తెలుగుతోపాటు కన్నడం లో కూడా విజయవిహారం చేసిన టీవీ9 గుజరాతీలో కాస్త . అక్కడున్న కేబుల్ ఆపరేటర్లు సహకరించకపోవటమే అందుకు కారణం.పైగా నరేంద్ర మోడీ కూడా వ్యతిరేకంగా ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఇక తమిళం విషయానికొస్తే అక్కడ చానల్ పెట్టాలని ఎంతో కాలంగా అనుకుంటున్నప్పటికీ టీవీ9 గురించి అక్కడ తెలిసిన వాళ్ళు లేకపోవటం ఒక ఇబ్బందిగా మారిందట. ఇప్పటివరకు చెన్నై లో టీవీ9 రాకపోవటం ఈ సమస్యకు దారితీసింది. అసలు విషయానికొస్తే, తమిళులు 9 అంకెను కొజ్జాకు గుర్తుగా వాడతారట.అపహాస్యం చేయటానికి, తిట్టటానికి ఉపయోగపడుతున్న అంకెతో చానల్ పేరు పెట్టుకుని నడపటంలో ఇబ్బందిని గమనించి రవిప్రకాష్ తటపటాయిస్తున్నట్టు చెబుతున్నారు. కేవలం పేరు కారణంగా చానల్ లో చేరటానికి కూడా సిబ్బంది వెనకాడతారేమోనని అనుమానిస్తున్నారు.ఈ అనుమానమే టీవీ9 తమిళం ఆలస్యం కావటానికి కారణం.
No comments:
Post a Comment