తెలుగు నాట మరో సంచలన దిన పత్రికగా ఆవిర్భవిస్తున్న ' సాక్షి ' పై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్ మోహన్ రెడ్డి దిన పత్రికను ప్రారంభించడమే ఈ చర్చకు కారణం. జగన్ సారధ్యంలో, పతంజలి ప్రధాన సంపాదకుడుగా 19 ఎడిషన్లతో వస్తున్న ' సాక్షి ' ఫిబ్రవరి నెలాఖరులో ప్రధానమంత్రి చేతుల మీదుగా విడుదలవుతున్నట్లు సమాచారం. జర్నలిస్టులకు భారీ జీతాలు ఆఫర్ చేసిన సాక్షి, ప్రధాన దిన పత్రికలను వణుకు పుట్టిస్తోంది. తమ జర్నలిస్టులు చేజారకుండా కాపాడుకోవడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇప్పటికే రెండు మూడు సార్లు జీతాలు పెంచక తప్పలేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ-9 లాగే ప్రింట్ మీడియాలో సాక్షి జర్నలిస్టుల విలువ పెంచింది. కొత్త ఛానెళ్ళు, దినపత్రికల రాకతో తెలుగు మీడియా సిబ్బంది సైతం ఐటి ఉద్యోగుల్లా మంచి జీతాలు పొందే రోజులొచ్చాయి. అన్ని పేజీలు రంగుల్లో రానున్న ' సాక్షి ' బాటలోనే ఇతర దినపత్రికలు వెళ్ళక తప్పదు. సాక్షి గురి ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిల పైనే అని ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ' ఆ ' రెండు పత్రికలపై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రికి సొంత దినపత్రిక ' సాక్షి ' రావడం అన్నివిధాలా సరికొత్త బలాన్ని తెచ్చి పెడుతుంది.
Posted by abouttelugumedia at 6:35 PM
2 comments:
Anonymous said...
అప్పట్లో పానుగంటి వారి సాక్షి వ్యాసాల కోసం రైల్వే స్టేషన్ లో ఎదురు చూసే వారంట...అంత గొప్ప పేరు పెట్టుకుని రాబోతోన్న పత్రిక ఎలా ఉండబోతోందో...
January 27, 2008 8:43 PM
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...
అంత పెద్దవాళ్ళ చేతుల్లో నడిచే పత్రికలకు విశ్వసనీయత తక్కువే. ఈరోజు "ఈనాడు"కు సైతం విశ్వసనీయత తక్కువ. వాళ్ళు ప్రచురించే వార్తలు వాస్తవాల పరంగా అసాధువులని కాదు గాని తమకు అనుకూలమైన వార్తల్నే ప్రచురించడం, ప్రతికూలమైన వార్తల్ని పరిహరించడం, తమకు అనుకూలమైన శైలిలో, తాము ప్రజల మనస్సులలో కలిగించదల్చుకున్న ముద్రకు అనువుగా వాటిని రూపుదిద్దడం-ఇలాంటి చర్యలు టోకుగా మీడియా విశ్వసనీయతని ఎప్పుడో దెబ్బతీసేశాయి. రాజకీయాల పట్లా సిద్ధాంతాల పట్లా తటస్థతతో వ్యవహరించగల మీడియా కోసం ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తోంది. ఆ అవసరాన్ని "సాక్షి" పూరిస్తుందని భావించలేను. కాని ఎన్ని పత్రికలుంటే అంత మంచిదని మాత్రం చెప్పగలను.
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
-
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది.
ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా
లుంగికట్టుకు...
6 years ago
1 comment:
"సాక్షి" కి యూనికోడ్ ఫాన్ట్స్ ని పరిచయమ్చేయడమ్ జరిగింది. కాని అది వారి scheme of things లొ లేదు కాబట్టి ప్రతిపాదన వీగిపోయింది. కాని జగన్ కి ప్రతిపాదన నచ్చింది, అని వినికిడి.
Post a Comment