అదిగో వస్తుంది.. అంటూ సత్యిచానల్ లాగే మరో రెండు వాల్స్ ఇప్పట్లో వచ్చేట్టు కనిపించడంలేదు సిబిసి చానెల్ ఇక రాదని రూడీ అయింది. కొద్ది నెలలుగా ప్రెస్ మీట్లు, ప్రోగ్రాం లకు మైకులు పట్టుకొని వచ్చి హంగామా చేసిన సిబిసి జర్నలిస్టులకు ఇక తమ చానెల్ వచ్చే అవకాశం లేదని తెలిసి ఇతర చానెళ్ళలో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. తెలుగుగులో పెద్ద ఎత్తున పెట్టుబడులతో రానున్న న్యూస్ చానెళ్ళ ముందు పోటీ పడలేమని తెలిసే సదరు యాజమాన్యం చానెల్ ప్రతిపాదన విరమించుకున్నాట్లు బోగట్టా. ఇక రాయుడు టెలివిజన్(ఆర్టీవీ)దీ ఇదే పరిస్థితి. ఉప్పల్ లో అత్యాధునిక స్టూడియోలు నిర్మించుకున్న ఆర్టీవీ ఇంతవరకూ పూర్తి స్థాయిలో జర్నలిస్టులను నియమించుకోలేదు కొంచెం సీనియర్ లు రేజ్యూం పంపగానే ఏప్పుడు జాయిన్ అవుతున్నావని అడుగుతున్నారు. ఆర్ టీవీ చీఫ్ ఎడిటర్ బాల గంగాధర్ చానెల్ ప్రారంభంలో జరుగుతున్న జాప్యాన్ని భరించలేక రాజీనామా చేయటంతో ఆయన స్థానంలో జర్నలిస్ట్ యూనియన్ నేత ఆంజనేయులును నియమించారు. ఖర్చుకు వెనుకాడుతున్న ఆర్ టీవీ యాజమాన్యం తక్కువ జీతాలు ఆఫర్ చేస్తున్నందువల్లే జర్నలిస్టులేవరూ అక్కడ చేరటానికి ఆసక్తి చూపడం లేదని వినికిడి. ఆర్ టీవీలో న్యూస్ కో ఆర్డినేటర్ గా పని చేస్తున్న పాత కాలం జర్నలిస్టు బసవేశ్వర రావు సదరు రాయుడు గారిని తప్పు దోవ పట్టిస్తున్నారట
No comments:
Post a Comment