Ap9 News CEO గా ఉంటూ ఆచానల్ పనులు వేగవంతం చేస్తునే దసరాకు రాని చానల్స్ లో తను పనిచేస్తున్న చానల్ పేరుకూడా పెట్టుకున్నాడు...నిజాయితీకోసమా...నిజంగానే అక్కడ పనులు సరిగ్గ జరగడంలేదా .. తానే అన్నిచూస్తూ.. ఎందుకుకు తన వెబ్సైట్ లో ఇలాంటి పోష్టుపెట్టాడో ..మొత్తానికి తాను పని చేస్తున్న చానల్ గురించి కూడా తన వెబ్సైట్ లో దసరాకు రాదని తేల్చారుఈ విషయం కొత్త యాజమాన్యానికి తెల్సో తెలీదో...మరి ఆ వెబ్సైట్ చూసిన వారు ఆ చానల్ లో చేరడానికి మాత్రం కచ్చితంగా వెనుకంజ వేస్తారు..
http://telugutv.info/ లోని గాసిప్స్ వివరాలు..
|
|
త్వరలో వస్తాయంటున్న కొత్త
న్యూస్ చానల్స్ లో దసరా గడువుగా పెట్టుకున్న చానల్స్ ఎక్కువగానే ఉన్నాయి.
సిబ్బంది నియామకాల్లో చురుగ్గా ఉన్న 6
టీవీ దసరా నాటికి ప్రసారాలు ప్రారంభించే దిశలో పనిచేస్తోంది. కానీ ఇంత
తక్కువ సమయంలో తీసుకురావటమన్నది ఆచరణలో సాధ్యమయ్యే విషయం కాదు. లైసెన్స్ తో
బాటు ఎక్విప్ మెంట్ కూడా ఉన్న ఆర్వీ ఎస్ న్యూస్ కూడా దసరాలోపే వచ్చే
ప్రయత్నాలు చేస్తున్నా నియామకాలప్రక్రియ వేగం పుంజుకోలేదు. ఇప్పుడున్న
వేగాన్ని బట్టి చూస్తే దసరా నాటికి మొదలయ్యే అవకాశాలున్నాయి.
న్యూస్ తోబాటు ఆధ్యాత్మిక చానల్ కూడా తెస్తామంటున్న ఎపి 9,
అర్చన టీవీ ల యాజమాన్యం ఇంకా ఎక్విప్ మెంట్ విషయంలో తుది నిర్ణయం
తీసుకున్నట్టు లేదు. ఈ చానల్స్ కూడా దసరా లోపు ప్రసారాలు మొదలుపెట్టే
అవకాశాలు కనిపించటంలేదు. చాలాకాలంగా పండుగలమీద పండుగలకు వాయిదాలు వేస్తూ
వస్తున్న తులసి న్యూస్ తాజాగా దసరా సందర్భాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ
అందుకు తగిన వేగం కనబడ్డంలేదు. ఎక్విప్ మెంట్ విషయంలో నిర్ణయాలదశ దాటలేదని
తెలుస్తోంది.
|
No comments:
Post a Comment