"బతుకుతెరువు కోసం వచ్చిన అమాయకురాలిని బజారుకీడ్చాలనుకున్న దుర్మార్గపర్వం"
( ఫేస్ బుక్ లో జర్నలిష్ట్ కలం నుండి వస్తోన్న నిజాల సమాహారం ఉన్నది ఉన్నట్టూగా..)
హర్ష,విప్లవ ఇద్దరూ కలిసి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నా శిశిరకు గుండెల్లో సుడిగుండాలు తిరుగుతూనే ఉన్నాయి. తండ్రి తన వల్లే చనిపోయాడని నిజం తెల్సుకున్ననాటి నుంచి అసలు బతకటమే వ్యర్ధంగా అన్పిస్తోంది. కానీ తాను తనువు చాలిస్తే సహస్ర అనాధ అవుతుంది. ఇప్పటి వరకు చేసిన పాపాలు చాలక, మరో మహా పాతకం చేసినట్లు ఉంటుంది. రాత్రులన్నీ తన కన్నీళ్లని నింపేసుకుని, పగళ్లన్నీ ఆమె తెచ్చి పెట్టుకున్న నవ్వులను తెంపేసుకుని కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఓ రోజు ఉదయాన్నే తాను హైదరాబాద్‌కు వెళ్లిపోతానని మొండిపట్టు పట్టింది. హర్ష,విప్లవ ఎంతగా సముదాయించినా వినలేదు. పోని సహస్రకు ఒక సంవత్సరం నిండే వరకు ఉండమని చెప్పినా వినలేదు. చేసేది లేక అయిష్టంగానే ఒప్పుకున్నారు. 3నెలల పసిపాపను పట్టుకుని ముగ్గురు హైదరాబాద్‌కు వచ్చారు. హర్ష,విప్లవ ప్రేమకు శిశిర పొంగిపోతోంది. తోడబుట్టినవాడు కూడా అలా చూసుకునేవాడు కాదేమో అందుకే కొన్నాళ్ల పాటు ఆర్ధికంగా అండగా ఉంటామని చెప్పేసరికి కాదనలేకపోయింది. రెండు రోజులుండి ఇద్దరూ వెళ్లిపోయారు. అలా రెండేళ్లు గడిచిపోయాయి. మీడియాలో మంచి అవకాశాలు ఉంటాయని ఎవరో చెబితే యాంకరింగ్ కోర్స్ కంప్లీట్ చేసింది. చేదుగతం ప్రతిరోజు తనను తొలిచేస్తున్నా సహస్ర కోసం
బతుకుతోంది. ఎలాగైనా సరే మంచి ఉద్యోగం సంపాదించుకుని తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంది శిశిర . శేఖర్ లాంటి నీచులకు బుద్ది చెప్పేలా బతకాలనుకుంది.
.......................
ఇంటికి దగ్గర్లో ఉండే బేబి కేర్ సెంటర్లో సహస్రను అప్పగించింది. వారికి తన జీవితాన్ని అంతా పూసగుచ్చినట్లు చెప్పింది. సానుభూతి కోసం మాత్రం కాదు సహస్రకు నొప్పి తెలియకుండా చూసుకునేందుకు. లక్‌డీకాపూల్‌లో ఉండే ఓ కేబుల్ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా చేరింది. 2నెలలకోసారి జీతం వస్తున్నా... ముప్పావు వంతు జీతం ట్రాన్స్‌పోర్ట్‌కే పోతున్నా సరే భవిష్యత్తు కోసం వెళ్లి వచ్చేది. కొంతకాలానికే ఆఫీస్‌లో తానేంటో నిరూపించుకుంది. ఏ పని ఇచ్చినా సరే సమర్ధవంతంగా పూర్తి చేసేది. ఇంతలో ఓ టాప్ ఛానల్, న్యూస్ రీడర్స్ కోసం యాడ్ ఇచ్చిన విషయాన్ని చెప్పారు కొలీగ్స్. అంతటి టాప్ ఛానల్‌లో ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేకపోయినా,ఇంటర్వ్యూ ఫేస్ చేసిన అనుభవం వస్తుందని రెజ్యూమెతో పాటు ఫోటోస్ కూడా మెయిల్ చేసింది. సరిగ్గా రెండు రోజుల తర్వాత ఆ ఛానల్ హెచ్ ఆర్ కాల్ చేసి ఇంటర్వ్యూకి రమ్మని కాల్ చేసింది. అంతే... ఉద్యోగం వచ్చినంత సంబురపడిపోయింది. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో టాప్ ఛానల్, అక్కడ ఉద్యోగం వస్తే నెలకు ఠంచనుగా జీతం వస్తుంది, అది కూడా మంచి జీతం. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. హర్ష,విప్లవ మోస్తున్న భారాన్ని కొంతవరకైనా తగ్గించవచ్చు అనుకుంది. శుక్రవారం ఉదయం 11గంటలకు ఆఫీస్‌కు రమ్మని చెప్పేసరికి.... గురువారం రాత్రి నుంచి ఎప్పుడెడప్పుడు ఆ ఛానల్ ఆఫీస్‌కు వెళ్లాలా అని మగత నిద్రపోయింది. ఆ ఛానల్‌లో న్యూస్ రీడర్ గా అవకాశం ఇప్పించమంటూ శుక్రవారం ఉదయాన్నే లేచి తను నమ్మే దేవుళ్లందరికి వేల సార్లు విన్నవించుకుని జూబ్లీహిల్స్‌కు బయలు దేరింది శిశిర.
......................
క్యాబ్ దిగగానే నివ్వెరపోయింది. కార్పోరేట్ కంపెనీలను తలదన్నేలా ఉంది ఆ ఛానల్ ఆఫీస్. లోపలికి వెళ్లగానే విశాలమైన రిసెప్షన్. వెయిట్ చేయండి, కాసేపట్లో హెచ్ ఆర్ వద్దకు పంపిస్తాం అనే సరికి, గెస్ట్‌ల కోసమే ఏర్పాటు చేసిన లాంజ్‌లో కూర్చుని కలియదిరిగి చూసింది. ఇక్కడ ఉద్యోగం వస్తే చాలు , ఎలాగైనా కల నెరవేరేలా చేయి అని మరోసారి దేవుళ్లను మరింత బలంగా వేడుకుంది. ఇంతలోనే హెచ్‌ఆర్ నుంచి కాల్, శిశిర పై ఫ్లోర్‌కు వచ్చేయండి అని. కొంచెం భయం, కొంచెం బెరుకు, కొంచెం ఆనందంతో వెళ్లింది. శిశిరను చూసిన వెంటనే హెచ్‌ఆర్ ప్రణతి ప్లెజెంట్‌గా రిసీవ్ చేసుకుంది. ఛైర్మన్ గారు మిమ్మల్ని పిలిపించారు. ఆయన వేరే వారితో మాట్లాడుతున్నారు. ఫ్రీ అయిన వెంటనే ఆయన వద్దకు పంపిస్తాను.. అలా కూర్చోండి అంటూ చెప్పింది ప్రణతి. ఇంటర్వ్యూలో సెకెండ్ స్టేజ్ పాసైపోయినట్లు, ఇక ఫైనల్ స్టేజ్ కోసం.. అదే ఛైర్మన్‌ను కలిసే తరుణం కోసం వెయిట్ చేస్తోంది. తనకేం తెలుసు... వెళ్లబోయేది కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మదమృగం బోనులోకి అని. ఇంతలోనే శిశిర ప్లీజ్ గో అంటూ చెప్పింది ప్రణతి.....Continue
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
-
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది.
ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా
లుంగికట్టుకు...
6 years ago
No comments:
Post a Comment