నాయనా వైఎస్సూ , ఇవ్వాళ నువ్వు కొత్తగా బాధ పడుతున్నట్లు కపట నాటకాలు ఆడొద్దు . నాకు పరమ వికారం కలుగుతుంది.అయినా ఐదేళ్ళ లో ఎ సంవత్సరం నువ్వు నన్ను వదిలావు కనుక,ఇవ్వాళ కొత్తగా చెప్పుకోవడానికి .
అధికారం వచ్చిన మొదట్లో నే ఇడుపుల పాయ వన విహారమునకు వెళ్ళినప్పుడు నువ్వు నీ పుత్ర రత్నం తో,అతితెలివి వీరులైన నీ వందిమాగదులతో రాష్ట్రాన్ని ఎలా భ్రస్టు పట్టించాలో తీవ్ర సమాలోచనలు చేస్తున్నప్పుడే నువ్వు నీ పాదయాత్ర ను చూసి నిన్ను నమ్మిన రైతు లోకాన్ని ఎంత ఘోరమైన మోసం చెయ్య బోతున్నవో గ్రహించి ఆందోళన చెంది మా అష్ట దిక్పలపతి అయిన ఇంద్రుల వారిచే ఈ ఘోరమును చర్చించి నీ అతితెలివికి అబ్బురపడితిమి.అప్పుడు నిన్ను నమ్మి మోసపోబోతున్న రైతు మహారాజుకు దుఖం కలగకుండా చూడవలెనని మేమందరమూ భావించి అయిదేళ్ళు సరి అయిన వర్షములు కురిపించితిమి.
అయినా నువ్వు వాళ్ళ ని ఎక్కడ వదిలావు నాయనా?పంట పండితే గిట్టుబాటు ధర వుండదు.పండించుకోవటానికి గుప్పెడు భూమిని సైతం మిగల్చకుండా అదే పని గా మీరంతా కలిసి మీ బొజ్జలు వినాయకుని బోజ్జకు వేయింతలుగా,లక్షింతలుగా పెంచుకుంటూ పోవుచున్నారు.మీ పాపములు non-stop గా రాయలేక చిత్రగుప్తుల వారి బృందం ఎన్నిసార్లు ప్రత్యెక వైద్యసేవలు పొందవలసి వస్తుందో వారి కష్టాలు చూస్తున్న మాకు తెలుసు.
అయిననూ పాపములు పండువరకు యమధర్మరాజు సైతం ఎవ్వరినీ ఏమీ చేయలేని పరిస్థితి మాది.నీ పరిపాలన లో శాంతి భద్రతలు సైతం నీ పరిపాలన వలె ఎంత పక్కదారి పట్టినవో తలచుకుంటే మాకే వళ్ళుగగుర్పోడుస్తూ,కడుపు దేవుతూ,గుండెలు గుభిల్లు మనుచున్నవి.
కానీ మేము ఎప్పటికైనా ప్రజలందరికీ సమానము గా జవాబుదారీ వహించవలసిన వాళ్ళము.మీకు లాగ అధికారంలో కోచ్చేముందు ఒక మాట,వచ్చిన తరువాత ఇంకొక మాట చెబుతూ,పనులు ఏమి సేయక,దైవ లోకం మీద మాత్రమె ఆధారపడి కాలం గడుపు నికృష్ట జాతి కాదు నాయనా.ఎంతో ఉత్తమమైన మానవ జన్మను ఇంతగా నిరర్ధకం చేసుకొనుచున్న మీ వంటి పాలకులను,మీతో ఎప్పుడూ వుండే మీ అతితెలివి వందిమాగధులను చూస్తుంటే మా కడుపు దేవుతున్నది.
మిమ్మలను కన్న భారతమాత నోట మాట రాక పిచ్చి చూపులు చూచుచున్నది నాయనా.అలాగే వారి సోదరి తెలుగు తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించుచున్నది నాయనా.
Anonymous said...
సామాన్య ప్రజ కు ఒక వినతి .
ఐదేళ్ళ కింద నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు నా ముఖమును , ఇప్పుడు ప్రతి ప్రకటనలో నూ చిరు మందహాసం తో కూడిన నా ముఖము ను గమనించండి . ఎవరు ఎక్కువ లబ్ది పొందారో మీకు ఇట్టే తెలిసి పోతుంది .
అయినా మా ముఖాలు (ఇందిర , సోనియా , రాజీవు , వైఎస్సు, జగన్ ) మరియు మా అరవిందము లైన మా వేషభాషలు వున్న ఫోటో లు చూసి పిచ్చెక్కి వోటు వేసే మీకు ఇంట తెలివి వస్తుంది అని నేను భావిమ్పలేదు . మీకు నా రెండు రూపాయల బియ్యం అందినట్లు లేదు. అవే తింటే వున్న మతి పోయి నాకు బానిస బ్రతుకులు బ్రతకరేమి ?
ఏమైననూ సరే, నేను దేవుడిని , నా పరిపాలన దేవుని పాలన , మా మంత్రులు , అధికారులూ అందరూ మహనీయులు . మా పుత్రరత్నం ఎంత అమోఘమైన చరిత ను సొంతం చేసుకున్నాడో మీరంతా వీక్షిస్తూనే వున్నారు కదా?
ఏదో ఐదేళ్ళ కోక సారి మాలాంటి దేవుళ్ళు ఇచ్చే ఎంగిలి కూటికి ఆసపడి వోటు వేసే దద్దమలకు ఇంత తెలివా ? ఎవరక్కడ ? కడప బాంబులు వెయ్యండిరా ?
సరిగ్గా ఐదేళ్ళ క్రితం నేను కూడా ఇలాగే అధికారం కొరకు నానా జాతుల గడ్డి కరచుచున్నవాడను అన్న సంగతి తెలివి తక్కువ దద్దమ్మలు అయిన సామాన్య ప్రజలు ఎప్పుడో మరచితిరి.చేసిన మంచి పనులు టార్చి లైట్ పెట్టి వెతికినా ఒక్కటీ కనపడక మా పరిపాలన లో నే వర్షాలు వస్తున్నాయి అని చెప్పుకోవలసిన దిక్కుమాలిన పరిస్థితి.పగ వాడికి కూడా ఇంత నీచమైన పరిస్థితి రాకూడదు.అందరూ నా రంగు రంగుల ప్రచార మాయా ప్రపంచములో జోగుచున్నారు.
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా...
http://apmediatruth.blogspot.com/ TV war to add fuel to political war ...comments loonidi