Posted by abouttelugumedia.blogspot.com
'జెమిని న్యూస్' బ్యూరో చీఫ్ గా ఎవరు వస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారంతా ప్రచారంలో ఉన్న ఒక వార్త విని షాక్ తిన్నారు. ఈ వార్త లేదా వదంతి జెమిని వర్గాలను కూడా కలవర పరుస్తోంది. 'జెమిని న్యూస్' బ్యూరో చీఫ్ గా ఆ చానెల్లోనే బిజినెస్ రిపోర్టర్ గా పని చేస్తున్న స్టెర్జీ రాజన్ ని నియమించాలని సన్ యాజమాన్యం నిర్ణయించిందట(?) బిజినెస్ రిపోర్టింగ్ ముసుగులో స్టెర్జీ పాల్పడే అవినీతిని మీడియా వర్గాలు కథలు, కథలుగా చెబుకుంటాయి. ఒక్కో వార్తకు ఆయన 2-5 వేల దాకా తీసుకుంటాడు. వార్తా క్లిప్పింగ్లపై వచ్చే ఆదాయం అధనం. ఈ ఆదాయం అంతా ఆయన వ్యక్తిగత, రహస్య ఖాతాలో జమ అవుతుంది. స్టెర్జీ జెమిని నుండి వచ్చే జీతం అంతగా ఖర్చు పెట్టడు. ఈ విషయం ఆయన సాలరీ అకౌంట్ గమనించి నిర్ధారించు కోవచ్చు. బిజినెస్ న్యూస్ ద్వారా జెమిని సంస్థకు దమ్మిడి ఆదాయం ఉండదు. కానీ స్టెర్జీ రాజన్ వ్యక్తిగత ఆస్తులు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరుగు తున్నాయి. జెమిని సంస్థకు ఒక్క యాడ్ రికమెండ్ చేయక పోగా వ్యాపార, కార్పోరేట్ సంస్థలకు జెమినిలో ఉచిత ప్రచారం కల్పిస్తాడీయన (తన జేబుకు గిట్టు బాటైతే చాలు). బిజినెస్ న్యూస్ తో పాటు స్టెర్జీ అధనపు బాధ్యతలు చూస్తున్న సిటిలైట్ ప్రోగ్రాంలో తరచూ ఆయన కుటుంబ సభ్యులు కనిపిస్తుంటారు. బిజినెస్ ప్రెస్ మీట్లకు కూడా కుటుంబ సభ్యులను తీసుకెలతాడని వినికిడి. ఇలాంటి కళాకారున్ని సన్ యాజమాన్యం ఏకంగా 'జెమిని న్యూస్' బ్యూరో చీఫ్ గా నియమిస్తే ఎంత 'ఛీప్'గా ఉంటుందో ఆలోచించండి. దొంగ చేతికి తాలం ఇచ్చినట్లే.. బ్రహ్మాండంగా చానెల్ను మార్కెట్ చేసి పడేస్తాడు (అమ్ముకుంటాడు) కదూ..
Comments Posted by abouttelugumedia.blogspot.com at 7:30 PM
చదువరి said...
మీ బ్లాగులో వ్యాఖ్యలు ఎక్కువగా రోమను లిపిలో ఉంటున్నాయి, చదవడానికి ఇబ్బందిగా ఉంటోంది. వ్యాఖ్యలు రాసేవారి కంప్యూటర్లలో తెలుగు చూసే సౌకర్యం ఉంది గానీ, తెలుగులో రాయడం ఎలాగో వారికి తెలిసినట్లు లేదు. తెలుగులో రాయడం ఎలాగో తెలియజేసే లింకులు మీ బ్లాగులో ప్రముఖంగా కనబడేలా పెట్టొచ్చు కదా! అలాగే http://groups.google.com/group/telugublog అనే లింకు కూడా ఇవ్వండి. ఈ విషయమై సహాయం చేసేందుకు అక్కడ జనమున్నారు.
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
-
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది.
ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా
లుంగికట్టుకు...
6 years ago
No comments:
Post a Comment