మా టీవీ యాజమాన్యంలో మార్పులు జరిగిన తరువాత పరిణామాలన్నిటినీ పరిశీలిస్తే అక్కడి లుకలుకలన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. పాత యాజమాన్యం మెచ్చుకున్న వాళ్ళను క్రమంగా పంపాలని ముందుగా నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా పెద్ద తలలను తొలగించి కొత్తవాళ్ళకి స్థానం కల్పించారు. ఈ రెండేళ్ళ కాలంలో 50 శాతం మంది ఉద్యోగులు మారారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ మార్పులు మొదట్లో పాత యాజమాన్యం మీద కోపంతో జరిగినా, ఆ తరువాత అది అంతర్యుద్ధంగా మారింది. అరవింద్ వర్గం, మాట్రిక్స్ ప్రసాద్ వర్గం తలపడటం మొదలెట్టాయి.మాట్రిక్స్ ప్రసాద్ తో నాగార్జున కూడా చేతులు కలపడంతో అరవింద్ నియమించిన సీ ఈ ఓ శరత్ కుమార్ కు తలనొప్పి తప్పలేదు. మాట్రిక్స్ ప్రసాద్ తన మనిషిని న్యూస్ ఛీఫ్ గా నియమించి అక్కడి ఉద్యోగులను వెళ్ళగొట్టే పని అప్పగించాడు.
పని చేసే వాళ్ళు వెళ్ళిపోయి, పనికిమాలిన వాళ్ళు వస్తున్నా నోరుమెదపలేని స్థితిలో ఉన్న సీ ఈ ఓ కు ఇప్పుడు తాజాగా మరో షాక్ తగిలింది. చానల్ నుంచి ఎవరెవరు వెళ్ళిపోయే అవకాశం ఉందో ఊహించి జాబితా తయారుచేసుకున్న న్యూస్ చీఫ్ ఆ జాబితాను సెక్యూరిటీకి ఇచ్చి వాళ్ళను ఆఫీసులోకి రానివ్వవద్దని చెప్పడంతో సిబ్బందిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ విషయం తెలిసిన సీ ఈ ఓ తన నిస్సహాయతను మేనేజ్‌మెంట్ కు తెలియజేసి ఆదేశాలకోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం.
న్యూస్ చానల్ రాకముందే ఇన్ని రాజకీయాలయితే ఇక పనిచేసినట్టే అని తిట్టుకుంటూ వీలైనంత త్వరగా బయట పడటానికి అక్కడ మిగిలిన పాత స్టాఫ్ తొందరపడుతున్నారు. నెలాఖరుకు అటో ఇటో తేలిపోక తప్పదు. అరవింద్ గారూ, ఈ రాజకీయాలు కూడా పట్టించుకోండి
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
-
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది.
ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా
లుంగికట్టుకు...
6 years ago
1 comment:
partner ship is such, one should be ready for it.
Post a Comment