తెలంగాణ ఎమ్ ఎస్ వో ల సమాఖ్యకు టీవీ9 బేషరతుగా క్షమాపణ చెప్పింది. ఎమ్ ఎస్ వో ల సంఘంతో చర్చలకు సిద్ధమని, అందుకు తగిన ఏర్పాట్లి చేయాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర ఎమ్ ఎస్ వో ల సమాఖ్య అధ్యక్షునికి టీవీ 9 ఈ మేరకు చానల్ తరఫున ఎస్. గిరిధర్ సంతకంతో ఒక లేఖ పంపింది
“ టీవీ 9 లో ఇటీవలి కాలంలో ప్రసారమైన ఒక కార్యక్రమంలో ప్రసారమైన అసభ్యకరమైన అంశం కారణంగా చానల్ ప్రసారాలను తెలంగాణ అంతటా నిలిపివేసిన “ విషయం ప్రస్తావిస్తూ అంతకుముందు టీవీ 9 కు ఎమ్ ఎస్ వోలు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు చెప్పింది. అయితే, ఎమ్ ఎస్ వోలు అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రసారం విషయంలో చానల్ తీసుకున్న చర్యలను కూడా ఆ లేఖలో పేర్కొంది.
ఆ కార్యక్రమ ప్రసారాన్ని తక్షణమే నిలిపివేయటంతోబాటు దానికి బాధ్యులైనవారిని అలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆదేశించామని, వెంటనే సంబంధితులందరికీ క్షమాపణలు చెబుతూ స్క్రోల్ నడిపామని, ఈ విషయాన్ని గౌరవ శాసన సభాపతికి, శాసన సభ్యులకు తెలియజేశామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామని ఆ లేఖలో గుర్తు చేశారు.
సంఘానికి బేషరతు క్షమాపణలు చెబుతూ, ప్రసారాల పునరుద్ధరణకు టీవీ 9 విజ్ఞప్తి చేసింది ఈ మేరకు ఒప్పందమ్ చేసుకోవటానికి చానల్ సిద్ధంగా ఉన్నట్టు తెలియజేసింది. పరస్పరం ప్రయోజనం పొందే ఉద్దేశ్యంతో సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని టీవీ 9 లేఖ తెలంగాణ ఎమ్ ఎస్ వో ల సమాఖ్యకు విజ్ఞప్తి చేసింది.
From :- http://www.telugutv.info/news_details.php?nid=1394
No comments:
Post a Comment