"ఆనాడు రవిప్రకాష్ సాధించాడు. ఇప్పుడు నా వంతు. విజయం ఏ ఒక్కడి సొత్తూ కాదు. అతను ఎన్‌టీ రామారావు లాంటి వాడయితే నేను చిరంజీవితో సమానం" వివరణ అవసరం లేకుండానే ఈ మాటలన్నది ఐ న్యూస్ రాజశేఖర్ అని ఇట్టే చెప్పవచ్చు. (చిరంజీవితో పోల్చుకుంటున్నప్పటికీ చిరంజీవిని వ్యతిరేకించే నటుడి పేరు ఉండటం మాత్రం యాదృఛ్ఛికం.) ఇప్పుడు రాజకీయాల్లో శూన్యత లేదని వాదిస్తున్నట్టే కొత్త చానల్స్ కు స్థానం లేదని చెబుతున్న వాళ్ళున్నారు. అప్పుడు రవిప్రకాష్ కు అనుకూలించిన వాతావరణం ఇప్పుడు లేదంటున్న వాళ్ళూ ఉన్నారు.
మరి రాజశేఖర్ తనను తాను చిరంజీవితో పోల్చుకోవడం ఎంత వరకు సబబు ? ఇంత చైతన్యం వచ్చిన నేటి పరిస్థితుల్లో చానల్ ను గట్టెక్కించగలడా ? టీవీ9 బలాలు, బలహీనతలు తెలిసిన తాను మాత్రమీ ఢీకొట్టగలనని చెప్పడంలో అతిశయోక్తి ఉందా ? టీవీ9 ప్రారంభానికి ముందే రవిప్రకాష్ ను జనం తెర మీద చూసి ఉండటం అతనికి ఉపయోగపడిన మాట నిజం కాదా ? సిటీ కేబుల్ పరిచయాలు పనికొచ్చిన సంగతి నిజం కాదా ? టీవీ9 లో తెరవెనుక కష్టపడినంత మాత్రాన మీడియా వాళ్ళకు తప్ప రాజశేఖర్ ఎవరికీ తెలియదనే సంగతి ఒప్పుకొని తీరవలసిందే కదా ? టీవీ9 యాజమాన్యం రవిప్రకాష్ కు ఇచ్చినంత స్వేఛ్ఛ ఐన్యూస్ యాజమాన్యం రాజశేఖర్‌కు ఇస్తుందా ? ఉద్యోగులే యజమానిని ఎంచుకునేంతగా సిబ్బంది కొరత ఉన్న ఈ రోజుల్లో సత్తా ఉన్న వాళ్ళు రాజశేఖర్‌ను నమ్మి చేరతారా ?
రాజశేఖర్‌ను నిరుత్సాహ పరచడం మా ఉద్దేశ్యం కాదు. సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలివి. మీ అభిప్రాయాలు చెప్పవలసిందిగా మనవి. దయచేసి వ్యక్తిగత దూషణలకు దిగకుండా కామెంట్స్ పంపుతారని ఆశిస్తున్నాం.
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
-
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది.
ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా
లుంగికట్టుకు...
6 years ago
1 comment:
Satha vunna vaallanu vandala mandini tayaru chese Satha Rajsekhar ku vundi. Cherevallanu Evadu aapaledu. tv9 start Ayinappudu Evadunnadu?
Post a Comment