' స్టింగ్ ' పరేషాన్.. Posted by abouttelugumedia.blogspot.com
రేటింగ్లు పెంచుకోవడంలో భాగంగా కొన్ని ఛానెళ్ళు ఆడే డ్రామాలకు అమాయకులు బలవుతున్నారు. ఢిల్లీ లో 'లైవ్ ఇండియా' ఛానెల్ ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు అమాయక యువతులను వ్యభిచార ఊబిలోకి దింపుతోదని ప్రసారం చేసిన వార్తకు ఎంత అల్లరి జరిగిందో అందరికీ తెలుసు. ఈ ఛానెల్ రిపోర్టర్ ప్రకాశ్ సింగ్ ఇందుకోసం నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ కు కిరాయి యువతిని ఉపయోగించాడని నిరూపితమైంది. పోలీసులు ఈ రిపోర్టర్ను అరెస్ట్ చేశారు. ఇక మన రాష్ట్రంలో కొత్తగా ప్రారంభం అయిన ఎన్-టీవీ ఉస్మానియా యూనివర్సిటీ స్టింగ్ ఆపరేషంపై కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన రిపొర్టర్ రెహనా సరైన హోం వర్క్ చేయక పోవడమో లేదా ఉద్దేశ్య పూర్వకంగా సదరు ప్రొఫెసర్ ను ఇరికించే ప్రయత్నమో తెలియదు కానీ, విధ్యార్థులంతా ఏకమై ఎన్-టీవీ ప్రతినిధులు క్యాంపస్ లోకి వస్తే తంతామని, ఓబీ వ్యాన్ తగల బెడతామని హెచ్చరించారట. కొద్ది నెలల క్రితం ఇండియా టీవీ రిపొర్టర్లు సెక్స్ వర్కర్లతో కలిసి కొందరు బిహార్ ప్రజాప్రతినిధులను అల్లరి పెట్టి, ఆ విజువల్స్ రోజంతా ప్రసారం చేసి జిగుస్స కలిగించారు. ఛానెళ్ళ రేటింగ్లను పెంచుకోవడానికి చేసే ఇలాంటి అనైతిక స్టింగ్ ఆపరేషన్లు సమాజానికి పరేషాన్లుగా మారుతున్నాయి. ఈ విషయంలో జర్నలిస్టులంతా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తమ స్టింగ్ ఆపరేషన్ ద్వారా సమాజానికి ఏమైనా మేలు జరిగితే సంతోషమే, కానీ ఛానెల్ పబ్లిసిటీ కోసం దిగజారిపోతే జర్నలిస్టులకు, వ్యభిచారిణులకు తేడా ఏముంటుంది.
comment
Phani said...
మీడియావాళ్ళకి విలువలేమిటీ మరీ చోద్యంగాకపోతే? నిన్న పంజగుట్ట సంఘటనలో గాయపడ్డవారి ఫొటోలు తీసుకోవటానికి విలేకరులు ఎలా ఎగబడిందీ యావదాంధ్ర కళ్ళారా చూసింది. రాజకీయులనీ మీడియావాళ్ళనీ ప్రజలు ఒకేగాటకట్టే రోజు మరెంతోదూరం లేదు.
September 10, 2007 2:39 PM
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
-
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది.
ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా
లుంగికట్టుకు...
6 years ago
1 comment:
hi
FRIENDS, MARI "PRAJASAKTI" SANGATI EMITI? DAANILO ANNI DESKLU KHALI AYYAAYATA.
- NETI SAAKSHI
Post a Comment