బ్లాగు వార్తలు చదివి సిబ్బంది నిజాలు తెలుసుకుంటారనే భయంతో టీటీవీ పెద్దలు కంగారుపడుతున్నారు. వాళ్ళకు సంబంధించిన వివరాలు చాలా తక్కువగా తెలుస్తుండటంతో ఇప్పటివరకు అటువైపు దృష్టిపెట్టలేదు.అయితే అక్కడి స్టాఫ్ ఈ బ్లాగును బాగా ఆదరిస్తున్నట్టు తెలిసిన పెద్దలు అసలు బ్లాగులనేవి ఉండకూడదని ఆగ్రహించారుగాని వాటిని నిర్మూలించడం వాళ్ళ తరం కాదని తెలుసుకున్నారు. అందుకే ఇప్పుడో కొత్త మార్గం కనిపెట్టారు. ఆఫీసులో ఎవ్వరూ బ్లాగులు చూడకూడదని ఒక సర్క్యులర్ తయారుచేసి నోటీసు బోర్డులో పెట్టారు.దీని ఫలితంగా ఉత్సాహం మరింత పెరుగుతుందని తెలియటం లేదు.బ్లాగ్ లో రాకపోయినంత మాత్రాన నిజాలు దాగుతాయా ? "అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు " అంటూ అర్థరాత్రివేళ గోడలమీద రాసిన కామ్రేడ్స్ ఇప్పుడు తమ పెత్తనం వచ్చేసరికి నిషేధాలు విధించాలనుకోవటం విడ్డూరం కాదా ?
No comments:
Post a Comment