జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాల్లో జర్నలిస్టు పెద్దలు హైదరాబాద్ భూములను ఆక్రమణలతో ఆంబుక్క పెట్టడమే కాకుండా.. హౌసింగ్ సొసైటీల్లోనూ ఆంధ్రోళ్లు అవకతవకలకు పాల్పడ్డరు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాల్లో జర్నలిస్టు పెద్దలు, సినీ పెద్దలు, రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తల హస్తం ఉందని సీఐడీ నిర్ధారించింది. 1998లో ప్రభుత్వానికి చెందిన వెయ్యి ఎకరాల భూములను కబ్జా చేసి సొసైటీ ప్లాట్లు చేసుకుని అమ్ముకుందని అప్పటి కలెక్టర్ ధృవీకరించిన్రు. త్వరలోనే వీళ్ల అవకతవకలపై చార్జిషీట్ దాఖలు చేయనుంది. ఇందులో సీవీఆర్ చానల్ ఓనర్ సీ వెంకటేశ్వరరావు ఏ-4 ముద్దాయిగా చేర్చుతున్నరు. ఎన్ టీవీ చౌదరి, మహా న్యూస్ ఐవీఆర్‌లపై కూడా కేసు నమోదయ్యే అవకాశముందని సీఐడీ వర్గాలు చెప్తున్నయి. . అవకతవకలకు పాల్పడ్డ సభ్యులకు ఎలాంటి శిక్ష వేయాలో కూడా చార్జిషీట్‌లో పొందుపరిచినట్లు తెలుస్తుంది. శుక్రవారం సీఐడీ ఎస్పీ కల్పానాయక్ ఆధ్వర్యంలో సొసైటీ ట్రెజరర్ హన్మంత్‌రావును రెండు గంటలపాటు ప్రశ్నించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ స్కాంలో పెద్దపెద్ద తలలు ఉండటంతో సీఐడీపై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తున్నది. చార్జిషీట్‌లో మీడియా ప్రముఖులు, రాజకీయ, సినీ పెద్దల పేర్లను చేర్చవద్దని వారిపై ప్రెషర్ పెడుతున్నట్టు తెలుస్తున్నది. ఈవార్త కవర్ కాకుండా ఆంధ్రా మీడియా మేనేజ్ చేస్తున్నది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అంశాన్ని సీఐడీ సీరియస్‌గా తీసుకున్నది.
soure :-
soure :-
No comments:
Post a Comment