ఏమిటి సంగతులు...హైక్ ఎంత ఉండవచ్చు...పెద్దగా ఉండవంటున్నారు...లేదు లేదు భారీగా పెంచుతారట...ఇంకొన్ని రోజులు ఆగితే గానీ తెలియదు...ప్రస్తుతం...tv5lo ప్రతి ఇద్దరు వ్యక్తుల మధ్య ఇదే మాటలు...ఎవరికి వాళ్ళు చెవులు కొరుక్కోవడమే. సాక్షి, ఐ న్యూస్, టీటీవి రాకతో...ఎవరు ఎప్పుడు ఏ చానల్ లో వుంటారో తెలియని పరిస్తితి.దీంతో జర్నలిస్టులను కాపాడుకొనేందుకు...జీతాలు పెంచడమొక్కటే మార్గం. tv5 సిబ్బంది ఎప్పటి నుంచో జీతాల పెంపు కోసం ఎదురు చూస్తున్నారు.టీవీ9లో భారీగా...అతి భారీగా జీతాలు పెరగడంతో tv5 ఏమి చెస్తదో చూడాలి.ఉద్యోగులు మాత్రం బాగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది.పెంచేదీ లేనిదీ చానల్ యాజమాన్యం ఇంత వరకు తేల్చి చెప్పలేదట. పెద్దలు. 5,10,15,20,30,40,50...వీటిలో ఎంత శాతం ఉంటుందో తెలియదు.( అసలు ఉండదనే టాక్ కూడా ఉంది.)అందరి చూపులు పైనే. ప్రస్తుతం రిపోర్టర్లకు, కాపీ ఎడిటర్లకు మంచి డిమాండ్ ఉండటంతో జీతాలు పెరగక పోతె చాలా మంది tv5 నుంచి బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.ఎన్నికలు సమీపిస్తున్న వేళ ...జీతాల విషయంలో tv5 చైర్మన్ సరైన నిర్ణయం తీసుకోక పోతె డెస్కులు ఖాళీ అయ్యే పరిస్తితి కనిపిస్తొంది.డెస్కులో కీలకంగా మారి ...జీతాల పెంపు సరిగా లేకపోతె మూటాముల్లె సర్దుకోవడానికి సిద్దంగా వున్నారు.వీళ్ళకే కాదు...వీళ్ల జూనియర్స్ కు కూడా...బయటి చానెళ్ళ నుంచి ఆఫర్స్ వస్తున్నాయట. సెప్టెంబర్ ఒకటి విడుదల వరకు ఆగితే ఎవరిదారి ఎటో తేలుతుంది.
No comments:
Post a Comment