుందాగా తప్పుకోవాలి...ఈ సూచన ఎవరికో ఇప్పటికే అర్థమై ఉంటుంది. మొదటగా తెలుగుటివి ఇన్ఫో... ఈ వెబో సైట్ నిర్వహకుల గురించి మాట్లాడుకోవాలి. ఒన్ కార్డ్ ఓన్ నేషన్ అని జనాల్ని బక్రాలుచేయాలని, దానికి ఓ ఛానల్ కూడా పెట్టుకోవాలని కలలు కన్న మగాను భావులదేనట ఈ వెబ్ సైట్.అందుకే ఈ సార్లకు వి6అంటే చాలా కోపం. ఎందుకంటే అమాయకుల దగ్గర్నుంచి వందల కోట్ల రూపాయల్ని దోచుకుందామనుకున్న వీళ్ల గుట్టును రట్టు చేసింది వి6 కాబట్టి. పాపం ఏం చేయాలో అర్థంగాక ఓ వెబ్ సైట్ పెట్టుకుని దాని ముందు ఓ ప్రపంచ మేదావిని కూర్చోబెట్టి ఇలాంటి రేటింగ్ గాలి వార్తలు రాపిస్తూ వి6పై కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారు. ఇక చెప్పండి సార్ ఆత్మన్యూన్యత ఎవరిదో. అసలు ఆత్మన్యూన్యత అన్న పదం ఎందుకు వాడారో దాని గురించి ఆలోచిస్తున్న మీకే బాగా తెలుస్తుంది.ఛానల్లో సీరియస్ గా పనిచేసుకునే మాకు ఉంటుందా ఆత్మన్యూన్యత లేక ఎవడిని ఉద్యోగం అడగలేక...జౌట్ డేటెడ్ గాళ్లకు ఉంటుందా ఆత్మన్యూన్యత అన్నది పెద్దలు, గౌరవనీయులు మీకే తెలియాలి. మొన్న క్రాంతి గురించి ఓ గాసిప్ రాశారు...మంచి అర్థవంతమైన తిట్లనే తిట్టించుకున్నారు. కొత్తగా నేను మేధావిని అని, మీడియాను ఆపోసన పట్టానని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. సార్ రెండేళ్ల క్రితం మా ఫ్రెండ్ పదివేల రూపాయలు పెట్టి టివి ఎలా పెట్టాలి అన్న ప్రాజెక్టు రిపోర్టును కొనుకొచ్చాడు. అది చూసాను అది 1985కాలంలో ఓ ఛానల్ ఏర్పాటుచేసేందుకు పనికి వచ్చే రిపోర్టని ఎవడు చదివినా చెబుతాడు. ఇపుడు ఆ రిపోర్టు గురించి ప్రస్తావన ఎందుకొచ్చిందంటే ఆ ప్రాజెక్టు రిపోర్టును రాసింది మీరు కాబట్టి. అవసరమైతే మీరు రాసిన రిపోర్టును కూడా ఇక్కడ రివ్యూ చేయగలను. అందులో మీ తెలివితేటల్ని మొత్తం చర్చించేందుకు మాకు కూడా అవకాశం ఉంది. సార్ మీ ఆలోచన తీరును మార్చుకోండిసార్. మీరనుకున్న ఆలోచనతో ఛానల్ చూస్తే అది దూరదర్శన్ కి సోదరి అవుతుంది. మీరు చూస్తున్న జనరేషన్ కి..మీరు ఆలోచిస్తున్న జనరేషన్ కి చాలా గ్యాప్ ఉంది సార్. ఆత్మన్యూనత అనే పదం ఎవరికి వర్తిస్తుందో ఇక మీరే తెలుసుకోండిసార్. ఇక ట్యామ్ రేటింగ్ గురించి ఇక్కడ ప్రస్తావన వచ్చింది. గతంలో మీరు ఎఫ్ బిలో ఒక కామెంట్ పోస్టు చేశారు. ఓ ఛానల్ వ్యవసాయ దారుల కార్యక్రమం ఈటివి2 కంటే నెంబర్ వన్ ప్లేస్ అని పెట్టారు. దానికి వచ్చిన కామెంట్లలో అసలు ఆ ప్రో్గ్రామ్ ఒకటి ఉందా అని చాలా మంది డౌట్ వ్యక్తం చేశారు. అసలు జనాలు కాదు జర్నలిస్టులు కూడా పట్టించుకోని ఓ ఛానల్ మొదటి 3ప్లేస్ ల్లో ఉంటుంది. అలాంటి ట్యామ్ రేటింగ్ పై మీరు సమయాన్ని కేటాయించి విష్లేషిస్తున్నారు. పైగా రేటింగ్ అన్నది మార్కెటింగ్ కు అవసరం. చందా కట్టాలా వద్దా అన్నది చెప్పేందుకు నీవు ఎవడివి సార్. నువ్వు ఛానల్ కేమైనా మార్కెంటింగ్ తెస్తావా...పైగా ట్యామ్ రేటింగ్ తప్పు అని ఎన్డీటీవి కోర్టులో ఫైట్ చేస్తుంది. మీరిక ఈ విషయం పక్కన పెట్టండి. మీ విశ్లేషణలో నిజాయితి ఉంటే మాకే కాదు ఎవడికి అభ్యంతరం లేదు.. కానీ మీరు మీ వ్యక్తిగత రేటింగ్ ను, సొంత గజ్జిని రుద్దుతున్నారు. అందుకే వాస్తవం చెప్పాల్ని వస్తుంది. ఎవడిని ఉద్యోగం అడగలేక...నాలుగ్గోడల మధ్య కూర్చోని నీ ఆత్మన్యూన్యత అభిప్రాయాలను వ్యక్తం చేయకండి. అవసరమైతే మరోసారి నీ బ్లాక్ అండ్ వైట్ ప్రాజెక్ట్ రిపోర్టులు మార్కెట్లో లో పెట్టుకుని విక్రయించండి. అయినా ఇప్పటికి మీరు చాలా సార్లు వి6కి వ్యతిరేకంగా రాశారు. క్రాంతి వాళ్ల తమ్ముడి పెళ్లికి సెలవు పెడితే అలిగాడని, షో ఆపారని రాసారు. నీ సోర్సు ఎవడోగాని వాడి...పగులగొట్టాలి.గాసిప్స్ రాస్తే పక్క సమాచారంతో రాయాలి. లేదంటే మూసుకుని ఎంజాయ్ చేయాలి. ఈ విషయం పక్కనపెడితే వి6కి ఎన్టీ అవార్డులు నాలుగు వస్తే మీరు కేవలం మూడే అనిరాశారు.వాటి కేటగిరి కూడా సరిగ్గా రాయలేకపోయారు. వెబ్ సైట్లో ఇష్టం వచ్చినట్టు ఎవరిమీద పడితే వాళ్లమీద రాయకండి సార్. మేము కూడా రాయగలం...నీకంటే అద్బుతంగా రాయగలం. నిజం చెబితే అబద్దం పారిపోవాలి... కానీ నిజాన్నే పారదోలాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు. అబద్దాన్ని నమ్ముకుని ఏమిచేయలేరు సార్...ఎందుకంటే అబద్దంతోపాటే పారిపోవాల్సి వస్తుంది కాబట్టి. ఇది చాలా చిన్న లాజిక్ అయినా దీంట్లో పెద్ద లాజిక్ ఉంటుంది. నమస్తే సార్ ఉంటాను.


http://telugutv.info/audienceview_forum.php?id=6 

No comments: