దశాబ్దానికి పైగా వార్తలు చదువుతూ తెలుగు ప్రజలందరికీ పరిచయమైన ప్రగతి తన పెద్దరికంతో న్యూస్ రీడర్ల సంఘం పెట్టి సమావేశానికి పిలిస్తే పట్టుమని పదిహేను మందికి మించి రాలేదు.బులిటెన్ మార్చుకునే అవకాశం ఉండి కూడా మొహం చాటేసిన వాళ్ళే ఎక్కువమంది ఉన్నట్టు సమాచారం.సంఖ్యాబలం కోసం వాయిస్ ఓవర్ ఆర్టిస్టులను కలుపుకున్నా ఆశించిన ఫలితం రాలేదు.
దాదాపు ఏడాది కాలంగా ప్రగతి ఈ పనిలొ నిమగ్నమయ్యారని, మొదట్లో యాంకర్లను కలుపుకోవాలని భావించినా వాళ్ళెవరూ ఈవిడ నాయకత్వాన్ని ఒప్పుకోరని గ్రహించి న్యూస్ రీడర్లకే పరిమితమయ్యారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మామూలు గెట్ టుగెదర్ అని పిలిచిన మొదటి సమావేశంలోనే సంఘం ఏర్పాటు, దాని భారీ లక్ష్యాలు వగైరా వివరిస్తూ సభ్యత్వ రుసుము ఐదు వేలని ప్రకటించిన ఫలితం రెండో సమావేశంలో తేలిపోయింది. ఐదుగురే హాజరయ్యారు. సంఘం రిజిస్టర్ చేయటానికి ఆ మాత్రం చాలుగనుక అలా ముందుకెళ్ళారు.
కార్యవర్గం తప్ప సభ్యులు లేని సంఘానికి బలం రావాలంటే ఇళ్ళ స్థలాల ఆశ చూపాలని ఆలోచించి వెంటనే ఆ మంత్రం పఠించారు.ముప్పై మందిని ముఖ్యమంత్రి ఇంటికి నడిపించారు.ఇళ్ళ స్థలాల గురించి అడుగుదామని చెప్పిన నాయకురాలు తీరా అక్కడికెళ్ళాక న్యూస్ రీడర్లకూ నంది అవార్డులు కావాలని అడగడం, అందుకింత హడావిడి ఏమిటన్నట్టు ఆయన విసవిసా వెళ్ళీపోవడం చూసిన న్యూస్ రీడర్లు విస్తుపోయారు.ఆమె ధోరణితొ విసిగిపోయారు.
గతంలో ఆమె "మీది తెనాలే, మాది తెనాలే " అంటూ నన్నపనేని రాజకుమారికి, ఏవీయస్ కు దగ్గరై చంద్రబాబు నాయుణ్ణి తన ప్రగతి మీడియా లింక్స్ కార్యక్రమానికి ఆహ్వానించిన సంగతి తెలిసిన కొంతమంది న్యూస్ రీడర్లు ఆమె తెలుగు దేశం అభిమాని కాబట్టే ప్రయత్నం విఫలమైందని విశ్లేషించారు.
పట్టువదలని ప్రగతి ఆరు మాసాలు గడిచే లోపే తన ప్రయత్నాలు పునరుద్ధరించారు.జూన్ 5న సమావేశానికి ఆహ్వానించారు.పదిహేను మంది న్యూస్ రీడర్లు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు హాజరయ్యారు. మరో పది మంది వివిధ కారణాలవల్ల రాలేకపోయినట్టూ ప్రధాన కార్యదర్శి ప్రగతి నివేదించారు. టీవీ5 వాళ్ళు ఒక్కరూ రాలేదట. అసలు సమాచారమే లేదని కొంతమంది అలకలు.
ఇక తీర్మానాల విషయానికొస్తే - మెడీక్లైం , రాజీవ్ ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. సొసైటీ ఏర్పాటు చేసుకుని ఇళ్ళ స్థలాలకోసం మరో విడత ప్రయత్నిచాలని కూడా నిర్ణయించారు.భారీ సభ్యత్వ రుసుములను చాలామంది వ్యతిరేకించారు. జెమినీలాంటి చానల్లో నెల జీతమే ఐదు వేలుంటే సంఘం చందా ఐదు వేలు ఎలాగని అడిగినా ప్రగతి గారు ఎంతమాత్రమూ తగ్గలేదు.భవిష్యత్తు కోసం త్యాగాలు తప్పవంటూ ప్రసంగం కొనసాగిస్తుండటంతో రీడర్లు ఒక్కొక్కరూ ఇళ్ళకు వెళ్ళాలంటూ లేచారు.స్వర్ణకమలం లో భానుప్రియలా " అర్థం చేసుకోరూ..." అంటూ ముగించడం ప్రగతి వంతు అయి అయింది.
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
-
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది.
ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా
లుంగికట్టుకు...
6 years ago
No comments:
Post a Comment